Nuclear Plant
-
చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం!
చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను వీలైనంత త్వరగా సాకారం చేయాలని రష్యా, చైనా తలపోస్తున్నాయి. అందుకవసరమైన విద్యుత్ అవసరాలను సోలార్ ప్యానళ్లు తీర్చలేకపోవచ్చనే ఉద్దేశంతో జాబిలిపై ఏకంగా అణు విద్యుత్కేంద్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాయి! అందుకోసం ఇప్పటికే సంయుక్త కార్యాచరణకు తెర తీశాయి కూడా... అంతరిక్ష పోటీలో కీలక ముందడుగు వేసే దిశగా రష్యా, చైనా సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను నిజం చేసే దిశగా కదులుతున్నాయి. 2035 లోపు అక్కడ అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు చేయాలని నిశ్చయానికి వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ తెలిపారు. ఈ మేరకు తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే ఇదంతా సులువు కాబోదని యూరీ అంగీకరించారు. కాకపోతే, ‘‘న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ రంగంలో రష్యాకున్న అపార నైపుణ్యం ఈ విషయంలో బాగా ఉపయోగపడనుంది. మేం తలపెట్టిన ప్రాజెక్టు చంద్రునిపై మనిషి శాశ్వత ఆవాసం దిశగా కీలక ముందడుగు కానుంది. అక్కడ మున్ముందు ఎదురయ్యే ఇంధన అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు సోలార్ ప్యానళ్లు చాలవు. అణు విద్యుతే ఇందుకు సమర్థమైన ప్రత్యామ్నాయం. కనుకనే బాగా ఆలోచించిన మీదట ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించాం’’ అని ఆయన వివరించారు. పర్యవేక్షణకు అంతరిక్ష ‘అణు’నౌక... అయితే చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం వ్యవస్థాపన మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. ఇందుకోసం ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు యూరీ వెల్లడించారు.... ► తొలి దశలో మానవ ప్రమేయంతో నిమిత్తం లేకుండా చంద్రునిపై అణు ప్లాంటు స్థాపన ప్రయత్నాలు పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిన సాగుతాయి. ► ఇందుకోసం ప్రధానంగా రోబోలను రంగంలోకి దించి వాటి సాయంతో పని నడిపిస్తారు. ► స్పేస్ టగ్బోట్ పేరిట అణు విద్యుత్‌తో నడిచే అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసే యోచనలో రష్యా ఉంది. ► ఇందులో భారీ అణు రియాక్టర్‌తో పాటు హై పవర్ టర్బైన్లు కూడా ఉంటాయి. ► విద్యుత్కేంద్రం తయారీకి కావాల్సిన సామగ్రిని దాన్నుంచే చంద్రునిపైకి పంపుతారు. ► దాని నిర్మాణ క్రమంలో వెలువడే అంతరిక్ష వ్యర్థాలు తదితరాలను క్లియర్ చేసే పని కూడా ఈ నౌకదే. చల్లబరచేదెలా...? చంద్రునిపై అణు విద్యుత్కేంద్రం నిర్మాణంలో ఇమిడి ఉన్న అనేకానేక సాంకేతిక సమస్యలను అధిగమించడంలో రష్యా, చైనా తలమునకలుగా ఉన్నాయి. అయితే అణు ప్లాంటును ఎప్పటికప్పుడు చల్లబరచడం వాటికి అత్యంత కీలకమైన సవాలుగా మారనుంది. గతేడాది రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన లూనా–25 అంతరిక్ష నౌక అంతరిక్షంలో అదుపు తప్పి పేలిపోయింది. ఆ ఎదురుదెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అణు కేంద్రం విషయంలో వెనక్కు తగ్గొద్దని పట్టుదలగా ఉంది. ఆలోపే చైనాతో కలిసి మానవసహిత చంద్ర యాత్ర, ఆ వెంటనే చంద్రునిపై శాశ్వత బేస్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చైనా కూడా 2030 నాటికల్లా తమ తొలి వ్యోమగామిని చంద్రునిపైకి పంపడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటినీ అమెరికా ఓ కంట కనిపెడుతూనే ఉంది. వీలైనంత త్వరగా అంతరిక్షంలో అణ్వాయుధాలను ఏర్పాటు చేసుకోవడమే రష్యా లక్ష్యమని ఇప్పటికే ఆరోపించడం తెలిసిందే. ఇదంతా పెద్ద దేశాల నడుమ అంతరిక్షంపై ఆధిపత్య పోరుకు దారి తీసే ఆస్కారం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా విని్పస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్
వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు. -
ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా!
కీవ్: జపోరిజజియా అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ వలెరియ్ మార్టిన్‌యుక్‌ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఆయనను ఎక్కడ నిర్బంధించి ఉంచారో తెలియడం లేదని పేర్కొంది. ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది. ఈమేరకు ఉక్రెయిన్ అణు విద్యుత్ నిర్వహణ సంస్థ ఎనర్జోఆటం మీడియాకు వెల్లడించించి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్ రఫేల్ గ్రాస్‌ను ఈ విషయంపై సంప్రదిస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది. మరోవైపు రష్యా రక్షణమంత్రి కూడా ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఐరోపాలోనే అతిపెద్దదైన ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా కొద్ది రోజుల క్రితమే ఆక్రమించుకుంది. ఆ తర్వాత దీని చీఫ్‌ను అక్టోబర్ 1 నిర్భంధించింది. అనంతరం అక్టోబర్ 3న విడుదల చేసింది. కానీ ఆ తర్వాత రోజు నుంచి అతడు విధులకు హాజరుకావడం లేదు. అణువిద్యుత్ కేంద్రం రష్యా గుప్పిట్లోనే ఉన్నప్పటికీ దీన్ని ఉక్రెయిన్ సిబ్బందే నిర్వహిస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా -
ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచేలా... రష్యా వ్యూహం
Kremlin called for "pressure" on Kyiv: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి జపోరిజ్జియాలో ఉన్న అణుకర్మాగారంపై రష్యా దాడి చేస్తుందంటూ ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దీని వల్ల యూరప్ దేశాలకు అత్యంత ప్రమాదమని చెర్నోబిల్ అణుప్రమాదం లాంటిది మరొక విపత్తు ముంచుకొస్తుందని హెచ్చరిచ్చింది కూడా. రష్యా దూకుడుకి అడ్డుకట్టవేయమని పశ్చిమ దేశాలను కోరింది. ఐతే రష్యా తాము అణుకర్మాగారంపై దాడుల జరపలేదని వాదించింది. కేవలం తాము ఆ ప్రాంతాన్ని అధినంలోకి తెచ్చుకున్నాం అని నొక్కి చెప్పింది. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం రష్యా అణు కర్మాగారంపై క్షిపిణి దాడులు చేస్తుందని, అందుకే ఆ కర్మాగారాన్ని మూసేశామని చెప్పారు. పైగా కర్మాగారం చాలావరకు దెబ్బతిందని ఇక ఏ క్షణమైన రేడియోషన్స్ లీకవుతాయంటూ యూరప్ దేశాలను హెచ్చరించారు జెలెన్స్కీ. రష్యా కూడా ఆయా వ్యాఖ్యలన్నింటిని ఖండిస్తూ వచ్చింది. ఈ విషయం పై ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. దీంతో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రోస్సీ తాను స్వయంగా ఆ ప్లాంట్‌ని పర్యవేక్షించడానికి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తాము చాలాకాలంగా దీని కోసమే ఎదురుచూస్తున్నాం అని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్‌పై ప్రపంచ దేశాల నుంచి మరింత ఒత్తిడి పెరగుతుందన్నారు. యూరోపియన్ ఖండాన్ని ప్రమాదంలోకి నెట్టేయకుండా అన్ని దేశాలు ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తాము కూడా ఈ అణు కర్మాగారం ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేలా కీవ్ పై ఒత్తిడి పెంచేందుకు పిలుపునిస్తున్నాం అని చెప్పారు. రాఫెల్ గ్రోస్సీ పర్యటనతో ఐఏఈఏ మాస్కో నియంత్రిత భూభాగాల్లో భద్రతను నిర్ధారించడమే కాకుండా ప్రబలంగా ఉన్న నష్టాలను కూడా పరిగణలోని తీసుకుంటుందని తెలిపారు. -
మొత్తం చేస్తోంది ఉక్రెయినే... నీతులు చెబుతున్న రష్యా
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నానాటికి ఉగ్ర రూపం దాల్చుతుందే గానీ తగ్గే సూచనలు కనిపించడంలేదు. ఐతే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజజియా ప్లాంట్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ప్రారంభమైన తొలి దశలోనే రష్యా దళాలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అణువిద్యుత్ పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో ప్లాంట్‌ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఐతే యుద్ధ తీవ్రరూపం దాల్చడంతో తాజాగా ఈ దాడుల్లో ఒక షెల్ ప్లాంట్ పై పడినట్లు తెలుస్తోంది. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ బలగాలే అణువిద్యుత్ ప్లాంట్ పై దాడులు జరిపాయని, ఇదంత ఉక్రెయిన్ నిర్వాకమే అంటూ ఆరోపణుల చేస్తోంది. ఇది ఐరోపాతో సహా దాని పొరుగు దేశాలకు అత్యంత ప్రమాదకరం అని రష్య ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు. పైగా ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఇప్పుడైనా మేల్కోని అలాంటి షెల్లింగ్ దాడులు చేయొద్దని ఉక్రెయిన్‌కి హితవు చెప్పాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పై దురాక్రమణకు దాడి దిగిందే కాకుండా తప్పంతా ఉక్రెయిన్ పై నెట్టేసి ఇప్పుడూ నీతి కబుర్లు చెబుతోంది రష్యా. అయినా యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే రష్యా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దాడి చేసిన విషయాన్ని విస్మరిస్తూ ఉక్రెయిన్‌ని నిందించడం గమనార్హం. మరోవైపు రష్యా చేసిన వ్యాఖ్యలన్ని అవాస్తవం అంటూ ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఐతే ఈ విషయమై యూఎన్ కూడా ఇరు దేశాలను హెచ్చరించింది. (చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం) -
ఉక్రెయిన్ యుద్ధంలో ఊహించని పరిణామం
కీవ్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో మంగళవారం.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీరును తప్పుబడుతూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది ఉక్రెయిన్. అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ గ్రాస్సీ దక్షిణ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌కు ప్రతినిధుల బృందాన్ని పంపుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ చర్యలను తప్పుబడుతూ ఉక్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఏఈఏకు, ఆ సంస్థ చీఫ్‌కు ఆ ప్లాంట్‌లో అనుమతి లేదంటూ నిషేదాజ్ఞలు జారీ చేసింది ఉక్రెయిన్. #BREAKING Ukraine blocks IAEA chief visit to Russian-occupied nuclear plant: Kyiv pic.twitter.com/Ht8zkkCEyN — AFP News Agency (@AFP) June 7, 2022 ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ న్యూక్లియర్ కంపెనీ ఎనెర్గోఆటం.. ఐరాసకు చెందిన అంతర్జాతీయ విభాగం ఐఏఈఏ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం అయిన జాపోరిజ్జియా.. దురాక్రమణ నేపథ్యంలో రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రష్యా-ఉక్రెయిన్ బలగాలు ఈ ప్లాంట్‌పై ఆధిపత్యం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఇప్పటికీ ఈ ప్లాంట్‌ను ఉక్రెయిన్ సిబ్బందే నిర్వహిస్తుండడం కొసమెరుపు. సోమవారం ఐఏఈఏ చీఫ్ రఫెల్ గ్రాసీ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ మిషన్‌లో భాగంగా నిపుణులతో కూడిన బృందాన్ని రష్యా ఆధీనంలో ఉన్న జాపోరిజ్జియాకు పంపనున్నట్లు ప్రకటించారు. అయితే.. అది రష్యా అనుకూల వ్యాఖ్య, పైగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐఏఈఏ బృందం ప్లాంట్‌లో పర్యటించడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి కీవ్ వర్గాలు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ తీరుపట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్
Russian troops first sign of illness from radiation: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా దాడి సాగిస్తూనే ఉంది. రష్యా సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన పేరుతో ఉక్రెయిన్ పై మరిన్ని వైమానిక బాంబులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరవధిక దాడుల కారణంగా ఉక్రెయిన్ ఊహించనట్లుగానే యూరప్ దేశాలకు పెనుముప్పు వాటిల్లనుంది. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించినప్పుడే చెర్నోబిల్ని నియంత్రణలోకి తెచ్చుకోవడంలో భాగంగా అణుకర్మాగారంపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ సేనలు అణుకర్మాగారంలో వ్యాపించిన మంటలను అదుపు చేసి పర్యవేక్షించారు. అంతేకాదు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ అణుకర్మాగారం అతిపెద్దదని గతంలో అది ఎంత పెను విధ్వంసం సృష్టించిందో కూడా వివరించారు. అయితే ఇప్పుడూ ఆ అణుకర్మాగారం నుంచి రేడియేషన్లు వెలువుడుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అందులో భాగంగానే చెర్నోబిల్ వద్ద రష్యా దళాలు అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం బెలారస్‌లోని ప్రత్యేక వైద్య సదుపాయానికి తరలి వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈమేరకు ఉక్రెనియన్ ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్చుక్ కూడా రష్యన్లు రేడియేషన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. చెర్నోబిల్ వద్ద కార్మికులు నివసించే సమీపంలోని స్లావుటిచ్ పట్టణం నుంచి రష్యన్ దళాలు వెనక్కి వెళ్లాయని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయమై యూఎన్ న్యూక్లియర్ వాచ్డాగ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో చెర్నోబిల్‌కు తన తొలి సహాయం అందించనున్నట్లు ఐఏఈఏ పేర్కొనడం విశేషం. (చదవండి: మా ఆంక్షలు నిర్వీర్యం చేయోద్దు!..హెచ్చరించిన యూఎస్) -
‘రష్యా ఘాతుకం ప్రపంచానికి తెలియాలి.. పుతిన్ పక్కా ప్లాన్‌తో ఉన్నాడు’
లివివ్: రష్యాపై ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఒలెక్సిల్ రెజ్నికోవ్ సంచలన ఆరోపణలు చేశారు. పైకి యుద్ధం చేస్తున్నామని ప్రకటించిన రష్యా.. తమ దేశ పౌరులపై ఘాతుకానికి పాల్పడిందని అన్నారు. తమ దేశ సైన్యంపై విరుచుకుపడుతూనే అమాయక ప్రజల ప్రాణాలను తీసిందని శుక్రవారం ఆరోపించారు. ఈ నిజం కీవ్‌కు మాత్రమే కాదు.. ప్రపంచానికి తెలియాలనే చెప్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే చెర్నోబిల్ అణు విద్యుత్‌ప్లాంట్‌పై పట్టు సాధించిన రష్యా.. తమపై నింద మోపేందుకు పక్కా ప్లాన్‌తో ఉందని ఒలెక్సిల్ అన్నారు. ప్లాంట్‌పై టెర్రరిస్టు అటాక్ చేయించేందుకు పుతిన్ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తద్వారా అణు విద్యుత్ ప్లాంట్ పరిరక్షించే పూర్తి బాధ్యత తమపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా చర్యల వల్ల విధ్వంసం జరిగితే పూర్తిగా బలయ్యేది ఉక్రెయిన్ కాబట్టి.. ఈ ఎత్తుగడకు పుతిన్ పూనుకున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంతో ఉక్రెయిన్ సంబంధాలు కోల్పోయిందని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ గురవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్
కీవ్: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం యూరప్ గుండెల్లో మరోసారి గుబులు పుట్టిస్తోంది. రష్యా కాల్పుల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో బుధవారం ప్లాంటుకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ జనరేటర్లు బ్యాకప్ పవర్ అందజేస్తూ నెట్టుకొస్తున్నాయి. కానీ వాటిలో రెండు రోజులకు సరిపడా డీజిల్ మాత్రమే అందుబాటులో ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. విద్యుత్ సరఫరా ఆగిపోయి విద్యుత్కేంద్రంలోని అణు వ్యర్థాల కూలింగ్ వ్యవస్థ దెబ్బ తింటే అణు ధార్మిక లీకేజీ తప్పదంటున్నారు. అణు, ధార్మిక భద్రత వ్యవస్థలపై నియంత్రణ చేజారి 1986ను మించిన ప్రమాదానికి దారి తీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో యూరప్ అంతా మరోసారి భయం గుప్పిట్లో గడుపుతోంది. చెర్నోబిల్ కేంద్రాన్ని రష్యా దళాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్ లైన్ల మరమ్మతు కోసం కాల్పులను తాత్కాలికంగా ఆపాలని రష్యా సైన్యానికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ద్మిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వాడకంలో లేని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం నుంచి తమకు డేటా అందడం ఆగిపోయిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది. అందులో పని చేస్తున్న సిబ్బంది భద్రత పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. వాళ్లు 13 రోజులుగా నిరంతరాయంగా పని చేస్తున్నారని సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ అన్నారు. అయితే, ‘‘కరెంటు కోతతో ప్లాంటు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ‘‘అణు వ్యర్థ నిల్వల నుంచి వచ్చే వేడిని చల్లార్చేందుకు ప్లాంటులో నిత్యం అందుబాటులో ఉండే కూలింగ్ వాటర్ చాలు. అందుకోసం అదనపు కరెంటు సరఫరా అవసరం లేదు’’ అని ఒక ప్రకటనలో ఐఏఈఏ పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వ అణు సంస్థ ఎనర్గోటమ్ మాత్రం విద్యుత్కేంద్రంలోని 20 వేల అణు వ్యర్థ యూనిట్లను చల్లబరిచి ఉంచేందుకు నిరంతర కరెంటు సరఫరా తప్పనిసరని అంటోంది. ‘‘లేదంటే అణు ధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. గాలి ద్వారా ఉక్రెయిన్‌తో పాటు బెలారస్, రష్యా, యూరప్‌లోని ఇతర దేశాలకూ వ్యాపించి వినాశనానికి దారి తీస్తాయి’’ అని ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చింది. 1986లో ఏం జరిగింది? చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1986లో భద్రత పరీక్షల సందర్భంగా ఇందులోని నాలుగో రియాక్టర్ పేలి పెద్ద ప్రమాదానికి దారితీసింది. పేలుడులో చనిపోయింది ఇద్దరే అయినా, ఆ తర్వాత అది పెను వినాశనానికే దారి తీసింది. మంటలను ఆర్పిన సిబ్బందిలో 30 మందికి పైగా మూడు నెలల్లోపే మృత్యువాత పడ్డారు. పేలుడు వల్ల 100 రకాలకు పైగా రేడియో ధార్మిక పదార్థాలు వెలువడ్డాయి. వీటి ప్రభావం యూరప్‌పై ఏళ్ల తరబడి కొనసాగింది. రేడియో ధార్మికత బారిన పడి నానారకాల వ్యాధులతో వేలాది మంది నరకయాతన అనుభవించి మరణించారు. చెర్నోబిల్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిప్యాట్ నగరంలోని దాదాపు 50 వేల మందిని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోపే పూర్తిగా ఖాళీ చేయించారు. మొత్తమ్మీద పరిసర ప్రాంతాల నుంచి 20 లక్షల మందిని ఖాళీ చేయించినట్టు అంచనా. (చదవండి: ఉక్రెయిన్ వీడిన 10 లక్షల మంది చిన్నారులు) -
Russia-Ukraine war: రష్యా అణు చెలగాటం
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా అణు చెలగాటమాడుతోంది. వారం కింద చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైనాన్ని మర్చిపోకముందే మరో అణు ప్లాంట్‌పై దాడికి తెగబడింది. ఆగ్నేయ ప్రాంతంలో ఎనర్‌హోడర్ నగరంపై గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు యుద్ధ ట్యాంకులతో భారీ దాడులకు దిగాయి. దాన్ని ఆక్రమించే ప్రయత్నంలో యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా బాంబుల వర్షం కురిపించినట్టు సమాచారం. దాంతో వాడుకలో లేని ఒకటో నంబర్‌రియాక్టర్‌కు మంటలంటుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి వాటిని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలకు కాల్పులే కారణమా అన్నది తెలియరాలేదు. కొద్దిపాటి ప్రతిఘటన అనంతరం విద్యుత్కేంద్రాన్ని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. దాడిలో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, అగ్నిప్రమాదంలో ఇద్దరు స్బిబంది గాయపడ్డారని సమాచారం. కాల్పుల వల్లే రియాక్టర్‌కు మంటలంటుకున్నాయని ఉక్రెయిన్ చెప్పగా, దాడుల్లో ప్లాంటులోని శిక్షణ కేంద్రం దెబ్బ తిన్నది తప్పిస్తే అందులోని ఆరు రియాక్టర్లకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రోసీ అన్నారు. రష్యా దుశ్చర్య యూరప్ వెన్నులో చలి పుట్టించింది. ప్రపంచ దేశాలన్నింటినీ షాక్‌కు గురిచేసింది. చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం పేలుడు తాలూకు ఉత్పాతాన్ని తలచుకుని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాది మతిమాలిన చర్య అంటూ యూరప్ దేశాలన్నీ దుమ్మెత్తిపోశాయి. సాధారణంగానే అణు ధార్మికత అణు విద్యుత్కేంద్రంపై దాడికి సంబంధించిన ఫుటేజీని ఉక్రెయిణ్ విడుదల చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే రష్యా సైనిక వాహనాలు భారీ సంఖ్యలో దానివైపు దూసుకెళ్లడం అందులో స్పష్టంగా కన్పించింది. తర్వాత కాసేపటికే విద్యుత్కేంద్రం పరసరాల్లోని భవనాలన్నీ బాంబుల దాడితో దద్దరిల్లిపోయాయి. అయితే ఆ తర్వాత కన్ను పొడుచుకున్నా కానరానంత పొగ పరసరాలన్నింటినీ కమ్మేసింది. కాసేపటికే రియాక్టర్‌కు మంటలంటుకున్నాయి. రియాక్టర్లు గనక పేలితే సర్వం నాశమయ్యేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఉక్రెయిన్ను తక్షణం నో ఫ్లై జోన్‌గా ప్రకటించాల్సిందిగా పశ్చిమ దేశాలను కోరారు. అయితే నాటో అందుకు నిరాకరించింది. ‘‘జెలెన్స్కీ ఆందోళనను మేం అర్థం చేసుకోగలం. కానీ నో ఫ్లై జోన్ ప్రకటన చేస్తే ఉక్రెయిన్ గగనతలాన్ని కాపాడేందుకు నాటో ఫైటర్ జెట్లు రంగంలోకి దిగి రష్యా విమానాలను కూల్చాల్సి ఉంటుంది. అది యూరప్‌లో పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుంది’’ అని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు. అమెరికా, ఇంగ్లండ్, ఐర్లండ్, నార్వే, అల్బేనియా విజ్ఞప్తి మేరకు అణు కేంద్రంపై దాడిని చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. తమను అప్రతిష్టపాలు చేసేందుకు అణు కేంద్రం వద్ద ఉక్రెయినే అగ్నిప్రమాదానికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. రియాక్టర్ వద్ద, పరిసరాల్లో రేడియో ధార్మికత స్థాయిలు పెరిగినట్టు ఉక్రెయిన్ చెప్పగా, సాధారణంగానే నమోదైనట్టు ఐఏఈఏ ప్రకటించింది. ఉక్రెయిన్ విద్యుత్ అవసరాల్లో 25 శాతాన్ని తీరుస్తున్న జపోరిజియా ప్లాంటులోని ఆరు అణు రియాక్టర్లలో ప్రస్తుతం ఒక్కటే 60 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాడులు మరింత ముమ్మరం రాజధాని కీవ్, ఖర్కీవ్ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. శుక్రవారమంతా ఎడతెరిపి లేని బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. కీవ్‌లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. రాజధానిని ఆక్రమించేందుకు 15 వేలకు పైగా అదనపు బలగాలు తాజాగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నగరానికి వాయవ్యంగా క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. ఖర్కీవ్‌తో పాటు ఒఖ్తిర్కాలపై రష్యా దళాలు భారీగా దాడులకు దిగుతున్నాయి. రేవు పట్టణం మారిపోల్‌లోనూ, పలు ఇతర నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తిప్పికొడుతున్న ఉక్రెయిన్ చెర్నిహివ్, మైకోలెయివ్ వంటి పలు నగరాల్లో రష్యా దాడిని ఉక్రెయిన్ సైన్యాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. అలాగే రేవు పట్టణం ఒడెసాలోనూ రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. నౌకలపై నుంచి నగరంపైకి రష్యా దాడులకు దిగుతోంది. రష్యా సైనికులకు ఆహారం, నిత్యావసరాలు అందకుండా చేస్తూ వారిని నీరసింపజేసే వ్యూహాన్ని ఉక్రెయిన్ ఎక్కడికక్కడ అమలు చేస్తోంది. ఉక్రెయిన్ వలసలు 12 లక్షలు: ఐరాస జెనీవా: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక శుక్రవారం నాటికి ఆ దేశం నుంచి 12 లక్షల మంది వలసబాట పట్టారని ఐక్యరాజ్య సమితి వలసల విభాగం తెలిపింది. గురువారం ఒక్కరోజే 1.65 లక్షల మంది దేశం వీడారని తెలిపింది. సుమారు 6.5 లక్షల మంది పొరుగునున్న పోలండ్‌లో, 1.45 లక్షల మంది హంగరీ, లక్ష మంది మాల్దోవా, 90వేల మంది స్లొవేకియాలో తలదాచుకున్నట్లు వివరించింది. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. జపాన్ రక్షణ సామగ్రి టోక్యో: ఉక్రెయిన్‌కు సాయంగా రక్షణ సామగ్రి పంపుతూ జపాన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు రక్షణ సామగ్రిని అందజేయొద్దన్న స్వీయ నియమాన్ని పక్కన పెట్టి మరీ బుల్లెట్‌ఫ్రూప్ జాకెట్లు, హెల్మెట్లు, టెంట్లు, జనరేటర్లు, ఆహారం, దుస్తులు, మందులు వంటివి పంపింది. -
రష్యా మొండితనం.. సర్వనాశనానికి సెకన్లు చాలు!
న్యూక్లియర్ ప్లాంట్లను యుద్ధంలో భాగం చేయకూడదు. అవి యుద్ధ స్థావరాలు కాకూడదు. ఉక్రెయిన్ జాపోరిజ్జియా అణు కేంద్రంపై రష్యా దాడుల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మాట చెప్తోంది. నిజానికి ఇదేం కొత్త మాట కాదు. అలాగే అదొక హెచ్చరిక. ఈ యుద్ధంలో యూరప్‌లోని అతిపెద్ద అణు రియాక్టర్ గనుక పేలితే?.. యూరప్ మొత్తం తుడిచిపెట్టుకుని పోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది ఇప్పుడు. శాంపిల్‌గా.. చెర్నోబిల్ విషాదాన్నే ప్రస్తావిస్తున్నారు. సుమారు 36 ఏళ్ల కిందట(ఏప్రిల్ 26, 1986).. ఒక రాత్రి. చిన్నతప్పిదం, ఏమరపాటుతో వ్యవహరించిన తీరు.. సెకన్ల వ్యవధిలోనే అత్యంత విషాదకరమైన విధ్వంసం చోటు చేసుకుంది. అణు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షిస్తున్న సమయంలో.. కరెంట్ సరఫరా ఆపేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రయోగాలు చేపట్టారు ఇంజినీర్లు. అయితే అప్పటికే అక్కడ చిన్న సమస్య ఉందని గుర్తించలేకపోయారు. నాలుగో నెంబర్ అణు రియాక్టర్లో కూలింగ్ వాటర్ సరఫరా ఆగిపోయి.. ఆవిరి ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఆ దెబ్బకు రియాక్టర్ మూత ఊడిపోయి అందులోంచి ‘కోర్’ బయటకు లీక్ అయ్యింది. చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదం.. పెనువిషాదం చోటు చేసుకుంది. ఘటనలో చెలరేగిన మంటలు పదిరోజుల పాటు మండుతూనే ఉన్నాయి. చెర్నోబిల్ ప్రమాదం జరిగిన టైంలో.. అక్కడికక్కడే చనిపోయింది ఇద్దరే. అటుపై రేడియేషన్ ఎఫెక్ట్‌తో 134 మంది అస్వతస్థకు గురయ్యారు. అందులో 28 మంది కొన్ని నెలలకు, మరికొందరు ఆ తర్వాత చనిపోయారు. కానీ, ఆ ప్రభావం ఏళ్ల తరబడి కొనసాగుతూనే వస్తోంది. ఎంతలా అంటే క్యాన్సర్, చర్మ.. గొంతు సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో సుమారు 2 లక్షల మందికిపైగా చనిపోయారని ఒక అంచనా. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెర్నోబిల్ ప్రమాదంపై పరిశోధనలు చేసిన రీసెర్చలు చెప్తుంటారు. విశేషం ఏంటంటే.. ఆ విషాదం తాలుకా జ్ఞాపకాలు మోస్తూ ఇంకా మంచానికే పరిమితమైన వాళ్లూ ఉన్నారు. బతకడం కష్టమే! చెర్నోబిల్ దుర్ఘటనలో విడుదలైన రేడియో ధార్మికత ప్రభావం కొన్ని వేల కిలోమీటర్లకు విస్తరించింది. హిరోషిమా, నాగసాకిల అణు బాంబు పేలుళ్ల కంటే ఎన్నో రెట్ల రేడియో ధార్మికతను విరజిమ్మింది. సుమారు పదమూడు దేశాలకు రేడియేషన్(ఇందులో రష్యా కూడా ఉంది) విస్తరించింది. ఈ ప్రాంతానికి దూరంగా లక్షల మందిని తరలించి.. నిషేధిత ప్రాంతంగా ప్రకటించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పదుల కిలోమీటర్ల పరిధిలో గట్టి కాపలా ఉంటుంది. చెర్నోబిల్ దుర్ఘటన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నివాస యోగ్యం కాదు. సాగు కూడా నిషేధం. అక్కడ కాసే పండ్లలో, పూసే పువ్వుల్లోనూ రేడియేషన్ ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. రేడియేషన్‌ను తట్టుకోలుగుతున్న కొన్ని జంతువులు మాత్రమే బతకగలుగుతున్నాయి. సోవియట్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న టైంలో జరిగిన ఈ అణు దుర్ఘటన.. ఇప్పటికీ ప్రభావం చూపెడుతోంది. అందుకే ఇక్కడ రోబోలతో అణువ్యర్థాలకు గోరీ కడుతున్నారు. నిషేధిత ప్రాంతం కాబట్టే.. ఇక్కడ ఒక అణు ఇంధన నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అనుకుంది. కానీ, యుద్ధ పరిణామాలతో అది రష్యా చేతికి వెళ్లింది. రష్యా ఆక్రమణలో భాగంగా పట్టణాల కంటే ముందుగా చెర్నోబిల్నే ఆక్రమించుకుంది రష్యా. ఆ టైంలో రష్యా అణు యుద్ధానికి దిగుతుందేమో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అయ్యింది. కావాలనే రష్యా.. రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయి. దేనిపై షూట్ చేస్తున్నారో రష్యా సైనికులకు పక్కాగా తెలుసు. కాబట్టి జాపోరిజ్జియా Nuclear Plantపై జరిగిన దాడి ప్రమాదవశాత్తూ జరిగింది కాదనేది ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆరోపణ. ఒకవేళ ఈ దాడి కావాలనే జరిగినా.. జరిగే నష్టం ఏ రేంజ్లో ఉంటుందో పుతిన్‌కి తెలుసు. ఎందుకంటే చెర్నోబిల్ పరిణామాలను ఆయన దగ్గరుండి చూశాడు.. ఆ ప్రభావానికి గురైన జాబితాలో రష్యా కూడా ఉంది కాబట్టి. అయినా కూడా అణు బూచితో ఉక్రెయిన్ ఆక్రమణలో ముందుకెళ్లాలని చూస్తోంది. ఉక్రెయిన్ను.. మద్ధతుగా వచ్చే దేశాన్ని అణ్వాస్త్ర దాడులతో బూడిద చేస్తామంటూ హెచ్చరిస్తున్నాడు పుతిన్. ఇందులో భాగంగానే ఒకవైపు ప్రధాన నగరాల ఆక్రమణ.. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న 15 న్యూక్లియర్ రియాక్టర్ల స్వాధీనం కొనసాగిస్తోంది రష్యా. శుక్రవారం రష్యా బలగాలు దాడి చేసింది, స్వాధీనం చేసుకుంది.. అలాంటి ఇలాంటి రియాక్టర్‌పైన కాదు. యూరప్‌లోనే అతిపెద్ద అణు రియాక్టర్ జాపోరిజ్జియా. జరగరానిది ఏదైనా జరిగితే ఆ విధ్వంసం ఊహించడమే కష్టం. ఎందుకంటే చెర్నోబిల్‌తో పోలిస్తే కొన్ని రెట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. ఉక్రెయిన్ సహా యూరప్ దేశాలు చాలామట్టుకు నామ రూపాలు లేకుండా పోవచ్చు. ఆఖరికి రష్యా కూడా ఆ ప్రతిఫలం అనుభవించాల్సిందే. జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్‌లోని ఆరు రియాక్టర్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తూ అది రిన్నోవేషన్లో ఉంది. ఆపరేటింగ్‌లో లేదు. అయితే అందులో అణు ఇంధనం మాత్రం ఉంది. ఆ ఇంధనం కూడా రష్యా నుంచే వచ్చింది. మంటలు అంటుకున్నాక ఆర్పడానికి రష్యా దళాలు ఫైర్ సిబ్బందిని అనుమతించలేదు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది. ఆపై సిబ్బంది అనుమతించడంతో సమయానికి మంటలు ఆపేశారు. ఘోర ముప్పు తప్పింది. అక్కడి వాతావరణంలో రేడియేషన్ లెవల్ కూడా మారలేదు. పుతిన్ ‘అణు దాడి’ హెచ్చరికల వరకు పరిమితం అయితే పర్వాలేదు. చెర్నోబిల్‌లో జరిగిన ఒక చిన్నతప్పిదానికే ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంటే.. కావాలని దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే.. ఆ ప్రభావం ఇంకా ఏ రేంజ్లో ఊహించడమే భయంకరంగా ఉంది. ::: సాక్షి, వెబ్ ప్రత్యేకం -
అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ
If There is an explosion, it is the end for everyone: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ భీకరమైన దాడిలో రష్యా కొన్ని ముఖ్యనగరాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో రష్యా జనవాసాలను, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణుకర్మాగారం పై దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ వెంటనే ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జెలెన్ స్కీ... చెర్నోబిల్ అనే పదం తెలిసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఇది గనుక పేలితే ఐరోపా అంతం అవుతుందని రాష్ట్రపతి చెప్పారు. అంతేకాదు ఆ అణు కర్మాగారాన్ని తాము ఇంత వరకు సురక్షితంగా ఉంచాం. మేము ఈ యుద్ధంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఈ దాడి కారణంగా అది ఎప్పుడూ పేలుతుందో కూడా కచ్చితంగా చెప్పలేం. అయినా రష్యన్ ట్యాంకులు థర్మల్ ఇమేజర్లతో అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దాడి మాత్రం కాదు. ఈ దాడిని అణు టెర్రర్‌గా అభివర్ణించారు. కానీ మాకు దేనిపై కాల్పులు జరుపుతున్నాం అనే విషయం పై స్పష్టమైన అవగాహన ఉంది. చర్నోబిల్ గురించి ప్రస్తావిస్తూ..ఆ ప్రపంచ విపత్తు పర్యవసానాన్ని వందల వేలమంది ప్రజలు ఎదుర్కొన్నారు. పదివేల మంది ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. రష్యా దీన్ని పునరావృతం చేయాలనే దురాలోచన కలిగి ఉంది. యూరోపియన దేశాల నాయకులారా మేల్కొండి. జపోరిజ్జియా 15 బ్లాక్‌లు కలిగిన అతి పెద్ద ప్లాంట్. ఒక వేళ పేలుడు సంభవించినట్లయితే ఇది ఐరోపా వాసులందరకీ ముగింపే అనే విషయాన్ని గుర్తించండి. అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. Терміново! pic.twitter.com/MuXfniddVT — Володимир Зеленський (@ZelenskyyUa) March 4, 2022 (చదవండి: భారీ విధ్వంసానికి రష్యా ప్లాన్.. ఆందోళనలో ఐరోపా దేశాలు..!) -
భారీ విధ్వంసానికి రష్యా ప్లాన్.. టెన్షన్లో ఐరోపా దేశాలు..!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. నేటితో 9వ రోజుకు చేరుకున్నరష్యా సైనిక దాడులు శుక్రవారం పీక్ స్జేజ్‌కు చేరుకున్నాయి. తొమ్మిదొవ రోజు రష్యా బలగాలు యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన జాపోరిజ్జియా న్యూక్లియర్ప్లాంట్ను టార్గెట్ చేసి రాకెట్ దాడులు జరిపాయి.దీంతో ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషయాన్నిఎనర్గోదర్ పట్టణ మేయర్ దిమిత్రో ఓర్లోవ్ ధృవీకరించారు. ఆ సమయంలో వెంటనే అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణా నష్టం జరగలేదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు స్పందించారు. యూకే ప్రధానరి బోరిస్ జాన్సన్.. శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్లక్ష్య చర్యలు, దాడులు ఐరోపా భద్రతకు సవాళ్లు విసురుతున్నాయన్నారు. వారి చర్యలు ఐరాపాకు తీవ్ర నష్టం కలిగించేలా, భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. న్యూ క్లియర్ ప్లాంట్‌పై దాడిని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో సైతం ఖండించారు. జెలెన్ స్కీకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రూడో.. ఈ సందర్భంగా అణు విద్యుత్ కేంద్రంపై దాడి రష్యాకు ఆమోద యోగ్యం కాదన్నారు. అక్కడ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కాగా, జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్ యూరప్‌లోనే అతిపెద్ద ప్లాంట్. ఇది గనుక పేలితే చెర్నోబిల్ కంటే పదిరెట్లు నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అగ్నికీలల్లో ఉక్రెయిన్ అణుప్లాంట్.. పేలితే పెనువిషాదమే!
రష్యా వైమానిక దాడుల్లో యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జాపోరిజ్జియా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అధికారికంగా ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆగ్నేయం వైపు నైపర్ నదీ తీరాన ఉంది జాపోరిజ్జియా పారిశ్రామిక నగరం. ఇక్కడే యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌ను నెలకొల్పారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు ఈ ప్లాంట్‌పై రాకెట్ లాంఛర్లతో దాడికి తెగబడ్డాయి. నలువైపులా దాడులు చేయడంతో.. ప్లాంట్ మంటల్లో చిక్కుకుంది. Russian RPG attack on #Zaporizhzhia nuclear power plant #UkraineRussianWar #Ukriane ⚠️⚠️🚨🚨⚠️🚨🚨🌎🚀🇺🇦 pic.twitter.com/EPz6nH4Ug8 — UKRAİNİAN 💎 (@donetekk) March 4, 2022 ఉక్రెయిన్‌కు దాదాపు 40 శాతం అణు విద్యుత్ ఈ స్టేషన్ నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని అణు ప్లాంట్లను టార్గెట్ చేసింది. జాపోరిజ్జియా గనుక పేలిందంటే.. చెర్నోబిల్ విషాదం(1986లో జరిగిన పెను విషాదం) కంటే ఘోరంగా డ్యామేజ్ ఉంటుందని, రేడియేషన్ ఎఫెక్ట్ చెర్నోబిల్ కంటే పదిరెట్లు ఎక్కువ ప్రభావం చూపెడుతుందని కుబేలా ప్రకటించారు. రష్యన్లు వెంటనే దాడుల్ని ఆపివేయాలి, అగ్నిమాపక సిబ్బందిని అనుమతించాలి, ఆ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా ఏర్పాటు చేయాల్సిందే అని ట్వీట్ చేశారు కుబేలా. #Ukraine tells IAEA that fire at site of #Zaporizhzhia Nuclear Power Plant has not affected “essential” equipment, plant personnel taking mitigatory actions. — IAEA - International Atomic Energy Agency (@iaeaorg) March 4, 2022 మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలోనూ రష్యా దాడులు కొనసాగినట్లు సమాచారం. అయితే జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ప్రదేశంలో జరిగిన అగ్నిప్రమాదం.. కీలకమైన విభాగాల్ని ప్రభావితం చేయలేదని, ప్లాంట్ సిబ్బంది ఉపశమన చర్యలు తీసుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి (IAEA) వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా, ఉక్రెయిన్ను ఆరా తీసింది. మరోవైపు ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలు న్యూక్లియర్ ప్లాంట్లపై దాడుల్ని చేయొద్దంటూ రష్యాను కోరుతున్నాయి. -
రష్యాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్..
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యం వెన్ను చూపకుండా రష్యా బలగాలను ఎదుర్కొంటోంది. పూర్తి సామర్థ్యం మేరకు ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడికి దిగుతోంది. ఉక్రెయిన్‌తో పోరులో రష్యా సైన్యంలో వేల సంఖ్యలో మృత్యువాతపడ్డినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ సోమవారం సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. సైనిక దాడుల్లో రష్యాకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రష్యా బలగాలు నైతిక ధైర్యాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమ దేశంపై రష్యా దాడుల తీవ్రత తగ్గిందన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణదారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ బిగ్రేడ్స్.. తమ శత్రువు యుద్ధ వాహనాలను, సైనికులకు దెబ్బతీశాయని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో వాస్తవ పరిస్థితులను చూసి రష్యా భయపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై సైనిక దాడుల్లో రష్యా బలగాలు ఆగ్నేయ ప్రాంతంలోని జపోరిజ్జియా అణువిద్యుత్ ప్లాంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనంతరం బెర్డ్యాన్స్క్, ఎనర్హోదర్ పట్టణాలను సైతం రష్యా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. -
తైషాన్ ప్లాంట్‌తో ప్రమాదమేమీ లేదు: చైనా
బీజింగ్/హాంకాంగ్: తైషాన్ న్యూక్లియర్ ప్లవర్ ప్లాంట్ చుట్టుపక్కన అసాధారణ అణు ధార్మికత స్థాయి ఆనవాళ్లలేవీ లేవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్లాంట్ నుంచి ప్రమాదకర వాయువులు లీక్ అవుతున్నాయనే వార్తలను కొట్టిపారేశారు. ప్రజల భద్రతకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తైషాన్ ప్లాంట్‌ను ప్రమాదకరమైన వాయువు వెలువడుతున్నట్లు సహ భాగస్వామి అయిన ఫ్రాన్స్ కంపెనీ ఫ్రామటోమ్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం అమెరికా సాయాన్ని కోరింది. గ్యాస్ లీకేజీని అడ్డుకోకపోతే ఇదొక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరించారు. -
మొసలికి చిప్..
ఇక్కడ కనిపిస్తున్నవి ఓ బకెట్లో ఉంచిన చిన్న చిన్న మొసలి పిల్లలు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం హోంస్టెడ్లో ఉన్న అణు విద్యుత్ కేంద్రం వద్ద మొసళ్లు చాలా ఉంటాయి. ఈ అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించిన 168 మైళ్ల పొడవైన కాలువల్లో ఇవన్నీ పెరుగుతుంటాయి. వీటి ఎదుగుదలను గమనించేందుకు, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా నిపుణులు ఉన్నారు. చిన్న మొసళ్ల శరీరంలో ఓ చిప్‌ను అమర్చి, మళ్లీ వాటిని నీళ్లలో వదిలేసి, వాటి ఆరోగ్య వివరాలను ఆ చిప్ ద్వారా తెలుసుకుంటుంటారు. పర్యావరణ మార్పులు, వేటగాళ్ల బారి నుంచి మొసళ్లను కాపాడేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. -
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం!
ప్యోంగ్యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దక్షిణ, ఉత్తర కొరియాలలో ఒకే సమయం ఉండాలని కిమ్ భావించి తమ దేశ సమయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. భారీ అణ్వాయుధాలకు అడ్డాగా మారిన ఉత్తర కొరియా తన న్యూక్లియర్ పరీక్షలను ఈ నెలలోనే నిలిపివేయాలని భావిస్తోంది. ఈ మేరకు విదేశీ మీడియా సంస్థల సమక్షంలో అణ్వస్త్రాలను పరీక్షించే వేదికను ధ్వంసం చేసి, ఆపై మూసివేయనున్నట్లు కిమ్ తాజాగా ప్రకటించారు. తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా నియంత తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ ప్రకటనకు కట్టుబడి న్యూక్లియర్ ప్లాంట్‌ను ధ్వంసం చేసి అణ్వాయుధాలకు తాము కూడా వ్యతిరేకమని ప్రపంచానికి చాటిచెప్పాలని కిమ్ భావిస్తున్నారు. మే 23-25 తేదీలలో ఈ పని చేయనున్నట్లు నార్త్ కొరియా ఉన్నతాధికారులు వెల్లడించారు. కిమ్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వాగతించడంతో పాటు ప్రశంసించారు. ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్ జోంగ్ ఉన్ తన తాజా నిర్ణయాలతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగా అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. కాగా, చైనాలోనూ పర్యటిస్తూ అగ్రదేశాలతో సత్సంబంధాల కోసం కిమ్ యత్నిస్తున్న విషయం విదితమే. -
దాడి చేయనని హామీ ఇస్తే అణ్వస్త్రాలను త్యజిస్తాం
సియోల్/వాషింగ్టన్: కొరియా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు అధికార ప్రకటన చేయటంతో పాటు తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా తెలిపింది. ఇటీవల జరిగిన అగ్రనేతల చారిత్రక సమావేశం సందర్భంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రతిపాదన చేశారని దక్షిణకొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి యూన్ యంగ్–చాన్ తెలిపారు. దీంతోపాటు వచ్చే మేలో అణు పరీక్షల ప్రాంతాన్ని మూసి వేయటంతోపాటు ఈ కార్యక్రమానికి అమెరికా, దక్షిణ కొరియా నిపుణులు, మీడియాను ఆహ్వానిస్తామని కిమ్ తెలిపారన్నారు. తాము అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకమని, ఈ విషయంలో పారదర్శకతతో ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పేందుకే కిమ్ ఈ ప్రతిపాదన చేశారని చాన్ చెప్పారు. ‘మేం అమెరికాతో తరచుగా చర్చలు జరిపితే, రెండు దేశాల మధ్య విశ్వాసం పెంపొందుతుంది. అప్పుడు యుద్ధ వాతావరణం సమసిపోతుంది. అలాంటప్పుడు మాకు అణ్వాయుధాలతో పనే ముంటుంది?’ అని కిమ్ తెలిపారన్నారు. -
శ్రీకాకుళంలో పవర్‌ప్లాంట్ ఏర్పాటుపై సందేహాలు
-
పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు
బ్రస్సెల్స్ లో వరుస పేలుళ్లు మారణహోమం సృష్టించిన నేపథ్యంలో రెండు అణువిద్యుత్ ప్లాంట్ లను తరలించినట్టు తెలుస్తోంది. బెల్జియంలోని తిహాంగే, డోయల్ ప్లాంట్లను తరలించారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తరలింపు గల పూర్తి కారణాలు తెలియరాలేదు. ఈ విషయాన్నిఫ్రెంచ్ బహుళజాతి విద్యుత్ వినియోగ కంపెనీ ఇన్జై ఒక ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. రక్షణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొంతమంది ముఖ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. బ్రసెల్స్ లో మంగళవారం ఉదయించిన ఈ పేలుళ్లలో కనీసం 34 మంది మరణించగా 170 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. -
'మేమేం రష్యాపై ఆధారపడం.. చాలా దేశాలున్నాయి'
ఇస్తాంబుల్: తామేం రష్యాపై ఆధారపడబోమని టర్కీ ప్రకటించింది. రష్యాకాకపోతే అలాంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. రష్యా యుద్ధ విమానాన్ని కూల్చివేసినప్పటికి నుంచి టర్కీ, రష్యాల మధ్య వైరుధ్యం పెరుగుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్న ఆ దేశాలు ఇక తమ మధ్య ఎలాంటి సహకారం ఉండబోదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అణువిద్యుత్ కోసం తామేం రష్యాపై ఆధారపడబోమని టర్కీ బుధవారం ప్రకటన చేసింది. సాంకేతిక పరిజ్ఞానం పొందే విషయంలో తామేం ఒకరి ఇంటి గుమ్మం ముందు సాగిలపడబోమంటూ టర్కీ వ్యాఖ్యానించింది. రష్యాకు చెందిన అణువిద్యుత్ సంస్థ రోసాటోమ్ టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్ లో గల అక్కుయులో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించింది. కాగా, ఇటీవల రష్యా కు చెందిన యుద్ద విమానాన్ని టర్కీ కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఒక్క రష్యా ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంటును నిర్మాణిస్తున్న రష్యాకు చెందిన సంస్ధ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు నిరాసక్తత చూపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా టర్కీ డిప్యూటీ ప్రధాని నుమన్ కుర్తుల్మస్ ఈ ప్రకటన చేశాడు. రష్యా ఒక్కటే కాదని, ఎన్నో దేశాలు తమ డిమాండ్లకు తగిన విధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రష్యా తలపెట్టిన ఈ ప్లాంటు పూర్తయితే టర్కీలో తొలి అణువిద్యుత్ ప్లాంట్ గా నిలిచేది. -
అణు’ ప్రాంతాల్లో ఆంక్షలు
శ్రీకాకుళం సిటీ: అణుకుంపటి మళ్లీ అంటుకుంటోంది. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అణు ప్లాంట్ ఏర్పాటుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన తాజా జీవో మళ్లీ నిప్పు రాజేసింది. అధికారంలో లేనప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా ద్వంద్వవైఖరి అవలంభిస్తున్న ప్రభుత్వం తెర వెనుక మాత్రం అణు ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని, దానికి భిన్నంగా భూసేకరణ చేపట్టబోమని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్టారెడ్డి ఒక పక్క శాసనమండలిలో చెప్పగా.. అదే రోజు కొవ్వాడ అణు కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరించి.. వాటి పరిధిలో ఎటువంటి అభివృద్ధి పను లు చేపట్టకుండా ఆంక్షలు విధిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలిలోనూ చర్చ అంతకుముందు శనివారం ఉదయం శాసనమండలిలోనూ అణు ప్లాంట్‌పై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పర్యావరణ, అటవీ, ఇతరత్రా అనుమతులు పొందకుండా భూసేకరణ చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. అందువల్ల ఇప్పటివరకు కొవ్వాడలో జరిగిన భూసేకరణను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. భూ ప్రకంపనల అధ్యయన నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అనుమతులు పొంది, 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. దీనిపై అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పందిస్తూ కోర్టు తీర్పుకు భిన్నంగా జరిగి ఉంటే కొవ్వాడలో భూసేకరణను రద్దుచేస్తానని, భూకంప నివేదిక తర్వాతే ప్రభుత్వం తరపున ఆమోదం తెలుపుతామని ప్రకటించారు. నాలుగు జోన్లలో ఆంక్షలు ప్రతిపాదిత కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరిస్తూ.. వాటి పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని ఆదేశిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నెం. 186ను జారీ చేసింది. పర్యావరణ శాఖ, అణుశక్తి రెగ్యులేటరీ బోర్డు సూచనల మేరకు ఈ ఆంక్షలు విధించినట్లు జీవోలో పేర్కొన్నారు. ఆ నాలుగు జోన్లు ఏవంటే.. రణస్థలం మండలంలోని రామచంద్రాపురం, టెక్కలి, గూడెం గ్రామాలు ఎక్స్‌క్లూజన్ జోన్ పరిధిలోకి వస్తాయని, ఈ ప్రాంతాల్లో నివాస, ఆవాసాలకు అనుమతులు ఇవ్వరాదని పేర్కొన్నారు. స్టెరిలైజ్డ్ జోన్ పరిధిలోకి అక్కయ్యపాలెం, చిల్లపేటరాజాం, దేరశాం, కోటపాలెం, జీరుకొవ్వాడ, మరువాడ, మెంటాడ, ఎన్.గజపతిరాజపురం, పాపారావుపేట, పాతర్లపల్లి, పాతసుందరపాలెం, సీతారాంపురం, సూరంపేట, తెప్పలవలస తదితర గ్రామాలను చేర్చారు. ప్లాంట్‌కు 5 కి.మీ. పరిధిలో ఉన్న ఈ గ్రామాలను నిషిద్ధ ప్రాంతంగా నోటిఫై చేశారు. ఎమర్జెన్సీ ప్లానింగ్ జోన్ కింద ప్లాంట్ చుట్టూ 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ప్రాంతాలను గుర్తించారు. ఈ పరిధిలో ప్లాంట్ ఉద్యోగుల గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి నిర్మాణాలు చేపడతారు. ప్లాంట్‌కు 30 కి.మీ. విస్తీర్ణం వరకు ఇంపాక్ట్ అసెస్మెంట్ జోన్‌గా గుర్తించారు. దీని పరిధిలో అణు ప్లాంట్ ప్రభావంపై అధ్యయనాలు నిర్వహిస్తారు. నాడు వ్యతిరేకించిన వారే.. ఈ జీవోతో అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి స్పష్టమైంది. ప్రతిపక్షంలో ఉండగా ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమాలను ప్రోత్సహించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించి అణు విద్యుత్‌కు యథోచిత సహకారం అందించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అణు పార్కుకు అనుకూలంగా ఉందని స్పష్టమవుతోంది. ఇది నిజంగా ప్రజలను మోసం చేయడమే.. నేను శనివారం శాసనమండలిలో అణు భూసేకరణను రద్దు చేయాలని కోరాను. అటవీశాఖ మంత్రి సానుకూలంగా మాట్లాడారు. ఇంతలోనే పురపాలక శాఖ నుంచి నాలుగు జోన్లలో ఎటువంటి అభివృధ్ది పనులు చేయకూడదంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదంతా అణు పార్కుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్నే సూచిస్తోంది. దీనిపై పోరాడతాం. - ఎంవీఎస్ శర్మ, ఎమ్మెల్సీ -
తమిళనాడు ఇడింతకురై సమీపంలో పేలుడు