సాధారణంగా ఎవరైనా పండ్లను చూపించి.. ‘ఇవి శాకాహారమా? మాంసాహారమా?’ అని అడిగితే చిత్రంగా అనిపిస్తుంది. ‘ఏమిటా పిచ్చి ప్రశ్న.. పండ్లలో ఎక్కడైనా మాంసం ఉంటుందా?’ అంటూ కోపం తన్నుకొస్తుంది. అయితే చాలామంది ‘అంజీరా పండ్లు శాకాహారమా? మాంసాహారమా?’ అనే ప్రశ్నే వేస్తున్నారు. ఎందుకంటే ‘పండులందు అంజీరా పండు వేరయా’ అంటున్నారు నిపుణులు. సైంటిఫిక్ రీజన్స్ చూపిస్తూ ‘ఈ పండు ముమ్మాటికీ మాంసాహారమే!’ అని తేల్చేస్తున్నారు.
అసలెందుకు అంజీరాను మాంసాహారం అంటున్నారంటే.. ఆ పండులో జరిగే పరాగ సంపర్క క్రియనే దానికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు. పరాగ సంపర్కం కోసం కందిరీగలు.. అంజీర్ పండ్లను ఆశ్రయిస్తుంటాయి. ఆ పండ్ల సూక్ష్మ రంధ్రాల్లోనికి వెళ్లిన కందిరీగలు పరాగ సంపర్కం చేస్తాయి, అనంతరం బయటకి రాలేక కొన్ని అందులోనే చనిపోతాయి. దాంతో వాటి అవశేషాలు అంజీర్ పండులోనే విలీనమవుతాయి. అందువల్ల అది పరోక్షంగా మాంసాహారమవుతుంది కాబట్టి అంజీర్ పండ్లు మాంసాహారమే నంటున్నారు నిపుణులు. (శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!)
అలాగని శాకాహారులు అంజీరాని తినడం మానేస్తే చాలా నష్టపోతారు. ఎందుకంటే అంజీరాతో ఎన్నో ఆరోగ్య ఫలితాలు అందుతాయి. వీటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు ఇలా అన్నీ పుష్కలంగా లభిస్తాయి. రోజూ తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. వీటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని, ఉదయం నిద్ర లేచిన వెంటనే తింటే చాలా మంచిది. మలబద్ధకం, మూలశంక వంటి సమస్యలను ఈ పండ్లు నయం చేస్తాయి. చెడు కొవ్వును వేగంగా కరిగిస్తాయి. బరువు, హైబీపీ, షుగర్ వంటి సమస్యలను అదుపులోకి తెస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, నెలసరి సమస్యలున్నవారు, కిడ్నీ సమస్యలున్నవారు వీటిని తింటే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానిచ్చే ఈ పండును శాకాహారులూ నిరభ్యంతరంగా తినచ్చు. (కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment