రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నానాటికి ఉగ్ర రూపం దాల్చుతుందే గానీ తగ్గే సూచనలు కనిపించడంలేదు. ఐతే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజజియా ప్లాంట్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ప్రారంభమైన తొలి దశలోనే రష్యా దళాలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అణువిద్యుత్ పై బాంబుల వర్షం కురిపించింది.
దీంతో ప్లాంట్‌ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఐతే యుద్ధ తీవ్రరూపం దాల్చడంతో తాజాగా ఈ దాడుల్లో ఒక షెల్ ప్లాంట్ పై పడినట్లు తెలుస్తోంది. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ బలగాలే అణువిద్యుత్ ప్లాంట్ పై దాడులు జరిపాయని, ఇదంత ఉక్రెయిన్ నిర్వాకమే అంటూ ఆరోపణుల చేస్తోంది. ఇది ఐరోపాతో సహా దాని పొరుగు దేశాలకు అత్యంత ప్రమాదకరం అని రష్య ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.
పైగా ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఇప్పుడైనా మేల్కోని అలాంటి షెల్లింగ్ దాడులు చేయొద్దని ఉక్రెయిన్‌కి హితవు చెప్పాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పై దురాక్రమణకు దాడి దిగిందే కాకుండా తప్పంతా ఉక్రెయిన్ పై నెట్టేసి ఇప్పుడూ నీతి కబుర్లు చెబుతోంది రష్యా. అయినా యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే రష్యా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దాడి చేసిన విషయాన్ని విస్మరిస్తూ ఉక్రెయిన్‌ని నిందించడం గమనార్హం. మరోవైపు రష్యా చేసిన వ్యాఖ్యలన్ని అవాస్తవం అంటూ ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఐతే ఈ విషయమై యూఎన్ కూడా ఇరు దేశాలను హెచ్చరించింది.
(చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment