nuclear terrorism
-
అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ
If There is an explosion, it is the end for everyone: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ భీకరమైన దాడిలో రష్యా కొన్ని ముఖ్యనగరాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో రష్యా జనవాసాలను, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణుకర్మాగారం పై దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ వెంటనే ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జెలెన్ స్కీ... చెర్నోబిల్ అనే పదం తెలిసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఇది గనుక పేలితే ఐరోపా అంతం అవుతుందని రాష్ట్రపతి చెప్పారు. అంతేకాదు ఆ అణు కర్మాగారాన్ని తాము ఇంత వరకు సురక్షితంగా ఉంచాం. మేము ఈ యుద్ధంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఈ దాడి కారణంగా అది ఎప్పుడూ పేలుతుందో కూడా కచ్చితంగా చెప్పలేం. అయినా రష్యన్ ట్యాంకులు థర్మల్ ఇమేజర్లతో అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దాడి మాత్రం కాదు. ఈ దాడిని అణు టెర్రర్‌గా అభివర్ణించారు. కానీ మాకు దేనిపై కాల్పులు జరుపుతున్నాం అనే విషయం పై స్పష్టమైన అవగాహన ఉంది. చర్నోబిల్ గురించి ప్రస్తావిస్తూ..ఆ ప్రపంచ విపత్తు పర్యవసానాన్ని వందల వేలమంది ప్రజలు ఎదుర్కొన్నారు. పదివేల మంది ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. రష్యా దీన్ని పునరావృతం చేయాలనే దురాలోచన కలిగి ఉంది. యూరోపియన దేశాల నాయకులారా మేల్కొండి. జపోరిజ్జియా 15 బ్లాక్‌లు కలిగిన అతి పెద్ద ప్లాంట్. ఒక వేళ పేలుడు సంభవించినట్లయితే ఇది ఐరోపా వాసులందరకీ ముగింపే అనే విషయాన్ని గుర్తించండి. అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. Терміново! pic.twitter.com/MuXfniddVT — Володимир Зеленський (@ZelenskyyUa) March 4, 2022 (చదవండి: భారీ విధ్వంసానికి రష్యా ప్లాన్.. ఆందోళనలో ఐరోపా దేశాలు..!) -
21వ శతాబ్దంలో వాటితో పెను ముప్పు!
వాషింగ్టన్: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. కొన్ని దేశాలు అణ్వాయుధాలు తయారు చేయడం కొన్నిసార్లు వినాశనానికి దారితీస్తుందని అమెరికా అభిప్రాయపడింది. 2018లో న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ (ఎన్పీఆర్) సమావేశంలో ఉన్నతాధికారులు, కొన్ని శాఖల అధిపతులు పలు అంశాలపై చర్చించారు. 21వ శతాబ్దంలో అణ్వాయుధ ఉగ్రవాదంతో పెను ముప్పు పొంచి ఉంటుందని అమెరికా రాజకీయ వ్యవహారాలశాఖ కార్యదర్శి టామ్ షానన్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం గానీ, ఉగ్రవాదులకు ఆశ్రయంగానీ ఇచ్చినట్లు గుర్తిస్తే ఇతర దేశాలను ఉపేక్షించేది లేదన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నట్లు ఏదైనా దేశంపై ఆరోపణలు రుజువైతే ఆ దేశాన్ని ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదివరకే పలుమార్లు ఈ అంశంపై పాకిస్తాన్‌ను హెచ్చరించామని, అయితే తాము ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని, తమ దేశంలో ఉగ్రవాదులే లేరని పాక్ చెబుతోందని ఈ సందర్భంగా షానన్ గుర్తుచేశారు. ఉగ్రవాద దేశాలు, అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలపై 100 పేజీల నివేదికను అమెరికా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇరాన్, ఉత్తర కొరియాలు అణ్వస్త్ర సామర్థ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని.. వాటిని ఆ దేశాలు ఎందుకోసం వినియోగించనున్నాయన్న దానిపై ఎన్పీఆర్ సమావేశంలో చర్చించినట్లు షానన్ వెల్లడించారు. -
అణు ఉగ్రవాదంపై అప్రమత్తత అవసరం
ఐక్యరాజ్యసమితి: అణ్వస్త్ర ఉగ్రవాదం సవాళ్లను, ముప్పును ఎదుర్కొనేందుకు అంతర్జాతీయు సహకారం అవసరమని భారత్ స్పష్టంచేసింది. అత్యంత ప్రమాదకరమైన అణ్వస్త్ర సామాగ్రిని ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు సమకూర్చుకోకుండా నివారించేలా అణ్వస్త్ర భద్రతా వ్యవస్థను బలోపేతంచేసేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని భారత్ సూచించింది. అణ్వస్త్ర ఉగ్రవాదం అంతర్జాతీయు సమాజానికి తీవ్రమైన సవాలుగా పరిణమించిన నేపథ్యంలో ఈ చర్యలు అవసరమని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లోని భారత శాశ్వత బృందం ఫస్ట్ సెక్రెటరీ అభిషేక్ చెప్పారు. సోమవారం ఐరాస సర్వప్రతినిధి సభలో అంతర్జాతీయు అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వార్షిక నివేదికపై ప్రకటన సందర్భంగా అభిషేక్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సభ్య దేశాల్లో రాజకీయపరంగా జోక్యం చేసుకునేటప్పుడు ఐక్యరాజ్యసమితి మరింత పారదర్శకంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. నిర్దేశిత లక్ష్యానికి, వాస్తవానికి చాలా అంతరం ఉంటోందని, దీనిని తగ్గించేందుకు సభ్య దేశాలతో లోతుగా చర్చలు జరపాలని కోరారు. సభ్య దేశాల సహాయ సహకారాలతో సాగించే శాంతి పరిరక్షక దళాలు సహా అన్ని కార్యకలాపాలపై పూర్తి స్థాయి సమాచారం అందజేయాలని సింగ్ పేర్కొన్నారు. మరోవైపు పరివేష్టిత(సముద్ర తీర ప్రాంతం లేని) దేశాల అభివృద్ధికి ప్రత్యేక ఎజెండా అవసరమని భారత్ పేర్కొం ది. పరివేష్టిత దేశాల అభివృద్ధిపై వియన్నాలో ఐక్యరాజ్యసమితి రెండవ సమావేశం జరిగింది.