లివివ్: రష్యాపై ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఒలెక్సిల్ రెజ్‌నికోవ్ సంచలన ఆరోపణలు చేశారు. పైకి యుద్ధం చేస్తున్నామని ప్రకటించిన రష్యా.. తమ దేశ పౌరులపై ఘాతుకానికి పాల్పడిందని అన్నారు. తమ దేశ సైన్యంపై విరుచుకుపడుతూనే అమాయక ప్రజల ప్రాణాలను తీసిందని శుక్రవారం ఆరోపించారు. ఈ నిజం కీవ్‌కు మాత్రమే కాదు.. ప్రపంచానికి తెలియాలనే చెప్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. ఇప్పటికే చెర్నోబిల్ అణు విద్యుత్‌ప్లాంట్‌పై పట్టు సాధించిన రష్యా.. తమపై నింద మోపేందుకు పక్కా ప్లాన్‌తో ఉందని ఒలెక్సిల్ అన్నారు. ప్లాంట్‌పై టెర్రరిస్టు అటాక్ చేయించేందుకు పుతిన్ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తద్వారా అణు విద్యుత్ ప్లాంట్ పరిరక్షించే పూర్తి బాధ్యత తమపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా చర్యల వల్ల విధ్వంసం జరిగితే పూర్తిగా బలయ్యేది ఉక్రెయిన్ కాబట్టి.. ఈ ఎత్తుగడకు పుతిన్ పూనుకున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంతో ఉక్రెయిన్ సంబంధాలు కోల్పోయిందని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ గురవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment