power plant
-
సీఈఆర్సీ నిర్ణయంతో రూ.1,000 కోట్ల మేర నష్టం
ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) ఇటీవల తీసుకున్న నిర్ణయం విద్యుత్ ఉత్పత్తిదారులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు విద్యుత్ ప్లాంట్ల(Power plants) ట్రయల్ రన్ సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు చెల్లింపులను నిషేధించే కొత్త నిబంధనను సీఈఆర్సీ ఇటీవల ప్రవేశపెట్టింది. దాంతో దేశంలోని విద్యుత్ ఉత్పత్తిదారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం తెలిపింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు రూ.1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది.కొత్త నిబంధన ప్రభావంవిద్యుత్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు ట్రయల్ పీరియడ్(Trail Period) నిర్వహిస్తుంది. ఇది సాధారణంగా 6-12 నెలల పాటు ఉంటుంది. ఈ సమయంలో సరఫరా చేసే విద్యుత్‌ను గ్రిడ్‌తో అనుసంధానం చేసుకుని గతంలో ప్రభుత్వం చెల్లింపులు చేసేది. కానీ కొత్త నిబంధన ప్రకారం ఎలాంటి చెల్లింపులు ఉండవని సీఈఆర్సీ నిర్ణయించింది. ట్రయల్ పీరియడ్ కాలంలో విద్యుత్ ఉత్పత్తిదారులు ఎటువంటి పరిహారం లేకుండా ఇంధన ఖర్చులతో సహా నిర్వహణ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇది విద్యుత్ ఉత్పత్తుదారులకు భారంగా మారుతుంది. దీంతో ఈ నిబంధనను పునఃసమీక్షించాలని పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరుతోంది. సీఈఆర్సీ నిబంధనలపట్ల ఈ అసోసియేషన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఉత్పత్తిదారులపై ఆర్థిక భారంముఖ్యంగా దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) లేకుండా మార్కెట్లో విద్యుత్‌ను విక్రయించే మర్చంట్ పవర్ ప్లాంట్లకు ఈ నిర్ణయంతో ఆర్థిక భారం ఎక్కువవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రయల్ పీరియడ్‌లో రెవెన్యూ పరంగా ప్రభుత్వ హామీ లేనందున ఈ ప్లాంట్లు బలహీనపడుతాయని చెబుతున్నారు. అదనంగా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ప్రొసీడింగ్స్ ద్వారా ప్లాంట్లు పొందినవారు యథాతథంగా వీటిని నిర్వహించాలంటే సవాలుగా మారుతుంది. కాబట్టి మూలధన పెట్టుబడితో వాటిని అప్డేట్ చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం హామీ కరవవడంతో ఎన్సీఎల్టీ ద్వారా ప్లాంట్లను చేజిక్కించుకోవడం అర్థం లేని అంశంగా మారుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: పెరిగిన జీడీపీ వృద్ధి అంచనాలుఅసోసియేషన్ వాదనలు..టెస్టింగ్, కమిషనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో ఉత్పత్తి కేంద్రాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎత్తిచూపుతూ, కొత్త నిబంధనను పునఃపరిశీలించాలని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం సీఈఆర్సీను కోరింది. ఇంధన ఖర్చులకు ఎలాంటి నిధుల వనరులు లేకుండా ఉంటే ప్రాజెక్టుల మనుగడ ప్రమాదంలో పడుతుందని అసోసియేషన్ పేర్కొంది. -
భారీ బ్యాటరీ ప్లాంట్‌ను చుట్టుముట్టిన అగ్ని జ్వాలలు
మోస్ ల్యాండింగ్: అమెరికాలోని కాలిఫోర్నియాలో దావానలం తీ వ్రత తగ్గుముఖం పట్టే లా కనిపించడం లేదు. గురు వారం ప్రపంచంలోనే పెద్దదైన మోస్ ల్యాం డింగ్‌లోని బ్యాట రీ స్టోరేజీ ప్లాంట్‌ను మంటలు చుట్టుముట్టాయి. దీంతో, అధికారులు కాలిఫోర్నియాకు 77 మైళ్ల దూరంలోని ఈ ప్లాంట్‌ను మూసివేశారు. ఆ చుట్టుపక్కల మోస్ ల్యాండింగ్, ఎల్క్ హార్న్ స్లో ఏరియాల్లోని సుమారు 1,500 మందిని ఖాళీ చేయించారు. సమీపంలోని ఒకటో నంబర్ హైవేలో కొంత భాగాన్ని మూసివేశారు. టెక్సాస్‌కు చెందిన కంపెనీ విస్ట్రా ఎనర్జీకి చెందిన మోస్ ల్యాండింగ్ పవర్ ప్లాంట్‌లో వేలాదిగా లిథియం బ్యాటరీలను నిల్వ ఉంచుతారు. సోలార్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఇవి చాలా అవసరం. ఈ బ్యాటరీలకు మంటలు అంటుకుంటే అదుపు చేయడం ఎంతో కష్టమని అంటున్నారు. అయితే, కాంక్రీట్ భవనంలోని బ్యాటరీలకు మంటలు వ్యాపించడం అంత సులువు కాదని చెబుతున్నారు. ప్లాంట్‌లోని సిబ్బందిని ముందుగానే ఖాళీ చేయించామని విస్ట్రా తెలిపింది. -
జనాన్ని కాలుష్యంలో ముంచెత్తుతారా?
డిసెంబర్ 19న జరగనున్న ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జీవించే హక్కుకే వ్యతిరేకం. దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ టీఎస్టీపీపీ 4,000 మెగా వాట్ల (మె.వా.) విస్తరణలో భాగంగా రెండోదశలో 3గీ800 మె.వా. స్థాపనకు, విద్యుత్పత్తికి పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) పెద్దపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నియమానుసారం... ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. కేవలం 13 కి.మీ. దూరంలో గోదావరి నది పక్కన మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఎస్సీసీఎల్ సొంత 1,200 మె.వా. థర్మల్ ప్లాంట్‌కు తోడుగా రామగుండం ఎన్టీపీసీలోని 4,200 మెగా వాట్లకు ఇది నూతన స్థాపిత సామర్థ్య ప్రతిపాదన. కొత్తగా టీజెన్‌కో రామగుండంలో 1,200 మెగావాట్లు, సింగరేణి వారు జైపూర్‌లోనే మరో 1,200 మెగావాట్ల విస్తర ణకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రజామోదంతో ఈ పరిశ్రమల ప్రతిపాదనలన్నీ కార్యరూపానికి వస్తే... కేవలం 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధార విద్యుదుత్పత్తి సామర్థ్యం (10,200 మె.వా.) ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రంగా మారుతుంది.రాక్షసి బొగ్గు, విద్యుత్తు ప్లాంట్లు, సిమెంటు, ఎరువుల పరిశ్రమలన్నీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. వీటికోసం స్థానికంగా రామగుండం, కమాన్‌పూర్, మంచిర్యాల మండలాల్లో సేకరించిన 90,000 ఎకరాల భూమికి ఇప్పుడున్న మార్కెట్ ధరలతో పోల్చితే అత్యంత స్వల్ప పరిహారం సమర్పించారు. ఈ 15 కి.మీ. పరిధిలోని దాదాపు 3 లక్షల పైచిలుకు కుటుంబాలలోని 12 లక్షల మంది ప్రజలు తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ, ఉపాధులను కారు చౌకగా త్యాగం చేశారు. అయినా స్థానిక యువతకు భూములు కోల్పోయిన కారణాన పరిహారంగా పట్టుమని 100 ఉద్యోగాలు కూడా అందలేదు. ఈ పచ్చినిజాన్ని అసత్యమని ఎవ్వరైనా అనగలరా?విద్యుత్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం క్రిటికల్, సూపర్, అల్ట్రా సూపర్, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ఇంధన దహన సామర్థ్యం 35– 40 శాతం లోపే కదా! దూర ప్రాంతాల థర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణా చేసే ఖర్చు ఆదా చేయడానికి రామగుండం నుండి 13 కిలోమీటర్ల పరిధిలో 10,200 మె.వా. సాంద్ర స్థాయిన థర్మల్ విద్యుత్పత్తి చేయ డాన్ని, చౌకధరకు (యూనిట్ 12 రూపాయలు) విద్యుత్పత్తి చేసే నెపంతో అనుమతించడమంటే... రామగుండం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో 21,000 మెగావాట్లకు సమానమైన ఉష్ణరాశితో, పరిసరాలను వేడిచేసే హీటర్లతో నిరంతరాయంగా మంటలు పెట్టినట్టే కదా?భారత ప్రభుత్వ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నవరత్న ఎన్టీపీసీ సంస్థ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారందరూ కలసి స్థానిక ప్రజారోగ్యాలను, జీవన నాణ్యతను రాజ్యాంగ నియమాలను పణంగా పెట్టి ఈ విస్తరణ చేపట్టడం సబబేనా? 15 కిలోమీటర్ల పరిధిలోని పర్యావరణ కాలుష్య మోతాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఎమ్ఓఎఫ్ఈసీసీ వారు కొత్త పరిశ్రమలకు, పాతవాటి విస్తరణలకు అనుమతులివ్వా లని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్నెలా విస్మరించారు?సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక లాభాపేక్షతో 706 చ.కి.మీ. విస్తీర్ణంలో అధిక సాంద్ర పారిశ్రా మికీకరణ చేపట్టడమే కదా! తక్కువ స్థలంలో ఎక్కువ ఒత్తిడితో, మనుషులు, జంతువులు కనీసం జీవించలేని పరిస్థితులను సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కే కదా! పక్కనే పారుతున్న గోదావరి నది నీరు నాణ్యతా ప్రమాణాల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు దాటి హెచ్ కేటగిరీలోకి చేరింది. ఈ నీరు కనీసం జంతువులు తాగడానికి కూడా పనికి రాదు. 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరిని అతి ఎక్కువగా కలుషితపరిచేది, ట్రీట్మెంట్ చేయకుండా రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి మైన్స్ వాడుకొని వదిలేస్తున్న వ్యర్థ జలాలు. ఇందుకు కారణం అది కాదని, పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పగలరా?ప్రజారోగ్య సంరక్షణార్థం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు విధిగా థర్మల్ స్టేషన్ల నిర్వహణలో అంతర్భాగంగా నిర్మించాలి. పర్యావరణంలోకి విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను 2022 నాటికే నివారించవలసిందిగా భారత సుప్రీంకోర్టు కఠినమైన డెడ్‌లైన్ విధించింది. ఇంతవరకు దేశంలో ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటి నిర్మాణం ప్రారంభమే కాలేదు. ఉన్నవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.ఎన్టీపీసీ వెబ్సైట్లో స్పష్టంగా చెప్పిన ప్రకారం... 76,531 మె.వా. విద్యుదుత్పత్తి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 17,794. ఒక మెగా వాట్ విద్యుదుత్పత్తికి ఆరుగురికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్టీపీసీ సంస్థ ప్రారంభంలో చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదిత 2,400 మెగావాట్లకు 96 మందికి ఉద్యో గాలిస్తామని ఈఐఏ రిపోర్ట్ ‘సోషల్ ఇంపాక్ట్’ సెక్షన్లో చెప్పారు. అంటే, 25 మెగావాట్ల స్థాపనకు ఒక ఉద్యోగాన్ని కల్పించగలుగుతారట. రేపు ఆచరణలో ఏం చేస్తారో తెలియదు.చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ఈ ప్రాంతంలో స్థానికంగా ప్రతిపాదిత ప్లాంట్‌కు 15 కి.మీ. పరిధిలోని పరిసర ప్రాంతాలలో 12 లక్షల జనాభా ప్రతీ క్షణం పీల్చుకుంటున్న సాధారణ గాలి నాణ్యతా ప్రమాణం 45కు దిగువన ఉందనీ, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు దిగువన, ధ్వని తీవ్రత 50 డెసిబల్స్‌కు దిగువన ఉన్నాయనీ... అంటే అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని అవాస్తవ సమాచారాన్ని నివేదికలో సమర్పించి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నది.ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు, పర్యావరణ చట్టాలు తెలియనట్లు అమాయక రీతిలో 10 కి.మీ. పరిధిలో సర్వే చేసినామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిన ప్రాంతంలో... గాలి నాణ్యత 48 ఏక్యూఐ కన్నా దిగువన ఉన్నట్టు, ధ్వని తీవ్రత 40 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉన్నట్టు, స్థానికంగా అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు రాయడం పచ్చి అబద్ధాలే.చదవండి: మళ్లీ తెరపైకి రెండో రాజధాని?నిరూపిత శాస్త్ర సాంకేతిక సత్యాల పరిమితిలో విషయాలను అర్థం చేసుకోవాలి. రామగుండం ఎన్టీపీసీ– టీఎస్ఎస్టీపీపీ ప్రతిపాదిత 2,400 మె.వా. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయదలచిన వేదికపై ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి చొరవ చూపాలి.ఇదివరకే జంతువులు, మనుషులు జీవించడానికి వీలుకాకుండా పరిసరాలు అధిక సాంద్ర పారిశ్రామికీకరణ వల్ల విధ్వంసమైపోయాయి. అందుకే జల, వాయు, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని పరిహరించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సర్వత్రా కలుషితమైన భూగర్భ జలాలనూ, గోదావరి నదినీ మెరుగుపరిచే అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇకముందు సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పరి శ్రమలనే ఈ కాలానికి కావలసినవిగా గుర్తించాలి. దేశాభివృద్ధి కోసం అంతటా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మించాలి.- ఉమామహేశ్వర్ దహగామపర్యావరణ నిపుణులు -
రానున్నది గ్రీన్ పవర్ యుగం
అశ్వారావుపేట: ప్రపంచంలో రానున్నది గ్రీన్ పవర్ యుగమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 కేవీ బయోమాస్ పవర్‌ప్లాంట్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొగ్గు, వంట చెరుకును మండించకుండా జలవిద్యుత్, పవన విద్యుత్‌తోపాటు గ్రీన్ పవర్ యుగం రాబోతోందని చెప్పారు.కాలుష్యం లేకుండా ప్రకృతిలోని వనరుల సహకారంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇందుకోసం రాష్ట్రంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుల కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని, రాబోయే ఆరేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ప్రాధాన్యం కలి్పస్తూ రూ.73 వేల కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పామాయిల్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కుట్ర జరిగిందని, ఆ చర్యలను తిప్పికొట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరించామని తెలిపారు.పామాయిల్ గెలల ధర పెంచేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, టన్నుకు రూ.20 వేలకు పైగా రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోనే ఆయిల్‌పామ్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేట పామాయిల్ తోటలతో పచ్చగా మారడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలోని రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం!
చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా, చైనా తలపోస్తున్నాయి. అందుకవసరమైన విద్యుత్ అవసరాలను సోలార్ ప్యానళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో జాబిలిపై ఏకంగా అణు విద్యుత్కేంద్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి! అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణకు తెర తీశాయి కూడా... అంతరిక్ష పోటీలో కీలక ముందడుగు వేసే దిశగా రష్యా, చైనా సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను నిజం చేసే దిశగా కదులుతున్నాయి. 2035 లోపు అక్కడ అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలని నిశ్చయానికి వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ తెలిపారు. ఈ మేరకు తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే ఇదంతా సులువు కాబోదని యూరీ అంగీకరించారు. కాకపోతే, ‘‘న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకున్న అపార నైపుణ్యం ఈ విషయంలో బాగా ఉపయోగపడనుంది. మేం తలపెట్టిన ప్రాజెక్టు చంద్రునిపై మనిషి శాశ్వత ఆవాసం దిశగా కీలక ముందడుగు కానుంది. అక్కడ మున్ముందు ఎదురయ్యే ఇంధన అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు సోలార్ ప్యానళ్లు చాలవు. అణు విద్యుతే ఇందుకు సమర్థమైన ప్రత్యామ్నాయం. కనుకనే బాగా ఆలోచించిన మీదట ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించాం’’ అని ఆయన వివరించారు. పర్యవేక్షణకు అంతరిక్ష ‘అణు’నౌక... అయితే చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం వ్యవస్థాపన మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. ఇందుకోసం ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు యూరీ వెల్లడించారు.... ► తొలి దశలో మానవ ప్రమేయంతో నిమిత్తం లేకుండా చంద్రునిపై అణు ప్లాంటు స్థాపన ప్రయత్నాలు పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిన సాగుతాయి. ► ఇందుకోసం ప్రధానంగా రోబోలను రంగంలోకి దించి వాటి సాయంతో పని నడిపిస్తారు. ► స్పేస్ టగ్బోట్ పేరిట అణు విద్యుత్‌తో నడిచే అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసే యోచనలో రష్యా ఉంది. ► ఇందులో భారీ అణు రియాక్టర్‌తో పాటు హై పవర్ టర్బైన్లు కూడా ఉంటాయి. ► విద్యుత్కేంద్రం తయారీకి కావాల్సిన సామగ్రిని దాన్నుంచే చంద్రునిపైకి పంపుతారు. ► దాని నిర్మాణ క్రమంలో వెలువడే అంతరిక్ష వ్యర్థాలు తదితరాలను క్లియర్ చేసే పని కూడా ఈ నౌకదే. చల్లబరచేదెలా...? చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం నిర్మాణంలో ఇమిడి ఉన్న అనేకానేక సాంకేతిక సమస్యలను అధిగమించడంలో రష్యా, చైనా తలమునకలుగా ఉన్నాయి. అయితే అణు ప్లాంటును ఎప్పటికప్పుడు చల్లబరచడం వాటికి అత్యంత కీలకమైన సవాలుగా మారనుంది. గతేడాది రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా–25 అంతరిక్ష నౌక అంతరిక్షంలో అదుపు తప్పి పేలిపోయింది. ఆ ఎదురుదెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అణు కేంద్రం విషయంలో వెనక్కు తగ్గొద్దని పట్టుదలగా ఉంది. ఆలోపే చైనాతో కలిసి మానవసహిత చంద్ర యాత్ర, ఆ వెంటనే చంద్రునిపై శాశ్వత బేస్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చైనా కూడా 2030 నాటికల్లా తమ తొలి వ్యోమగామిని చంద్రునిపైకి పంపడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటినీ అమెరికా ఓ కంట కనిపెడుతూనే ఉంది. వీలైనంత త్వరగా అంతరిక్షంలో అణ్వాయుధాలను ఏర్పాటు చేసుకోవడమే రష్యా లక్ష్యమని ఇప్పటికే ఆరోపించడం తెలిసిందే. ఇదంతా పెద్ద దేశాల నడుమ అంతరిక్షంపై ఆధిపత్య పోరుకు దారి తీసే ఆస్కారం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా విని్పస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యర్థాల ప్లాంట్.. వినోదాల స్పాట్!
నగరాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఓ ప్రదేశంలో కాల్చేయడమో లేదా రీసైక్లింగ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. తీవ్ర దుర్గంధభరితమైన, అత్యంత కాలుష్యమయమైన ఆ ప్రాంతానికి పొరపాటున కూడా వెళ్లే సాహసం చేయలేం కదా? కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లి సేద తీరడమే కాదు.. ఆడొచ్చు.. పాడొచ్చు.. ఇంకా కావాల్సింది సుష్టుగా తినొచ్చు. అవాక్కవుతున్నారా? నిజంగా ఇది నిజం. మరి అ అందమైన చెత్త వినోద కేంద్రం ఎక్కడుంది, దాని విశేషాలేంటో చూద్దామా? డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్.. రాజరిక వారసత్వం, ఆధునిక వాస్తుశిల్పాన్ని మిళితం చేసిన పర్యావరణ అనుకూలమైన అందమైన నగరం. 2017లో కోపెన్‌హాగన్‌ను ప్రపంచంలోని గ్రీన్‌సిటీగా ప్రకటించారు. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడం, క్లీనర్ మొబిలిటీపై దృష్టి పెట్టింది. దీంతో నగరంలోని వ్యర్థాలను మొత్తం విద్యుత్‌గా మార్చే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు. కేవలం ప్లాంటు ఒకటే ఏం బాగుంటుందని అనుకున్నారు డెన్మార్క్ అధికారులు. అంతే వ్యర్థాల శుద్ధి కేంద్రానికి వినోదపు టచ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అదిరిపోయే డిజైన్‌తో ఈ ప్లాంట్ నిర్మించారు. కోపెన్‌హాగన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ ఆర్కిటెక్ట్ అద్భుతాన్ని అమేజర్ బక్కే లేదా కోపెన్హిల్గా పిలుస్తారు. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్న ఈ భవ నాన్ని చూస్తే ఇది వ్యర్థ శుద్ధి కేంద్రమా అనే సందేహం కలగక మానదు. 100 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్కైయింగ్, హైకింగ్, క్లైంబింగ్ వంటి వినోద సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇది వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌గానే కాకుండా.. వినోదాలు పంచే విహారాల స్పాట్‌గా కూడా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కార్బన్ న్యూట్రల్ సిటీగా.. 2025 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిటీగా కోపెన్హాగన్ అవతరించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను భూగర్భంలో ఉండే ఓ బాయిలర్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాంట్ పనిచేస్తుంది. రోజుకు 300 ట్రక్కుల వ్యర్థాలను వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాతావరణంలోకి 250 కిలోగ్రాముల కార్బన్‌డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో 124 మీటర్ల చిమ్నీ ద్వారా బయటకు వస్తుంది. ఏటా 4,40,000 టన్నుల వ్యర్థాలను మండించడం ద్వారా 1,50,000 గృహాల విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తోంది. పర్వతారోహకులకు పండుగే.. పర్యాటకులు ఈ ప్లాంట్ పై స్కైయింగ్ చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 85 మీటర్ల క్లైంబింగ్ వాల్‌ను ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడకు వచ్చే పర్వతారోహకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కింది భాగంలో గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక రిసార్ట్స్ తరహాలో ఇక్కడ కెఫే, బార్ కూడా ఉన్నాయండోయ్.. రూఫ్‌టాప్ కెఫేలో వేడి వేడి కాఫీ, చల్లని శీతలపానీయాలతో సేద తీరొచ్చు. సముద్రాన్ని చూస్తూ మీకు నచి్చన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా డెన్మార్క్ వెళితే ఈ ప్లాంట్‌ను ఓ లుక్కేసి రండి. -
రామగుండం విద్యుత్ కేంద్రంలో మంటలు
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 50 ఏళ్ల నాటి బీ–థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో టర్బయిన్, బాయిలర్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. నిప్పురవ్వలు ఎగసిపడటంతో... రామగుండంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాలం చెల్లిన పరిజ్ఞానం వినియోగిస్తు న్నారు. ఇందులోని మిల్స్ నుంచి బాయిలర్‌లోకి బొగ్గును డంపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వివిధ యంత్రాలు, కంట్రోల్ రూం వరకు బొగ్గుపొడి (కోల్‌డస్ట్) వెదజల్లి నట్లుగా నిండిపోతూ ఉంటుంది. అయితే బాయిలర్ ప్రాంగణంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, నిప్పురవ్వలు బొగ్గుపొడిపై పడటంతో మంటలు చెలరేగి సమీపంలోని రబ్బర్ కేబుల్స్‌కు అంటుకొని విద్యుత్ కేంద్రం ట్రిప్ అయిందని అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో ఫైరింజిన్ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని చెప్పారు. పునరుద్ధరించిన కొన్ని గంటల్లోనే ట్రిప్.. ఈ కేంద్రంలో సెప్టెంబర్ 12 నుంచి వార్షిక మరమ్మతులు ప్రారంభించిన అధికారులు వాటిని నెల రోజుల్లో పూర్తిచేసి విద్యుత్ కేంద్రాన్ని తిరిగి ఉత్పత్తి దశలోకి తీసుకురావాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక 45 రోజులు పట్టింది. ఈ నెల 20న అర్ధరాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకురాగా కొన్ని గంటలపాటు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ క్రమంలోనే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మరోసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు కనీసం 10 రోజులపైనే పడుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు ఆస్తి నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాధారణంగా విద్యుత్ కేంద్రం జీవితకాలం 25 ఏళ్లుకాగా బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపించి సుమారు 50 ఏళ్లు గడుస్తోంది. విద్యుత్ సౌధకు చెందిన పలువురు నిపుణులు ఇటీవల ఈ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి 2029 వరకు దీన్ని కొనసాగించేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. -
చెత్తతో ‘పవర్’ ఫుల్
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను.. ఉపయుక్తంగా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా చెత్త ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు సమీపంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను.. ప్రాసెస్ చేసేలా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ గత నెలలో ఆదేశించారు. ఆ మేరకు ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణపై రూపొందించిన నివేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమర్పించగా.. ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో 7.5 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమైంది. సమీప పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 22 పట్టణ స్థానిక సంస్థల నుంచి చెత్త తరలింపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 22 పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్‌గా ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో రోజూ సుమారు 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంచనా వేసింది. ఇందులో 400 మెట్రిక్ టన్నులు పొడి వ్యర్థాలు కాగా, మిగిలింది తడి చెత్త. తడి వ్యర్థాలను ముమ్మిడివరం, అమలాపురంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ ప్లాంట్ల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్లలో ఇనుము, గాజు, ప్లాస్టిక్, రబ్బర్ వంటివి వేరుచేస్తున్నారు. పునర్ వినియోగానికి, బయో ఎరువుగా మార్చేందుకు వీలులేని చెత్తను రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు తరలిస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా.. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతుల్లో విద్యుత్‌గా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు అనుగుణంగా రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి దాదాపు 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా ప్లాంట్లకు సమీపంలోని మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటి తరహాలోనే త్వరలో రాజమండ్రి వద్ద కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
NTPC: భారతావనికి వెలుగు దివ్వె.. ఎన్టీపీసీ
పెద్దపల్లి/జ్యోతినగర్: భారతావనికి వెలుగు ది వ్వెగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) లిమిటెడ్ నేటితో 47 వసంతా లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సంస్థ దేశంలో 77 విద్యుత్ కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల వి ద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. 1975 నవంబర్ 7న నామకరణం స్వాతంత్య్రం అనంతరం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. విద్యుత్ ప్రాజెక్టు పంపిణీ విధానం తమ ఆధీనంలో ఉండాలనుకుంది. విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం కేటాయించి. మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చే యాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు విద్యుత్ కేంద్రం నిర్మించాలంటే సమయం పడుతుందని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దినదినాభివృద్ధి చెందుతూ.. ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతూ దినదినాభివృద్ది చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, విధానాలు, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్మెంట్ విధానాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ సంస్థ విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు.. ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్తోపాటు మొత్తంగా 77 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్ రంగంలో వేగవంతమైన ప్రగతి నమోదు చేసింది. ఇతర సంస్థలతో కలిసి వ్యాపారం.. ఒకప్పుడు కేవలం విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ ప్రస్తుతం ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంత బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలిసి వ్యాపారాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. జాయింట్ వెంచర్లతో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. 2032 నాటికి, శిలాజ ఇంధనం ఆధారిత ఉత్పత్తి సామర్థ్యం ఎన్టీపీసీ యొక్క పోర్ట్‌ఫోలియోలో దాదాపు 30% ఉంటుంది. ఈ సంస్థ జాతీయ సామర్థ్యంలో 16.78% కలిగి ఉంది. ఎకనామిక్ టైమ్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యుత్తమ 50 కంపెనీల్లో గుర్తింపు పొందింది. -
అదానీ పవర్ చేతికి డీబీ పవర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంటు కలిగిన డీబీ పవర్‌ను కొనుగోలు చేయనుంది. రూ. 7,017 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు అదానీ పవర్ వెల్లడించింది. డీబీ పవర్ జాంజ్‌గిర్ చంపా జిల్లాలోగల 600 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. 923.5 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి మధ్య, దీర్ఘకాలిక ఒప్పందాలను కలిగి ఉంది. పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాతో ఇంధన సరఫరా ఒప్పందాలను సైతం కలిగి ఉంది. నగదు చెల్లించేవిధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ పేర్కొంది. దీనిలో భాగంగా డీబీ పవర్ మాతృ సంస్థ డిలిజెంట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. డీబీ పవర్లో డిలిజెంట్ పవర్ మొత్తం ఈక్విటీ మూలధనాన్ని కలిగి ఉన్నట్లు వివరించింది. 2022 అక్టోబర్ 31లోగా వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువును పెంచుకోనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ పవర్ సామర్థ్యాన్ని విస్తరించుకోనున్నట్లు పేర్కొంది. 2006లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రిజిస్టరైన డీబీ పవర్ గతేడాది(2021–22)లో రూ. 3,448 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. అంతక్రితం ఏడాది(2020–21)లో రూ. 2,930 కోట్ల్ల, 2019–20లో రూ. 3,126 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. -
వేడిజలం వెలుగులీను!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సరికొత్త వెలుగుల సృష్టికి సన్నద్ధమవుతోంది. తొలిసారిగా జియోథర్మల్ పవర్‌ప్లాంట్ స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రోటోటైప్ ప్రయోగాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వేదికగా చేసుకుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రయోగం కొలిక్కి వస్తుందని సింగరేణి భావిస్తోంది. సంప్రదాయ థర్మల్, హైడల్ సిస్టమ్‌లో ఇప్పటికే విద్యుదుత్పత్తి జరుగుతోంది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో బొగ్గును మండించి సృష్టించే నీటిఆవిరి టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జలవిద్యుత్ కేంద్రాల్లో వేగంగా ప్రవహించే నీరు టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. కానీ, జియో థర్మల్‌పవర్ ప్రాజెక్టులో మాత్రం వేడినీరు విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఇంధన వనరుగా మారనుంది. 30 ఏళ్ల కిందటే భూగర్భపొరల్లో జరిగే భౌతిక, రసాయనిక చర్యల కారణంగా అరుదుగా అక్కడక్కడా భూగర్భజలాలు చాలావేడిగా ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని 30 ఏళ్ల క్రితం అధికారులు అంచనా వేసి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం మణుగూరు ప్రాంతంలో 1989లో బొగ్గు అన్వేషణ చేపట్టి వేడి భూగర్భజలాలను కనుగొంది. జియో థర్మల్ పద్ధతిలో తేలికగా విద్యుదుత్పత్తి చేయడానికి భూగర్భజలాల ఉష్ణోగ్రత 140 సెల్సియస్ డిగ్రీలకుపైగా ఉండాలి. కానీ, మణుగూరు దగ్గర వెలుగులోకి వచ్చిన వేడి భూగర్భజలాల ఉష్ణోగ్రత 67 సెల్సియస్ డిగ్రీలు మాత్రమే నమోదైంది. దీంతో అప్పటి నుంచి జియో థర్మల్ ప్లాంట్ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల జియోథర్మల్ పవర్ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. ఫ్లాష్ స్ట్రీమ్ ప్లాంట్లు, బైనరీ సైకిల్ పవర్ ప్లాంట్ల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్న భూగర్భజలాలకు ఇతర ద్రావకాలను జతచేయడం ద్వారా వేడి ఆవిరిని సృష్టించే వీలుంది. ఈ వేడి ఆవిరి ద్వారా టర్బయిన్లు తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. రెండేళ్ల శ్రమ బైనరీ సైకిల్ ప్లాంట్ ద్వారా జియో థర్మల్‌పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సింగరేణి సంస్థ రెండేళ్ల క్రితం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో జియో థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయడానికి కేంద్రం రూ.1.72 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సింగరేణి సంస్థ, సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రీస్ సంస్థలు సంయుక్తంగా మణుగూరు మండలం పడిగేరు వద్ద పనులు చేపట్టాయి. ఇటలీలో 20వ శతాబ్దంలోనే... ప్రపంచంలో తొలి జియో థర్మల్‌పవర్ ప్లాంట్‌ను 20వ శతాబ్దం ఆరంభంలో ఇటలీలోని టస్కనీలో ప్రారంభించారు. అక్కడ నీటి అడుగు భాగం నుంచి వేడి నీటి ఆవిరి ఉబికి వస్తుండటంతో తొలిసారిగా జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో జియో థర్మల్ ఎనర్జీని ఇరవైకి పైగా దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అత్యధికంగా ఈ విధానంలో అమెరికాలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. తొలిసారిగా లఢక్‌లో.. ఇండియాలో తొలి ప్రాజెక్టును 2021 ఫిబ్రవరిలో లఢక్‌లోని పుగాలో ఓఎన్జీసీ ఈ చేపట్టింది. ఇక తాతాపాని(ఛత్తీస్‌గఢ్), మాణికరన్(హిమాచల్‌ప్రదేశ్), బక్రేశ్వర్(పశ్చిమబెంగాల్), తువా(గుజరాత్), ఉనాయ్(మహారాష్ట్ర), జల్గావ్(మహారాష్ట్ర), రాజ్‌గోర్, ముంగేర్(బిహార్), గోదావరి – ప్రాణహిత లోయ మణుగూరు(తెలంగాణ)లో జియో థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు అవకాశాలు ఉన్నాయి. జియో థర్మల్‌పవర్ తయారీ ఇలా ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రొటోటైప్ జియో థర్మల్ పవర్‌ప్లాంట్‌లో వేడి భూ గర్భజలాలను ప్రత్యేకంగా తయారు చేసిన ఓ చాంబర్లోకి పంపిస్తారు. ఇందులో ఆర్గానిక్ ర్యాంకైన్ అనే ప్రత్యేకమైన ద్రావకాన్ని ఉంచుతారు. నీటి వేడితో ఈ ఆర్గానిక్ ర్యాంకైన్ అనే పదార్థం ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరిని టర్బయిన్లు ఉండే చాంబర్లోకి పంపిస్తారు. టర్బయిన్లను ఆవిరి తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. టర్బయిన్లు తిప్పిన ఆవిరిని తిరిగి కూలింగ్ చాంబర్లోకి పంపిస్తారు. అక్కడ చల్లబడిన ఆర్గానిక్ ర్యాంకైన్ సబ్‌స్టాన్స్‌ను తిరిగి ఉపయోగిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టును ‘క్లోజ్డ్ లూప్ బైనరీ డ్రైజెట్ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీ’గా పేర్కొంటున్నారు. ఈ విధానంలో వాతావరణ కాలుష్యం పరిమితంగా ఉంటుంది. బొగ్గును మండించాల్సిన అవసరం లేదు. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. ర్యాంకైన్ సబ్‌స్టాన్స్‌ను మాత్రమే రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. పడిగేరు వద్ద 20 కిలోవాట్స్ సామర్థ్యంతో ప్రస్తు తం ప్రోటోటైప్ ప్రాజెక్టు సిద్ధమైంది. వచ్చే రెండు, మూడు నెలల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాలు జరగనున్నాయి. -
విద్యుత్ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు
పరవాడ(పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో 1997లో ఏర్పాటు చేసిన సింహాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఈ నెల 8న 26వ ఏటలో అడుగుపెట్టబోతుంది. పరవాడ సమీపంలో 3,283 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,700 కోట్ల వ్యయంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2007 నుంచి రెండు విడతలుగా రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాయికి చేరుకుంది. బొగ్గు ఆధారంగా నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మేటిగా నిలిచి మహారత్న బిరుదును సార్థకం చేసుకున్న ఘనత సింహాద్రి ఎన్టీపీసీకే దక్కుతుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు సద్వినియోగం చేసుకొంటున్నాయి. నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు 2020లో శ్రీకారం చుట్టింది. సింహాద్రి ఆధ్వర్యంలో స్థానిక రిజర్వాయర్‌పై రూ.110 కోట్ల వ్యయంతో 25 మెగావాట్ల తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి.. 2021 ఆగస్టు 21 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించింది. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను సింహాద్రి ఎన్టీపీసీ తన సొంత అవసరాలకు వినియోగించుకుంటోంది. దీపాంజిలినగర్ టౌన్షిప్లో సముద్రిక అతిథి గృహం ప్రాంగణంలో గతేడాది 30న రూ.9కోట్ల వ్యయంతో హరిత హైడ్రోజన్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే తొలి పైలట్ ప్రాజెక్ట్‌కు భూమి పూజ జరిగింది. 50 కిలోవాట్ల సామర్థ్యం గల స్టాండ్‌లోన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత హరిత హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన బ్లూమ్ ఎనర్జీ సంస్థకు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరఫరా కానున్న విద్యుత్‌ను సముద్రిక అతిథి గృహం అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్లాంట్ ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన రెండు కూలింగ్ టవర్ల కాల పరిమితి తీరిన నేపథ్యంలో వాటిని తొలగించి.. నూతనంగా మరో రెండు కూలింగ్ టవర్ల నిర్మాణానికి రెండేళ్ల కిందట సంస్థ శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి రూ.186 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం కూలింగ్ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సింహాద్రిలో 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 30 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. ఈ బొగ్గు నిల్వల ను ఒడిశాలోని తాల్చేరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును మండించే క్రమంలో విడుదలవుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సంస్థలో 600 మంది శాశ్వత ఉద్యోగులు, రెండు వేలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ నాణ్యమైన విద్యుదుత్పాదనకు తమ వంతు కృషి చేస్తున్నారు. బాలికా సాధికారతకు కృషి సింహాద్రి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బాలిక సాధికారత కోసం ఈ ఏడాది రూ.45 లక్షలు ఖర్చు చేశాం. నిర్వాసిత గ్రామాల నుంచి 125 మంది బాలికలను ఎంపిక చేసి వారికి దీపాంజిలినగర్ టౌన్షిప్లో ప్రత్యేక వసతి కల్పించి.. ఆరు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారిలో ఉత్సాహవంతులైన 10 మంది బాలికలను ఎంపిక చేసి టౌన్‌షిప్‌లోని బాలభారతి పబ్లిక్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఉచితంగా విద్యనందించేందుకు ఏర్పాట్లు చేశాం. నిర్వాసిత గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం, విద్య వంటి అభివృద్ధి పనులకు సీఎస్సార్ ద్వారా అత్యధిక నిధులను కేటాయిస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. – జి.సి.చౌక్సే, సీజీఎం, సింహాద్రి ఎన్టీపీసీ -
జీఎంఆర్ పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
-
తైషాన్ ప్లాంట్‌తో ప్రమాదమేమీ లేదు: చైనా
బీజింగ్/హాంకాంగ్: తైషాన్ న్యూక్లియర్ ప్లవర్ ప్లాంట్ చుట్టుపక్కన అసాధారణ అణు ధార్మికత స్థాయి ఆనవాళ్లలేవీ లేవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్లాంట్ నుంచి ప్రమాదకర వాయువులు లీక్ అవుతున్నాయనే వార్తలను కొట్టిపారేశారు. ప్రజల భద్రతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తైషాన్ ప్లాంట్‌ను ప్రమాదకరమైన వాయువు వెలువడుతున్నట్లు సహ భాగస్వామి అయిన ఫ్రాన్స్ కంపెనీ ఫ్రామటోమ్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం అమెరికా సాయాన్ని కోరింది. గ్యాస్ లీకేజీని అడ్డుకోకపోతే ఇదొక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరించారు. -
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మళ్లీ పేలుడు?
సాక్షి, శ్రీశైలం: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు కలకలం రేపింది. బుధవారం సాయంత్రం భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో భయంతో పవర్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు లో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు ప్రభాకరరావు స్పష్టం చేశారు. గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించమని సీఎండీ ప్రభాకరరావు ఆదేశించారు. సిఎండి అదేశాలతోనే మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంపై నిర్లక్ష్యం..
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభం నుంచి ప్రమాదం వరకు కృష్ణానదిపై ఉన్న అన్ని జల విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే విద్యుధుత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రమంతా విద్యుత్ వెలుగులు పంచిన ఈ వెలుగుల దివ్వెలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో చీకట్లు కమ్ముకున్నాయి. భారీ అగ్నిప్రమాదానికి ఏడుగురు విద్యుత్ ఉద్యోగులు మరణించడంతోపాటు ఇద్దరు అమరాన్రాజ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పవర్‌హౌస్‌లోని ప్యానెల్బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు కాలిపోయాయి. విద్యుత్ కాంతులతో మెరిసే ప్లాంట్‌లోని లోపలి దృశ్యం పొగతో నల్లగా మారింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే సీఐడీ, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు అంతస్తుల్లో నిండుకున్న నీటి తోడిపోత కొలిక్కివచ్చింది. అనుకోని ఘటనతో భారీగా నష్టం వాటిల్లిన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిశీలిస్తే ప్రతి ఏటా రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేయడం గమనార్హం. ఆది నుంచి అగ్రభాగమే రాష్ట్రానికే తలమానికంగా ఉన్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ప్రారంభించినప్పటికి నుంచి విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు పంచింది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆనాటి ఏపీఎస్ఈబీ ఆధ్వర్యంలో 1992లో భూగర్భ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సివిల్ పనులతోపాటు కేంద్రంలోని ఆరు యూనిట్ల నిర్మాణాలు 2003 వరకు పూర్తయ్యాయి. కాగా తొలి యూనిట్ 2001లో పూర్తవగా.. తదుపరి ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున పూర్తయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేంద్రం పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. 6 యూనిట్ల ద్వారా ప్రతిరోజు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. నిలిచిన విద్యుదుత్పత్తి రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఈ నెల 20న జరిగిన ప్రమాదంతో ప్రస్తుతం ఉత్పత్తి పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. కాంతివంతంగా ఉండే పవర్హౌస్లోపలి దృశ్యం పొగతో నల్లబారింది. ప్యా నల్ బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. విద్యు త్ వైర్లు, పరికరాలు కాలిపోయాయి. బేస్బేలో టర్బైన్ల చు ట్టూ కాంక్రీట్, ఫోరింగ్ ధ్వంసమైంది. ప్రస్తుతం పునరుద్ధర ణ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పా రిశుద్ధ్య పనులు పూర్తి కాగా.. బయటి నుంచి విద్యుత్ తీసుకొని పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. రెండు అంతస్తుల్లో నిండుకున్న లీకేజీ నీటిని మోటార్ల ద్వారా తోడిపోత కొలిక్కి వచ్చింది. త్వరలోనే యథావిధిగా విద్యుదుత్పత్తి చేస్తామని అధికారులు ప్రకటించినా జపాన్ నుంచి నిపు ణులు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయి తే సీఐడీ అధికారులు, నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచిన శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో త్వరగా విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇలా.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 7 వేల మిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి చేసింది. 2014– 15లో 1,802.583 మి.యూ, 2015– 16లో 155.263 మి.యూ, 2016– 17లో 616.832 మి.యూ, 2017– 18లో 826.490 మి.యూ, 2018– 19లో 984.396 మి.యూ, విద్యుదుత్పత్తి చేశారు. అలాగే గతేడాది 1,289 మి.యూ, ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా 1993 మి.యూ సాధించారు. ఇక ఈ ఏడాది (2020– 21) జూలై 17 నుంచి భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 24 గంటల వ్యవధిలో 20 మి.యూచొప్పున విద్యుదుత్పత్తి చేశారు. ఈ ఏడాది లక్ష్యం 1,400 మి.యూ, కాగా ప్రమాదం జరిగిన నాటికి అంటే కేవలం 32 రోజుల్లోనే దాదాపుగా 656 మి.యూ, ఉత్పత్తి చేసినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. ఈ విధంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 7,034 మి.యూ, విద్యుదుత్పత్తి చేపట్టారు. -
శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
-
శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ బృందం దర్యాప్తును ముమ్మరంగా చేసింది. విచారణలో భాగంగా నిన్న మరోసారి శ్రీశైలం వెళ్లిన సీఐడీ బృందం నేడు (శుక్రవారం) సంఘటన స్థలంలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారిస్తోంది. ఇప్పటికే ప్రమాద ఘటనపై పలు ఆధారాలు సేకరించిన బృందం సభ్యులు ప్రమాద ఘటనపై శాఖా పరమైన విచారణ పూర్తి చేసింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డ ఉద్యోగుల నుంచి పవర్ ప్లాంట్‌కు సంబంధించిన విషయాలు, ప్రమాద కారణాలను సేకరిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రమాద జరిగిన తీరు, కారణాలపై సీఐడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. బ్యాటరీ మార్చే క్రమంలో ప్రమాదం! కాగా, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం ఘటనపై శ్రీశైలం ప్లాంట్ ఇంచార్జ్ ఉమా మహేశ్వర చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం.. ఆగస్టు 20 వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. హైడ్రో పవర్ టన్నెల్లో పని జరుగుతున్న సమయంలో సడన్‌గా మెషీన్లో ప్రమాదం సంభవించింది. ఏఈ, డిఈ , ఏఏఈ లతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ప్రాజెక్టులో బ్యాటరీలు అమర్చడానికి వచ్చిన అమర్ రాజ కంపెనీకి చెందిన ఇద్దరు మెకానిక్‌లు కూడా ఉన్నారు. టర్బైన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన పవర్ హౌస్ జనరేటర్లు. కేబుల్, ప్యానెల్స్, బ్యాటరీ చేంజ్ చేసేటపుడు న్యూకిలెన్స్ న్యూట్రల్‌గా మారకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని సీఐడీ బృందం ప్రాథమిక అంచనాకొచ్చింది. (చదవండి: 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ) -
బ్యాటరీలు పాడయ్యేవరకు ఎందుకు నిర్లక్ష్యం?
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్‌హౌస్ ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. ప్యానల్ బోర్డులో వచ్చిన మంటలపై దర్యాప్తు కొనసాగుతోంది. 220 కేవీ డీసీ విద్యుత్ సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్రమాదం జరిగినట్టు అంచనాకొచ్చింది. అయితే, అర్ధరాత్రి బ్యాటరీలు ఎందుకు బిగించాల్సి వచ్చింది? అధికారులు, సీఈలు లేకుండా బ్యాటరీలు ఎందుకు ఏర్పాటు చేశారు? బ్యాటరీలు బిగించే సమయంలో జనరేటర్లు ఎందుకు ఆపలేదు? బ్యాటరీలు పూర్తిగా పాడయ్యే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అని శ్రీశైలం విద్యుత్ అధికారులను సీఐడీ బృందం ప్రశ్నించింది. దాంతోపాటు చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలను సేకరించింది. చదవండి: కొంపముంచిన అత్యవసర స్విచ్!) కాగా, శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 యూనిట్లు ఉండగా, వీటికి సంబంధించిన టర్బయిన్లను తెరిచి చూసే అవకాశం ఉంది. అప్పుడే నష్టంపై పూర్తి అంచనా రానుందని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. టర్బయిన్ల పైన ఉండే జనరేటర్లు, వైన్డింగ్ కాయిల్స్ కాలిపోతే మాత్రం నష్టం రూ.వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఆరు యూనిట్లలో తొలి రెండింటి టర్బయిన్లు బాగానే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
పవర్ హౌస్‌లోకి నీళ్లు.. విచారణకు ఆటంకం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో సోమవారం విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో చీకటి, వేడి ఎక్కువగా ఉండడంతో పూర్తి అండర్ గ్రౌండ్‌కు దర్యాప్తు బృందం వెళ్లలేకపోయింది. కొన్ని చోట్ల కాలిన పదార్థాల నుండి సీఐడీ బృందం షాంపిల్స్ సేకరించారు. మానవ తప్పిదమా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఇప్పటికే అధికారుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని సాక్ష్యాల కోసం సీఐడీ అధికారులు నేడు విచారణ చేట్టారు. అదే విధంగా పవర్ హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో చేస్తున్న మరమ్మతుల వల్ల దర్యాప్తుకు కొంత ఆటంకం ఏర్పడింది. పవర్ హౌస్‌లోకి విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది బయటి నుంచి లోపలికి విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. ఊట నీరును మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. (శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ) -
శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ
-
శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై ఇప్పటికే సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ ఆరంభించగా, తాజాగా మరో కమిటీని నియమించారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎండీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలో శ్రీనివాసరావు(జేఎండీ), జగత్‌రెడ్డి(ట్రాన్స్మిషన్ డైరెక్టర్), సచ్చిదానందం(టీఎస్ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్), రత్నాకర్(కన్వీనర్)లు సభ్యులుగా ఉన్నారు.( చదవండి: శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీ విచారణ
-
శ్రీశైలం ప్రమాదం: వివరాలు సేకరిస్తున్న సీఐడీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలను సీఐడీ దర్యాప్తు బృందం విశ్లేషించనున్నది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందని టెక్నికల్ బృందాలు వీడియో తీశారు. (కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) పవర్ సప్లై ఎలా ఇచ్చారనే వివరాలు సీఐడీ రాబడుతోంది. పలువురు అధికారుల నుంచి సీఐడీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మొదట ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న స్థలంలోని పదార్థాలను అధికారులు సేకరించారు. అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా? లేదా? అన్న దానిపై సీఐడీ టెక్నికల్ బృందం విశ్లేషించనుంది. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. మానవ తప్పిదం ఉందా లేదా అనేది సీఐడీ అధికారులు తేల్చనున్నారు. (శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ) చదవండి: (‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
-
‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రo ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. అజాంపురా హరిలాల్ బాగ్‌లోని ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఆయన కలిశారు. ఫాతిమా ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె చిన్నప్పటి నుంచి ధైర్యశాలియని, చదువులో ముందుడేదని ఎంపీ గుర్తు చేసుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇతరులను కాపాడే క్రమంలో ఫాతిమా అసువులు బాశారని అన్నారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. కాగా, శ్రీశైలం ఎడమ గుట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 17 మంది విధుల్లో ఉండగా.. 8 మంది గాయాలతో బయటపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: మృత్యుసొరంగం) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ విచారణ కొనసాగుతోంది. శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై విచారణకు నాలుగు బృందాలు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ సైన్స్, సీఐడీ, లోకల్ పోలీసుల టీమ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాద ఘటనపై ఈగలపెంట పోలీస్ స్టేషన్లో 174 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 8 మంది గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. (చదవండి: కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) (చదవండి: మృత్యుసొరంగం) -
డ్యూటీ ముగిసినా.. విధుల్లోకి వెళ్లి..
సాక్షి, హైదరాబాద్: తమ విధులు ముగిసినా.. అత్యవసర మరమ్మతుల కోసం మళ్లీ ప్లాంట్‌కు వచ్చి ముగ్గురు మరణించడం పలువురిని కలచివేస్తోంది. శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఈలు ఉజ్మా ఫాతిమా, మోహన్‌కుమార్, జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ జనరల్ డ్యూటీలో విధులు ముగించుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, బ్యాటరీల మరమ్మతు చేయడం కోసం హైదరాబాద్‌కు చెందిన అమరాన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్‌కుమార్, మహేశ్‌కుమార్ వచ్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఉండటంతో డీఈ శ్రీనివాస్‌గౌడ్ ఫోన్ చేసి వారిని రావాలని కోరడంతో.. ముగ్గురూ తిరిగి ప్లాంట్‌కు వచ్చి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడటంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మూడేళ్ల క్రితం పదోన్నతిపై వెళ్లి.. హైదరాబాద్ చంపాపేటకు చెందిన జెన్కో డీఈ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ 2002లో జెన్కోలో ఏఈగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్లపాటు కేటీపీఎస్‌లో పని చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధలో పదేళ్లపాటు పనిచేశారు. ఐదేళ్ల క్రితం ఏడీగా పదోన్నతిపై నాగార్జునసాగర్‌కు వెళ్లారు. అనంతరం డీఈగా మూడేళ్ల క్రితం శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి బదిలీ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. శ్రీనివాస్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మొదటి నుంచి అక్కడే.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగి నరసింహారావు పెద్దకుమారుడు మోహన్‌కుమార్.. జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. 2013–14లో సబ్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏఈగా పదోన్నతి పొందారు. మొదటి నుంచి ఆయన శ్రీశైలంలోనే పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు పార్ధు(5), నిహారిక(7 నెలలు) ఉన్నారు. విధుల్లోకి వెళ్లిన మోహన్‌కుమార్ కాసేపటికే భార్య పావనికి ఫోన్ చేసి.. ‘ఇక్కడ ప్రమాదం జరిగింది. నేను వస్తానో, రానో..’అని చెప్పి ఫోన్ పెట్టేశారని భార్య రోదిస్తూ చెప్పారు. (మృత్యుసొరంగం) నాలుగున్నరేళ్ల క్రితం ఏఈగా ఎంపికై.. హైదరాబాద్ కాలాపత్తర్‌కు చెందిన ఉజ్మాఫాతిమా(26) నాంపల్లి ఎగ్జిబిషన్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నాలుగున్నరేళ్ల క్రితం ఏఈగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ శ్రీశైలంలో వేశారు. ప్రమాదంలో మృతిచెందడంతో ఆమె నివాసం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన ఫాతిమాకు డీఈ శ్రీనివాస్‌గౌడ్ ఫోన్ చేయడంతో మళ్లీ వెళ్లిందని, తిరిగి ఇలా శవమై వస్తుందని ఊహించలేదని ఫాతిమా తల్లి రోదిస్తూ చెప్పారు. ఫాతిమాకు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లితో కలసి స్థానికంగానే ఉంటున్నారు. (ఇదే తొలి ప్రమాదం) కేటీపీఎస్ నుంచి శ్రీశైలానికి... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన ఎట్టి రాంబాబు(40) 2013లో పాల్వంచ కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో చేరారు. అనంతరం జూనియర్ ప్లాంట్ ఆపరేటర్‌గా పర్మనెంట్ అయింది. ఆ తర్వాత శ్రీశైలం పవర్ హౌస్‌కు బదిలీ కావడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మర్సకట్ల పెద్ద వెంకట్రావ్(47) పాల్వంచ కేటీపీఎస్‌లో పనిచేసి.. బదిలీపై శ్రీశైలం వెళ్లారు అక్కడ ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి నుంచి డిప్యుటేషన్‌పై.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన మాలోతు కిరణ్(35) కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం ‘సీ’స్టేషన్లో జూనియర్ ప్లాంట్ అటెండెంట్(జేపీఏ)గా విధులు నిర్వహించేవారు. జూన్‌లో కర్మాగారం మూసివేయడంతో నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి ఇటీవల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి, మృత్యువాతపడ్డారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే అమరాన్ కంపెనీలోకి.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన వడ్డాణం వీరభద్రయ్య, ధనమ్మల ఏకైక కుమారుడు మహేశ్‌కుమార్ (35).. లాక్‌డౌన్‌కు ముందు రైల్వేలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. లాక్డౌన్ కారణంగా ఏ పని లేకపోవడంతో అక్కడ మానేశారు. ఇటీవల వరంగల్‌లో ఉన్న అమరాన్ బ్యాటరీ కంపెనీలో చేరారు. మహేశ్‌కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. సీఐడీ విచారణ ♦విచారణ అధికారిగా సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ♦ప్రమాద కారణాలు వెలికి తీయాలని సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. దురదృష్టకర ఘటన.. అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం జరగడంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్నవారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాన్ని అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న సీఎం.. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. తీవ్ర విషాద ఘటన.. నా సుదీర్ఘ అనుభవంలో ఇంతటి విషాద ఘటన ఎన్నడూ చూడలేదు. మంటలు ఎగిసి పడుతున్నా, ప్లాంటును కాపాడేందుకు ప్రయత్నించి ఆ క్రమంలోనే మరణించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. – ట్రాన్స్‌కో–జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు -
మృత్యుసొరంగం
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచుతున్న భారీ జలవిద్యుత్ కేంద్రం కొందరు ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిలిచ్చింది. జలవిద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్ ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులుకాగా, మిగిలిన ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వారు. మరో ఎనిమిది మంది ఉద్యోగులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు... గురువారం రాత్రి 10:30 నుంచి 11:00 గంటల సమయంలో 900 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంగల శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉన్న 4వ యూనిట్‌లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్‌తో తొలుత మంటలు రేగాయి. ఆ వెంటనే ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న డీఈ పవన్, ఇతర ఉద్యోగులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడమే కాకుండా కేవలం 3 నిమిషాల్లోనే పవర్‌హౌస్‌లో పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన ఆరుగురు ఉద్యోగులు వెంటనే కారులో బయటకు వచ్చారు. ఎలక్ట్రికల్ డీఈ అంకినీడు, మరో ఉద్యోగి అతికష్టం మీద డీజిల్ సెట్ వెళ్లే సొరంగ మార్గంలో పరుగులు పెడుతూ బయటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రాన్స్ఫార్మర్ పేలుడుకు కారణం అదేనా? శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కృష్ణా నదిలో హెడ్ (నీటి ఇన్‌టేక్, నీటి డిశ్చార్జ్ పాయింట్ మధ్య హెచ్చుతగ్గులు) ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే 150 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే కారణంతో ఒక్కో యూనిట్ 180 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. అయితే పేలుడు సంభవించిన నాలుగో యూనిట్‌కు చెందిన ఆక్సిలరీ వోల్జేజీ ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు మాత్రం ఒక్కసారిగా 200 మెగావాట్ల ఉత్పత్తికి వెళ్లిపోయింది. ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ఓ అధికారి చెప్పారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నాలుగో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆగిపోలేదని సమాచారం. ఈ క్రమంలో పేలుళ్లు, మంటలు సంభవించి విద్యుత్ కేంద్రం మొత్తం చీకటిగా మారింది. అడుగు దూరంలో ఉన్న మనిషిని సైతం చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగిందని బయటకు వచ్చిన ఇంజనీర్లు, ఇతర అధికారులు పేర్కొన్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, ఎస్పీఈ సిబ్బంది, అధికారులు, కార్మికులు, నాన్ ఇంజనీర్లు ఆక్సిజన్ ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు. కారు లైట్లు వేసుకొని వెళ్లినా దారి కనిపించలేదు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్. శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ విద్యుత్ కేంద్రం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 2:15 గంటలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి పొగ కమ్ముకోవడంతో వెనుదిరిగారు. అనంతరం జగదీశ్‌రెడ్డి ప్రమాద ఘటనపై జెన్కో అధికారులతో సమీక్షించారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను అతికష్టం మీద లోపలికి పంపించారు. పవర్‌హౌస్‌లోని గ్యాస్ ఇన్సులేటెడ్ సిస్టమ్ దిగువ ప్రాంతంలో ఆయిల్ లీక్ కావడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. అయినా అతికష్టం మీద ఫైర్ సిబ్బంది ప్రయత్నం కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎండీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పొగ ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన ప్లాంటులోకి ప్రవేశించి గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతికారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు దురదుష్టవశాత్తు మరణించడంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మృతులు వీరే.. 1. డీఈ శ్రీనివాస్‌గౌడ్ (హైదరాబాద్) 2. ఏఈ వెంకటేశ్వర్రావు (పాల్వంచ) 3. ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్) 4. ఏఈ ఉజ్మా ఫాతిమా (హైదరాబాద్) 5. ఏఈ సుందర్ (సూర్యాపేట) 6. ప్లాంట్ అటెండర్ రాంబాబు (ఖమ్మం జిల్లా) 7. జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ (పాల్వంచ) 8. వినేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) 9. మహేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) వీరందరూ ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. -
నువ్వు, పిల్లలు జాగ్రత్త.. సుందర్ చివరి మాటలు
సాక్షి, నాగర్ కర్నూల్: ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు ఇవి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో సుందర్ నాయక్ ఒకరు. 35 ఏళ్ల సుందర్ నాయక్ నిన్ననే తిరిగి విధుల్లో చేరాడు. కరోనా బారిన పడి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత తేరుకున్న సుందర్ డ్యూటీకి గురువారం హాజరయ్యాడు. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) కాగా, కరోనాను జయించిన సుందర్.. ఇలా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మృత్యుంజయుడనుకున్న సుందర్‌ను విధి మరోలా వక్రించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తొలుత లభించిన మృతదేహం కూడా సుందర్‌దే. ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇక ప్రాణాలతో బయటపడలేమని ఊహించిన సుందర్.. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడలేకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని భార్యకు ఫోన్లో ప్రమాద తీవ్రతను వివరించాడు. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం) -
విషాదం: లోపలున్న 9 మందీ మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్ కో అధికారులు ప్రకటించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...‘రాత్రి 10.30 గంటలకు ప్యానెల్స్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం గుర్తించిన ఉద్యోగులు మంటలార్పేందుకు యత్నించారు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్లాంట్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. రాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి ప్రమాదంపై సమాచారం అందించారు. ఆపదలో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్‌లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు’అని పేర్కొన్నారు. (పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం) మృతుల వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ 8. టెక్నీషియన్ మహేష్ కుమార్ 9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్ -
పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సీఐడీ విచారణకు ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విద్యుత్ కేంద్రంలో మొత్తం 9 మంది చిక్కుకుపోగా సీఐఎస్ఎఫ్ రెస్క్యూ బృందం వారిని రక్షించేందుకు రంగంలోకి దిగింది. అయితే దురదృష్టవశాత్తూ లోపల చిక్కుకుపోయిన వారంతా మృత్యువాతపడ్డారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదం ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, గురువారం రాత్రి 10.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. -
కరోనాపై గెలిచి, అనూహ్యంగా మృత్యువాత
నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఒకరు మృతి చెందారు. ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మృతుడు సుందర్ నాయక్ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. (35 మందితో పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్) -
పాల్వంచలో మరో విద్యుత్ ప్లాంట్ !
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో మరో విద్యుత్ ప్లాంట్ నిర్మించడంపై జెన్కో యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గురువారం సర్వే చేపట్టారు. 1966 –78 మధ్య కాలంలో నిర్మించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(720 మెగావాట్ల) ప్లాంట్లలో ఈ ఏడాది డిసెంబర్ 31తో ఉత్పత్తి ఆపేయాల్సి ఉంది. అనంతరం కర్మాగారాన్ని నేలమట్టం చేస్తారు. అయితే ఇక్కడి భౌగోళిక వనరులను ఉపయోగించి ఓఅండ్ఎం కర్మాగారం స్థానంలో మరో ప్లాంట్ నిర్మించే అంశంపై బీహెచ్ఈఎల్, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే చేశారు. మూసివేత అనంతరం నేల మట్టం చేయకుండా భవిష్యత్ ప్లాంట్‌కు ఉపయోగకరంగా పనిచేసే నిర్మాణాలను పరిశీలించారు. ముఖ్యంగా కూలింగ్ టవర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అయితే, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ కంటే మెరుగైన టెక్నాలజీతో ప్లాంట్ రూపుదిద్దుకోవడానికి ఇక్కడ భూమితో పాటు బొగ్గు, నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని సర్వే బృందం గుర్తించింది. దీని వల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కాలుష్యం వెలువడుతుందని చెబుతున్నారు. కొత్త టెక్నాలజీతో నిర్మించే సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్లను భారత దేశంలోనే మొదటిసారిగా పాల్వంచలో ఏర్పాటు చేయాలని యోచిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ యూనిట్లకు మరమ్మతులు వస్తే.. చాలా రోజుల పాటు రాష్ట్ర గ్రిడ్‌కు ఉత్పత్తి నిలిచిపోయేది. అయితే ఆల్ట్రా యూనిట్లకు మరమ్మతులు తక్కువని, ఒకవేళ వచ్చినా చేయడం సులువని అధికారులు చెబుతున్నారు. -
సీఎం జగన్ నిర్ణయంతో వేంపెంటలో ఆనందాలు
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలో ఆనందాలు వెల్లివిరిశాయి. గ్రామస్తులను కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ఆయన రద్దు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా వేంపెంట గ్రామప్రజలకు ‘‘అధికారంలోకి వచ్చేదాకా స్టే తెచ్చుకుందాం. అధికారంలోకి రాగానే ప్రాజెక్టును క్యాన్సెల్ చేస్తా’’ అని ఆ రోజు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పవర్ ప్లాంట్ ప్రాజెక్టును రద్దు చేసి వేంపేట ప్రజలపై తన ప్రేమను చాటుకున్నారు. దీంతో ఎనిమిదేళ్ల పోరాటం.. ఐదేళ్ల సుదీర్ఘ రిలే నిరాహార దీక్షల తర్వాత గ్రామస్తులు విజయం సాధించినట్లైంది. -
మాటనిలబెట్టుకున్న వేళ ఊరు నిలబడ్డ వేళ
-
పల్లెపై బూడిద పడగ..
సాక్షి, తోటపల్లిగూడూరు: తీర ప్రాంతం పల్లెలపై బూడిద పడగేస్తోంది. పచ్చని పల్లెలు పవర్ ప్రాజెక్ట్‌లు వెదజల్లే వాయు కాలుష్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. మండలంలోని వరకవిపూడి పంచాయతీ అనంతపురంలో సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ (ఎన్‌సీసీపీపీఎల్) ఏర్పాటైంది. 1,300 మెగావాట్ల విద్యుతుత్పత్తి లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం విద్యుతుత్పత్తి కొనసాగిస్తోంది. దీనికి సమీపంలోనే టీపీసీఎల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తన కార్యకాలాపాలను సాగిస్తోంది. విద్యుతుత్పత్తి ప్రారంభించిన సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ ఏడాదికే విషవాయువుల రూపంలో తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి బూడిద రూపంలో వెలుబడుతున్న విష వాయువులు వరకవిపూడి, మండపం పంచాయతీలతో పాటు ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. మనుషులు.. మొక్కలు విలవిల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లతో వరకవిపూడి పంచాయతీలోని అనంతపురం, శివరామపురం మండపం పంచాయతీలోని ఇసుకదొరువు, కాటేపల్లి, సీఎస్‌పురం, గొల్లపాళెం గ్రామాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిద, విషవాయులు ఇళ్లను చుట్టుముట్టతుండంతో ఆరుబయట విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. క్యాన్సర్, అల్సర్, ఇతర గుండె సంబంధిత వ్యాధులతో స్థానికులు వైద్యశాలల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. ఇళ్లల్లో పెంచుకొంటున్న పూల మొక్కలతో పాటు ఏళ్ల నాటి వటవృక్షాలు సైతం ఎండుముఖం పట్టి మోడు బారిపోతున్నాయి. ఏళ్ల తరబడి నీడతో పాటు ప్రాణవాయువును ఇచ్చిన పచ్చని చెట్లు తమ కళ్లెదుటే నిలువునా ఎండిపోతుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేçస్తున్నారు. స్థానికంగా ఉన్న వందల ఎకరాల్లో పంటలు సైతం పండక భూములను బీళ్లుగా మార్చుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. వరిపైర్లపై వీటి ప్రభావం అధికంగా ఉండడంతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితులు దాపరించాయని స్థానిక రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి సెంబ్‌కార్ఫ్ గాయత్రి పవర్ ప్రాజెక్ట్ కారణంగా పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి. ప్రాజెక్ట్ నుంచి బూడిద రూపంలో కాలుష్యం విడుదలవుతూ పంటలు, పూల మొక్కలు, చెట్లు నిలువున ఎండిపోతున్నాయి. కాలుష్యంతో స్థానికులు వివిధ రోగాల బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాజెక్ట్‌ల నుంచి విడుదలవుతున్న కాలుష్యం నియంత్రణ విషయంలో కంపెనీ యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయం. – ఉప్పల శంకరయ్యగౌడ్, అనంతపురం చెప్పిందొకటి.. చేస్తుంది మరొకటి ప్రాజెక్ట్ ప్రారంభం, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాని, కనీస సౌకర్యాల కల్పనలో సెంబ్‌కార్ఫ్ పవర్ ప్రాజెక్ట్ యాజమాన్యం పూర్తిగా గాలికొదిలేసింది. కాలుష్యం బారిన పడిన గ్రామాలకు, స్థానికులను రక్షించండంటూ మొత్తుకొంటున్న కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. విషయాయుల ప్రభావంతో స్థానిక గ్రామాల ప్రజలు అనేక రోగాలతో అల్లాడుతున్నారు. విషవాయువులు అధికమై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకీడుస్తున్న పైనాపుపురం గ్రామ వాసులను వేరే ప్రాంతానికి తరలించాలని అభ్యర్థిస్తున్న ఉలుకుపలుకు లేదు. – నెల్లూరు శివప్రసాద్, పైనాపురం -
జీఎంఆర్ ప్లాంటుపై అదానీ కన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చెందిన విద్యుత్ ప్లాంటు టేకోవర్ ప్రయత్నాలను అదానీ పవర్ ముమ్మరం చేసింది. జీఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీ (జీఎంఆర్సీఈ) కొనుగోలుకు సంబంధించిన డీల్ దాదాపు తుదిదశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కింద జీఎంఆర్సీఈకి చెందిన రూ. 5,800 కోట్ల రుణభారంలో దాదాపు రూ. 3,800 కోట్లు, అలాగే రూ. 1,400 కోట్ల నిధులయేతర భారం అదానీ పవర్‌కు బదలాయింపు అవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణదాతలు లాంఛనంగా ఆమోదముద్ర వేసిన తర్వాత మరికొన్ని వారాల్లో డీల్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వివరించాయి. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ కింద రెండు 685 మెగావాట్ బొగ్గు ఆధారిత పవర్ యూనిట్లు ఉన్నాయి. గతేడాది వీటిలో వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక కింద జీఎంఆర్ చత్తీస్‌గఢ్ నియంత్రణాధికారాలను బ్యాంకులు గతేడాది జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంక్ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం రూ. 3,000 కోట్ల రుణాలను సంస్థలో 52% వాటాల కింద మార్చుకున్నాయి. దీన్ని కొనుగోలు చేసేందుకు అదానీ పవర్‌తో పాటు వేదాంత, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ప్రభుత్వ రంగ ఎన్ఎల్సీ ఇండియా తదితర సం స్థలు నాన్–బైండింగ్ బిడ్లు దాఖలు చేసినట్లు కంపెనీకి రుణాలిచ్చిన పీఎఫ్సీ గతంలో వెల్లడించింది. కృష్ణగిరిలో జీఎంఆర్ ఎస్ఐఆర్కు శంకుస్థాపన.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తలపెట్టిన జీఎంఆర్ కృష్ణగిరి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (జీకేఎస్ఐఆర్)కు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ టిడ్కోతో కలిసి జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని ఏర్పాటు చేస్తోంది. కృష్ణగిరి జిల్లాలోని హోసూర్‌లో సుమారు 2,100 ఎకరాల్లో ఈ రీజియన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఆటోమొబైల్, ఆటో పరికరాలు, డిఫెన్స్ .. ఏరోస్పేస్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి హైటెక్ పరిశ్రమలపై జీకేఎస్ఐఆర్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఇందులో దేశ, విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. ‘రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు, ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చే సంస్థలకు జీఎంఆర్ దీర్ఘకాలిక ప్రాతిపదికన స్థలాన్ని లీజుకి ఇస్తుంది. ఆయా సంస్థలు కావాలనుకుంటే పూర్తిగా కొనుక్కోవచ్చు’ అని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం) బీవీఎన్ రావు తెలిపారు. -
వ్యర్థాలతో వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాల్లో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్ చెత్త (మునిసిపల్ ఘనవ్యర్థాల ఎంఎస్‌డబ్లు్య) నిర్వహణలోనూ రికార్డు కెక్కనుంది. దేశంలో ఏ నగరంలో లేని అతి పెద్ద భారీ డంపింగ్ యార్డు జవహర్‌నగర్‌లోని వ్యర్థాల క్యాపింగ్ పనులు త్వరలో పూర్తి చేయనుంది. తద్వారా పరిసర గ్రామాల ప్రజలకు వాతావరణ, భూగర్భజల కాలుష్యం తగ్గనుంది. దాదాపు 135 ఎకరాల్లో పేరుకుపోయిన 12 మిలియన్ టన్నుల వ్యర్థాల నుంచి వెలువడుతున్న దుర్గంధం, కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెత్తకుప్పల నుంచి వెలువడే కలుషితాలు, వర్షం నీరు కలిసి వెలువడుతున్న కాలుష్యకారకద్రవాల (లీచెట్)తో భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. ఈ సమస్య పరిష్కారానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్ దేశాల మాదిరిగా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ పనుల్ని రాంకీకి చెందిన ‘హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ లిమిటెడ్’ చేపట్టింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలాఖరులోగా క్యాపింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే క్యాపింగ్లోని ఆరు దశల్లో తొలిదశలో భాగంగా 150 మి.మీ. మందం మట్టితో కప్పే ప్రక్రియను 85శాతం పూర్తిచేసింది. వర్షాకాలం ముగిశాక అక్టోబర్‌లో రెండో దశ పనుల్ని చేపట్టనున్నారు. విషవాయువులు బయటికి వెళ్లేలా... క్యాపింగ్ అనంతరం డంప్‌యార్డ్‌పై బోరు బావుల మాదిరిగా పైపులను చొప్పించి విషవాయువులు పైకి వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. వెలువడే గ్యాస్‌లోని వాయువుల్ని, వాటి పరిమాణాన్ని లెక్కించి, విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. అందుకు అవకాశముంటే విద్యుత్ ఉత్పత్తికూడా చేస్తారు. విషవాయువులు, లీచెట్‌ను శుభ్రపరుస్తారు. ఇప్పటికే లీచెట్ శుభ్రపరిచే చర్యలు పైలట్‌గా చేపట్టారు. క్యాపింగ్ పనుల్లో టెర్రా సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈ పనుల్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం పరిశీలించారు. క్యాపింగ్ ప్రాజెక్ట్ హెడ్ కృష్ణతో కలసి పనుల వివరాలను మీడియాకు వివరించారు. మార్చిలో విద్యుత్ ప్లాంట్ పనులు.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పనులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌కు రోజుకు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు ఈ క్యాపింగ్ తదితర పనుల్ని పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 నగరాల్లోనే ఇంత పెద్ద డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు జరిగాయని ప్రాజెక్ట్ హెడ్ కృష్ణ తెలిపారు. చెత్త నిర్వహణలో ఆదర్శం: బొంతు దేశంలో ఆగ్రా, ముంబై వంటి నగరాల్లో డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు చేసినా, ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఇంత పెద్ద చెత్తగుట్టలకు ఎక్కడా క్యాపింగ్ జరగలేదు. అనుకున్న ప్రకారం పనులన్నీ పూర్తయితే జవహర్‌నగర్ మోడల్ డంపింగ్ కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మారుతుంది. తొలిదశలో మట్టితో కప్పేందుకు ఇప్పటివరకు 5.5 లక్షల క్యూబిక్ టన్నుల మట్టిని వినియోగించారు. లీచెట్ శుద్ధికి 4ఎంఎల్డీ సామర్ధ్యమున్న యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం మేర దుర్గంధం తగ్గింది. ప్రాజెక్టు వ్యయం రూ.144 కోట్లు కాగా, సగం కాంట్రాక్టు సంస్థ, మిగతా సగం జీహెచ్ఎంసీ భరిస్తున్నాయి. ఇకపై గ్రేటర్‌లోని చెత్తనంతా జవహర్‌నగర్‌కే తరలించం. నగరం నలువైపులా వివిధ ప్రాంతాల్లో చెత్త డంప్ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణ చేపడతాం. దాదాపు 50–100 ఎకరాల మేర స్థలాల్ని ఎంపిక చేసి చుట్టూ గార్డెన్‌ను అభివృద్ధి చేసి, మధ్యలో ఘనవ్యర్థాల నిర్వహణ పనులు చేపడతాం. ఆటోనగర్‌లోనూ చెత్త నిర్వహణ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. గ్రేటర్‌లోని 12 చెత్త రవాణా కేంద్రాలనూ ఆధునీకరిస్తాం. వాటి నిర్వహణ బాధ్యతల్ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగిస్తాం. ఆరు దశల్లో పనులిలా.. ఆరు దశల్లో ఈ క్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేస్తారు. తొలిదశలో డంప్ యార్డును మట్టితో కప్పి వర్షపు నీరు చెత్తలోకి చేరకుం డా చేస్తారు. అనంతరం మట్టిపొరపైన జియోసింథటిక్ క్లే లైనర్ వేస్తారు. తర్వాత జియో కంపోజిట్ లేయర్ ఏర్పాటు చేస్తారు. చివరగా మళ్లీ మట్టిపొరను దాదాపు ఒకటిన్నర అడుగు (45సెం.మీ.) మేర పరుస్తారు. దీనిపై అందంగా కనిపించేందుకు, ఆక్సిజన్ వెలువడేందుకు రంగు రంగుల మొక్కలు పెంచుతారు. -
వంశధారపై విద్యుదుత్పత్తి ప్రాజెక్టు లేనట్లే
అమరావతి: వంశధార నదిపై 20 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆర్థికంగా గిట్టుబాటు కాదని ఏపీ జెన్కో(విద్యుదుత్పత్తి సంస్థ) నిపుణుల బృందం తేల్చిచెప్పడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నదిపై 19.5 టీఎంసీల సామర్థ్యంతో హిరమండలం రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఆ రిజర్వాయర్ స్లూయిజ్‌ల ద్వారా గొట్టా బ్యారేజీ ఎడమ కాలువకు నీళ్లందిస్తారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు స్పిల్ వే ద్వారా గొట్టా బ్యారేజీకి దిగువన వంశధార నదిలోకి వరద నీటిని వదిలేస్తారు. రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 47.5 మీటర్ల వరకూ నీటిని వినియోగించుకోవచ్చు. అక్కడినుంచి గొట్టా బ్యారేజీకి అనుసంధానం చేస్తూ పెన్‌స్టాక్(గొట్టాల)ను ఏర్పాటు చేసి వాటికి 20 అడుగుల దిగువన టర్బైన్లను ఏర్పాటు చేసి రెండు వేల క్యూసెక్కుల నీరు విడుదల ద్వారా 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయాలంటే రిజర్వాయర్‌లో పవర్ బ్లాక్‌ను ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంటుంది. పవర్ బ్లాక్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను జలవనరుల శాఖ ఈఎన్సీ(పరిపాలన) రవికుమార్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ గిరిధర్ రెడ్డి, సలహాదారు రౌతు సత్యనారాయణ బృందానికి అప్పగించింది. వారి నివేదికను జెన్కోకు పంపగా ఇటీవల రిజర్వాయర్‌ను పరిశీలించిన జెన్కో నిపుణుల బృందం పెన్ స్టాక్‌ల ద్వారా జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అధిక వ్యయం అవుతుందని, ఇది గిట్టుబాటు కాదని తేల్చిచెబుతూ సర్కార్‌కు మరో నివేదిక ఇచ్చింది. దీంతో జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. -
67 మంది దుర్మరణం
చైనాలో కూలిన పవర్‌ప్లాంట్ బీజింగ్: చైనాలో నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ ప్లాట్‌ఫాం కూలడంతో 67 మంది దుర్మరణం పాలయ్యారు. గురువారం తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్‌సలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ ప్లాట్‌ఫాం ఒక్కసారిగా భూమిలో కుంగిపోరుుంది. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పలువురు చిక్కుకుపోయారు. కాంక్రీటు పలకలు విరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి వ్యాపించింది. 70 మంది కార్మికుల్లో 67 మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించగా, ఇద్దరు గాయాల పాలయ్యారు. మరొకరు గల్లంతయ్యారు. 200 మంది అగ్నిమాపక సిబ్బంది జాగిలాలతో సహా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గత ఏడాది చైనా పోర్ట్ సిటీ తియాంజిన్‌లో జరిగిన పేలుళ్లలో 173 మంది చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. 2014 ఆగస్టులో తూర్పు చైనాలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 75 మంది చనిపోయారు. -
చైనలో కుప్పకూలిన పవర్ ప్లాంట్
-
వాటాల విక్రయాలపై జీఎంఆర్ కసరత్తు
• చత్తీస్‌గఢ్ విద్యుత్ ప్లాంటుపై చర్చలు • హైదరాబాద్ ఎయిర్‌పోర్టుపై సీడీపీక్యూ ఆసక్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారీ రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టిన మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ మరికొన్ని వ్యాపారాల్లో వాటాలను విక్రయించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో బాగంగా జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్) అనుబంధ సంస్థ జీఎంర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీలో (జీసీఈఎల్) వాటాల విక్రయంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్‌తో పాటు అమెరికాకు చెందిన లోన్ స్టార్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జీసీఈఎల్కు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మొత్తం 1,370 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రెండు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. సంస్థకు దాదాపు రూ. 8,290 కోట్ల రుణభారం ఉంది. దీన్ని 2017 నుంచి తిరిగి చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ. 750 కోట్ల విలువ చేసే రెండు క్యాప్టివ్ గనులు కూడా ఉన్న జీసీఈఎల్ విలువ సుమారు రూ. 12,500 కోట్ల మేర ఉండొచ్చని అంచనా. అయితే, జీసీఈఎల్కు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లేకపోవడం డీల్‌కు అడ్డంకిగా మారొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం స్వల్పకాలిక పీపీఏలే ఉన్న జీసీఈఎల్.. తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదరవచ్చని భావిస్తోంది. సెంబ్‌కార్ప్, లోన్ స్టార్ ఫండ్స్.. రెండూ కూడా ఇటీవల సన్ఎడిసన్కి చెందిన భారత వ్యాపార విభాగం కొనుగోలు కోసం షార్ట్‌లిస్ట్ అయిన సంస్థలే. అయితే, దీన్ని అంతిమంగా హైదరాబాద్‌కి చెందిన గ్రీన్కో ఎనర్జీ కొనుగోలు చేసింది. విమానాశ్రయంలో 30 శాతం వాటాలు.. జీఎంఆర్‌కి చెందిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో వాటాలు తీసుకోవడంపై కెనడా ఫండ్ సంస్థ సీడీపీక్యూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 25-30 శాతం వాటా కొనుగోలు చేయాలని సీడీపీక్యూ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 350-400 మిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని అంచనా. సీడీపీక్యూ సంస్థ.. టీవీఎస్ గ్రూప్‌లో భాగమైన టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌లో దాదాపు రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అటు అబూ ధాబి ఇన్వెస్ట్మెంట్ సంస్థ కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. విద్యుత్, విమానాశ్రయాలు తదితర రంగాల్లో విస్తరించిన జీఎంఆర్ గ్రూప్ రుణభారం దాదాపు రూ. 43,000 కోట్ల మేర ఉంది. దీన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా కొన్నాళ్ల క్రితమే జీఎంఆర్ ఎనర్జీ సంస్థలో 30 శాతం వాటాను దాదాపు 300 మిలియన్ డాలర్లకు మలేషియా సంస్థ టెనగా నేషనల్ బెర్హాద్‌కి విక్రయించింది. ఆ తర్వాత మారు ట్రాన్స్మిషన్ సర్వీసెస్‌లో 74 శాతం, అరావళి ట్రాన్స్మిషన్ సర్వీసెస్‌లో 49 శాతం వాటాలను అదానీ ట్రాన్స్మిషన్కు విక్రయించింది. -
‘యాదాద్రి’ ప్లాంటుపై పునర్విచారణ!
జెన్కోకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశం పర్యావరణ అనుమతుల జారీపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మళ్లీ బహిరంగ విచారణ నిర్వహించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించి జెన్కో రూపొందిన ‘పర్యావరణ ప్రభావంపై అంచనా (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ ఈఐఏ)’ నివేదికలో తీవ్ర లోపాలుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఈఐఏ నివేదికను రూపొందించాలని, దాని ఆధారంగా ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మరోమారు బహిరంగ విచారణ నిర్వహించాలని స్పష్టం చేసింది. గత ఆగస్టు 29న జరిగిన ‘పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ)’ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులపై తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన మినిట్స్ కాపీని సవరించి మళ్లీ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినిట్స్‌లో బహిరంగ విచారణ నిర్ణయాన్ని పొందుపరచలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చేర్చి సవరించిన మినిట్స్ కాపీని విడుదల చేసింది. కాపీ పేస్ట్ నివేదిక ఇతర ప్రాజెక్టుల నివేదికల నుంచి సమాచారాన్ని తస్కరించి (కాపీ పేస్ట్) ఈ నివేదికను జెన్కో రూపొందించిందని, ప్రాజెక్టుకు సంబంధం లేని ఎన్నో అంశాలను ఈ నివేదికలో చొప్పించినట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. కథ మళ్లీ మొదటికి కమిటీ అక్షింతల నేపథ్యంలో జెన్కో కొత్తగా ఈఐఏ నివేదిక రూపొందించి దాని ఆధారంగా బహిరంగ విచారణ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల కోసం జెన్కో చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అధికారుల తప్పిదాలతో ప్లాంట్ నిర్మాణంలో మరింత ఆలస్యం జరుగుతోంది. -
కేటీపీపీ విద్యుదుత్పత్తి పునఃప్రారంభం
600 మెగావాట్ల ప్లాంట్‌లో కొనసాగుతున్న మరమ్మతులు గణపురం : మండలంలోని చెల్పూరు శివారు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లో శనివారం ఉద యం విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. బాయిలర్ ట్యూబ్‌ల లీకేజీలతో రెండు రోజుల క్రితం మొదటి దశ విద్యుత్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిన విషయం తెలిసిందే. పగిలిన బాయిలర్ ట్యూబ్‌లకు రెండు రోజుల పాటు మరమ్మతులు చేసిన అధికారులు సింక్రనైజేషన్ ప్రారంభించారు. కాగా మూడు రోజుల క్రితం రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లోనూ విద్యుదుత్పత్తి నిలిచింది. జనరేటర్లో సాంకేతిక సమస్య తలెత్తగా ప్లాంట్ ఇంకా ప్రారం భం కాలేదు. మరో మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించేం దుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
చైనా విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు
21 మంది మృతి బీజింగ్: చైనాలోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం అత్యంత ఒత్తిడితో కూడిన ఆవిరి గొట్టం పేలడంతో 21 మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. హ్యుబే ప్రావిన్స్ డ్యాంగ్‌యాంగ్ నగరంలోని మాడియన్ గాంగ్యు విద్యుదుత్పత్తి కేంద్రంలో మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, వారికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే పని భద్రత అధికారులు రక్షణ చర్యలు చేపట్టారని డ్యాంగ్‌యాంగ్ అధికారులు తెలిపారు. పైపును పరీక్షిస్తుండగా ఒక్కసారిగా పగలడంతోనే ప్రమాదం సంభవించిందన్నారు. నగరీకరణ, అభివృద్ధిలో దూసుకుపోతున్న చైనాలో కార్మికుల భద్రత, పర్యావరణ నిబంధలు పాటించడంలో నిర్లక్ష్యం వల్ల ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలు చాలా సాధారణమయ్యాయి. చైనా ఈశాన్య నగరం తియాన్జిన్ ప్రమాదానికి ఏడాది పూర్తవుతున్న ఒక రోజు ముందే డ్యాంగ్‌యాంగ్ దుర్ఘటన జరగడం గమనార్హం. నాటి పేలుడులో 173 మంది మరణించారు. -
విద్యుత్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన జెన్కో సీఎండీ
మేళ్లచెర్వు : మండలంలోని వజినేపల్లి సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న 120 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పులిచింతల వద్ద ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం నాలుగు యూనిట్లకు గాను మొదటి యూనిట్‌ను నెల రోజుల్లో ప్రారంభించి 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి రెండవ యూనిట్, 2017 ఫిబ్రవరి చివరి నాటికి మూడు, నాలుగు యూనిట్లను ప్రారంభించి 120 యూనిట్ల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ద్వారా1080 మెగావాట్లు, యాదాద్రి ప్రాజెక్టు ద్వారా 400 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం 7600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు నాటికి 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న పనుల తీరుపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట హైడల్ డైరెక్టర్ వెంకటరాజన్, ఎస్ఈ లు శ్రీనివారెడ్డి, సద్గుణ కుమార్, ఈఈ ఆశోక్‌కుమార్, డీఈలు నాగిరెడ్డి రవి,టి.నర్సింహారావు తదితరులున్నారు. -
విశాఖలో హిందుజా విద్యుదుత్పత్తి ప్రారంభం...
హైదరాబాద్: హిందుజా గ్రూపునకు చెందిన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలోని విశాఖపట్నంలో నెలకొల్పిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లో సోమవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఒక్కోటీ 520 మెగావాట్ల సామర్థ్యంతో హిందుజా ఇక్కడ రెండు యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ ఎండీ అశోక్‌పురి మాట్లాడుతూ... రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించామని తెలిపారు. మొదటి యూనిట్ ద్వారా జనవరి నుంచే గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఇప్పుడు రెండో యూనిట్ కూడా ఉత్పత్తిని ఆరంభించిందని తెలియజేశారు. -
భారీగా విద్యుదుత్పత్తి నిలుపుదల!
- ‘బ్యాకింగ్ డౌన్’కు ఈఆర్సీ ఆమోదముద్ర - 2016-17లో 6,926 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాదీ భారీ ఎత్తున విద్యుదుత్పత్తి నిలుపుదలకు రంగం సిద్ధమైంది. డిమాండ్ లేకపోవడంతో 2016-17లో 6,926 మిలియన్ యూనిట్ల (ఎంయూ)లను బ్యాకింగ్ డౌన్ (అందుబాటులో ఉన్న విద్యుత్‌తో పోలిస్తే డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బలవంతంగా ఉత్పత్తిని తగ్గించుకోవడం) చేయాల్సి రావచ్చని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థితికి పెరిగిన సమయాల్లో నిరంతర సరఫరా కొనసాగింపునకు అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేయక తప్పదని, డిమాండ్ తగ్గిన సమయాల్లో ఈ విద్యుత్ అవసరం ఉండదని వివరణ ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ ప్లాంట్లతోపాటు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్న ఇతర విద్యుత్ ప్లాంట్లలో చేపట్టాలనుకుంటున్న ఈ బ్యాకింగ్ డౌన్ వల్ల రూ. 692.61 కోట్ల అదనపు భారం పడనుందని నివేదించాయి. దీనిపై ఈఆర్సీ సానుకూలంగా స్పందించింది. అదనపు భారాన్ని నిర్ధారించాక ట్రూ అప్ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. తాజాగా ప్రకటించిన రిటైల్ టారీఫ్ ఆర్డర్ 2016-17లో విద్యుత్ ప్లాంట్ల బ్యాకింగ్ డౌన్ అంశంపై డిస్కంలకు ఈఆర్సీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ విక్రయాలతో రూ.724 కోట్ల ఆదాయం... విద్యుత్ డిమాండ్ లేని సమయంలో 1,448 ఎంయూల విద్యుత్‌ను విక్రయించడం ద్వారా రూ. 724 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని డిస్కంలు అంచనా వేశాయి. కారిడార్ అందుబాటులో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు మిగులు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.09 చొప్పున విక్రయించాలని ఈఆర్సీ ఆదేశించింది. అనుమతికి మించి కొంటున్నారు... డిమాండ్ పెరిగినప్పుడు తాము అనుమతిచ్చిన దానికన్నా అధిక విద్యుత్‌ను డిస్కంలు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నాయని ఈఆర్సీ పేర్కొంది. ఈ కొనుగోళ్లతో పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలంటూ బహిరంగ విచారణలో వచ్చిన సూచనలపై స్పందన తెలపాలని డిస్కంలను కోరింది. గతేడాది 2000 ఎంయూల బ్యాకింగ్ డౌన్ 2015-16లో జెన్కో థర్మల్ ప్లాంట్ల ద్వారా 17,076 ఎంయూల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 15,123 ఎంయూల ఉత్పత్తే జరిగింది. లక్ష్యంతో పోల్చితే 2వేల మిలియన్ యూనిట్లను బ్యాకింగ్ డౌన్ చేశారు. దీంతో జెన్కో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా 73.21%కు పతనమైంది. జెన్కో ప్లాంట్లను బ్యాకింగ్ డౌన్ చేసి స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించడంతో వినియోగదారులపై రూ. 600 కోట్ల భారం పడిందని నిపుణులు అంచనా వేశారు. ఇది కేవలం జెన్కో ప్లాంట్ల బ్యాకింగ్ డౌన్ వల్ల పడిన భారం మాత్రమే. గతేడాది ఆశించిన రీతిలో డిమాండ్ లేకపోవడంతో దీర్ఘకాలిక పీపీఏలు కుదుర్చుకున్న ఎన్టీపీసీ ప్లాంట్లను సైతం బ్యాకింగ్ డౌన్ చేశారు. -
గ్యాస్ ప్లాంట్లపై చిగురించిన ఆశలు
శంకరపల్లి, కరీంనగర్ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాలన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి మూలపడ్డ గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కరీంనగర్లో 2,100, శంకరపల్లిలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులపై పునఃపరిశీలన జరిపేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి టి.రామచంద్రు ఈ రెండు విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండి యా (గెయిల్) చెర్మైన్ త్రిపాఠి సానుకూలం గా స్పందించినట్లు తెలిసింది. ప్రతిపాదనలు పంపిస్తే కేటాయింపులపై మళ్లీ పరిశీలన జరుపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. శంకరపల్లిలో ప్రతిపాదిత వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌కు రోజుకు 5 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) సహజ వాయువు అవసరం. కరీంనగర్ లోని 2,100 మెగావాట్ల ప్లాంట్ కోసం మరో 10 ఎంఎంఎస్‌సీఎండీల సహజవాయువు అవసరమని అంచనా. దేశంలోని గ్యాస్ కొరత, పైప్‌ైలైన్ల కొరత వల్ల ఈ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు సాధ్యంకాలేదు. ఇరాన్ నుంచి అఫ్గానిస్తాన్ మీదుగా దేశానికి సహజవాయువు తరలించేందుకు కేంద్రం ఒప్పం దాలు కుదుర్చుకుంది. దీంతో గ్యాస్ ఆధారి త విద్యుత్ ప్లాంట్లకు కేటాయింపులు జర గొచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి. -
ఎన్సిసి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
-రూ.15 కోట్ల ఆస్థి నష్టం టిపి గూడూరు(నెల్లూరు జిల్లా) నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండలం అనంతవరంలో ఉన్న నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి (ఎన్సిసి) చెందిన పవర్‌ప్లాంట్ కూలింగ్ టవర్‌లో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల రాత్రి ఒంటి గంట తర్వాత మంటలు చెలరేగి కూలింగ్ ప్లాంట్ మొత్తం విస్తరించాయి. ఎన్సిసి పవర్‌ప్లాంట్‌ను సింగపూర్‌కు చెందిన సింటార్క్ కంపెనీ నిర్వహిస్తోంది. అగ్నిప్రమాదాన్ని గమనించిన సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. ఐదు ఫైరింజన్లు వచ్చి తెల్లవారేవరకూ ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. -
పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా దీక్షలు
కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట వద్ద పవర్‌ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 299 రోజులకు చేరాయి. దీక్షా శిబిరాన్ని నందికొట్కూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వేంపెంట గ్రామం వద్ద పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
స్టాక్స్ వ్యూ
బజాజ్ ఫిన్సర్వ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.1,835 టార్గెట్ ధర: రూ.2,102 ఎందుకంటే: బజాజ్ గ్రూప్‌కు చెందిన బజాజ్ ఫిన్సర్వ్ ఆర్థిక దిగ్గజ కంపెనీగా ఎదిగింది. జీవిత బీమా, సాధారణ బీమా, కన్సూమర్ ఫైనాన్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక సేవలతో పాటు పవన విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్.... ఈ మూడు వ్యాపారాల్లో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మంచి లాభాలార్జిస్తోంది. అలయంజ్ ఎస్ఈ(జర్మన్) కంపెనీతో కలిసి జీవిత, సాధారణ బీమా కంపెనీలను ఏర్పాటు చేసింది. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీవిత బీమా వ్యాపారాన్ని, బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణ జీవిత బీమా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్(ఇది కూడా స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బజాజ్ ఫిన్సర్వ్కు ఇది లిస్టెడ్ అనుబంధ సంస్థ. బజాజ్ ఫైనాన్స్‌లో బజాజ్ ఫిన్సర్వ్కు 57.6 శాతం వాటా ఉంది) వినియోగదారులకు, వాహన, వినియోగ వస్తువుల రుణాలందిస్తోంది. భారత్‌లో అతి పెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల్లో ఒకటిగా బజాజ్ ఫైనాన్స్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బజాజ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు రూ.32,410 కోట్లకు పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ లోన్ బుక్ నాలుగేళ్లలో నాలుగింతలైంది. ఆదాయం 13 శాతం, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇక బజాజ్ ఫిన్సర్వ్ మహారాష్ట్రలో 138 విండ్ మిల్స్‌తో 64 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. రెండేళ్లలో బజాజ్ ఫిన్సర్వ్ నికర అమ్మకాలు 14 శాతం, నికరలాభం 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. గుజరాత్ పిపవావ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.175 టార్గెట్ ధర: రూ.202 ఎందుకంటే: ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్లలో ఒకటైన ఏపీఎం టెర్మినల్స్ దన్నుతో గుజరాత్ పిపవావ్ పోర్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్ పిపవావ్లో ఏపీఎం టెర్మినల్స్‌కు 43 శాతం వాటా ఉంది. భారత ప్రైవేట్ రంగంలో తొలి పోర్ట్ కంపెనీ అయిన గుజరాత్ పిపవావ్ కంపెనీ కార్గో హ్యాండ్లింగ్, వేర్‌హౌస్, సీఎఫ్ఎస్ సౌకర్యాలనందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర అమ్మకాలు 10% వృద్ధితో రూ.185 కోట్లకు చేరాయి. నికర లాభం ఫ్లాట్‌గా రూ.80 కోట్లుగా నమోదైంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 22%, నికర లాభం 56% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఏపీఎం టెర్మినల్స్ సంస్థ భారత రైల్వేలతో కలిసి పిపవావ్ రైల్వే కార్పొరేషన్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌లో డబుల్ స్టాక్ ట్రైన్స్(ఒక బోగీపై మరో బోగీ ఉన్న రైళ్లు)ను ప్రవేశపెట్టనున్న తొలి కంపెనీ ఇదే కానున్నది. నైరుతీ భారత దేశంలో ప్రధానమైన ఇన్లాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ-కంటైనర్ కార్గోను తాత్కాలికంగా స్టోరేజ్, హ్యాండ్లింగ్ చేసే డ్రై పోర్టులు)లతో అనుసంధానతను మరింత మెరుగుపరచుకుంది. దీనికోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గంలో ఈ పోర్ట్ ఉంది. దాద్రి నుంచి రీఫర్ రాక్స్(రిప్రిజిరేటర్ లాజిస్టిక్స్) సౌకర్యం ఉన్న గుజరాత్‌లోని ఏకైక పోర్ట్ ఇదొక్కటే. దీంతో పశ్చిమాసియా, ఈజిప్ట్, మధ్యధరా దేశాల, ఆఫ్రికా, యూరప్ పోర్ట్‌లతో నేరుగా అనుసంధానం ఏర్పర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ. 202 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. -
టీపీసీఐఎల్ కృష్ణపట్నం ప్లాంటులో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా (టీపీసీఐఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ పట్నం వద్ద ఉన్న 1,320 మెగావాట్ల సామర్థ్యపు బొగ్గు విద్యుత్ ప్లాంటులో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఇంతవరకు నిర్మాణ దశలో ఉన్న 660 మెగావాట్ల సామర్థ్యపు రెండవ యూనిట్ పనులు పూర్తవడంతో కంపెనీ తన పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ బొగ్గు విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన 660 మెగావాట్ల సామర్థ్యపు మొదటి యూనిట్ నిర్మాణ పనులు ఫిబ్రవరిలో పూర్తి అయ్యాయి. ఈ యూనిట్లో ఇప్పటికే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. -
కూలీ మృతి : కార్మికులు ఆందోళన
-
146వ రోజుకు చేరిన వేంపల్లె గ్రామస్తుల దీక్ష
కర్నూలు(పాములపాడు): తమ గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు 146వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని వేంపల్లె గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పవర్‌ప్లాంట్ నిర్మాణం నిర్ణయాన్ని విరమించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రోడ్డెక్కిన ‘పవర్’ నిర్వాసితులు
- ప్లాంటు ఎదుట రాస్తారోకో - ‘సాక్షి’ కథనంతో కదలిక - స్తంభించిన ట్రాఫిక్.. తహశీల్దార్ హామీతో విరమణ పినపాక : భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు గురువారం రోడ్డెక్కారు. భూనిర్వాసితులకు ప్రభుత్వం చెప్పి న విధంగా సౌకర్యాలు, అవకాశాలు కల్పించడం లేదని గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీం తో భూనిర్వాసితుల్లో కదలిక వచ్చి పవర్ ప్లాంట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం పినపాక, మణుగూరు మండలాల రైతులు సుమారు 1,030 ఎకరాలు భూమిని ఇచ్చి జీవనాధారం పూర్తిగా కోల్పోయారు. ప్రభుత్వం భూమి తీసుకునే సమయం లో ఉపాధి కల్పన, విద్య, ఉద్యోగ అవకాశాలు ముందుగా భూ నిర్వాసితులకు అందజేస్తామని తెలిపారు. కానీ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభమైన నాటి నుంచి నిర్వాసితులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అయితే రెవెన్యూ, జెన్ కో అధికారుల తీరు పై ఆగ్రహిస్తూ.. ‘సాక్షి’ కథనంతో చైతన్యవంతులైన భూ నిర్వాసితులు రాస్తారోకో నిర్వహిం చారు. మణుగూరు-వరంగల్ ప్రధాన రహదారిపై సీతారాంపురం వద్ద సుమారు వంద మంది భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదుట సుమారు గంటపాటు రాస్తారోకో చేపట్టారు. అలాగే ప్రభుత్వం ఐటీఐలో ప్రవేశాలు, జాబ్ కార్డులు కావాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పవర్ ప్లాంట్ పనుల్లో భూ నిర్వాసితుల తోపాటు స్థాని కులకు అవకాశం కల్పించాలని నినదించారు. గిరిజన సొసైటీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమ సమస్యకు పరి ష్కారం చూపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఘన్యానాయక్, కరకగూడెం ఎస్సై ముత్యం రమేష్, ఏఎస్సై పాయం కన్నయ్యదొర అక్కడికి చేరుకుని తగిన న్యాయం చేస్తామని నిర్వాసితులకు హామీ ఇస్తారు. దీంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు. రాస్తారోకో వల్ల మణుగూరు-వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలి చిపోయింది. కార్యక్రమంలో ఏడూళ్లబయ్యా రం సర్పంచ్ వాగుబోయిన చందర్రావు, ఉప్పాక సర్పంచ్ కుంజా వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధు లు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. -
భెల్ నికర లాభం 62 శాతం డౌన్
మార్కెట్ మందగమనమే కారణమంటున్న కంపెనీ న్యూఢిల్లీ: విద్యుత్ రంగ పరికరాలు తయారు చేసే భెల్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించింది. ప్రభుత్వ నియమనిబంధనల కారణంగా మార్కెట్ మందగమనంగా ఉండటమే దీనికి కారణమని వివరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,461 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించి రూ.1,314 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. మొత్తం టర్నోవర్ రూ.40,338 కోట్ల నుంచి రూ.30,806 కోట్లకు తగ్గిందని వివరించింది. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు లభ్యత విషయంలో అడ్డంకులు, నిధుల లభ్యత సరిగ్గా లేకపోవడం, భూ సమీకరణ, పర్యావరణ అనుమతులు, తదితర అంశాలు లాభంపై ప్రభావం చూపాయని పేర్కొంది. ఆర్డర్ బుక్ రూ. లక్ష కోట్లపైనే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో వచ్చిన ఆర్డర్లు 10 శాతం వృద్ధి చెంది రూ.30,794 కోట్లకు పెరిగాయని వివరించింది.. విద్యుత్‌రంగంలో ఆర్డర్లు రూ.24,873 కోట్లుగా, పరిశ్రమల విభాగం నుంచి రూ.5,201 కోట్లుగా, ఎగుమతుల అర్డర్లు రూ.720 కోట్లుగా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద ఆర్డర్ బుక్ రూ.1,01,159 కోట్లుగా ఉందని పేర్కొంది. తెలంగాణలో ప్లాంట్: కాగా ఈ కంపెనీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇటీవలనే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5,000 కోట్లు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరులో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో ఇక్కడ విద్యుదుత్పత్తి చేయాలనేది ఈ ఒప్పందం లక్ష్యం. కాగా తెలంగాణ రాష్ట్రంలో 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం టీఎస్‌జెన్‌కోతో భెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
విశాఖ ఉక్కులో పవర్ ప్లాంట్ ప్రారంభం
ఉక్కునగరం: నవరత్న సంస్ద విశాఖ స్టీల్‌ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు వేసింది. ప్లాంట్ నిర్వహణకు సొంత విద్యుత్‌పై ఆధారపడేందుకు నూరు శాతం బ్లాస్ట్‌ఫర్నేస్ గ్యాస్, కోక్ ఒవెన్ గ్యాస్‌తో నిర్వహించనున్న 120మెగావాట్ల కాలుష్యరహిత పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించింది. దేశీయ ఉక్కు పరిశ్రమలో ఈ తరహా ప్లాంట్ ఏర్పాటు ఇదే తొలిసారి.. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఉక్కు సీఎండీ పి. మధుసూదన్ మొదటి బాయిలర్‌ను లైటప్ చేసారు. రూ.676 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా ఉక్కు ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైన విద్యుత్‌కు గ్రిడ్‌పై ఆధారపడకుండా సొంతంగా తయారుచేసుకోగలదన్నారు. డైరక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్ర, డైరక్టర్(ఆపరేషన్స్) డి.ఎన్.రావులు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న 6.3 మిలియన్ టన్నుల విస్తరణ సామర్ద్యానికి 418మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందన్నారు. ప్రస్తుతం 60 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 3 టర్బో జనరేటర్లు ద్వారా 180 మెగావాట్లు, 67.5 మెగావాట్ల సామర్ద్యం కలిగిన రెండు జనరేటర్ల ద్వారా 135 మెగావాట్లతో మొత్తం 315మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ లో పవర్ ప్లాంట్ ప్రారంభం
విశాఖపట్నం : నవరత్న సంస్థ 'విశాఖ స్టీల్‌ప్లాంట్' విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు వేసింది. ప్లాంట్ నిర్వహణకు సొంతగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు పవర్ ప్లాంట్ ప్రారంభించింది. నూరు శాతం బ్లాస్ట్‌ఫర్నేస్ గ్యాస్, కోక్ ఒవెన్ గ్యాస్‌తో నిర్వహించనున్న 120మెగావాట్ల కాలుష్యరహిత పవర్‌ప్లాంట్ దేశీయ ఉక్కు పరిశ్రమలో ఇదే మొదటిసారి కావడం విశేషం. మంగళవారం జరిగిన పవర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ సిఎండి పి. మధుసూదన్ మొదటి బాయిలర్‌ను లైటప్ చేశారు. రూ.676 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో సిఎండీ మాట్లాడుతూ ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా ఉక్కు ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైన విద్యుత్ కొరకు గ్రిడ్‌పై ఆధారపడకుండా సొంతగా తయారుచేసుకోగలమన్నారు. డైరక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్ర, డైరక్టర్(ఆపరేషన్స్) డి.ఎన్.రావులు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న 6.3 మిలియన్ టన్నుల విస్తరణ సామర్ద్యానికి 418మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందన్నారు. ప్రస్తుతం 60 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 3 టర్బో జనరేటర్ల ద్వారా 180 మెగావాట్లు, 67.5 మెగావాట్ల సామర్ద్యం కలిగిన రెండు జనరేటర్ల ద్వారా 135 మెగావాట్లతో మొత్తం 315మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. -
మొదలైంది మరో.. పవర్ గేమ్
బృందం పర్యటన సాగిందిలా.. ఎచ్చెర్ల మండలంలో.. జిల్లాలో మొదటిగా ఈ మండలంలోని ఎస్.ఎం.పురం ప్రాంతంలో పర్యటించింది. భూముల వివరాలతో అధికారులు రూపొందించిన ప్రాథమిక మ్యాప్ ఆధారంగా పరిశీలన జరిపింది. పొందూరు మండలంలో.. అనంతరం పొందూరు మండలంలోని బురిడి కంచరాం, ధర్మపురం, కనిమెట్ట భూములను పరిశీలించింది. భౌగోళిక పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల వివరాలపై ఆరా తీసింది. నరసన్నపేట మండలంలో.. ఉర్లాం, కామేశ్వరిపేట, జల్లువానిపేట, కొత్తపోలవలస, కొల్లవానిపేట గ్రామాల్లో పర్యటించింది. భూముల లభ్యత, పవర్ ప్లాంట్‌కు గల అనుకూలతలను పరిశీలించింది. ఎచ్చెర్ల, పొందూరు, నరసన్నపేట:జిల్లాలో మరో పవర్ గేమ్ మొదలైంది. ఇప్పటికే సోంపేట, కాకరాపల్లి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతుండగా కొత్తగా జపాన్ సంస్థ సుమితొమొ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు స్థల పరిశీలన మొదలైంది. సుమితొమొ-జెన్కో ప్రతినిధుల బృందం మంగళవారం జిల్లాలోని ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల్లోని ప్రతిపాదిత భూములను పరిశీలించింది. తొమ్మిది మంది సభ్యుల జపాన్ బృందంతోపాటు జెన్కో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర్బాబు, ఎస్ఈ రంగనాథం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎల్.సుబ్రమణ్యం, ఎల్.సూర్యనారాయణ తదితర పది మంది సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నరసన్నపేట మండలంలోనూ ఈ బృందాలతో పర్యటించి వివరాలు అందజేశారు. మ్యాప్‌ల ఆధారంగా పరిశీలన మొదట ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం ప్రాంతంలో పర్యటించిన బృందానికి స్థానిక అధికారులు రూపొందించిన మ్యాపు అందజేశారు. ఇందులో ఎస్.ఎం.పురానికి చెందిన 601.02, పొందూరు మండలంలో కనిమెట్టకు చెందిన 746. 40, బురిడి కంచరాంకు చెందిన 438.12, కింతలికి చెందిన 38.71, తోలాపికి చెందిన 190.55, ధర్మపురానికి చెందిన 271.82, నందివాడకు చెందిన 10 4.92 ఎకరాలు.. మొత్తం 2391.55 ఎకరాల భూములను సూచిం చారు. అనంతరం పొందూరు మండలంలోని బురిడికంచరాం,ధర్మపురం, కనిమెట్ట భూములను పరిశీలించారు. భూముల పరిస్థితి, పంటల సాగు, భౌగోళిక పరిస్థితి, తదితర అంశాలను ఆరా తీశారు. అయితే ప్రభుత్వ స్థలం ఉందని అధికారులు చెబుతున్న కొండ ప్రాంతాన్ని మాత్రం జపాన్ బృందం పరిగణనలోకి తీసు కోలేదు. మరోపక్క చెరువు గర్భం 200 ఎకరాలుగా గుర్తించారు. ఎలాగైనా ఈ ప్రాంతంలోనే ప్రాజెక్టు ఖరారు చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్, జెన్కో అధికారులు ప్రయత్నించగా.. జపాన్ బృందం ప్లాంట్, టౌన్షిప్, ఇతరత్రా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థల పరిశీలన చేశారు. పోలీసుల మోహరింపు ఈ పర్యటన సందర్భంగా శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావు నాయుడు, జేఆర్‌పురం సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురం నుంచి ఎస్ఎం పురం వరకు పోలీసులను మోహరించారు.పోలీసులు ముందుగా ఈ ప్రాంత గ్రామాల్లో సివిల్ దుస్తుల్లో తిరుగుతూ పరిస్థితిని ఆరా తీశారు. అయితే ప్రాజెక్ట్‌పై ఇంకా పూర్తిగా అవగాహన లేకపోవడంతో ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎచ్చెర్ల నాయకులు దూరం ఎస్ఎంపురం భూముల పరిశీలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ చౌదరి అవినాష్, ఇదే గ్రామానికి చెందిన జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి తదితరులు హాజరు కాలేదు. బృందం పర్యటన సమాచారం కూడా వీరికి తెలియజేయలేదని తెలిసింది. ఉర్లాం ప్రాంతంలో.. అనంతరం ఈ బృందం మంగళవారం సాయంత్రం నరసన్నపేట మండలంలో పర్యటించింది. ఉర్లాం, కామేశ్వరిపేట, జల్లువానిపేట, కొత్తపోలవలస, కొల్లవానిపేట తదితర గ్రామాల భూములను పరిశీలించారు. ఉర్లాం సమీపంలోని మూర్తిరాజు కాల్వ నుంచి రెండు వైపులా కన్పిస్తున్న పంట భూములను పరిశీలించారు. జపాన్ బృంద నాయకుడు యువమోటోకు జెన్కో ప్రతినిధి సీవీ రంగనాథన్, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, తహశీల్దార్ సుధాసాగర్లు భూముల సమాచారం అందజేశారు. ఈ ప్రాంతంలో 2600 ఎకరాల భూమి ఉందని, దీంట్లో 600 వరకూ ప్రభుత్వ భూమి అని వివంచారు. రెండు కిలోమీటర్ల పరిదిలో రైల్వే స్టేషన్, 23 కిలోమీటర్లు పరిదిలో కళింగపట్నం పోర్టు, ఐదు కిలో మీటర్ల పరిధిలో జాతీయ రహదారి ఉన్నాయని వివరించారు. ప్రధాన నీటి వనరుగా వంశధార నది ఉందని తెలిపారు. అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఆశాజనకంగా ఉంటుందని వివరించారు. వీరి వెంట శ్రీకాకుళం ఆర్డీఓ దయానిధి ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. -
చెత్తలో పేలుడు: ముగ్గురి మృతి
మహారాష్ట్రలోని ఓ పవన విద్యుత్ ప్లాంటులో చెత్త తగలబెడుతుండగా అందులో ఉన్న జిలెటిస్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో్ నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారాలో చోటుచేసుకుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ప్లాంటు ప్రాంగణంలో ఉన్న చెత్తను మండిస్తుండగా అందులోని జిలెటిన్ స్టిక్స్ పేలి ప్రమాదం సంభవించిందని సతారా ఎస్పీ ఎ. దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులను సమీపంలోని సితార ఆస్పత్రికి తరలించామన్నారు. -
నిరాశకు గురిచేసిన సీఎం పర్యటన
కేవలం పవర్ప్లాంటుకే పరిమితం మీడియాకూ దూరంగానే.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి జిల్లాకు వచ్చిన కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారని భావించారు. కానీ.. గురువారం ఆయన పర్యటన కేవలం జైపూర్ విద్యుదుత్పత్తి కేంద్రానికే పరిమితమైంది. జిల్లా ప్రగతి గురించి గానీ, జిల్లాలో నెలకొన్న ప్రధా న సమస్యలను గానీ ప్రస్తావించలేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు పవర్‌ప్లాంటు కు చేరుకున్న సీఎం సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ ప్లాంటులోనే గడిపారు. సింగరేణి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు మంత్రులతో కలిసి రెండు హెలిక్యాప్టర్లలో వచ్చిన సీఎంకు జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ఎం.జగన్మోహన్ తదితరులు ఘనస్వాగతం పలికారు. సుమారు గంటపాటు విద్యుత్ ప్లాంటు నిర్మాణం పనులను పరిశీలించారు. ప్లాంటులోని వివిధ విభాగాలను చూశారు. ప్లాంటు వద్దే అక్కడే బీహెచ్ ఈఎల్, సింగరేణి, ఎన్టీపీసీల ఉన్నతాధికారులతో పనుల ప్రగతిపై సమీక్షించారు. సుమారు మూడున్నర గంటలపాటు ఈ ప్లాంటులో గడిపిన సీఎం మీడియాతో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. సీఎంను కలిసేందుకు వచ్చిన జైపూర్, పెగడాపల్లి, గంగిపల్లి గ్రామస్తులతో కొద్ది సేపు మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసిత కుటుంబాల్లో అర్హులైన వారికి ఈ ప్లాంటులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మంచిర్యాలను జిల్లాగా మార్చుతామని సీఎం కేసీఆర్ మరోమారు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడతామన్నారు. మరోమారు వచ్చి రెండ్రోజులుంటా..! ఈసారి కేవలం విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలించేందుకే వచ్చానని, త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండి, జిల్లా అభివృద్ధిపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌కు ప్లాంటు పర్యవేక్షణ బాధ్యతలు.. జైపూర్ విద్యుదుత్పత్తి కేంద్రం పనుల పర్యవేక్షణ బాధ్యతలను సీఎం కేసీఆర్ కలెక్టర్ ఎం.జగన్మోహన్కు అప్పగించారు. పక్షం రోజులకోసారైనా ప్లాంటు నిర్మాణం పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి సూచించారు. ఈ ప్లాంటులో అదనంగా మరో 600 మెగావాట్లతో యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించిన కేసీఆర్.. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆకస్మికంగా సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాట్లు పూర్తి చేసింది. పర్యటన సజావుగా ముగియడంతో ఊపిరి పీల్చుకుంది. సీఎం కార్యక్రమంలో పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎంపీలు గోడం నగేష్, బాల్క సుమన్, పార్లమెంటరీ సెక్రెటరీ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జి.విఠల్‌రెడ్డి, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాబూరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సింగరేణి సీఎండీ సుదీర్థ బట్టాచార్య, డెరైక్టర్ (పా) రమేష్, బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు, టీఆర్ఎస్ పార్టీ తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్, వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, టీఆర్ఎస్ ముఖ్యనేతలు రాచకొండ కృష్ణారావు, సుద్దమల్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. డీఐజీ ఆధ్వర్యంలో బందోబస్తు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా కరీంనగర్ డీఐజీ మల్లారెడ్డి నేతృత్వంలో ఎస్పీ తరుణ్‌జోషి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏఎస్పీ ఫణిభూషణ్ భారీ బందోబస్తు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాకకు ముందు సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య, జిల్లా కలెక్టర్ జగన్మోహనరావు, పవర్ ప్లాంట్ ఈడీ సంజయ్ సూర్, మంచిర్యాల ఆర్డీవో అయేషాఖానంలు హెలీప్యాడ్ వద్ద సమావేశమయ్యారు. పర్యటన విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. -
ఖమ్మం జిల్లా పవర్ ప్లాంటును నల్గొండ తరలిస్తారా ?
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పవర్ ప్లాంట్‌ను నల్గొండ జిల్లాకు తరలించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లాలో 3200 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూ సేకరణ పూర్తయిందని... ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను నల్గొండకు ఎలా తీసుకెళ్తారని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, విద్యుత్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి అన్యాయం చేశారని ఆరోపించారు. మంజూరైన విద్యుత్ ప్లాంట్‌ను కూడా నిర్మించకుండా ఇతర జిల్లాకు తరలిస్తే ఖమ్మం జిల్లా మరింత నష్టపోతుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ మరో జిల్లాకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి తుమ్మలకు ఈ సందర్భంగా పొంగులేటీ సూచించారు. -
ఎన్నికల హామీలు అమలు చేయాలి
వైఎస్ఆర్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి మణుగూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మణుగూరు, పినపాక మండలాల్లో పర్యటించి విద్యుత్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మణుగూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, వాటివల్ల నష్టపోతున్న ప్రజలకు, రైతులకు సరైన న్యాయం చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని అన్నారు. అభివృద్ధి పేరుతో పవర్ ప్రాజెక్టులు నిర్మించి పేదల నెత్తిన బూడిద పోస్తే సహించేది లేదని హెచ్చరించారు. భూముల రకాన్ని బట్టి పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులవుతున్న వ్యవసాయ కూలీలకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని సక్రమంగా అమలు చే యాలని డిమాండ్ చేశారు. పత్తి, వరి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసి, ఎలాంటి షరతులు లేకుండా క్వింటాకు రూ.4,500 చెల్లించాలని కోరారు. కోల్ ఇండియాలో అమలు చేస్తున్న వేతనాలను సింగరేణిలో కూడా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెంచిన పింఛన్లు అందరికీ అందేలా చూడాలని అన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, కొదమసింహం పాండురంగాచార్యులు తదితరులు ఉన్నారు. -
గోదారున్నా... గొంతెండుతోంది
తలాపునే గోదావరి. పక్కనే ఎన్టీపీసీ. పరిధి కార్పొరేషన్. విద్యుత్‌ప్లాంట్ సమీపంలోనే 12 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి ట్యాంకు. ఇంకేం... ఆ కాలనీ ప్రజలకు 24 గంటలు తాగునీరు... సౌకర్యాలకు ఏ కొదవా లేదనుకుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లభించవు. డ్రెయినేజీ సమస్య, బహిర్భూమికి బయటకెళ్లాల్సిందే. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆదివారం ఉదయం నర్రశాలపల్లి, రామయ్యపల్లి, మల్కాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. -గోదావరిఖని సోమారపు సత్యనారాయణ : బాగున్నారా...? శాలపల్లిలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? లక్ష్మి : మీదికి మంచిగనే ఉన్నం సారు... కానీ, మాకు చెప్పలేని బాధలున్నయ్. తాగే నీళ్లకు చానా తప్పలైతంది. పైపులైన్లు ఉన్నట్టే గని నీళ్లు మాత్రం వస్తలేవు. చాలా ఏండ్ల సంది నీళ్ల కోసం అరిగోసపడుతున్నం. సోమారపు : ఇది ఎన్టీపీసీ పునరావాస ప్రాంతం కదా..? వాళ్లు పట్టించుకుంటలేరా? రాధ : మా భూములు ఎన్టీపీసీకి అప్పగించినా... వారికి మా గురించి పట్టింపులేదు. ఊళ్లె రెండు చోట్ల ప్లాస్టిక్ ట్యాంకులు పెట్టి తాగేనీళ్లు ఇస్తమన్నరు. ఇప్పటికి ఏదీ లేదు. సోమారపు: కార్పొరేషన్ నుంచి నీళ్లు వస్తలేవా? లక్ష్మీ : ట్యాంకర్లు పంపిస్తున్నరు. గింతమందికి అవి ఏ మూలకు సరిపోతయ్ సారూ... కొంత మందికే సరిపోతున్నయ్. మిగతావాళ్లం నిన్నమొన్నటి నీళ్లతోనే సరిపెట్టుకుంటున్నం. సోమారపు : ఏం బాబూ ఏం చదువుతున్నవ్? బొద్దుల వెంకటేశ్ : సార్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నా. శాలపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నట్టేగానీ గ్రామ పంచాయతీలో ఉండే సౌకర్యాలు కూడా లేవు. ఎన్టీపీసీ దత్తత గ్రామమని చెబుతున్నా వాళ్లెప్పుడూ పట్టించుకోలేదు. పిల్లలకు కనీసం ఆడుకునేందుకు ఆట స్థలాలు కూడా లేవు. సోమారపు అమ్మా పెన్షన్ ఇస్తున్నరా? రాసకొండ విజయలక్ష్మి: సార్, మొన్నటిదాక పింఛిన్ వచ్చింది. ఇప్పుడింకా ఇవ్వలేదు. చిన్న దుకాణం పెట్టుకుని బతుకు ఎల్లదీత్తున్న. బ్యాంకు లోను ఇప్పియ్యండి సార్. సోమారపు : బ్యాంకు వాళ్లతో, మహిళా సంఘాలతో మాట్లాడి రుణం ఇప్పిస్తానమ్మా. సోమారపు : బాబూ... ఏం పనిచేస్తున్నవ్? వెంకటేశ్వర్లు : నేను ఎన్టీపీసీలో క్యాజువల్ లేబర్‌ను. సార్, ఇక్కడ నీళ్ల సమస్య ఎక్కువున్నది. డ్యూటీకి పోయి వచ్చినంక మళ్ల నీళ్ల డ్యూటీ చేసుడు. బాగా ఇబ్బందైతంది. పక్కనే గోదావరి నది పారుతున్నా మాకు గుక్కెడు నీళ్లు ఇస్తలేరు. ఇటు ఎన్టీపీసోళ్లుగానీ, అటు కార్పొరేషనోళ్లు గానీ పట్టించుకుంటలేరు. మమ్ముల్ని ఇట్లనే బతుకుమంటరా? సోమారపు : బాబూ.. నీ బాదేంది ? నంబయ్య : సార్, ఇంటి ముందట మురుగు కాల్వతో ఇబ్బంది పడుతున్నం. పందులతో రోజూ పరేషాన్ అయితంది. జరాలొచ్చి సచ్చిపోతున్నం. జర పట్టించుకోండి సార్. సోమారపు : అమ్మా.. మంచిగున్నరా? వెంకటతార : నాకు ఇల్లు లేదు. కిరాయికుంటు న్న. ఆధార్‌కార్డు లేదని రేషన్ బియ్యం పోత్తలే రు. నలుగురు ఆడపిల్లలు. బతుకు ఎల్లదీస్తన్న. ఇంట్ల మూగపిల్ల ఉన్నది. ఆమెకు పెన్షన్ ఇస్తలేరు. సాయం చేయండి. నీ కాళ్లుమొక్కుత. సోమారపు : తప్పకుండా అధికారులకు చెప్పి పెన్షన్ ఇప్పిస్తానమ్మా. సోమారపు : నువ్వే కాల్వలు తీస్తున్నవేంది? చిలుముల గట్టయ్య : ఇండ్ల ముందట కట్టిన ఓపెన్ డ్రెయినేజీలల్ల చెత్త నిండిపోతంది. కార్పొరేషన్ వాళ్లు ఎప్పుడస్తరో తెల్వది. ఒగలమీద ఆధారపడితే పనికాదు కదా! అందుకే నేనే తీసుకుంటన్న. సోమారపు : బాబూ! బోరు సరిగ్గా పని చేస్తుందా? రామయ్య : పనిచేస్తంది సార్. ఈ బోరే మాకు దిక్కు. కార్పొరేషనోళ్లు, ఎన్టీపీసోళ్లు మంచినీళ్లను పంపుతలేరు. ఈ బోర్ నీళ్లనే తాగుతున్నం. ఇవి ఎట్లున్నా తాగక తప్పుతలేదు. రోడ్డుకుపోయి రోజు నీళ్లు తెచ్చుకునుడు కష్టమైతంది. ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చినా అవి కొంత మందికే సరిపోతున్నయ్. సోమారపు : ఇంటింటికి మరుగుదొడ్లు లేవా ? లింగయ్య : లేవు సార్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ లేక అందరూ బహిర్భూమికి బయటకే వెళ్తున్నరు. అంతకుముందు ఖాళీ జాగా బాగనే ఉండేది. పట్టాలున్నొళ్లు వాళ్ల జాగల చుట్టూ గోడలు కట్టుకున్నరు. ఇప్పుడు బహిర్భూమికి వెళ్లాలంటే చాలా దూరం పోవాల్సిందే. సోమారపు : అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే మరుగుదొడ్లు కట్టుకుంటరా? గట్టయ్య : మాకంత స్థోమత లేదు సార్. ఏదైనా స్కీం కింద మరుగుదొడ్లు కట్టించెటట్లు చూడుండి. అక్కడక్కడ చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేయించుండ్రి. సోమారపు : ఏమమ్మా... మీదేం సమస్య ? నంద స్వరూప : రామయ్యపల్లె ఉన్నదా అంటే ఉన్నదన్నట్టుగానే ఉంది. కాల్వలు లేవు. చెత్త బండి వస్తలేదు. పక్కనే గోదావరి పారుతున్నా మంచినీళ్లు లేవు. మొన్న నెల రోజుల క్రితం నీళ్లను పంపించినట్టే చేసిండ్రు. మళ్ల ఇప్పుడు వస్తలేవు. ఎవలన్న ఒకలు పనికిపోకుండ ఉంటేనే బయటకుపోయి నీళ్లు తెచ్చుకునుడు. లేకపోతే బాయినీళ్లే దిక్కు. సోమారపు: సింగరేణివల్ల ఇబ్బందులున్నయా? ఎండి రహీం : పక్కనే మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ఉంది. ప్రతీ రోజు బొగ్గు కోసం బ్లాస్టింగ్ చేస్తుంటే ఆ ధాటికి మా ఇళ్లు కదులుతున్నయ్. చాలా ఇళ్లు పగుళ్లు తేలి ఎప్పుడు కూలుతాయో అన్నట్లుగా భయం భయంగా ఉంది. సోమారపు : కార్పొరేటర్‌గా ఈ ప్రాంత సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ? వెంగల పద్మలత : 5వ డివిజన్ పరిధిలోని చాలా సమస్యలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన. ముఖ్యంగా ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు వద్ద ట్యాంకు నిర్మించి ఐదేళ్లవుతున్నా ఇక్కడి ప్రజలు తాగునీటికి నోచుకోలేదు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ లేక చాలా మంది బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నా గ్రామస్థాయి సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. -గోదావరిఖని ఎమ్మెల్యే హామీలు శాలపల్లి, రామయ్యపల్లి, మల్కాపురం గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్‌కు మరమ్మతు చేయిస్తా. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కొత్తగా పైప్లైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా. శాలపల్లిలో ఎన్టీపీసీ పునరావాసం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా యాజమాన్యంతో చర్చిస్తా.ఈ మూడు గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాన్ని ఎన్టీపీసీ యాజమాన్యంతో చేయించేలా చూస్తా. ఓపెన్ డ్రెయినేజీల్లో కాలువలు కుంగిపోతే ఇంజినీర్లతో చెక్చేయించి తిరిగి నిర్మింపజేయిస్తా. చెత్త తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులతో మాట్లాడుతా.గోదావరి నది ప్రస్తుతం ఎండిపోతున్నందున భవిష్యత్‌లో ఇబ్బంది ఉండకుండా ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు వస్తున్న నీటిని ఎన్టీపీసీ సిస్టర్న్ నుంచి గ్రావిటీ ద్వారా కార్పొరేషన్‌కు తాగునీరు అందించేందుకు రూ.48 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఆ నిధులు మంజూరైతే కార్పొరేషన్‌తోపాటు గ్రామాల్లో కూడా నీటికి ఇబ్బందులుండవు. -
అమ్మో.. థర్మల్!
ఎచ్చెర్ల: జాతీయ రహదారికి ఆనుకొని రెండు మండలాల సరిహద్దుల్లో ఉన్న ప్రశాంత వాతావరణంలో ఉన్న పల్లెలు కొద్దిరోజులుగా ఆ ప్రశాంతతకు దూరమయ్యాయి. ఏదో తెలియని ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తమ గుండెలపై థర్మల్ కుంపటి పెడతారేమోనన్న ఆలోచనే వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం, పొందూరు మండలం ధర్మపురం గ్రామాల మధ్య ఉన్న కొండపై ఇటీవల స్థలపరిశీలన జరిపిన ఉన్నతాధికార బృందం ఈ ప్రాంతం ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉందని ప్రకటించినప్పటి నుంచి స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడి ప్రకృతి వనరులు దెబ్బతింటాయంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.సంస్థలు, రైతుల ఆధీనంలో.. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ నుంచి పెద్ద చెరువు వరకు అధికారులు పరిశీలించిన కొండ విస్తరించి ఉంది. అక్కడి నుంచి పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన కొండ ఆవరించి ఉంది. ఎస్.ఎం.పురం పరిధిలో 112 సర్వే నెంబర్, ధర్మపురం పరిధిలో 05 సర్వే నెంబర్లో సుమారు 1500 ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పటికే ఎస్ఎం పురం పరిధిలోని కొండ ప్రాంత భూముల్లో అంబేద్కర్ వర్సిటీ, శ్రీ వెంకటేశ్వరా గ్రూప్ కళాశాలలు, ఎచ్చెర్ల ఐటీఐ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, 21వ శతాబ్ది గురుకులం, రాజీవ్ స్వగృహ, ఎస్ఎంపురం ఏపీ గురుకుల పాఠశాల.. ఇలా పలు ప్రభుత్వ, ప్రైవే టు సంస్థలకు ప్రభుత్వం సుమారు 300 ఏకరా లు కేటాయించింది. గతంలో సామాజిక అటవీశాఖ పరిధిలో ఉన్న ఈ భూముల్లో పలువురు రైతులకు పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు స్థలాలు కేటాయించటంతో ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఆ ప్రాంతంలోనే వేరే చోట పట్టాలు ఇచ్చారు. అలా గే ఇందిరప్రభ లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. ఇంకోపక్క వాటర్‌షెడ్‌లో భాగంగా ఇక్కడి కొండలను ఆర్ఐడీఎఫ్ సంస్థ అభివృద్ధి చేసి మొక్కలు నాటింది. ఇక్కడి జీడి, మామిడి తోటలు సైతం రైతుల ఆధీనంలో ఉన్నాయి. మొత్తం మీద ఎస్ఎం.పురం, దర్మవరం ప్రాంతాల పరిధిలో సుమారు 400 మంది రైతులకు గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయి. వారందరికీ సాగుహక్కు ఉంది. పెద్ద చెరువు కింద 500 ఎకరాలు కాగా ఇదే ప్రాంతంలో ఉన్న ఎస్.ఎం.పురం పెద్ద చెరువు కింద 500 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ చెరువుకు మడ్డువలస ప్రాజక్టు నీరు తరలిస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వాలళు హామీ ఇస్తు న్నా కార్యరూపం దాల్చలేదు. ఫరీదుపేట, ఎస్.ఎం.పురం. కనిమెట్ట తదితర గ్రామాల సాగుభూములు ఈ చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. పక్కా జిరాయితీ భూములైన వీటిలో ప్రతి ఏటా వరితోపాటు ఆరుతడి పంటలు, కూరగాయలు విస్తారంగా సాగు చేస్తున్నారు. మడ్డువలస నీరు తరలిస్తే ఇంకా మంచి పంటలు పండే అవకాశం ఉంది. ఈ పరిస్థితులో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదనతో రెండు మండలాల్లోని సుమారు పది గ్రామాల రైతులు ఉలిక్కిపడ్డారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఏస్తే కాలుష్యంతో వ్యవసాయం కనుమరుగవుతుందని ఆందోళన చెందుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా, దళిత సం ఘాలు పోరాటానికి సైతం సిద్ధమవుతున్నాయి. -
రగులుతున్న బీల
ప్రశాంత బీల మళ్లీ రగులుతోంది. ఉద్యమానికి కదం తొక్కుతోంది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న అరుదైన చిత్తడి నేలల్లో పారిశ్రామిక నిర్మాణాలు వద్దని ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా.. మెత్తబడని సర్కారు తీరుపై మండిపడుతోంది. ఇప్పటికే ఎన్సీసీ విద్యుత్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలంటూ ఉద్యమం జరుగుతోంది. 1107 జీవో రద్దు చేస్తామని ఎన్నికల ముందు.. ఆ తర్వాత కూడా మురిపిస్తూ వస్తున్న టీడీపీ సర్కారు.. దాన్ని విస్మరించి అవే చిత్తడి నేలల్లో మరో విద్యుత్ కుంపటి పెట్టడానికి సిద్ధం కావడం బీల పల్లెలను భయాందోళనలకు గురి చేస్తోంది. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పర్యావరణ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సోంపేట, కవిటి మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. సంతబొమ్మాళి: ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటుకు చెందిన ఎమ్డీ, డెరైక్టర్లు, బ్యాంకు అధికారులు వచ్చారన్న సమాచారంతో వడ్డితాండ్ర థర్మల్ మెయిన్ గేటు ముందు మత్స్యకారులు శనివారం బైఠాయించి శాంతియుతంగా నిరసనను తెలిపారు. థర్మల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో టెక్కలి సీఐ రమణమూర్తి, నౌపడ, సంతబొమ్మాళి ఎస్ఐలు రాజేష్, కృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది మెయిన్ గేటు ముందు మోహరించారు. ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు మాట్లాడుతూ ప్రజా వినాశనం చేసే థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా 2007 నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ఆర్డీవో నుంచి రాష్ట్రపతి వరకు వినతి పత్రాలందించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంపరలో థర్మల్ ప్లాంటు నిర్మాణం వ ల్ల రైతులు, మత్స్యకారులు, ఉప్పు కార్మికులు వీధిన పడుతున్నారన్నారు. సోంపేట పోలీస్ కాల్పుల అనంతరం 2011 మార్చి 2న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వడ్డితాండ్ర వచ్చి థర్మల్ ప్లాంటును రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు సీఎం హోదాలో ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. సోంపేటలో థర్మల్ను రద్దు చేస్తానని చెప్పి బారువలో నాలుగు వేల మెగా ఓట్ల థర్మల్ ప్లాంటును నెలకొల్పుతానని బాబు చెప్పడం దారుణమన్నారు. ఇలా డీఎస్పీ దేవప్రసాద్ ముందు మత్స్యకారులు తమ వినిపించారు. అంతకుముందు ఒడ్డితాండ్ర రిలే దీక్షా శిబిరం నుంచి ప్లాంటు మెయిన్ గేటు వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. పోరాట కమిటీ నాయకులు ఎన్.వెంకటరావు, కారుణ్య ఖత్రో, అనంతు దుర్యోధన, కారుణ్య కేశవ, మత్స్యకార మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రామగుండంలో 600 మె.వా. జెన్కో ప్లాంట్
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం బీ-థర్మల్ విద్యుత్ కేంద్రంలో జెన్కో ఆధ్వర్యంలో మరో 600 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు జెన్కో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం స్థానిక జెన్కో ఎస్ఈ సూర్యనారాయణకు ఉత్తర్వులు అందాయి. నూతన కేంద్రం ఏర్పాటుకు 522 ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. వారంలోగా పూర్తి నివేదికలను జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుకు పంపిస్తామని ఎస్ఈ తెలిపారు. -
నాలుగేళ్లలో నాలుక మడతడింది!
రణస్థలం: నాలుగేళ్లలో చంద్రబాబు నాలుక మడతపడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు.. చేసిన హెచ్చరికలు మడమ తిప్పాయి. కొవ్వాడలో ప్రతిపాదించిన అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి మరోమారు బయటపడింది. ఇందుకు నిరసనగా ఆందోళనకు ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. అణుపార్కు ఏర్పాటును స్థానికులు, మత్స్యకారులు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ప్లాంటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టి ఏడాదిపాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా 2010 సెప్టెంబర్ ఆరో తేదీన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులైన ప్రస్తుత సర్పంచ్ మైలపల్లి పోలీసు, ఇతర నాయకులు కొవ్వాడలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అణు వ్యతిరేక ఉద్యమానికి టీడీపీ బాసటగా ఉంటుం దని స్పష్టం చేశారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పు డు టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు అణు పార్కు ప్రతిపాదన రద్దుకు ప్రయత్నించకపోగా ఆ ప్లాంట్ ఏర్పా టుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల ఆరో తేదీన మున్సిపల్ పరి పాలన శాఖ జీవో నెం.186 జారీ చేయడం సరికొత్త ఆందోళనలకు తెర తీసింది. కొవ్వాడ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరించారు. ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రజల నివాసం, నిర్మాణాలు తదితరాలపై ఆంక్షలు విధించడంతో అణు పార్కు నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమైపోయింది. వాస్తవానికి అణు ఉద్యమం విషయంలో టీడీపీ మొదటినుంచీ సైంధవ పాత్రనే పోషిస్తోంది. పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గతంలో ఉద్యమ నేతలకు చెప్పకుండానే ఏకపక్షంగా దీక్షలు చేస్తున్న వారికి నిమ్మ రసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఇదే కాకుండా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు టీడీపీ నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి తోడకావడంతో స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీల తీరుపై ముఖ్యమంత్రి సమక్షంలోనే నిరసన వ్యక్తం చేయాలని స్థానిక మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న రణస్థలం మండలంలో ఆయన పర్యటించనుండగా, ఆ సందర్భంగా ఏదో ఒక చోట ఆందోళన చేపట్టాలని వారు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చడం పై చంద్రబాబును నిలదీస్తామని అంటున్నారు. 2010 సెప్టెంబర్ 6.. అది కొవ్వాడ గ్రామం.. టీడీపీ ఆధ్వర్యంలో భారీ సభ.. పాల్గొన్న నేత అప్పటి ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధినేత చంద్రబాబు.. అప్పుడు ఆయన ఏమన్నారంటే.. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదు. అణు ప్లాంట్ పెట్టి శ్రీకాకుళం జిల్లాను నాశనం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అణు ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రతి ఉద్యమం వెనుకా మా పార్టీ ఉంటుంది.. అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత.. 2014 సెప్టెంబర్ 6.. కొత్తగా అధికారంలోకి వచ్చిన అదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జీవో నెం.186 జారీ చేసింది. కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా చుట్టుపక్కల 30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, ప్రాంతాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరించి.. జనావాసాలు, నిర్మాణాలు, భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడం ఈ జీవో సారాంశం. -
మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్: జెన్కో సీఎండీ
వరంగల్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్ సరఫరా వీలవుతుందని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. వరంగల్ నగర శివారులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మించిన 100 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ర్టంలో 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా 130 మిలియన్ యూనిట్లు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు. -
వ్యర్థాలకు అర్థం..!
నోయిడా, గ్రేటర్ నోయిడా పరిసర వాసులు విద్యుత్ కొరత, కోత సమస్యలనుంచి కొంతమేర బయటపడే తరుణం సమీపిస్తోంది. ఇందుకు కారణం వ్యర్థాలనుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దిశగా నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే అథారిటీలు అడుగులు వేస్తున్నాయి.దీంతోపాటు ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. నోయిడా: మరో రెండు సంవత్సరాల్లోగా జిల్లాలో తొలి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టును నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. దీని అంచనా వ్యయం రూ. 260 కోట్లు. 2016 నాటికల్లా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ఈ మూడు సంస్థలు యోచిస్తున్నాయి. జిల్లాలో ప్రతిరోజూ ప్రతిరోజూ 1,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. నోయిడా వార్షిక బడ్జెట్ కేవలం రూ. 100 కోట్లే అయినప్పటికీ ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు దాదాపు 1,600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక అనేక ప్రాంతాల్లో చెత్తను ఎక్కడ పారేయాలనేది పెద్ద తలనొప్పిగా పరిణమించింది. 40 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించినప్పటికీ వ్యర్థాలను పారవేసేందుకు తగినంత స్థలం లేకపోవడం గమనార్హం. ఈ విషయమై ఈ ప్రాజెక్టు ఇన్చార్జి సమకంత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘వరుసగా నాలుగోసారి కూడా టెండర్లను పిలిచాం. ఇది పర్యావరణ అనుకూల ప్రాజెక్టు. ఒక సంస్థ తన బిడ్‌ను మాకు దాఖలు చేసింది. సాంకేతిక బిడ్‌ను మా నిపుణుల బృందం పరిశీలించింది. టెండర్ కమిటీ నుంచి అనుమతి లభించగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ కన్సల్టెంట్‌ను నియమిస్తాం’ అని అన్నారు. మరో రెండు సంవత్సరాలలోగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కాగా విద్యుత్ కొరత సమస్యతో సతమతమవుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం అత్యంత కీలకమని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ప్రాజెక్టును నిర్మించాలని, దీనిద్వారా పది మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఐదేళ్లలోగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికైన పెట్టుబడి తిరిగి వస్తుందని ఆశిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. -
25 ఏళ్లు పూర్తయిన విద్యుత్ ప్లాంట్లు మార్పు
న్యూఢిల్లీ: దేశంలోని విద్యుత్ ప్లాంట్లలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వాటన్నిటినీ మార్చనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిని అధునాతనమైన, పర్యవరణ హితమైన విద్యుత్ ప్లాంట్లుగా అభివద్ధి చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయల్ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన సమస్యలకు ఆయన సమాధానం ఇస్తూ.. తరచు బ్రేక్డౌన్లకు గురికావడం, సక్రమంగా పనిచేయకవపోడం, కాలుష్యం తదితర కారణాలతో 25 ఏళ్లు పూర్తయిన పవర్ ప్లాంట్లను మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినకుండా దశల వారీగా ఈ ప్లాంట్లను మార్పు చేస్తామన్నారు. విద్యుత్ ప్లాంట్ల మార్పునకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. విద్యుత్ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చామని, ఈ రంగంలో పెట్టుబడుల పెరుగుదలను ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సగం వరకూ తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జూలై 30 నాటికి 46 థర్మల్ పవర్ ప్లాంట్లలో ఏడు రోజుల కంటే తక్కువ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని, వీటిలో 23 ప్లాంట్లలో 4 రోజులకు సరిపడ నిల్వలే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
కోడి ‘పవర్’
కోళ్ల వ్యర్థాలతో విద్యుత్ పలమనేరు వద్దరూ.50 కోట్లతో నిర్మాణం రోజుకు 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రైతులకు నాణ్యమైన విద్యుత్ 300 మందికి ఉపాధి అవకాశం రెండు నెలల్లో ప్లాంట్ ప్రారంభం పలమనేరు: కోళ్ల వ్యర్థాలతో విద్యుత్ తయారయ్యే భారీ పవర్‌ప్లాంట్ మరో రెండు నెలల్లో జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ కర్మాగారానికి సంబంధించిన నిర్మాణ పనులు పలమనేరులో జోరందుకున్నాయి. రాష్ట్రంలో భారీ పవర్‌ప్లాంట్ ఇదే కోళ్లవ్యర్థాలతో విద్యుత్ తయారయ్యే భారీ పవర్ ప్లాంట్ రాష్ట్రంలో ఇదే ప్రథమం. ఇక్కడ రోజుకు 7.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రుత్విక్ పవర్ ప్రాజెక్టు ఇదే తరహాలో ఉన్నా దానికి ఇంత సామర్థ్యం లేదు. ఇదిలావుండగా చిత్తూరు జిల్లాలో నెలలో 1.40 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోనే 37 లక్షల కోళ్లను సంరక్షిస్తున్నారు. ఇక్కడ కోళ్లవ్యర్థాలను సేకరించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే తలంపుతో ఈ పరిశ్రమను నిర్మిస్తున్నారు. రోజుకు 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈ ప్లాంట్‌లో రోజుకు 300 టన్నుల కోళ్లవ్యర్థాలతో 7.5 మెగావాట్ల (1.80 లక్షల యూనిట్ల) విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో పది శాతం ప్లాంట్ అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు అనుసంధానం చేస్తారు. ఇప్పటికే 15 నెలలుగా ఈ పనులు సాగుతున్నాయి. 7.5 మెగావాట్ల ప్రాజెక్టుకు 55 లక్షల కోళ్లవ్యర్థాల అవసరముంటుంది. దీంతోపాటు వరిపొట్టు, వేరుశెనగ పొట్టు, కొబ్బరి పీచును ఉపయోగించనున్నారు. ఓ యూనిట్ కరెంటును తయారు చేసేందుకు రెండు కిలోల వ్యర్థాలను వాడాల్సి ఉంటుంది. కోళ్లపెంపకందార్లకు ఎంతో ఆసరా గంగవరం, పరిసరప్రాంతాల్లోని దాదాపు 400 మంది కోళ్ల రైతులకు ఈ యూనిట్ వల్ల ప్రతి నెలా లాభం చేకూరనుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కోళ్ల వ్యర్థాలు టన్ను ధర రూ.750 పలుకుతోంది. పవర్‌ప్లాంట్ ప్రారంభమైతే ఈ ధర రెట్టింపవుతుందని రైతులు ఆశపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో మరెన్నో లాభాలు ఇన్నాళ్లూ రైతులు కోళ్ల వ్యర్థాలను పంటలకు ఎరువుగా వాడేవారు. ఇకపై ఇదే వ్యర్థాల ద్వారా కరెంటు తయారయ్యాక మిగిలే బూడిదను రైతులు ఎరువుగా వాడుకోవచ్చు. ఇందులో పాస్ఫరస్, పొటాష్ తగిన మోతాదులో ఉంటాయి. ఈ బూడిదను ఇటుకల తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, ఏజెంట్లు, ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా 300 మందికి ఉపాధి లభించనుంది. రైతులకు నాణ్యమైన విద్యుత్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో లో ఓల్టేజీ సమస్య ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే 7.5 మెగావాట్లలో పది శాతం పోను మిగిలింది ట్రాన్స్‌కోకు విక్రయించనున్నారు. ఫలితంగా రైతుకు నాణ్యమైన విద్యుత్, ఇళ్లకు 24 గంటల విద్యుత్ అందించవచ్చు. ఇక్కడ విద్యుత్‌ను ఎలా తయారు చేస్తారంటే ఇక్కడ నిర్మించిన రెండు వేర్వేరు షెడ్లలో కోళ్లవ్యర్థాలు, వరిపొట్టును ప్రత్యేక బెల్టుల ద్వారా కాల్చుతారు. దీనికోసం భారీ ఎకనమైజర్ను ఉపయోగించి హీట్ రికవరీ యూనిట్ ద్వారా టర్బైన్ తిరిగేలా చేస్తారు. కరెంటు ఉత్పత్తై ఎలక్ట్రానిక్ ప్యానెల్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. స్టీమ్ తయారీ కోసం భారీ బ్రాయిలర్స్ను వాడుతున్నారు. ఎకనమైజర్ యూనిట్లో ఎయిర్ హీటింగ్, వాటర్ హీటింగ్లున్నాయి. ఈ కరెంటు ఉత్పత్తి కోసం గంటకు 60 వేల లీటర్ల నీరు అవసరం. అయితే అంత అందుబాటులో లేకపోవడంతో ఉన్న నీటితోనే యూనిట్ నడిచేందుకు రూ.5 కోట్ల వ్యయంతో ఎయిర్‌కూల్ కండెన్సర్లను వాడుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు వెళ్లేందుకు 55 మీటర్ల ఎత్తుగల చిమినీని నిర్మించారు. ఇక్కడ తయారయ్యే కరెంటును స్టెప్ అప్, స్టెప్డౌన్లను సరిచేసే ప్లాంట్ స్విచ్‌యార్డ్‌కు పంపించి అక్కడి నుంచి విద్యుత్ తీగల సాయంతో యూనిట్‌కు సమీపంలోని మేలుమాయి 33 కేవీ సబ్‌స్టేషన్‌కు పంపుతారు. గంగవరం మండలంలో అవసరాలు తీరాక పలమనేరు పట్టణానికి విద్యుత్ సరఫరా చేయాలంటే అక్కడి నుంచి పట్టణంలోని 132, 220 కేవీ సబ్ స్టేషన్లకు ఈ విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ఈ యూనిట్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. సీమాంధ్రలో ఇదే భారీ ప్రాజెక్టు పౌల్ట్రీబేస్డ్ పవర్ప్లాంట్లు ఎంతో ఉపయోగం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశంలో ఇలాంటివి ఐదు దాకా ఉన్నాయి. ఏపీలో అయితే ఇదే భారీ ప్రాజెక్టు. ఇక్కడున్న ముడిసరుకుల లభ్యతతో యూనిట్ కాస్ట్ రూ.5 వరకు అవుతుంది. మరో రెండు నెలల్లో కరెంటును ఉత్పత్తి చేసి ట్రాన్స్‌కోకు అందజేస్తాం. -బీ.వెంకయ్య, టెక్నికల్ డెరైక్టర్, రెడన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ లోవోల్టేజీ సమస్య తీరినట్టే ఈ ప్రాంతంలో లో వోల్టేజీ సమస్య తీరనుంది. కోళ్ల రైతులకు ప్రతినెలా అదనంగా డబ్బులొచ్చినట్టే. -రాంబాబు, జనరల్ మేనేజర్,ఆపరేషన్, రెడన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కరెంటు సమస్య తీరినట్టే ప్రస్తుతం పలమనేరు పట్టణానికి రోజుకు 5.5 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ ఫ్యాక్టరీ నుంచి మాకు రోజుకు 7.4 మెగావాట్లు అందినా గంగవ రం, పలమనేరు మండలాల్లో పూర్తిగా కరెంటు సమస్య తీరినట్టే. -రాజశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏడీ, పలమనేరు -
స్థానికులకు ఉద్యోగాలేవీ?
జేపీ పవర్‌ప్లాంట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు, నిరుద్యోగుల ఆందోళన బూదవాడ (జగ్గయ్యపేట) : గ్రామంలో సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా వేరే రాష్ట్రాల వారికి ఇస్తున్నారని, గ్రామాభివృద్ధికి యాజమాన్యం చొరవ చూపడం లేదని గ్రామస్తులు అధికారుల ముందు వాపోయారు. గ్రామంలోని రామపురం రోడ్డులో జేపీ సిమెంట్స్ ఆధ్వర్యంలో 25మెగావాట్ల బొగ్గు ఆధారిత క్యాప్టీవ్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం (పవర్‌ప్లాంట్) ఏర్పాటుకు గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి ప్రభావతి, విజయవాడ సబ్ కలెక్టర్ హరిచందన, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పివిఎల్జి.శాస్త్రి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామంలో ఐదు సంవత్సరాల క్రితం జేపీ సిమెంట్స్ ఫ్యాక్టరీ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారని, నిర్మాణం సమయంలో భూములు అమ్మిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని యాజమాన్యం ఇచ్చిన హామీని విస్మరించందన్నారు. ప్రస్తుతం నిర్మాణం చేపట్టే పవర్‌ప్లాంట్ ద్వారా గ్రామానికి ఉచిత విద్యుత్, గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యంతోపాటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలకు, ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్‌కు యాజమాన్య ప్రతినిధులు స్పందించకపోవడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. గ్రామస్తులు, నిరుద్యోగులు, మహిళలు ఒక్కసారిగా ముందుకు రావడంతోపాటు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. డీఆర్వో ప్రభావతి మాట్లాడుతూ ప్రజలు చెప్పిన సమస్యలన్నింటినీ లిఖిత పూర్వకంగా నమోదు చేసుకున్నామని, యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ కోరడంతో యాజమాన్యం తర ఫున ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం.సూరి అభివృద్ధికి కొంత సమయం పడుతుందని, ఏడు గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్నామని అందరికీ న్యాయం చేస్తామని చెబుతుండటంతో ప్రజలు కోపోద్రిక్తులై నినాదాలు చేశారు. తహసీల్దార్ వరహాలయ్య, డీటీ భోజరాజు, ఆర్ఐ వెంకటేశ్వరరావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, ఫ్యాక్టరీ డెరైక్టర్ నవీన్‌సింగ్, సర్పంచి బాబురావు, ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం సైదమ్మ, వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్, తెలుగు యువత నాయకులు శ్రీరాం చిన్నబాబు పాల్గొన్నారు. -
ఏపీ మొత్తం అంటోంది... మీరు వాటా అడుగుతున్నారు..?
తెలంగాణ డిస్కంల ముందు హిందుజా సంశయం మాకూ వాటా ఉందన్న టీ డిస్కంలు ముసాయిదా పీపీఏ అందజేత సాక్షి, హైదరాబాద్: తమ ప్లాంటులో ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ను తమకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంటోందని... వాటా మేరకు 53.89 శాతం విద్యుత్ మాకు ఇవ్వాలని మీరు అడుగుతున్నారని.. తాము ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదని తెలంగాణ ఇంధనశాఖ వర్గాల ముందు హిందుజా సంస్థ ప్రతినిధులు వాపోయినట్టు సమాచారం. విశాఖ సమీపంలో 1,040 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును హిందుజా నిర్మిస్తోంది. ఈ ప్లాంటుతో ఉమ్మడి రాష్ట్రంలోనే గతేడాది మే 17న నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోఏ)ను కుదుర్చుకున్నాయి. ఇందుకనుగుణంగా తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకునేందుకు రావాలని హిందుజా సంస్థను తెలంగాణ డిస్కంలు (టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్) ఆహ్వానించాయి. ఈ మేరకు సంస్థ వైస్‌ప్రెసిడెంట్ (కమర్షియల్) సిద్దార్థ దాస్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అభిషేక్ దాస్‌లు తెలంగాణ ఇందనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషితో పాటు ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీతో గురువారం సమావేశమయ్యారు. హిందుజా సంస్థ ప్రతినిధులకు ముసాయిదా పీపీఏను అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా హిందుజా ప్రతినిధులు తమ సందేహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, రెండు రాష్ట్రాల్లోని డిస్కంలకు ఏ వాటా మేరకు విద్యుత్ సరఫరా జరగాలన్న విషయంలో ఉమ్మడి రాష్ర్టంలోనే జీవో నం 20 జారీ అయిందని హిందుజా సంస్థ ప్రతినిధులకు తెలంగాణ అధికారులు సమాధానమిచ్చారు. సదరు జీవో కాపీని కూడా వారికి అందజేశారు. ముసాయిదా పీపీఏపై తమ న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం వారం రోజుల్లో తిరిగి వస్తామని హిందుజా ప్రతినిధులు తెలిపినట్టు ఇంధనశాఖ వర్గాలు వివరించాయి. -
విద్యుత్ కొనుగోలుకు అనుమతివ్వండి
ఈఆర్సీని కోరిన తెలంగాణ డిస్కంలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు రానున్న 25 ఏళ్ల పాటు ఏటా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని తెలంగాణ డిస్కంలు కోరాయి. ఈ మేరకు ఈఆర్సీకి తెలంగాణ డిస్కంలు శనివారం దరఖాస్తు చేసుకున్నాయి. దీర్ఘకాలానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటుచేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అయితే, విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ ద్వారా చేయాలా? లేక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ద్వారానా అన్నది నిర్ణయించాల్సి ఉంది. ఎంఓయూ ద్వారా కొనుగోలుకు అనుమతించాల్సిందిగా ఈఆర్సీని ప్రభుత్వం అభ్యర్థించే అవకాశముంది. కానీ, బిడ్డింగ్ ద్వారానే కొనుగోలు చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేస్తోంది. ఆగస్టు 30 నాటికి కృష్ణపట్నం రెడీ: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో 800 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ తొలి యూనిట్ ఆగస్టు 30 నాటికి సిద్ధం కానుంది. దాంతో ఆగస్టు 30 నుంచి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభించాలని శనివారం జరిగిన ఏపీసీపీడీసీఎల్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 200 మెగావాట్ల రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 30 నాటికి గ్రిడ్‌కు అనుసంధానించాలని తీర్మానించారు. అయితే, కృష్ణపట్నం ప్లాంట్ ఒప్పందం మేరకు తెలంగాణ వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ఈ సమావేశంలో తెలంగాణ డిస్కంల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు. మీ ఆదేశాలు పాటించడం లేదు: సీలేరు ప్లాంట్ నుంచి విద్యుత్‌ను తెలంగాణకే ఇవ్వాలని గోదావరి జల నియంత్రణ బోర్డు చైర్మన్ మహేంద్రన్ రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ ఆదేశాలు జారీ అయి 48 గంటలు దాటినప్పటికీ తమకు విద్యుత్ ఇవ్వడం లేదని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర శనివారం గోదావరి జల నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఆదేశాలను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ల్యాంకో, స్పెక్ట్రం ప్లాంట్లకు గ్యాసు నిలిపివేత
* నగరం ఘటన నేపథ్యంలో గెయిల్ నిర్ణయం * నిలిచిన 235 మెగావాట్ల విద్యుత్ * యూనిట్ విద్యుత్ రాకున్నా రోజుకు రూ. 60 లక్షల భారం సాక్షి, హైదరాబాద్: ల్యాంకో, స్పెక్ట్రం ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్లాంట్లకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) గ్యాసు సరఫరాను నిలిపివేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, నగరం గ్రామం వద్ద పేలుడు నేపథ్యంలో పైపులైన్‌ను పరీక్షించనున్న నేపథ్యంలో గ్యాసు సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఈ ప్లాంట్లకు గెయిల్ శుక్రవారం సమాచారం అందించింది. పైపులైన్ పరీక్షలు, మరమ్మతుల అనంతరమే గ్యాసును తిరిగి సరఫరా చేస్తామని గెయిల్ స్పష్టం చేసింది. అప్పటివరకు ఈ రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. ఫలితంగా 235 మెగావాట్ల (రోజుకు 6 మిలియన్ యూనిట్లు) విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఫలితంగా తెలంగాణకు 126 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 109 మెగావాట్ల మేరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓఎన్జీసీ, రవ్వ క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాసుతో కేవలం కొన్ని ప్లాంట్లు మాత్రమే నడుస్తున్నాయి. తాజా ఘటనతో ఆ ప్లాంట్లు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడింది. స్థిర చార్జీలు చెల్లించాల్సిందే! గ్యాసు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన్పటికీ స్థిర చార్జీలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్లతో విద్యుత్ సంస్థలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) మేరకు కంపెనీ సొంత తప్పిదం లేకుండా బలవంతంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే (ఫోర్జ్ మెజర్) స్థిర చార్జీలను సదరు కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రస్తుతం ప్లాంట్లకు సంబంధం లేకుండా బలవంతంగా మూయించడం వల్ల యూనిట్‌కు రూపాయి చొప్పున స్థిర చార్జీలను ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మొత్తం 6 మిలియన్ యూనిట్ల (60 లక్షల యూనిట్లు)కుగానూ ఒక్క యూనిట్ విద్యుత్ సరఫరా కాకున్నా రోజుకు 60 లక్షల రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పోలీసు పహారాలో పవర్ ప్లాంట్ పనులు
పాములపాడు, న్యూస్‌లైన్: మండల పరిధిలోని వేంపెంట గ్రామంలో పోలీసుల పహరా మధ్య పవర్ ప్లాంట్ పనులు సాగుతున్నాయి. రూ.35 కోట్ల నిధులతో 7.5 మెగా విద్యుత్ ఉత్పత్తి కోసం ర్యాంకో మినీ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్న విషయం విధితమే. అయితే ఊరు మధ్యలో పనులు చేపడుతుండటంతో గ్రామస్తులు వ్యకిరేకిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం పోలీసుల సహకారంతో నాలుగు రోజులుగా యంత్రాలతో పనులు చేపడుతోంది. ఈ పనులను అడ్డుకునేందుకు పవర్‌ప్లాంట్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీని గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మండలంలో వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి ధర్నా, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వబోమని ముందస్తుగానే ప్రకటించడంతో గ్రామస్తుల ధర్నాకు బ్రేక్ పడింది. ఎలాగైన పనులను అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వేంపెంట గ్రామం విప్లవాలకు పరిటిగడ్డగా పేరుగాంచింది. గతంలో గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు అధిక సంఖ్యలో మొహరించారు. భారీగా మొహరించిన పోలీసులు.. గ్రామంలో సోమవారం ధర్నా చేపడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ జి.నరసింహారెడ్డి దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరు గ్రామంలోని పురవీధుల్లో పహరా కాశారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 1998లో జరిగిన మరణకాండ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులు గ్రామంలో మొహరించారు. 16 ఏళ్ల తరువాత మళ్లీ గ్రామాన్ని పోలీసులు చుట్టు ముట్టడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
వేంపెంటలో ‘ప్లాంట్’ చిచ్చు
వేంపెంట (పాములపాడు), న్యూస్‌లైన్: మండలంలోని వేంపెంట గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణ చిచ్చు రగులుతోంది. గ్రామస్తులకు వ్యతిరేకంగా గురువారం పోలీస్ పహారాలో పనులు ప్రారంభించారు. పనులు వెంటే ఆపివేయాలని, లేదంటే తాము గ్రామాన్ని విడిచి వెళతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 2011 జులైలో నిప్పుల వాగులో పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. 7.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి దాదాపు రూ.35కోట్ల తో ర్యాంక్ మినీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రెండేళ్ల కిందట భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ ప్లాంట్ నిర్మాణం వేంపెంట గ్రామం మధ్యలో జరుగుతున్నందున గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పలుమార్లు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు.. అప్పటి రాష్ట్ర న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామిలు కూడా ప్రజలతో చర్చించారు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటుతాయని, శబ్ద కాలుష్యం, వ్యవసాయ బోరు బావులకు, సాగుతాగు నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని గ్రామస్తులు ఆందోళనకు గురై తమ గోడును వారితో చెప్పుకునప్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి గత ఏడాది జులై 13న గ్రామానికి చేరుకుని సభ నిర్వహించి వారితో అభిప్రాయాలు సేకరించారు. గ్రామస్తుల అభీష్టం మేరకే పవర్‌ప్లాంట్ పనులు జరుగుతాయని ప్రజలకు తెలిపారు. ఆ సమయంలేనే ప్లాంటు పనులు నిలిపి వేయించారు. ప్రజల కోరికకు విరుద్ధంగా ప్రజల అభీష్టానికి విరుద్ధంగా గురువారం గ్రామంలో పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా బస్టాండ్ సెంటర్లో, పనులు జరిగే చోట, ఎస్సీకాలనీలోని స్థూపం వద్ద ప్రధాన కూడళ్లలో డీఎస్పీ జి.నరసింహారెడ్డి, సీఐ రవిబాబుల ఆధ్వర్యంలో దాదాపు 60 మంది పోలీసు పహారా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. పనులు చేసుకునేందుకు తమకు ప్రభుత్వ అనుమతులున్నాయని, అయితే గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఉందని పనులు జరిగేందుకు పోలీసు ఫోర్సు కావాలని కోరడంతో బలగాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామం విడిచి వెళతాం.. పజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పవర్‌ప్లాంటు పనులు జరుపుతున్నందున గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్తులు గాండ్ల రమేష్, సామేలు, సాలన్న, ఏసురత్నం, కాంతారెడ్డి, రమణారెడ్డి, కోరబోయిన శాంతు, చెలమారెడ్డి, బోయశ్రీనివాసులు పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడంతో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పనులు చేయబోమని హామీ ఇచ్చి ఈరోజు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మాటకు విలువ లేనప్పుడు గ్రామంలో ఉండటం వ్యర్థమని ప్రజలంతా మూకుమ్మడిగా గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధం కావాలని తీర్మానించామన్నారు. ‘ ఏరాసు, కేఈలు పెద్దోళ్లు.. వారి రాజకీయ, ధన బలాన్ని చూపేం దుకే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దించారు.’ అని బోరెడ్డి శివారెడ్డి ఆరోపించారు. గ్రామంలోని ప్రజలంతా రోడ్డుమీద పడితే అధికారులకు, పవర్‌ప్లాంట్ యజమానులకు ఆనందమా అంటూ జాను అనే వ్యక్తి ప్రశ్నించారు. -
‘ఎస్‌బీక్యూ’లో అగ్నిప్రమాదం
ముగ్గురికి గాయాలు రూ. 2 కోట్ల ఆస్తి నష్టం.. చిల్లకూరు, న్యూస్‌లైన్: ఎస్‌బీక్యూ ఉక్కు పరిశ్రమలోని విద్యుత్ ప్లాంట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, రూ.2కోట్లు ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకులపాటూరులోని ఎస్‌బీక్యూ ఉక్కు పరిశ్రమలో 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉంది. ఉదయం మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా కోల్ కన్వేయర్ హ్యాండ్లింగ్ సిస్టంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బొగ్గును ప్లాంట్‌లోకి తీసుకెళ్లే కన్వేయర్ బెల్టులో రాపిడి జరగడంతో ఎగసిన మంటలు ఇరువైపులా ఉన్న బొగ్గుకు అంటుకోవడంతో ఒక్కసారిగా బెల్టు కాలిపోవడం ప్రారంభిం చింది. గమనించిన కార్మికులు రాజశేఖర్, చెన్నకేశవరెడ్డి, వికాస్ మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించి గాయాలపాలయ్యారు. అప్రమత్తమైన సహచర కార్మికులు వెంటనే పరిశ్రమలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే గాలి వీస్తుండటంతో మంట లు నలువైపులా వ్యాపిం చాయి. సమాచారం అందుకున్న గూడూరు, కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నాలుగు గంటలకు పైగా శ్రమించినా మంటలను అదుపు చేయలేకపోయారు. చివరకు ఇరువైపులా కన్వేయర్ బెల్టులను తొలగించడంతో కొంతమేర మంటలు అదుపులోకి వచ్చాయి. కోల్కన్వేయర్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో నిల్వ ఉన్న బొగ్గు మొత్తం కాలిపోయింది. గాయపడిన కార్మికులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణకు 'జైరాం' వరాలు
తెలంగాణ ప్రాంతంపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం రూ. 20 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్టు నిర్మించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నల్గొండ పర్యటనకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి వచ్చే రూ. 25 - 30 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రాంత అభివృద్దికే కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే సింగరేణి బొగ్గు గనుల్లో 51 శాతాన్ని తెలంగాణకు, 49 శాతం కేంద్ర ప్రభుత్వానికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. -
పవర్‌ప్లాంట్ అనుమతి రద్దు చేయాలి : భాను
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్‌పై యాక్టివ్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన జల విద్యుత్ కేంద్రానికి తిరిగి అనుమతి ఇవ్వడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను బుధవారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఈ నిర్ణయం వల్ల బుడమేరుకు వరద వస్తే పలు గ్రామాలతో పాటు విజయవాడ నగరంలో 16 డివిజన్లు నీట మునుగుతాయని హెచ్చరించారు. యాక్టివ్ పవర్‌ప్లాంట్ వల్ల ఎన్టీటీపీఎస్ కూడా నష్టపోతుందని ఆయన విమర్శించారు. ఏడాది పొడవునా నడిచే వీలున్న ప్రాజెక్టును ప్రభుత్వమే నడపడం వల్ల ఎన్టీటీపీఎస్కు కూడా ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. బుడమేరులో పోలవరం కాల్వను కూడా కలపాలన్న నిర్ణయంతో ఈ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతాంగం కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ ప్లాంట్ వల్ల రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాలకు చెందిన సుమారు 12 వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగిన ఘటనలు గతంలో అనేకం జరిగిన సంగతి గుర్తుచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తన స్వార్థం కోసం ఆ భూమిని కేటాయిస్తూ అనుమతి ఇవ్వడంపై ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. నేడు ధర్నా ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలోని జలవిద్యుత్ కేంద్రానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాజెక్టు ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ లంకె అంకమోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొంటారని వివరించారు. ప్రజలకు, రైతులకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నాటి సీఎం రాజశేఖరరెడ్డి దీన్ని నిలుపుదల చేయిస్తే ప్రస్తుత సీఎం తన స్వార్థం కోసం అనుమతి ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ ధర్నాకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు. -
పోలీసులంటే హడలిపోతున్న శ్రీకాకుళం పల్లెలు
-
అణు విద్యుత్ కేంద్రం పనులు వేగవంతం
రణస్థలం, న్యూస్‌లైన్: మండలంలోని మత్స్యకార గ్రామమైన కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రం పనులు వేగవంతమయ్యూయి. ఇందులో భాగంగా గతంలోని కోటపాలెం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన భూము లను స్వాధీనం చేసుకోవడానికి మొదటి విడతగా 481 ఎకరాలకు సంబంధించి 4(1) నోటీసులను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ భూము లపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయూలని రైతులను ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా ఈ నెల 27న రామచంద్రాపురం, 29న కోటపాలెం గ్రామాల్లో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయూ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ అధికారులు శనివారం నోటీసులను అతికించారు. దీంతో కొవ్వాడ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. గ్రామసభలకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ సభలు ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నేరుగా అభ్యంతరాలపై గ్రామ సభలు పెట్టడం సరికాదని ఈ ప్రాంత మత్స్యకారులు, రైతులు, ప్రజలు, పలు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షుణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కేటీపీపీలో మరో విద్యుత్ ప్లాంట్
గణపురం, న్యూస్‌లైన్ : గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అంధ్రప్రదేశ్ పవర్ జనరేటింగ్ కార్పొరేషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢీల్లీకి చెందిన స్టింగ్ ఎనర్జీ కంపెనీ బృందం ఆరు నెలల క్రితం ప్లాంట్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన వసతులను పరిశీ లించి సంతృప్తి వ్వక్తం చేశారు. ఈ మేరకు వారు ఇచ్చిన అనుకూల రిపోర్ట్ ఆధారంగా జెన్కో నిర్ణ యం తీసుకున్నట్లు ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. దీని నిర్మాణానికి కావాల్సిన రూ. 3,300 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించారు.రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు సరిపోనూ విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం... రానున్న రోజుల్లో ఇబ్బం దికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు జెన్కోకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి ఆరు నెలల క్రితమే కేటీపీపీలో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జరిగిన జెన్కో ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జెన్కో భూ సర్వే చేపట్టింది. దుబ్బపల్లి కొంపల్లి, మోరంచవాగు పరిసర ప్రాంతాల భూముల్లో యాష్ ఫాండ్, కోల్ డంప్ యార్డ్, రిజర్వాయర్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు శ్రీకారం చుట్టింది. మొత్తం కేటీపీపీ పరిసర ప్రాంతాల్లో 800 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. కాగా, 800 మెగావాట్ల ప్లాంట్‌తో కలిపితే కేటీపీపీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1900 మెగావాట్లకు చేరుకోనుంది. దీన్ని బట్టి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా కేటీపీపీ అవతరించనుంది. -
రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్‌కు సమైక్య సెగ
-
కంతనపల్లి ప్రాజెక్ట్‌పై కేంద్రం కొర్రీ !
సాక్షి, హైదరాబాద్: కంతనపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. పదేళ్లలో ఈ ప్రాజెక్టు పూడిపోతుందనే విషయమై సమాధానం ఇవ్వాలని కేంద్రం రాష్ర్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజైన్ సరిగా లేదని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో, ప్రాజెక్ట్ ప్రస్తుత డిజైన్‌లో మార్పులకు అవకాశం ఉందా? అనే విషయంపై కూడా కేంద్రం ఆరా తీసింది. ఈమేరకు,.. కేంద్ర జలవనరుల శాఖ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి ఈ నెల 18న లేఖ వచ్చింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం, కంతనపల్లి వద్ద ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. 22.5 టీఎంసీల నీటిని నిల్వచేసే సావుర్థ్యంతో రూపొందించిన ఈ బ్యారేజీనుంచి మొత్తం 50 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. తొలిదశలో బ్యారేజీ నిర్మాణం, వులిదశలో లిప్టులు, కాల్వల తవ్వకం చేపడతారు. బ్యారేజీ నిర్మాణానికి రూ. 1,809 కోట్ల అంచనాతో ఇటీవలే టెండర్లను ఖరారు చేశారు. వరంగల్ జిల్లాలో 4.23 ల క్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 2.57 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 69 వేల ఎకరాలు కలిపి, మొత్తం ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్ట్నుంచి సాగునీరు అందనుంది. 450 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కానుంది. అయితే లిప్టుల కోసం 878 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. కాగా డిజైన్ సరిగాలేని ఈ ప్రాజెక్టుకు టెండర్ ఖరారు చేయుడం సరికాదంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తూ, రాష్ట్రానికి లేఖ రాసింది. పూడిక అంశంపై అధ్యయనం చేపట్టారా? అని కేంద్రం ఆరాతీసింది. పూడిక తొలగిం పునకు తీసుకోవాల్సిన చర్యలు, డిజైన్ వూర్పునకు అవకాశాలు, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరింది. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం త్వరలోనే సమాధానం పంపించే అవకాశం ఉంది.