కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు.
హైదరాబాద్ : కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు. మేడే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తమ పార్టీ పేరులోనే కార్మికుల సంక్షేమం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు.