KTPP
-
కేటీపీపీలో లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు లక్ష మెట్రిక్ టన్నులకు చేరింది. కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌లో మరమ్మతుల సందర్భంగా లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రానికే బొగ్గు నిల్వ లక్ష మెట్రిక్ టన్నులకు చేరింది. అధికారుల ప్రణాళిక ప్రకారం రవాణా జరిగితే మరో 20 రోజుల్లో 2.50లక్షల టన్నుల బొగ్గు కేటీపీపీకి చేరుతుంది. -
బొగ్గుయార్డులో లారీ క్లీనర్ సజీవ సమాధి
గణపురం :మండలంలోని చెల్పూరు శివారులోని కేటీపీపీలోని బొగ్గుయార్డ్లో శనివారం జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్ దర్శనాల సమ్మోదర్(23) సజీ వ సమాధి అయ్యాడు. భూపాలపల్లిలోని రాంనగర్లో నివాసముం టున్న సింగరేణి కార్మికుడు దర్శనాల వెంకటయ్య, విమల దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారి లో ఒక కుమారుడైన సమ్మోదర్ బొగ్గు లారీపై క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భూపాలపల్లి నుంచి లోడుతో కేటీపీపీకి వచ్చిన రెండు లారీలు యార్డ్‌లో బొగ్గును డంపు చేస్తున్న సమయంలో సమ్మోదర్పై బొగ్గుపడింది. ఈ విషయాన్ని రెండు లారీల డ్రైవర్లు గమనించలేదు. డంపు చేసిన తర్వాత క్లీనర్ కోసం వెతకగా కనిపించలేదు. అతడి కోసం అరగంట సేపు వెతికారు. తర్వా త అనుమానం వచ్చి అక్కడ డంపు చేసిన బొగ్గును ప్రొక్లయిన్తో తోడగా ముక్కలుముక్కలుగా సమ్మోదర్ మృ తదేహం బయటపడింది. తల కనిపిం చలేదు. ప్రమాదానికి కారణమైన లారీలు వేర్వేరు ట్రా¯న్పోర్టులకు సం బంధించినవి. బొగ్గు డంపు చేసే సమయంలో యార్డ్‌కు సంబంధించిన అధికారులు లేకపోవడంతో సంఘటన సమాచారం కచ్చితంగా తెలి యడం లేదు. పోలీసులు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఎస్సై ప్రవీన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య మంజుల, నాలుగు నెలల కూతురు పాప ఉన్నారు. మృతుడి కూతురు పరిస్థితి విషమం సంఘటన స్థలంలో సమ్మోదర్ మృతదేహంపై పడి భార్యతోపాటు తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగి లేలా విలపించారు. సుమారు నాలు గు నెలలు కూడా నిండని అతడి కూతురికి ఫిట్స్ వచ్చాయి. దీంతో గాబరా పడ్డా బంధువులు చేతిలో ఇనుప వస్తువు పెట్టి కాళ్లు చేతులు మర్దన చేశారు. భర్త మరణం, కూతురి పరిస్థితిని చూసి మంజుల బోరున విలపించింది. పాపను స్థానిక అస్పత్రికి తరలించారు. -
కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గణపురం : గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) 500 మెగావాట్ల ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మరమ్మతు చేపట్టి తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. బాయిలర్ ట్యూబ్‌ల్లో తలెత్తిన సమస్యతోనే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. -
కేటీపీపీలో కొనసాగుతున్న మరమ్మతులు
విద్యుత్ ఉత్పత్తికి మరో నాలుగు వారాలు పట్టే అవకాశం గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. శనివారం బీహెచ్ఈఎల్కు చెందిన ఆరుగురు ఇంజనీర్ల బృందం జనరేటర్‌ను పరిశీలించింది. ఈసందర్భంగా జనరేటర్‌ను రెండు భాగాలుగా వీడదీసి గమనించగా కోర్స్ భాగంలో లోపం బయటపడింది. జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, రాధాకృష్ణ మరమ్మతులను పర్యవేక్షించారు. ప్లాంట్‌లో సంవత్సరం పాటు మరమ్మతులు చేసే బాధ్యత బీహెచ్ఈఎల్ కంపెనీదే కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి అనుభవం కల్గిన ఇంజనీర్లను రప్పిం చారు. జనరేటర్లో విడిభాగాలు విదేశాల నుంచి, కొన్ని చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నందున మరమ్మతులు పూర్తయ్యేందుకు దాదాపు నెల రోజులు పట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు. -
ఆదినుంచీ అవాంతరాలే
600 మెగావాట్ల ప్లాంట్‌పై కమ్ముకున్న చీకటి తెరలు ఈ నెలలో ఇప్పటికి మూడుసార్లు ఉత్పత్తికి బ్రేక్ మరమ్మతులకు నెల రోజులు పట్టవచ్చంటున్న అధికారులు గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో గల కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లోని 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తికి పలుమార్లు అంతరాయం కలుగుతుండటంతో నష్టాల బాట పట్టింది. ప్లాం ట్‌పై చీకటి తెరలు కమ్ముకున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే మూడుసార్లు ఉత్పత్తి నిలిపోయింది. గత ఆరు రోజులుగా ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్ పడింది. జూలైలోనూ రెండు పర్యాయాలు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరి 5న విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏకధాటిగా 15 రోజులు ఉత్పత్తి అయిన సందర్భం లేదు. వాస్తవానికి ప్లాంట్ ప్రారంభిం చిన రెండు నెలలకు కానీ సీఓడీ ప్రకటన రాలేదు. సీఓడీ జరిగిన తరువాత ప్లాంట్‌లో వారం, పది రోజులకోమారు విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం జనరేటర్ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేయడానికి నెల రోజులు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్లాంట్‌లో తరుచూ అంతరాయం ఏర్పడుతుండడంతో కేటీపీపీకి భారీ నష్టం వాటిల్లుతోంది. 600 మెగావాట్ల ప్లాంట్ నుంచి ఉత్పత్తి జరిగే విద్యుత్ 24 గంటలకు 14.5 మిలియన్ యూనిట్లు ఉంటుంది. యూనిట్‌కు రూ.5 చొప్పున విలువ కట్టినా రోజుకు కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. -
కేటీపీపీ విద్యుదుత్పత్తి పునఃప్రారంభం
600 మెగావాట్ల ప్లాంట్‌లో కొనసాగుతున్న మరమ్మతులు గణపురం : మండలంలోని చెల్పూరు శివారు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లో శనివారం ఉద యం విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. బాయిలర్ ట్యూబ్‌ల లీకేజీలతో రెండు రోజుల క్రితం మొదటి దశ విద్యుత్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిన విషయం తెలిసిందే. పగిలిన బాయిలర్ ట్యూబ్‌లకు రెండు రోజుల పాటు మరమ్మతులు చేసిన అధికారులు సింక్రనైజేషన్ ప్రారంభించారు. కాగా మూడు రోజుల క్రితం రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లోనూ విద్యుదుత్పత్తి నిలిచింది. జనరేటర్లో సాంకేతిక సమస్య తలెత్తగా ప్లాంట్ ఇంకా ప్రారం భం కాలేదు. మరో మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించేం దుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
కేటీపీపీ రెండు ప్లాంట్లలో విద్యుదుత్పత్తికి బ్రేక్
గణపురం : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లోని 500, 600 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది. 600 మెగావాట్ల ప్లాంట్‌లో ఉదయం, 500 మెగా వాట్ల ప్లాంట్‌లో రాత్రి 7 గంటలకు ఉత్ప త్తి నిలిపోయింది. బాయిలర్‌లో నీటి ఆవిరిని సరఫరా చేసే పైపులు పగిలిపోవడంతో అవాం తరం ఏర్పడింది. రెండు రోజుల్లో ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. -
కేటీపీపీ సీఈకి లోకాయుక్త నోటీసులు
వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) సీఈ శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కేటీపీపీలో ఉద్యోగ నియామకాల్లో, క్యాజువల్ లేబర్ ఎంపికలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్థానిక నిరుద్యోగులు లోకాయుక్తకు జూన్ 17వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్తా సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. కేటీపీపీ అధికారుల వింత నిర్ణయాల మూలంగా ప్లాంట్‌లో స్థానికేతరులకు ఉద్యోగాలు లభించాయి. ఇటీవల చేపట్టిన 420 జేపీఏ(జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్) ఉద్యోగ నియూమకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై సీఈకి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త.. 24న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. -
'ఆంధ్ర ఇంజనీర్లను తిరిగి తీసుకోవద్దు'
గణపురం(వరంగల్ జిల్లా): తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో పనిచేసి బదిలీ అయిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజనీర్లను తిరిగి తెలంగాణలోని సంస్థల్లోకి తీసుకోవద్దని వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) ఎదుట ఇంజనీర్లు శుక్రవారం ధర్నా చేశారు. రెండు నెలల క్రితం కేటీపీపీ నుంచి 80 మంది ఇంజనీర్లతోపాటు వివిధ విద్యుత్ సంస్థల్లో సుమారుగా 2వేల మందికి బదిలీలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులు కోర్టులను కూడా ఆశ్రయించారు. ఆంధ్ర ఉద్యోగులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుండగా.. తెలంగాణ ఉద్యోగులు వారు పని చేస్తున్న సంస్థల ఎదుట ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులకు తెలంగాణలో అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ స్థానిక ఇంజనీర్లు ధర్నాకు దిగారు. ఇప్పటికే ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం కింద సర్వం నష్టపోయామని.. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు. -
భూపాలపల్లి కేటీపీపీలో సాంకేతిక లోపం
వరంగల్: వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ (కేటీపీసీ) లో మంగళవారం సాంకేతిక లోపం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీక్ అవడంతో 500 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు పునరుద్ధరణ ఏర్పాటు చేస్తున్నారు. -
KTPPలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
-
నాలుగు రోజులకే బొగ్గు!
కేటీపీపీలో నిండుకున్న నిల్వలు గణపురం: గణపురం మండలం చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం కేటీపీపీ బొగ్గు యార్డ్‌లో శనివారం నాటికి 29,034 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు సరఫరాలో అంతరాయం కలిగినా.. వర్షాలు కురిసినా.. వారం రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయో ప్రమాదం పొంచి ఉన్నది. వాస్తవానికి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బొగ్గురవాణా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక కారణమైతే, సింగరేణి సంస్థ బొగ్గును అందించకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీపీకి ప్రతిరోజు 7,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. అంటే రోజుకు 450 లారీల బొగ్గు అవసరం. కచ్చితంగా చెప్పాలంటే ప్రతి మూడు నిమిషాలకు లారీ బొగ్గు (లారీలో దాదాపు17టన్నులు ఉంటే) కావాల్సి ఉంది. విద్యుత్ కేంద్రంలో విద్యుత్ నిలిచిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 400 పైగా లారీల బొగ్గు ప్లాంట్‌కు సరఫరా కావాలి. బొగ్గు కాంట్రాక్టర్లు కేటీపీపీకి 450 లారీల బొగ్గును సరఫరా చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పటి వరకైతే 300 నుండి 400లారీల బొగ్గు ప్లాంట్‌కు చేరుతుంది. శుక్రవారం నాడు మాత్రం 7850 మెట్రిక్ టన్నుల బొగ్గు (సుమారుగా 450 లారీల బోగ్గు )ప్లాట్‌కు చేరుకుంది. భూపాలపల్లి బొగ్గు బావుల్లో, ఒపెన్‌కాస్ట్ బావిలోనూ టార్గెట్ మేరకు బొగ్గు ఉత్పత్తి కాకపోవడంతో కేటీపీపీకి అవసరమైన బొగ్గు రావడం లేదు. దాంతో గోదావరిఖని, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో విద్యుత్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు ఆశిం చిన మేరకు లేక పోవడంతో అధికారుల్లో గుబు లు మొదలైంది. బొగ్గుకొరత ఏర్పడుతుందనే విషయాన్ని గమనించిన అధికారులు ప్రస్తుతం కొంత బొగ్గు, కొంత ఆయిల్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం నాటి నుంచీ బొగ్గు సరఫరా విషయంలో క్షణంక్షణం టెన్షన్‌గానే ఉంది. బొగ్గు సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్రాక్టుర్లు వారి టార్గెట్ ప్రకారం బొగ్గు ను సరఫరా చేస్తే అధికారులకు తలనొప్పి ఉండేదికాదు. 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ దానిపై అధికారులు దృష్టి సారించడం లేదు. బొగ్గు సర ఫరా కాంట్రాక్టులో కొంతమందికి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో టార్కెట్ పూర్తి చేయకున్నా.. వారిపై చర్యలు చేపట్టడానికి అధికారులు సహసం చేయలేక పోతున్నారు. ఏ రోజుకు.. ఆ రోజే సరఫరా భూపాలపల్లి బొగ్గు గనుల నుంచి కేటీపీపీ 4500 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా కావాల్సి ఉండగా 3500నుండి 4000 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నది, గోదావరిఖని నుంచి 3వేల మెట్రిక్ టన్నులకు గాను వెయ్యి మెట్రిక్‌టన్నులు, బెల్లంపల్లి, రాంగుండం, మంచిర్యాల రైల్వేట్రాక్ ద్వారా ఉప్పల్‌కు వచ్చిన 4వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నుంచి రోజుకు రెండు వేల నుంచి ఇరైవె ఐదు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫారా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ రోజుకు కావాల్సిన బొగ్గు ఆ రోజే సరఫరా అవుతున్నది. నిల్వ చేసుకోవడానికి అదనంగా ఎక్కడి నుంచి కూడా రావడం లేదు. అనివార్య కారణాల మూలంగా బొగ్గు రాక్ రాకుంటే కేటీపీపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు అధికారుల దగ్గర సమధానం లేదు. -
కేటీపీపీలో మరో విద్యుత్ ప్లాంట్
గణపురం, న్యూస్‌లైన్ : గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అంధ్రప్రదేశ్ పవర్ జనరేటింగ్ కార్పొరేషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢీల్లీకి చెందిన స్టింగ్ ఎనర్జీ కంపెనీ బృందం ఆరు నెలల క్రితం ప్లాంట్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన వసతులను పరిశీ లించి సంతృప్తి వ్వక్తం చేశారు. ఈ మేరకు వారు ఇచ్చిన అనుకూల రిపోర్ట్ ఆధారంగా జెన్కో నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. దీని నిర్మాణానికి కావాల్సిన రూ. 3,300 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించారు.రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు సరిపోనూ విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం... రానున్న రోజుల్లో ఇబ్బం దికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు జెన్కోకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి ఆరు నెలల క్రితమే కేటీపీపీలో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జరిగిన జెన్కో ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జెన్కో భూ సర్వే చేపట్టింది. దుబ్బపల్లి కొంపల్లి, మోరంచవాగు పరిసర ప్రాంతాల భూముల్లో యాష్ ఫాండ్, కోల్ డంప్ యార్డ్, రిజర్వాయర్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు శ్రీకారం చుట్టింది. మొత్తం కేటీపీపీ పరిసర ప్రాంతాల్లో 800 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. కాగా, 800 మెగావాట్ల ప్లాంట్‌తో కలిపితే కేటీపీపీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1900 మెగావాట్లకు చేరుకోనుంది. దీన్ని బట్టి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా కేటీపీపీ అవతరించనుంది.