సియోల్/వాషింగ్టన్: కొరియా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు అధికార ప్రకటన చేయటంతో పాటు తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా తెలిపింది. ఇటీవల జరిగిన అగ్రనేతల చారిత్రక సమావేశం సందర్భంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రతిపాదన చేశారని దక్షిణకొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి యూన్ యంగ్–చాన్ తెలిపారు.
దీంతోపాటు వచ్చే మేలో అణు పరీక్షల ప్రాంతాన్ని మూసి వేయటంతోపాటు ఈ కార్యక్రమానికి అమెరికా, దక్షిణ కొరియా నిపుణులు, మీడియాను ఆహ్వానిస్తామని కిమ్ తెలిపారన్నారు. తాము అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకమని, ఈ విషయంలో పారదర్శకతతో ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పేందుకే కిమ్ ఈ ప్రతిపాదన చేశారని చాన్ చెప్పారు. ‘మేం అమెరికాతో తరచుగా చర్చలు జరిపితే, రెండు దేశాల మధ్య విశ్వాసం పెంపొందుతుంది. అప్పుడు యుద్ధ వాతావరణం సమసిపోతుంది. అలాంటప్పుడు మాకు అణ్వాయుధాలతో పనే ముంటుంది?’ అని కిమ్ తెలిపారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment