వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) సీఈ శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కేటీపీపీలో ఉద్యోగ నియామకాల్లో, క్యాజువల్ లేబర్ ఎంపికలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్థానిక నిరుద్యోగులు లోకాయుక్తకు జూన్ 17వ తేదీన ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్తా సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. కేటీపీపీ అధికారుల వింత నిర్ణయాల మూలంగా ప్లాంట్‌లో స్థానికేతరులకు ఉద్యోగాలు లభించాయి. ఇటీవల చేపట్టిన 420 జేపీఏ(జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్) ఉద్యోగ నియూమకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై సీఈకి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త.. 24న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.