పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు | Belgian media reports of Tihange nuclear plant evacuation | Sakshi
Sakshi News home page

పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు

Published Tue, Mar 22 2016 8:41 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు - Sakshi

పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు

బ్రస్సెల్స్ లో వరుస పేలుళ్లు మారణహోమం సృష్టించిన నేపథ్యంలో రెండు అణువిద్యుత్ ప్లాంట్ లను తరలించినట్టు తెలుస్తోంది. బెల్జియంలోని తిహాంగే, డోయల్ ప్లాంట్లను తరలించారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం  తీసుకున్నట్టు  సమాచారం.  తరలింపు గల  పూర్తి కారణాలు తెలియరాలేదు.

ఈ విషయాన్నిఫ్రెంచ్ బహుళజాతి విద్యుత్ వినియోగ కంపెనీ ఇన్జై ఒక  ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో  సేవలందిస్తున్న ఈ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. రక్షణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొంతమంది ముఖ్య సిబ్బంది  పర్యవేక్షణలో ప్లాంట్  కార్యకలాపాలు కొనసాగుతాయని  తెలిపారు. బ్రసెల్స్ లో మంగళవారం ఉదయించిన  ఈ పేలుళ్లలో  కనీసం 34 మంది మరణించగా 170 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement