ట్రంప్‌నకు కిమ్‌ దేశం షాక్‌ | Kim Jong Un May Skip Meet With Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు కిమ్‌ దేశం షాక్‌

May 16 2018 8:59 AM | Updated on Jul 29 2019 5:39 PM

Kim Jong Un May Skip Meet With Trump - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

ప్యాంగ్‌యాంగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉత్తరకొరియా షాక్‌ ఇచ్చింది. అణ్వస్త్రాల నిరాయుధీకరణ, కొరియా యుద్ధానికి అధికారికంగా ముగింపు పలకడంపై దక్షిణ కొరియాతో జరగుతున్న చర్చలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా-దక్షిణ కొరియాలు మిలటరీ విన్యాసాలు చేయడానికి సిద్ధమవుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

ఇలా చేయడం ఉత్తరకొరియాను రెచ్చగొట్టడమేనని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో ట్రంప్‌-కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య జరగాల్సిన భేటీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఉత్తరకొరియాను మాటలతో లొంగదీశానని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్‌నకు ఇది గట్టి ఎదురుదెబ్బే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement