గణపురం, న్యూస్‌లైన్ : గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అంధ్రప్రదేశ్ పవర్ జనరేటింగ్ కార్పొరేషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢీల్లీకి చెందిన స్టింగ్ ఎనర్జీ కంపెనీ బృందం ఆరు నెలల క్రితం ప్లాంట్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన వసతులను పరిశీ లించి సంతృప్తి వ్వక్తం చేశారు. ఈ మేరకు వారు ఇచ్చిన అనుకూల రిపోర్ట్ ఆధారంగా జెన్‌కో నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. దీని నిర్మాణానికి కావాల్సిన రూ. 3,300 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించారు.రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు సరిపోనూ విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం... రానున్న రోజుల్లో ఇబ్బం దికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు జెన్‌కోకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
వాస్తవానికి ఆరు నెలల క్రితమే కేటీపీపీలో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జరిగిన జెన్‌కో ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జెన్‌కో భూ సర్వే చేపట్టింది. దుబ్బపల్లి కొంపల్లి, మోరంచవాగు పరిసర ప్రాంతాల భూముల్లో యాష్ ఫాండ్, కోల్ డంప్ యార్డ్, రిజర్వాయర్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు శ్రీకారం చుట్టింది. మొత్తం కేటీపీపీ పరిసర ప్రాంతాల్లో 800 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. కాగా, 800 మెగావాట్ల ప్లాంట్‌తో కలిపితే కేటీపీపీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1900 మెగావాట్లకు చేరుకోనుంది. దీన్ని బట్టి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా కేటీపీపీ అవతరించనుంది.
కేటీపీపీలో మరో విద్యుత్ ప్లాంట్
Published Tue, Oct 8 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement