67 మంది దుర్మరణం | China power station collapse kills 67 in Jiangxi | Sakshi
Sakshi News home page

67 మంది దుర్మరణం

Published Fri, Nov 25 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

67 మంది దుర్మరణం

67 మంది దుర్మరణం

చైనాలో కూలిన  పవర్‌ప్లాంట్
బీజింగ్: చైనాలో నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ ప్లాట్‌ఫాం కూలడంతో 67 మంది దుర్మరణం పాలయ్యారు.  గురువారం తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్‌‌సలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ ప్లాట్‌ఫాం ఒక్కసారిగా భూమిలో కుంగిపోరుుంది. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పలువురు చిక్కుకుపోయారు. కాంక్రీటు పలకలు విరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి వ్యాపించింది. 70 మంది కార్మికుల్లో 67 మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించగా, ఇద్దరు గాయాల పాలయ్యారు. మరొకరు గల్లంతయ్యారు. 

200 మంది అగ్నిమాపక సిబ్బంది జాగిలాలతో సహా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గత ఏడాది చైనా పోర్ట్ సిటీ తియాంజిన్‌లో జరిగిన  పేలుళ్లలో 173 మంది చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. 2014 ఆగస్టులో తూర్పు చైనాలోని  ఓ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 75 మంది చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement