బీజింగ్/హాంకాంగ్: తైషాన్ న్యూక్లియర్ ప్లవర్ ప్లాంట్ చుట్టుపక్కన అసాధారణ అణు ధార్మికత స్థాయి ఆనవాళ్లలేవీ లేవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్లాంట్ నుంచి ప్రమాదకర వాయువులు లీక్ అవుతున్నాయనే వార్తలను కొట్టిపారేశారు. ప్రజల భద్రతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తైషాన్ ప్లాంట్‌ను ప్రమాదకరమైన వాయువు వెలువడుతున్నట్లు సహ భాగస్వామి అయిన ఫ్రాన్స్ కంపెనీ ఫ్రామటోమ్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం అమెరికా సాయాన్ని కోరింది. గ్యాస్ లీకేజీని అడ్డుకోకపోతే ఇదొక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment