Sivakumar
-
తెలుగోళ్లు మెచ్చిన తమిళ స్టార్ హీరో.. సూర్య బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్‌లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్‌తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిల్లో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూర్య పెద్దగా వివాదాల జోలికి పోడు. తాజాగా ఈ హీరో తండ్రి మాత్రం ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించారని, తెచ్చిన శాలువా విసిరేశారని అంటూ ఓ వీడియో వైరల్ అయింది. దీంతో సూర్య తండ్రిపై విమర్శలు వచ్చాయి. దీంతో అసలేం జరిగింది? ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్వయనా సూర్య తండ్రి క్లారిటీ ఇచ్చేశారు. ఏం జరిగింది? నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు శివకుమార్ తాజాగా చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈవెంట్ పూర్తయిన తర్వాత బయటకు వెళ్తున్న క్రమంలోనే ఓ వ్యక్తి, ఈయన కోసం శాలువా తీసుకొచ్చాడు. దాని ఒంటిపై కప్పబోతుంటే.. శివకుమార్ దాన్ని చేతిలోకి తీసుకుని కింద పడేశారు. అయితే శాలువా పట్టుకొచ్చిన వ్యక్తి శివకుమార్‌కి ఫ్రెండ్ మనవడే. దీంతో చనువు కొద్ది నాకెందుకురా అనే ఉద్దేశంతోనే విసిరేశారట. (ఇదీ చదవండి: నేను బతికే ఉన్నాను.. రూమర్స్‌పై యువనటి క్లారిటీ) 50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ 'వీడియోలో ఉన్నది మా తాత కరీమ్. శివకుమార్, ఆయన గత 50 ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. శాలువా ఇస్తున్నప్పుడు.. ఎందుకురా ఇవన్నీ అని జోక్ చేస్తూ దాన్ని విసిరేశారు. వెళ్దాం పద అని తాతతో పాటు కిందకు వెళ్లిపోయారు. శాలువా నీ దగ్గరే ఉండనివ్వు అని మా తాతతో అన్నారు. మా తాత కారైకుడీలో ఉంటారు. అక్కడ జరిగిన ఈవెంట్‌కే శివకుమార్ అతిథిగా వెళ్లారు. నిజమేంటో తెలియకుండా తప్పుడు ప్రచారం చేయొద్దు' అని కరీమ్ మనవడు రిఫాయ్ చెప్పుకొచ్చాడు. శివకుమార్ ఏం చెప్పారు? 'నేను, కరీమ్ చాలా క్లోజ్. కానీ కొత్తగా నా కోసం శాలువా తీసుకొచ్చాడు. కానీ ఇదంతా నచ్చక తిరిగిచ్చేశాను. అయితే ఆ రోజు సరిగా విశ్రాంతి లేకపోవడం వల్ల స్పీచే కష్టంగా ఇచ్చాను. అన్ని పూర్తి చేసుకుని బయటకొస్తుంటే శాలువా తీసుకొచ్చాడు. కానీ అది కిందపడేయడం నా తప్పే. దానికి నేను సారీ చెబుతున్నా' అని శివకుమార్ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
విజయ్‌కాంత్ లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా: కార్తీ
దివంగత నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తరపున ఈ నెల 19న సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు హీరో, ఆ సంఘం కోశాధికారి కార్తీ తెలిపారు. గత నెల 28న విజయ్‌కాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా.. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం కారణంగా సంతాపం తెలుపలేకపోయారు. అందులో హీరో కార్తీ ఒకరు. గురువారం చైన్నెకి చేరుకున్న ఆయన తన తండ్రి శివకుమార్, సోదరుడు సూర్యతో కలిసి స్థానిక కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయ ఆవరణలో విజయకాంత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్‌కాంత్ మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అంటే మార్గదర్శిగా నిలవాలన్నది విజయ్‌కాంత్ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. కాగా జనవరి 19న తమ సంఘం తరపున విజయ్‌కాంత్‌కు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. • Exclusive - #Sivakumar Sir, @Karthi_Offl Anna At Captain #Vijayakanthsir 's Home For Grieving The Loss Of Their Loved One | @prabhu_sr #Karthi pic.twitter.com/pzMldSMoez — Yogesh Yogi (@YogeshY16480498) January 5, 2024 చదవండి: ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
తెనాలికి సీఎం వరాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం నిధులను మంజూరు చేస్తున్నట్లు మంగళవారం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ► తెనాలిలో మున్సిపల్ భవనం కోసం రూ.15 కోట్లు ► షాదీ ఖానా కోసం రూ.4 కోట్లు ► ఎస్సీ కాలనీలో స్మశానవాటిక కోసం రూ.9 కోట్లు ► కొల్లిపర మండలంలో అగ్రికల్చర్ మినీ మార్కెట్ యార్డు భూముల కొనుగోలు కోసం రూ.5 కోట్లు ► దుగ్గిరాల– కొల్లిపర రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు డ్రోన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నదాతలు ఆశీస్సులు అందించాలి అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్‌కి సంపూర్ణ ఆశీస్సులు అందించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం నూటికి నూరు శాతం బీమా ప్రీమియాన్ని భరిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలుస్తున్నాం. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మి వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి లక్ష మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇవన్నీ కొన్ని పత్రికలకు, టీడీపీ నాయకులకు పట్టడం లేదు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అన్న మాదిరిగా వ్యవహరిస్తున్నారు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వారి నోటిని వేటితో కడగాలి? పేద ఎస్సీ మహిళా కౌలు రైతునైన నాకు సెంటు భూమి కూడా లేదు. 6 ఎకరాలు కౌలుకు తీసుకుని పసుç³#, వరి సాగు చేస్తున్నా. కరోనా సమయంలో పసుపు రూ. 5,500 ఉంటే మీరు రూ.6,850 ప్రకటించడంతో లబ్ధి పొందాం.గతేడాది పసుపు వర్షాలతో దెబ్బతింటే ఇన్సూరెన్స్ కింద రూ.80వేలు వచ్చాయి. టైలరింగ్ కూడా చేస్తున్న నాకు చేయూత సాయం అందుతోంది. మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టగా కొంతమంది మాత్రం మీరు వెళ్లిన తర్వాత తుడిచేశారు. ఇప్పుడు కొందరు పాదయాత్ర చేస్తున్నారు. వారి మాటలూ వింటున్నాం. మరి వాళ్ల నోటిని వేటితో కడగాలి? – పి.మేరిమ్మ, రేవేంద్రపాడు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
సంక్రాంతికి బుల్లితెరపై సూర్య తండ్రి శివకుమార్ తిరుక్కురళ్ 100
తమిళసినిమా: సీనియర్ నటుడు, హీరో సూర్య తండ్రి శివకుమార్ గొప్ప నటుడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఉత్తమ నటుడుగా కంటే మంచి చిత్ర కళాకారుడు అనిపించుకోవడమే గర్వంగా భావిస్తారు. శివకుమార్ మంచి చిత్రకారుడు అన్న విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాలకు పైగా కథానాయకుడిగా సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథా చిత్రాలు చేసి శభాష్ అనిపించుకున్న శివకుమార్ నటనకు స్వస్తి చెప్పి దశాబ్దంన్నరకు పైనే అయ్యింది. అయితే ఆయన ప్రశాంతి దశలో మాత్రం లేరు. కంబ రామాయణం, మహాభారతం వంటి పురాణం గ్రంథాలను అవపోసన చేసి వేదికలపై గంటల తరబడి ప్రవచనాలు చెబుతూ ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తున్నారు. తాజాగా తిరుక్కురళ్ 100 పేరుతో ముఖ్య అంశాలకు తన జీవిత అనుభవాలను జోడించి ఓ గ్రంథాన్ని రచించారు. దానిని ఇటీవల ఈరోడ్‌లో వేలాదిమంది ప్రేక్షకుల సమక్షంలో ఏకధాటిగా ఉపన్యసించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతకుముందు పరిధి పరిమేలముగర్ నుంచి సాల్మన్ పాపయ్య వరకు పలువురు ప్రముఖ రచయితలు తిరుక్కురళ్‌కు పరిభాషను రచించారు. అయితే తిరుక్కురళ్‌లోని ముఖ్య అంశాలకు తన అనుభవాలను జోడించి రచించింది నటుడు శివకుమారేనని అభినందనలు అందుకుంటున్నారు. కాగా ఈయన రాసి, ఉపన్యసించిన తిరుక్కురళ్ 100 కార్యక్రమాన్ని పుదియ తలైమురై టీవీ ఛానల్ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రచారం చేయనుంది. అదే విధంగా పుదుయుగం ఛానల్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ప్రచారం చేయనుందని నటుడు శివకుమార్ శనివారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. -
శివ వెనకున్నవారినీ శిక్షించాలి
సాక్షి, వరంగల్: న్యాయ విద్యార్థినిపై లైంగికదాడి కేసులో అరెస్టయిన వేముల శివకుమార్‌ను శిక్షించాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేశాయి. తన పీఏ పోక్సో కేసులో అరెస్టవ్వడానికి నైతిక బాధ్యత వహిస్తూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. శివతోపాటు ఆయన వెనుక ఉన్న అధికార పార్టీ వారికి శిక్ష పడేలా పోలీసుల దర్యాప్తు సాగాలని కోరాయి. అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం జంక్షన్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ, వరంగల్ చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కొండా సురేఖ, వరంగల్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మట్టెవాడ ఠాణాకు తరలించి శివకుమార్‌తో పాటు విజయ్‌కుమార్, హాస్టల్ నిర్వాహకురాలును పోలీసులు అరెస్టు చేశారు. -
వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం..సాక్షి ఫోటో జర్నలిస్టులకు సన్మానం
-
ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్ ఎంపిక
భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్ నేషన్ వన్ ఫ్లాగ్’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్ కోల్లోజు శివకుమార్ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్ అవార్డు అందుకోనున్నారు. -
సింపుల్‌గా బీఏ రాజు కుమారుడి వివాహం.. ఫోటోలు వైరల్
BA Raju Son Siva Kumar Marriage Pics Goes Viral: ప్రముఖ దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్ శివకుమార్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం నిరాడంబరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'పూణెకి చెందిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ పేర్కొన్నారు. ఇక కొత్త జంటకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా పూరి జగన్నాథ్, వివి. వినాయక్ వంటి టాప్ డైరెక్టర్స్ వద్ద సహాయ దర్శకుడిగా చేసిన శివకుమార్.. శివకుమార్ ’22’అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. Today Got Married To My Bestie Dandige Lavanya , Marathi Girl From Pune Settled In Hyderabad . Need All Your Blessings As We Start Our New Journey Together. Thanks & Love You All ❤️ pic.twitter.com/bH8Yu1tos3 — Shiva Kumar B (@ShivaKumarB22) January 22, 2022 -
3 టన్నుల ఇనుముతో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
తెనాలి: తెనాలి శిల్పకారులు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 14 అడుగుల విగ్రహాన్ని ఇనుప వ్యర్థాలతో తయారు చేశారు. సూర్య శిల్పశాల నిర్వహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు 3 టన్నుల ఇనుప వ్యర్థాలను ఉపయోగించి, 3 నెలల శ్రమతో అంబేడ్కర్ విగ్రహాన్ని వీరు తీర్చిదిద్దారు. శిల్పశాల ఎదుట ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహంతో ఎమ్మెల్యే శివకుమార్ -
నేను ప్రేమించా.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు
బచ్చన్నపేట: ఇద్దరూ క్లాస్మేట్స్.. కలసి చదువుకున్నారు.. ఆ రకంగా ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ఈ ప్రేమ యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది.. దీంతో కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు.. చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్‌ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్‌లో చదివించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్ (22) హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కావడంతో ఇద్దరూ కొడవటూర్ గ్రామంలోనే ఉంటున్నారు. (బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్‌తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్‌పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్ వెళుతున్న అతడిని యువతి సోదరుడు శివకుమార్ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్ రోడ్డుపై కమాన్ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
రాజనీతి
పూర్వం చంద్రగిరిని జయవర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన పాలనలో సమర్థుడు. తన కాలంలో రాజ్యాన్ని బాగా విస్తరించడమే కాక ప్రజలను కన్నబిడ్డల వలే చూసేవాడు. రాజ్యం మధ్యన వున్న నది ఒడ్డున పెద్దకోట కట్టాడు. అది శత్రుదుర్భేద్యమైన కోట. ఆయనకు చెట్లంటే వల్లమాలిన అభిమానం. కోట లోపల వున్న అంతఃపురం చుట్టూ గొప్ప ఉద్యనవనాన్ని పెంచాడు. వాటిని చూడడానికి అనేకమంది పనివాళ్లను నియమించాడు. యుద్ధాలు లేని, రాజకీయంగా సమస్యలు లేని సమయాల్లో ఆయన సాయంత్రం ఉద్యానవనంలో సేదదీరేవాడు. ఆ సమయంలో అక్కడికి పండితులను రప్పించుకుని, వారి చేత రామాయణ, భారత, భాగవతాలను చదివింపజేసుకొని వినేవాడు. అందులోని ధర్మసూక్ష్మాలను వారితో చర్చించేవాడు. అయితే ఆయనకు పెద్ద కొరత ఉండేది, అదేమంటే సంతానం లేకపోవడం. ఎవరైనా ఆ విషయాన్ని ఆయన ముందు ఎత్తితే, ‘‘ఎందుకు బిడ్డలు లేరని బాధ పడటం? నా ప్రజలందరూ నా బిడ్డలే కదా! ఇందుకు నేను సంతోషపడాలిగాని, విచారించడం దేనికి? అది సరయింది కాదు’’ అనేవాడు. ‘‘అది కాదు ప్రభూ! తమ తర్వాత ఈ రాజ్యానికి వారసుడెవరా?’’ అని అంటే ‘‘అది భగవంతుడు నిర్ణయిస్తాడు, దానికి మనం బాధ పడటం దేనికి?’’ అనేవాడు మహారాజు. కాలం గడిచింది. రాజుగారు వృద్ధులయ్యారు. కాలం చేశారు. తరవాత వారసుడి గురించి సేనాధిపతి, మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి, ‘‘మన రాజ్యానికి అనాదిగా ఒక ఆచారం వుంది. వారసుడు లేనప్పుడు మన పట్టపుటేనుగుకు ఒక దండ ఇచ్చి, అది ఎవరి మెడలో వేస్తే వారే రాజు! ఆ ఆచారాన్నే మనం ఇప్పుడు కూడా కొనసాగనిద్దాం’’ అన్నాడు. ‘‘ఏనుగుకు ఎవరు సమర్థుడో, ఎవడు కాదో ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఒక అనర్హుడు అదృష్టవంతుడయితే మన రాజ్యం పరిస్థితి ఏమిటి? అధోగతే కదా?’’ అని సేనాధిపతి అన్నాడు. దానికి మంత్రి, ‘‘మన ప్రభువు గొప్ప దైవభక్తుడు, ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ వుంటాయి. మన పట్టపుటేనుగు మనకు మంచి రాజును నిర్ణయిస్తుందని నాకు నమ్మకం వుంది’’ అన్నాడు. మంచి ముహూర్తం చూసి, మంత్రి పట్టపుటేనుగుకు మాల ఇచ్చి, రాజవీధుల గుండా నడిపించే ఏర్పాటు చేశాడు. హుందాగా పూలదండను తొండంతో పట్టుకుని రాజవీధుల గుండా నడుస్తూ చివరకు పట్టపుటేనుగు ఒక బలిష్ఠుడైన సామాన్యుడి మెడలో వేసింది. ఆశ్చర్యం! విచారిస్తే, వాడు కోటలో వున్న తోటమాలి కొడుకు, వీరభద్రుడు. మంత్రి అతణ్ణి రాజుగా ప్రకటించి, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయసాగాడు. సేనాధిపతి, మంత్రితో ‘‘ఒక తోటమాలి కొడుకు ఇంత పెద్దరాజ్యాన్ని సమర్థంగా పరిపాలించగలడా? శత్రువుల బారి నుండి రాజ్యాన్ని కాపాడగలడా?’’ అంటూ సందేహం బయటపెట్టాడు. ఇదంతా వీరభద్రుడు విననే విన్నాడు. ‘‘అయ్యా! నేను తోటమాలి కొడుకునే. అయినంత మాత్రాన రాజ్యాన్ని పాలించలేనని ఎలా అనుకుంటున్నారు? ఎవరైనా అవకాశం రానంతవరకే సామాన్యులు. అవకాశం లభిస్తే వారిలోని శక్తిసామర్థ్యాలు వాటంతట అవే వెలుపలికి వస్తాయి’’ అంటూ ఈ శ్లోకం చెప్పాడు. యధా మధు సమాదత్తే రక్షాన్ పుష్పాణి షట్పదః తద్వ దర్థాన్మనుష్యే భ్య ఆద ద్యాద విహింసయా–అంటే ‘‘తుమ్మెదలు ఏ విధంగానయితే, తమకున్న శక్తియుక్తులతో పూలను పాడు చేయకుండా, వాని నుండి మహత్తరమైన తేనెను పొందుతాయో...అట్లే ప్రజారంజకుడైన రాజు తన ప్రజలను అన్ని విధాలైన ఆపదల నుండి కాపాడుతూనే రాజ్య క్షేమం కోసం వాని నుండి తగిన మేరకు శిస్తు మొదలైన వాటిద్వారా ధనాన్ని, ఏ విధమైన హింసకు తావు లేకుండా సన్మార్గాన గ్రహిస్తాడు’’ అని అర్థం చెప్పాడు. మంత్రి, సేనాధిసతి ఆశ్చర్యపోతుండగా వీరభద్రుడు ఇలా ఇలా అన్నాడు... పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్ఛేదం నకారయేత్ మూలాకార ఇవారమే న యధా జ్ఞా ర క కారకః అంటూ అర్థం కూడా ఇలా చెప్పాడు వీరభద్రుడు. ‘‘తోటలో మాలి ఏ విధంగా ఒక్కొక్క పువ్వును ఎంతో జాగ్రత్తగా పువ్వు యొక్క మూలానికి హాని కలగకుండా పుష్పాలను కోస్తాడో, అదే విధంగా ప్రజారంజకుడైన రాజు తన ప్రజల జీవన మూలానికి ఎటువంటి కీడు కలిగించకుండా పన్నులు గ్రహిస్తాడు. అంతేగాని బొగ్గును తయారు చేసే వాడిలాగా మూలానికి హాని చేయడు’’ ఆశ్చర్యం నుంచి తేరుకొని మంత్రి ‘‘ఇవన్నీ భారతంలోని విదురనీతిలోనివి. నీకెలా తెలుసు? చూస్తే నీకు మంచి ధారణశక్తి వున్నట్టుంది’’ అన్నాడు. దానికి వీరభద్రుడు– ‘‘అయ్యా! నేను చిన్ననాటి నుండి రాజుగారి ఉద్యానవనంలో నా తండ్రితో పాటు కలిసి పనిచేస్తుండేవాణ్ణి! రాజుగారు సాయం సమయాల్లో జరిపే పండితగోష్ఠులను శ్రద్ధగా వినేవాడ్ని. పెద్దయితే నేను రాజుగారి కొలువులో ఏదైనా ఉద్యోగం చేయాలనుకునేవాణ్ణి, కాని అదృష్టం నన్ను రాజును చేసింది. నాకున్న జ్ఞానంతో నేను రాజ్యాన్ని సుభిక్షం చేయగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది’’ అన్నాడు. మంత్రికి ఎంతో తృప్తి కలిగింది. ఆయన సేనాధిపతి వైపు చూస్తూ ‘‘రాజుగారన్నట్లే భగవంతుడు మనకు మంచి రాజునే ఇచ్చాడు. ఇతనికి రాజనీతి తెలుసు. మన సహాయసహాకారాలు ఎలాగూ వుంటాయి గనక ఇబ్బంది ఏమి లేదు’’ అన్నాడు. సేనాపధిపతి సంతృప్తి పడ్డాడు. వారు ఊహించినట్టే వీరభద్రుడు అతి తక్కువ కాలంలోనే మంచిరాజుగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. -
టిక్‌టాక్‌లో చూసి శివకుమార్ ఫిదా.. కానీ,
బెంగళూరు : టిక్‌టాక్ ద్వారా పరిచయమైన యువతికి ఓ యువకుడు రూ. లక్షలు ఇచ్చి మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన శివకుమార్‌కు టిక్‌టాక్ ద్వారా విజయలక్ష్మీ అనే మహిళ పరిచయం అయింది. దీంతో శివకుమార్ ఫిదా అయ్యారు. ఆమె మొబైల్ నంబర్ తీసుకుని ఫేస్బుక్ ఖాతా ద్వారా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. వీరి స్నేహం ప్రేమగా మారింది. కొద్ది రోజుల పాటు ఇద్దరు ఒకే ఇంటిలో సహ జీవనం కూడా మొదలుపెట్టారు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి శివకుమార్ దగ్గర రూ. లక్షలు డబ్బులను తీసుకుని విజయలక్ష్మీ పరారైంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హత్య చేస్తానంటూ బెదిరించినట్లు శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీజీహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ బిల్డప్ బాబాయ్! ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని తహసీల్దార్ సమయస్పూర్తితో పట్టించిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. మహమ్మద్ సల్మాన్ (37) అరెస్టయిన నకిలీ ఐఏఎస్ అధికారి. నిందితుడు ఇన్నోవా కారుపై కర్ణాటక సర్కార అని రాసుకుని ఇద్దరు గన్మ్యాన్లను వెంటబెట్టుకుని తిరుగుతూ తాలూకాలకు వెళ్లి ప్రభుత్వ అధికారుల చేత పనులు చేయించుకోవడంతోపాటు రాజభోగాలు అనుభవించేవాడు. శుక్రవారం సాయంత్రం మహ్మద్ సల్మాన్ చెన్నపట్టణ ప్రభుత్వ అతిథిగృహంలో ఐఏఎస్ అధికారి హోదాలో దిగాడు. ఈ విషయం కాస్త తహసీల్దార్ సుదర్శన్ చెవిన పడింది. దీంతో హుటాహుటిన ఒక బొకే తీసుకుని స్వాగతిద్దామని బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో తహసీల్దార్ సుదర్శన్ రెవెన్యూశాఖకు సంబంధించి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేయగా మహ్మద్ సల్మాన్ తడబడ్డాడు. దొరికిపోతాననే భయంతో గన్మ్యాన్లతో కలిసి పరారవుతుండగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సల్మాన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదేవిధంగా ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతూ ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది. సల్మాన్‌తోపాటు ఇద్దరు గన్మ్యాన్లను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రాజస్తాన్‌లో తెలంగాణ పోలీసులపై దాడి
సాక్షి, వరంగల్ : రాజస్తాన్‌లో తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం వరంగల్ సుబేదార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ శివకుమార్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్ బేల్వాడ జిల్లా హెర్నియ గ్రామానికి వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై స్థానికులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ శివకుమార్‌తో పాటు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు. బేల్వాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు వరంగల్ పోలీసులపై దాడి చేసిన వారిపై రాజస్తాన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నేను పబ్లిక్ ప్రాపర్టీ కాదు!
సెలబ్రిటీలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ సినిమా నటీనటులంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే వారు ఎక్కడ కనిపించినా ఫొటోల కోసం ఎగబడుతుంటారు. ఇది ఒక్కోసారి ఆ సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. తాజాగా తమిళ నటుడు శివకుమార్‌కి (హీరో సూర్య, కార్తీల తండ్రి) అలాంటి ఇబ్బందే ఎదురైంది. తనతో సెల్ఫీ తీసుకోబోయిన ఓ అభిమాని ఫోన్ లాక్కొని శివకుమార్ విసిరివేశారు. ఇది కాస్తా హాట్ టాపిక్ కావడంతో శివకుమార్ స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘సెల్ఫీల విషయంలో ఎవరి ఇష్టం వారిది. కానీ, ఒక సెలబ్రిటీ విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు. ఓ 25 మంది అభిమానులు సెక్యూరిటీ గార్డులను పక్కకు తోసేసి మరీ నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగాలనుకుంటే ముందు వారి అనుమతి తీసుకోవాలి. నేనేమీ పబ్లిక్ ప్రాపర్టీ కాదు. నాకూ ప్రైవసీ ఉంటుంది. గతంలో చాలాసార్లు అభిమానులు సెల్ఫీ అడిగితే కాదనలేదు. నన్ను నేను ఓ బుద్ధుడిలానో లేదా ఓ సాధువులానో భావించడం లేదు. నేనూ మీలాగే సాధారణ మనిషిని. నాకు నచ్చినట్లుగా జీవిస్తున్నాను. నన్ను ఓ నేతగానో.. ఓ సూపర్స్టార్గానో చూడాలని కోరడం లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో హీరోలే. కానీ, మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు’’ అని శివకుమార్ పేర్కొన్నారు. -
జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్ కీలక సమాచారం
చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కమిషన్ జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌తో పాటు జయలలిత దగ్గర చాలాకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న కన్నన్‌ని వేర్వేరుగా విచారించింది. శశికళ, వైద్యుడు, కన్నన్ చెప్పిన అంశాలకు పొంతన లేదని తెలిపింది. శశికళ, శివకుమార్‌ల వర్షన్... ‘ఆ రోజు అనగా 2016, సెప్టెంబర్ 22న అమ్మ(జయలలిత) బెడ్‌పై కూర్చుని ఉంది. అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో డ్రైవర్ కన్నన్, జయ వ్యక్తిగత భద్రతా అధికారి ‘అమ్మ’ను బెడ్ మీద నుంచి వీల్ చైర్‌లోకి మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. దాంతో రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్‌కు ఫోన్ చేసామని’ చెప్పారు. కన్నన్ చెప్పిన వివరాలు... ‘అమ్మ’ డ్రైవర్ కన్నన్ మాత్రం శశికళ, శివకుమార్‌లు చెప్పిన దానికి విరుద్ధమైన విషయాలు చెప్పాడని కమిషన్ వెల్లడించింది. కన్నన్ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కన్నన్ జయలలితను ఆస్పత్రిలో చేర్చిన రోజు జరిగిన సంఘటన గురించి కమిషన్‌తో చెప్పిన వివరాలు... ‘నేను ‘అమ్మ’ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్లో కూర్చుని ఉన్నారు. అప్పటికే ‘అమ్మ’ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. పెన్ను కాప్ కూడా తీసి ఉంది. ‘చిన్నమ్మ’ నాతో వెంటనే వెళ్లి ఒక వీల్ చైర్ తీసుకు రా, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. కొంతసేపటి తరువాత నేను, పీఎస్ఓ వీరపెరుమాల్ చైర్ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్లో కూర్చొపెట్టాము. రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్ నుంచి కింద పడింది. వెంటనే నేను, వీరపెరుమాల్ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. దాంతో స్ట్రెచర్ తీసుకువస్తే బాగుంటుందని భావించామ’ని తెలిపాడు. గంట సేపు డాక్టర్ అదృశ్యం... అంతేకాక కన్నన్ చెప్పిన మరో ఆసక్తికర అంశమేంటంటే.. ‘నేను రాత్రి 8.30 గంటల సమయంలో డాక్టర్ శివకుమార్‌ను పోయెస్ గార్డెన్లో చూశాను. కానీ కొంతసేపటి తరువాత ఆయన బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన తిరిగి ఎప్పుడు పోయెస్ గార్డెన్‌కి వచ్చాడో నాకు తెలియదు. కానీ నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు గంట తర్వాత అంటే 9.30 గంటలకు అతను తిరిగి వచ్చుంటాడని తెలిపాడు. అంతేకాక ‘ఆ రోజు(సెప్టెంబర్ 22) రాత్రి 10 గంటల ప్రాంతంలో కారును సిద్ధంగా ఉంచమని పీఎస్వో పెరుమాళ్‌కు చెప్పాను. అయితే లక్ష్మి (జయ ఇంట్లో పనిమనిషి) పెద్ద కారు అయితే బాగుంటుందని తనతో చెప్పింద’ని తెలిపాడు. అయితే కన్నన్ చెప్పిన ఈ రెండు విషయాలను శశికళ, శివకుమార్‌లు చెప్పలేదని కమిషన్ పేర్కొంది. అంతేకాక పోయెస్ గార్డెన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అయితే సెప్టెంబర్ 22 నాటి దృశ్యాలు అందులో రికార్డయ్యాయో, లేదో తనకు తెలియదని కన్నన్ కమిషన్‌తో చెప్పాడు. -
కార్తీతో మళ్లీ..
తమిళసినిమా: నటుడు కార్తీ, నటి రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో కార్తీ, రకుల్ మధ్య రొమాన్స్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. తాజాగా ఈ జోడి మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై రొమాన్స్‌కు రెడీ అయ్యింది. సరవణన్, ఆర్.కన్నన్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌కశ్యప్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రజత్ రవిశంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ చిత్రాన్ని రిలయన్స్ సంస్థ సమర్పణలో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇది కార్తీకు 17వ చిత్రం. ఈ చిత్రం శనివారం ఉదయం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కార్తీ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టగా, నటుడు సూర్య కెమెరా స్విచ్ఛాన్ చేసి షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్ కీలక పాత్ర పోషించనుండటం మరో విశేషం. ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్, ఆర్జే.విఘ్నేశ్‌కాంత్ నటిస్తున్నారు. దీనికి హారీష్ జయరాజ్ సంగీతం, వేల్రాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ నెల 8 నుంచి 15 రోజుల పాటు చెన్నైలో షూటింగ్ నిర్వహించినున్నట్లు, ఆ తరువాత హైదరాబాద్, ముంబై, యూరప్ దేశాలు, హిమాలయాల్లోనూ చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి 2డీ.ఎంటర్టెయిన్మెంట్ రాజశేఖర్ పాండియన్, దర్శకుడు పాండిరాజ్, మాదేశ్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు
-
‘ఫీజు’ చెల్లించే వరకు పోరు
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ 24న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలు కల్పించి, అంతులేని హామీలు గుప్పించి, 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ.. అతి తక్కువ కాలంలోనే అపఖ్యాతి మూటగట్టుకొందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ విమర్శించారు. మంగళవారం లోటస్‌పాండ్ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల బలిదానాలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ పూటకో మాట.. పచ్చి అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని వాపోయారు. వైఎస్సార్ 23 జిల్లాల్లో సమర్థవంతంగా ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాలలకు చెల్లించారన్నారు. తద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులు ఉన్నత చదువు అభ్యసించేందుకు అవకాశం కల్పించారన్నారు. మహానేత వైఎస్సార్ అకాల మరణం తర్వాత అధికార పీఠం ఎక్కిన నలుగురు సీఎంలు వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రం విడిపోతే మా బతుకులు బాగుపడతాయని ఆశలు పెట్టుకున్న విద్యార్థులను టీఆర్ఎస్ సర్కారు నిరాశకు గురిచేసిందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూ రూ. 1,35,000 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్.. విద్యార్థులకు రూ. 3,000 కోట్లు చెల్లించలేరా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఏటా 30 నుంచి 40 శాతం మాత్రమే చెల్లిస్తూ పోతే రాబోయే అకడమిక్ సంవత్సరంలో అది రూ.6,000 కోట్లకు చేరి, విద్యార్థుల చదువులే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో పోరాటం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తమ పార్టీ సమరానికి సిద్ధమైందన్నారు. ఈ నెల 24న నగరంలోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ శ్రేణులంతా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేంత వరకు పోరాటం ఆపమని అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24న చలో ఇందిరా పార్కు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో ఉదయం 11 గంటలకు ఆందోళన ప్రారంభమౌతుందన్నారు. -
అనూప్, శివకుమార్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్కేటర్లు అనూప్‌కుమార్, శివకుమార్ మనీశ్‌లు సత్తా చాటారు. చైనాలోని లిషుయ్ నగరంలో జరిగిన ఈ టోర్నమెంట్ సీనియర్ విభాగంలో అనూప్ కుమార్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలను సాధించగా... క్యాడెట్ విభాగంలో శివకుమార్ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. -
నాన్న బాటలో పయనిస్తాం
నాన్న బాటలో పయనించడానికి ప్రయత్నిస్తామని ప్రముఖ నటుడు సూర్య వ్యాఖ్యానించారు. సీనియర్ నటుడు, సూర్య, కార్తీల తండ్రి, మంచి చిత్రకారుడు అయిన శివకుమార్ 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టిన రోజును గురువారం ఆయన గురించిన విశేషాలతో కూడిన గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ శివకుమార్ ఇన్ తమిళసినిమా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గిండిలోని ఒక నక్షత్రహోటల్ వేదికై న ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య మాట్లాడుతూ తన తండ్రి నటుడిగా పరిచయం కానీ 22 ఏళ్ల వయసులో ఆకలి బాధను కూడా లెక్క చేయకుండా గీచిన చిత్రలేఖనాలను ఆయన 75 వ వసంతంలో ప్రజల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిరంత శ్రమ, కృషితో తమ నాన్నమ్మ అడవులకు వెళ్లి కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బుతో పొట్ట నింపుకుని నటుడిగా ఈ స్థాయికి ఎదిగారని తెలిసారు. ఇక్కడ వక్తలు మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవాలని తమకు సలహా ఇస్తున్నారని, అయితే నాన్న జీవన విధానం తమకు సాధ్యం కాదని అన్నారు. ఆయన చిత్రకళాకారుడిగా ఉంటూ అటుపై నటనపై ఆసక్తితో ఆ వైపు దృష్టి సారించారని, షూటింగ్ ముగిసిన తరువాత నాటకాలతో నటనను మరింత మెరుగుపరచుకునే వారని, అలా ఉదయం నుంచి రాత్రి వరకూ శ్రమించారని తెలిపారు. అందువల్ల నాన్న అడుగుజాడల్లో నడవడానికి తాము ప్రయత్నం మాత్రమే చేయగలం అని పేర్కొన్నారు. నాన్నకు ఇప్పటికీ 500 మందితో సన్నిహితంగా ఉంటారన్నారు. అంత కాకపోయినా తామూ నలుగురు సన్నిహితులను పొందాలని భావిస్తున్నామనని అన్నారు. శివకుమార్ మాట్లాడుతూ తాను గొప్పనటుడినని చెప్పుకోను గానీ, చిత్రకారుడినని చెప్పుకోవడానికి గర్వపడతానని పేర్కొన్నారు. తన 16వ ఏట నుంచి 24 ఏళ్ల మధ్యలో గీచిన చిత్రలేఖనాలను ఇప్పుడు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని శివకుమార్ అన్నారు. -
నవంబర్ 8 లోపే వారిపై వేటు వేయాలి
వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపలే స్పీకర్ అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై నవంబర్ 8 లోపే అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్సీపీ స్వాగతిస్తోం దన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారని, అలాంటప్పుడు పార్టీ ఫిరారుుంచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. -
నాగకన్య పోరాటం
గతజన్మ స్మృతుల అన్వేషణలో ఓ నాగకన్యకు ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రతికూల శక్తులపై ఆమె ఎటువంటి పోరాటం చేశారు? నాగకన్య నేపథ్యం ఏంటి? అనే కథాంశంతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగభరణం’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సాజీద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రధారులు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ నెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ‘‘క్లైమాక్స్‌లో స్వర్గీయ కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను గ్రాఫిక్స్ రూపంలో పునఃసృష్టించిన సన్నివేశాలు అలరిస్తాయి. మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి బలం. కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు కోడి రామకృష్ణ. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి ప్రేక్షకాదరణ లభించిందని శివకుమార్ తెలిపారు. ముకుల్‌దేవ్, రవి కాలే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: వేణు, సంగీతం: గురుకిరణ్.