
If There is an explosion, it is the end for everyone: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ భీకరమైన దాడిలో రష్యా కొన్ని ముఖ్యనగరాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో రష్యా జనవాసాలను, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణుకర్మాగారం పై దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ వెంటనే ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో జెలెన్ స్కీ... చెర్నోబిల్ అనే పదం తెలిసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఇది గనుక పేలితే ఐరోపా అంతం అవుతుందని రాష్ట్రపతి చెప్పారు. అంతేకాదు ఆ అణు కర్మాగారాన్ని తాము ఇంత వరకు సురక్షితంగా ఉంచాం. మేము ఈ యుద్ధంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఈ దాడి కారణంగా అది ఎప్పుడూ పేలుతుందో కూడా కచ్చితంగా చెప్పలేం. అయినా రష్యన్ ట్యాంకులు థర్మల్ ఇమేజర్‌లతో అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దాడి మాత్రం కాదు. ఈ దాడిని అణు టెర్రర్‌గా అభివర్ణించారు. కానీ మాకు దేనిపై కాల్పులు జరుపుతున్నాం అనే విషయం పై స్పష్టమైన అవగాహన ఉంది. చర్నోబిల్ గురించి ప్రస్తావిస్తూ..ఆ ప్రపంచ విపత్తు పర్యవసానాన్ని వందల వేలమంది ప్రజలు ఎదుర్కొన్నారు.
పదివేల మంది ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. రష్యా దీన్ని పునరావృతం చేయాలనే దురాలోచన కలిగి ఉంది. యూరోపియన దేశాల నాయకులారా మేల్కొండి. జపోరిజ్జియా 15 బ్లాక్‌లు కలిగిన అతి పెద్ద ప్లాంట్. ఒక వేళ పేలుడు సంభవించినట్లయితే ఇది ఐరోపా వాసులందరకీ ముగింపే అనే విషయాన్ని గుర్తించండి. అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
Терміново! pic.twitter.com/MuXfniddVT
— Володимир Зеленський (@ZelenskyyUa) March 4, 2022
(చదవండి: భారీ విధ్వంసానికి రష్యా ప్లాన్.. ఆందోళనలో ఐరోపా దేశాలు..!)