సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం నిధులను మంజూరు చేస్తున్నట్లు మంగళవారం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
► తెనాలిలో మున్సిపల్ భవనం కోసం రూ.15 కోట్లు
► షాదీ ఖానా కోసం రూ.4 కోట్లు
► ఎస్సీ కాలనీలో స్మశానవాటిక కోసం రూ.9 కోట్లు
► కొల్లిపర మండలంలో అగ్రికల్చర్ మినీ మార్కెట్ యార్డు భూముల కొనుగోలు కోసం రూ.5 కోట్లు
► దుగ్గిరాల– కొల్లిపర రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు
డ్రోన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అన్నదాతలు ఆశీస్సులు అందించాలి
అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్‌కి సంపూర్ణ ఆశీస్సులు అందించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం నూటికి నూరు శాతం బీమా ప్రీమియాన్ని భరిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలుస్తున్నాం.
రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మి వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి లక్ష మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇవన్నీ కొన్ని పత్రికలకు, టీడీపీ నాయకులకు పట్టడం లేదు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అన్న మాదిరిగా వ్యవహరిస్తున్నారు.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
వారి నోటిని వేటితో కడగాలి?
పేద ఎస్సీ మహిళా కౌలు రైతునైన నాకు సెంటు భూమి కూడా లేదు. 6 ఎకరాలు కౌలుకు తీసుకుని పసుç³#, వరి సాగు చేస్తున్నా. కరోనా సమయంలో పసుపు రూ. 5,500 ఉంటే మీరు రూ.6,850 ప్రకటించడంతో లబ్ధి పొందాం.గతేడాది పసుపు వర్షాలతో దెబ్బతింటే ఇన్సూరెన్స్ కింద రూ.80వేలు వచ్చాయి.
టైలరింగ్ కూడా చేస్తున్న నాకు చేయూత సాయం అందుతోంది. మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టగా కొంతమంది మాత్రం మీరు వెళ్లిన తర్వాత తుడిచేశారు. ఇప్పుడు కొందరు పాదయాత్ర చేస్తున్నారు. వారి మాటలూ వింటున్నాం. మరి వాళ్ల నోటిని వేటితో కడగాలి?
– పి.మేరిమ్మ, రేవేంద్రపాడు, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment