
వాషింగ్టన్: అమెరికా(USA) అధ్యక్షుడితో భేటీ అంటే హంగామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అగ్రదేశాధ్యక్షుడు ముందు మిగతా దేశాధ్యక్షులు చాలా నెమ్మదిగా వ్యవరిస్తారనే భావన మనలో చాలామందికే ఉంటుంది. . మరి అందరి దేశాధినేతలు వలే ఉంటే చెప్పుకోవడానికి ఏముంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్‌స్కీ(Zelensky) స్టైలే సెపరేటు.
‘నలుగురు వెళ్లే దారిలో నేను వెళ్లను.. నా దారి రహదారి’ అనే ముక్కుసూటితనం జెలెన్‌స్కీలో కనిపిస్తూ ఉంటుంది. రష్యాతో యుద్ధం మొదలుకొని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తో నిన్నటి చర్చల వరకూ జెలెన్‌స్కీ ప్రత్యేక పంథాలోనే వెళుతున్నారు. ఎక్కడా తగ్గేదే లే.. నా రూటే సెపరేట్ అన్న శైలి ఆయనలో కనిపిస్తోంది. ట్రంప్ తో భేటి అయ్యే క్రమంలో కూడా జెలెన్‌స్కీ సాధారణంగానే వచ్చారు. ఎక్కడ హంగు, ఆర్భాటం లేకుండా వైట్ వైస్ లో దర్శనమిచ్చారు. అయితే జెలెన్‌స్కీ కనీసం సూట్ కూడా ధరించకుండా ట్రంప్ తో భేటీ కావడంపై అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ లో ఆసక్తిని పెంచింది. ఉండబట్టలేక అడిగేశాడు.
సూట్ ధరించకపోతే నీకేమైనా నష్టమా?
అయితే దీనికి కూడా జెలెన్‌స్కీ తనదైన స్టైల్ లోనే సమాధానమిచ్చారు. ‘సూట్ ధరించకపోతే నీకేమైనా సమస్యా.. లేక ఏమైనా నష్టమా? అంటూ జెలెన్‌స్కీ అనడంతో సదరు రిపోర్టర్ కాస్త కంగుతిన్నాడు. దాన్ని సరిచేసుకునే క్రమంలోనే ఆ రిపోర్టర్.. కాదు కాదు.. చాలా మంది అమెరికన్లలో ఒక భావన ఉంది. వైట్ హౌస్ ఆఫీస్ కి హాజరయ్యే క్రమంలో డ్రెస్ కోడ్ కు విలువ ఇవ్వరనే అమెరికన్లు అనుకుంటూ ఉంటారు అంటూ సర్దుకునే యత్నం చేశాడు రిపోర్టర్..
ఆ రోజు వచ్చినప్పుడే సూట్ ధరిస్తా..
దీనికి ప్రతిగా జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ‘ నేను కచ్చితంగా సూట్ ధరిస్తా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన క్షణమే నేను సూట్ ధరిస్తా. ఆ రోజు వచ్చినప్పుడు నేను సూట్ ను కచ్చితంగా వేసుకుంటాను. డ్రెస్ కోడ్ ను బట్టి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయొద్దు.. మీలాగ. థాంక్యూ’ అంటూ సమాధానమిచ్చారు.
జెలెన్‌స్కీ మద్దతుగా నెటిజన్లు..
జెలెన్‌స్కీ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు డ్రెస్ కోడ్ ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. అలా అయితే ట్రంప్ తొలి క్యాబినెట్ సమావేశానికి ఎలన్ మస్క్ సూట్ తో ఎందుకు రాలేదు.. కేవలం టీ షర్ట్ మాత్రమే ఎందుక ధరించారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, అసలు మిమ్ముల్ని ఆ క్వశ్చన్ అడిగిన రిపోర్టర్ సూట్ ఎందుకు ధరించలేదో అడగండి’ అంటూ మరొకరు నిలదీశారు. ఇలా జెలెన్‌స్కీపై ఏ రకంగా చూసినా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అమెరికాతో పెట్టుకున్నప్పుడు భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని కొందరు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రస్తుతానికి జెలెన్‌స్కీకి మద్దతు మాత్రం పెద్ద ఎత్తులోనే లభిస్తూ ఉండటం విశేషం.

Q: "Why don't you wear a suit?"
Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025
WHY doesn’t THIS guy wear a suit? pic.twitter.com/ZAQHWYjIob
— The Resistor Sister®️♥️🇺🇸 (@the_resistor) February 28, 2025
Comments
Please login to add a commentAdd a comment