గుంటూరు జిల్లాలో టీడీపీకి, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. తెనాలి టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు శివకుమార్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ కీలకనేతగా శివకుమార్ వ్యవహరిస్తున్నారు. శివకుమార్‌కు తెనాలిలో ప్రముఖ విద్యాసంస్ధల ఛైర్మన్‌గా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. లోటస్‌పాండ్‌లో శివకుమార్‌తో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదిలాఉంటే పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా విజయనగరంలో కాంగ్రెస్ పార్టీకి... బొత్సా సత్యనారాయణకు ఆ జిల్లా నేత షాక్ ఇచ్చారు. బొత్సా ముఖ్య అనుచరుడు, చీపురుపల్లి కాంగ్రెస్ కీలకనేత మీసాల వరహాలనాయుడు కూడా ఈ రోజే జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వరహలనాయుడు సతీమణి సరోజిని ఇటీవలే ఇండిపెండెంట్‌గా పోటీచేసి చీపురుపల్లి మేజర్ పంచాయితీ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలుపొందారు.
Published Fri, Nov 8 2013 2:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement