Non Vegetarian
-
ఔరా! అంజీరా! ఇది మాంసాహారమా?
సాధారణంగా ఎవరైనా పండ్లను చూపించి.. ‘ఇవి శాకాహారమా? మాంసాహారమా?’ అని అడిగితే చిత్రంగా అనిపిస్తుంది. ‘ఏమిటా పిచ్చి ప్రశ్న.. పండ్లలో ఎక్కడైనా మాంసం ఉంటుందా?’ అంటూ కోపం తన్నుకొస్తుంది. అయితే చాలామంది ‘అంజీరా పండ్లు శాకాహారమా? మాంసాహారమా?’ అనే ప్రశ్నే వేస్తున్నారు. ఎందుకంటే ‘పండులందు అంజీరా పండు వేరయా’ అంటున్నారు నిపుణులు. సైంటిఫిక్ రీజన్స్ చూపిస్తూ ‘ఈ పండు ముమ్మాటికీ మాంసాహారమే!’ అని తేల్చేస్తున్నారు.అసలెందుకు అంజీరాను మాంసాహారం అంటున్నారంటే.. ఆ పండులో జరిగే పరాగ సంపర్క క్రియనే దానికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు. పరాగ సంపర్కం కోసం కందిరీగలు.. అంజీర్ పండ్లను ఆశ్రయిస్తుంటాయి. ఆ పండ్ల సూక్ష్మ రంధ్రాల్లోనికి వెళ్లిన కందిరీగలు పరాగ సంపర్కం చేస్తాయి, అనంతరం బయటకి రాలేక కొన్ని అందులోనే చనిపోతాయి. దాంతో వాటి అవశేషాలు అంజీర్ పండులోనే విలీనమవుతాయి. అందువల్ల అది పరోక్షంగా మాంసాహారమవుతుంది కాబట్టి అంజీర్ పండ్లు మాంసాహారమే నంటున్నారు నిపుణులు. (శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!)అలాగని శాకాహారులు అంజీరాని తినడం మానేస్తే చాలా నష్టపోతారు. ఎందుకంటే అంజీరాతో ఎన్నో ఆరోగ్య ఫలితాలు అందుతాయి. వీటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు ఇలా అన్నీ పుష్కలంగా లభిస్తాయి. రోజూ తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. వీటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని, ఉదయం నిద్ర లేచిన వెంటనే తింటే చాలా మంచిది. మలబద్ధకం, మూలశంక వంటి సమస్యలను ఈ పండ్లు నయం చేస్తాయి. చెడు కొవ్వును వేగంగా కరిగిస్తాయి. బరువు, హైబీపీ, షుగర్ వంటి సమస్యలను అదుపులోకి తెస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, నెలసరి సమస్యలున్నవారు, కిడ్నీ సమస్యలున్నవారు వీటిని తింటే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానిచ్చే ఈ పండును శాకాహారులూ నిరభ్యంతరంగా తినచ్చు. (కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!) -
మల్టీఫంక్షనల్ పర్ఫెక్ట్ కుక్వేర్
శాండివిచ్ దగ్గర నుంచి వాఫిల్స్ వరకు అన్నింటినీ సిద్ధం చేయడంలో ఈ డివైస్ ప్రత్యేకం. వెజ్, నాన్‌వెజ్ అనే తేడా లేకుండా భోజన ప్రియులకు నచ్చిన రుచులను నిమిషాల్లో అందించే మల్టీఫంక్షనల్ బ్రేక్ ఫస్ట్ మేకర్ ఇది. అన్నివిధాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది. పైగా దీన్ని పట్టుకుని వెళ్లడానికి వీలుగా ఒకవైపు ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ముందువైపు లాక్ చేసుకునే వీలుతో పాటు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి రెగ్యులేటర్ కూడా ఉంటుంది. డివైస్‌ను నిలబెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్స్ ఉంటాయి. దానికే పవర్ కనెక్టర్‌ని చుట్టి పక్కకు స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లెట్స్, కట్లెట్స్ ఇలా చాలానే వండుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాఫిల్స్ ప్లేట్, గ్రిల్ ప్లేట్లను మార్చుకుంటూ ఉండొచ్చు. (చదవండి: ఈ చీజ్ ధర వింటే ..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
మాంసాహారులతో శృంగారం వద్దు!: పెటా
వైరల్: ముక్క తినే మగవాళ్లకు ముద్దూముచ్చటలను దూరం చేయాలన్న పెటా ప్రయత్నం బెడిసి కొట్టింది. నాన్-వెజ్ తినే మగవాళ్లతో శృంగారంలో పాల్గొనకూడదంటూ మహిళాలోకానికి పిలుపు ఇచ్చింది మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ. అయితే.. ఈ పిలుపుపై సెటైర్లు పేలుతున్నాయి ఇప్పుడు. సెప్టెంబర్ 22వ తేదీన పెటా తన బ్లాగు పోస్టులో ఇలా రాసుకొచ్చింది. ‘‘చేతిలో బీరు బాటిళ్లు.. ముక్కతో మగవాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, అది మూగజీవులకు మాత్రమే హాని కాదు.. ఈ భూమికి కూడా. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడానికి మహిళల కంటే పురుషులే ఎక్కువ కారణం. ముఖ్యంగా మాంసం తినే మగవాళ్లు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కారణం అవుతున్నారు అంటూ పెటా ఓ పోస్ట్ ఉంచింది. ఈ కారణంతో.. సె* స్ట్రైక్ చేయాలని, తద్వారా వాళ్లను శాఖాహారులుగా మార్చాలంటూ పెటా పిలుపు ఇచ్చింది. అయితే.. సోషల్ మీడియా ఈ పిలుపునకు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. పైగా పెటా ప్రచారంలో ఏమాత్రం వాస్తవికత లేదని పేర్కొంటూ సెటైర్లు పేలుస్తున్నారు. Hold men accountable! This may be the only solution to the climate catastrophe 😉 pic.twitter.com/qqU5g52yq9 — PETA (@peta) September 23, 2022 PETA has asked WOMEN to stop having SEX with MEAT eating MEN. Calling for a sex strike, PETA wrote, “Men need to take accountability for their actions. PETA’s proposing a strike on sex with meat-eating men to persuade them to go vegan." But what about the MEAT-EATING WOMEN 😁 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) September 27, 2022 me, a woman who eats mainly meat and is thus free from peta's stupid complaints https://t.co/SXLeaZGMU8 pic.twitter.com/ibKaBBSJwX — sef🏳️⚧️ (@Karmatekc) September 27, 2022 Lol, this has to be a troll! lol https://t.co/Y0xNGV3XUy — Lakel The VA (@CartoonCritic12) September 27, 2022 "Men have a 40 percent higher carbon footprint because they're eating more meat than woman." Women in Germany are being told to stop having sex with their husbands and boyfriends until they stop eating red meat. Dr Carys Bennett from PETA explains on #TimesRadio. pic.twitter.com/6B9jlFn1Pl — Times Radio (@TimesRadio) September 22, 2022 ఇదీ చదవండి: దొంగలను భలేగా పట్టేసిన సెక్యూరిటీ గార్డు -
మాంసాహార ప్రియులు పెరుగుతున్నారట!.. ముక్క లేనిదే ముద్ద దిగదే!
సాక్షి, అమరావతి: దేశంలో ముక్క లేకుండా ముద్ద దిగని వారి సంఖ్య పెరుగుతోంది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి ఈ వివరాలు సేకరించారు. ఆ సర్వే ప్రకారం దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి పడిపోయింది. అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతమే పెరిగింది. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ మాంసాహార ప్రియులు స్వల్పంగా పెరిగారు. ఇక్కడే అధికం.. పురుషుల్లో మాంసాహారం తినేవారిలో లక్షద్వీప్‌లో అత్యధికంగా 98.4 శాతం ఉన్నారు. రాజస్తాన్‌లో అత్యల్పంగా 14.1 శాతం ఉన్నారు. లక్షద్వీప్ తర్వాత అండమాన్ – నికోబార్ దీవుల్లో 96.1శాతం, గోవా 93.8 శాతం, కేరళ 90.1శాతం, పుదుచ్చేరి 89.9శాతం మాంసాహారులు ఉన్నారు. ఇక్కడ వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి కూడా బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా మాంసాహారులు ఆంధ్రప్రదేశ్‌లో 97.4 శాతం మంది పురుషులు, 95 శాతం మంది మహిళలు మంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య çపురుషుల్లో స్వల్పంగా, మహిళల్లో బాగా పెరిగింది. 2015–16లో 78.2 శాతం మంది పురుషులు మాంసాహారం తీసుకుంటే 2019–21 నాటికి 80 శాతానికి చేరుకుంది. అదే మహిళల్లో 71.2 శాతం నుంచి 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లో 74.6 శాతం నుంచి 73.8 శాతానికి తగ్గితే.. మహిళల్లో మాత్రం 57.7 శాతం నుంచి 72.4 శాతానికి అనూహ్యంగా పెరిగినట్లు సర్వే వెల్లడించింది. చదవండి: అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం -
నాటు కోడికి గిరాకీ పెరుగుతున్నా, ధర తగ్గింది.. కారణం ఇదే!
సాక్షి,శ్రీకాకుళం: ఒకప్పుడు నాటుకోడి అందరికీ ఇష్టమైన మాంసాహారం. తర్వాత ధరలు పెరిగిపోవడంతో కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైంది. బ్రాయిలర్ చికెన్ ధరకు నాటుకోడి చికెన్ ధర రెట్టింపు ఉండేది. కోవిడ్ సమయం నుంచి ప్రజలు ధర కాస్త ఎక్కువైనా మళ్లీ నాటుకోడి వైపు దృష్టి సారించారు. పెరటి కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. మహిళా సంఘాలు, పొదుపు సంఘాల వారికి రాయితీపై కోళ్ల పెంపకం యూనిట్లను అందజేస్తున్నారు. దీని వల్ల నాటుకోడి ధర తగ్గింది. ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.400 వరకు ఉంది. ప్రత్యేక సంతలు నాటు కోళ్లు కావాలంటే గతంలో గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామస్తులు నాటుకోళ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్లో నాటుకోళ్ల సంత జరుగుతుంది. బుధవారం నరసన్నపేటలో నాటుకోళ్ల ప్రత్యేక సంత ఉంటుంది. ఇలా జిల్లాలోని పట్టణాల్లో నాటుకోళ్లకు ప్రత్యేక సంతలు నిర్వహిస్తున్నారు. చింతాడ, బుడుమూరు, సీతంపేటలలో వారానికోసారి నిర్వహించే సంతల్లో కూడా నాటుకోళ్లను విక్రయిస్తారు. చదవండి: బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి -
మటన్ , చికెన్ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే!
ఒకప్పుడు బంధువులు వచ్చినప్పుడో.. ఏదైనా వేడుక జరిగినప్పుడో.. పండుగల సందర్భంలోనో మాంసాహారాన్ని వినియోగించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో నాన్‌వెజ్‌ను ఇష్టంగా తింటున్నారు. ఎలాంటి సందర్భాలు లేకున్నా వారంలో రెండు మూడు రోజులు ‘ముక్క’తో ఎంచక్కా లాగించేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే ‘నీసు’ లేనిదే ముద్ద దిగనివారు కూడా ఉన్నారు. కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో మాంస వినియోగం ఏడాదికేడాదికి పెరుగుతోంది. చికెన్, మటన్, చేపలపైనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా రూ.217 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనికి అదనంగా బీఫ్, పోర్క్, గుడ్లు, కంజులు తదితర వాటిపై ప్రతి నెలా మరో రూ.20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46 లక్షలకుపైగా జనాభా ఉంది. ఒక సర్వే ప్రకారం జనాభాలో 85 శాతం మంది మాంసం ప్రియులు ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే వీరి ఇళ్లలో నాన్‌వెజ్ ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతుంటాయి. కొన్ని కుటుంబాలు వారంలో మూడు నాలుగు రోజులు మాంసాహారాన్ని ఆరగిస్తుండటం విశేషం. పోషకాహారం కోసం కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత జిల్లాలో మాంసాహార వినియోగం గణనీయంగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ ఏమీ చేయలేదని డాక్టర్లు సూచించారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏదో ఒక మాంసం తీసుకోవాలని చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టినా ప్రజలు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండలేకపోతున్నారు. 2020తో పోలిస్తే 10 నుంచి 15 శాతం మాంసం అమ్మకాలు పెరిగాయి. సామాన్య ప్రజలకు చికెన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్‌తో సరిపుచ్చుకుంటున్నారు. ప్రతి నెలా 5,440 టన్నుల వినియోగం మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్, 30 శాతం మంది మటన్, 20 శాతం మంది చేపలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కోడిమాంసం 2,400 టన్నులు, మటన్ 1,440 టన్నులు, చేపలు 1,600 టన్నుల ప్రకారం మొత్తంగా 5,440 టన్నుల అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.217 కోట్లు ఉంటోంది. అంటే ఏడాదికి 65,280 టన్నుల నాన్‌వెజ్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఏడాదికి మాంసాహారానికే రూ.2,604 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నాణ్యత తప్పనిసరి వినియోగదారులు మాంసం ఏదైనా నాణ్యతను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. పశువైద్యులు ధ్రువీకరించిన తర్వాతనే పొట్టేళ్లను మాంసానికి వినియోగించాల్సి ఉంది. నాణ్యమైన మాంసం విక్రయించే విధంగా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రికార్డు స్థాయిలో ఉత్పత్తి జిల్లాలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2021–22లో లక్ష్యం 1,03,201 టన్నులు ఉండగా రికార్డు స్థాయిలో 1,09,711 టన్నులు ఉత్పత్తి అయ్యింది. జిల్లాలో ప్రతి నెలా 5,000 నుంచి 6,000 టన్నుల ప్రకారం ఏడాదికి 66 వేల టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చికెన్, మాంసం, చేపలు, గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. – డాక్టర్ రామచంద్రయ్య,జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి, కర్నూలు ఇష్టంగా తింటాం మాకు మాంసాహారమంటే ఎంతో ఇష్టం. మాంసం, చికెన్, చేపలు వినియోగిస్తాం. వారంలో రెండు, మూడు రోజులు తీసుకుంటాం. కరోనా మొదలైనప్పటి నుంచి వీటి వినియోగాన్ని పెంచాం. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రధానంగా మాంసాహారంపై దృష్టి పెట్టాం. – ఎం రాజేష్, చౌట్కూరు గ్రామం, మిడుతూరు మండలం వినియోగం పెరిగింది మేం కొన్నేళ్లుగా చికెన్ సెంటరు నిర్వహిస్తున్నాం. 2020 నుంచి చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే 10 శాతంపైగా అమ్మకాలు పెరిగాయి. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు 500 కిలోల వరకు అమ్మకాలు ఉంటాయి. ఆదివారం 1000 కిలోల వరకు ఉంటాయి. వారం రోజుల్లో వినియోగదారులకు, హోటళ్లకు మేం 3500 కిలోల చికెన్ విక్రయిస్తున్నాం. మార్కెట్లో కొన్ని నెలలుగా బ్రాయిలర్ కోళ్ల కొరత ఉంది. ఇందు వల్ల కిలో చికెన్ రూ.300 ప్రకారం విక్రయిస్తున్నాం. వారానికి గుడ్లు 5000 వరకు విక్రయిస్తున్నాం. – నాగశేషులు, ప్రకాశ్‌నగర్, కర్నూలు అమ్మకాలు ఊపందుకున్నాయి కర్నూలులోని మద్దూరునగర్‌లో మాది చిన్న షాపు. ప్రతి రోజు పొట్టేలు మాంసం అమ్ముతాం. కరోనా తర్వాత విక్రయాలు ఊపందుకున్నాయి. సోమవారం నుంచి ఆదివారం వరకు సగటున 150 కిలోల మాంసం అమ్మతున్నాం. పొట్టేళ్ల ధరలు పెరగడంతో కిలో మాంసం రూ.750 ప్రకారం విక్రయిస్తున్నాం. – షాకీర్, మద్దూర్‌నగర్, కర్నూలు -
ధర తగ్గేదేలే, కొండెక్కి కూర్చున్న కోడి.. ఇలా అయితే తినేదెలా!
సాక్షి, హైదరాబాద్: ఆదివారం వచ్చినా, దోస్త్‌ల దావత్త్‌లు, ఫంక్షన్లకు వెళ్లినా ఇలా అకేషన్ ఏదైనా చికెన్ లేకపోతే చాలా మందికి ముద్ద దిగదనే సంగతి తెలిసిందే. అలాంటి చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా పెరిగిన చికెన్ రేట్లతో మన మనీ ఖాళీ అవ్వాల్సిందే. నిన్నటి వరకు డబుల్ సెంచరీ దాటిన చికెన్ ఈ సారి ఏకంగా ట్రిబుల్ సెంచరీని క్రాస్ చేసి సామాన్య ప్రజలకు షాకిచ్చింది! ధర తగ్గేదేలే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు చూస్తే మధ్య తరగతి ప్రజలు కొనాలాంటే భయపడేలా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం.. కిలో చికెన్ (స్కిన్ లెస్) రూ.300కు విక్రయిస్తున్నారు. కొన్ని వారాల క్రితం వరకు రూ.200 లోపు ఉండేది. అయితే తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర రూ.300లకు పైగా ఉంది. విజయవాడలో కేజీ ధర రూ.306 ఉండగా, హైదరాబాద్‌లో 290 నుంచి 300 వరకు చికెన్ ధర పలుకుతోంది. ఈ ధర చూసి చికెన్ కొనేందుకు మాంసం ప్రియులు జంకుతున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులతోపాటు చికెన్ కూడా కొనలేని పరిస్థితికి చేరిందనంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: పళ్లు తోముకుంటూ వేపపుల్ల మింగేశాడు.. ఆ తర్వాత.. ) అయితే చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు.. అందులో పౌల్ట్రీ ఫారాల్లో వినియోగించే దాణా రేటు పెరగడం, వేసవి ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు చనిపోతున్నాయని, బర్డ్ ఫ్లూ లాంటి వదంతుల కారణంగా కొత్త జాతులు ఉత్పత్తి కావడం లేదని పౌల్ట్రీ రైతులు తెలిపారు. వీటి కారణంగా మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు సరిపడా కోళ్ల సరఫరా లేకపోవడం వీటి ధరలను అమాంతం పెరుగుతున్నట్లు వ్యాపారలు చెబుతున్నారు. -
ఈ ‘బనాన గర్ల్’ డైటేమిటంటే....
ఆమె అసలు పేరు లియాన్నె ర్యాట్‌క్లిఫ్. పాతికేళ్ల వయస్సులో అందరిలాగే ఆమె బొద్దుగా ఉండేది. ఇప్పుడు 40 ఏళ్ల వయస్సులో సన్నని నడుముపైన చెంచాడు కొవ్వు కూడా లేకుండా ముద్దుగా తయారయింది. అప్పుడు ఇష్టంగా మూడు పూటలు మాంసాహారం తినేది. ఇప్పుడు అంతకంటే ఇష్టంగా శాఖాహారమే తింటోంది. అది కూడా వండి వడ్డించిన ఆహారం కాకుండా పండ్లు, పచ్చి కాయగూరలనే తింటోంది. దాదాపు 14 ఏళ్లుగా ఆమె తీసుకుంటున్న డైట్ ఇదే! అందుకే ఆమె అప్పటికి, ఇప్పటికి 18 కిలోలు తగ్గారట. ర్యాట్క్లిప్ ప్రతిరోజు ఉదయం అల్పాహారం కింద సగం పుచ్చకాయ తింటుంది. మధ్యాహ్నం లంచ్ కింద నాలుగు అరటి పండ్ల ముక్కలు, ఓ బొప్పాయి కాయ, రెండు అంజిరా పండ్లను పోలిన టర్కీ పండ్ల ముక్కలను పాలులేకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఐస్ క్రీమ్‌తో కలిపి తింటుంది. అప్పుడప్పుడు పీనట్ బటర్‌తో ఈ పండ్ల ముక్కలను కలుపుకొంటుంది. ఇక రాత్రి పూట వివిధ రకాల కూరగాయ ముక్కలను కొబ్బరి చట్నీలో అద్దుకొని తింటుంది. ఆమె రోజు తినే ఆహారం మొత్తం కలసి 2,700 కాలరీలు మాత్రమే. అరటి పండులా పై నుంచి కింది వరకు ఒకే తీరుగా ఉంటుందనో లేక రోజూ అరటి పండ్లు తింటుందనో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు ఆమెను ‘బనాన గర్ల్’ అని పిలుస్తున్నారు. ర్యాట్క్లిప్కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జన్మించిన బనాన గర్ల్ సెప్టెంబర్ 19వ తేదీన తన 40వ పుట్టిన రోజు జరుపుకొని ఆ సందర్భంగా తన ఆహార అలవాట్లకు సంబంధించి తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నేటి వరకు దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. మాంసహారిగా బతికిన తాను శాకాహారిగా ఎలా మారిందో కూడా బనాన గర్ల్ వివరించారు. ‘చచ్చిన జంతువులను తినడమంటే వాటిని పాతి పెట్టడమే గదా! అంటే మన కడుపును శ్మశానంగా మార్చడమే గదా! అందుకని శాకాహారిగా మారాను. మాంసాహారంలో లభించే ప్రోటీన్లు శాకాహారంలో కూడా ఉంటాయని ఆమె చెప్పారు. ‘అదంతా సరేగానీ, మీరు తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువగా సుగరే ఉంటుంది. సుగర్ ఎక్కువగా తింటూ శరీరాన్ని ఇలా ఎండ పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ఆమెకు చురకలంటిస్తోన్న వారు లేకపోలేదు. -
మాంసాహారుల్లోనే ‘స్ట్రోక్’లు తక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్ స్ట్రోక్) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్లపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తేల్చారు. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. అయితే మాంసాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు. సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులుకాగా, ఐదో వంతు మంది చేపలు తినేవారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్ స్ట్రోక్‌లకు గురయ్యారు. మాంసహారులపైన అధ్యయనం జరపడం చాలా సులువుగానీ శాకాహారులపై అధ్యయనం జరపడం కష్టమని వివిధ యూనివర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలు తినే వాళ్లు ఎక్కువగా ఉంటారని, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తినేవారు తక్కువగా ఉంటారని, శాకాహారుల మెదడు రక్తనాళాల్లో కొలస్ట్రాల్ శాతం తక్కువ ఉన్నవాళ్లు వీటిని తిన్నట్లయితే కచ్చితంగా కొలస్ట్రాల్ శాతం పెరుగుతుందని ‘బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్’ సీనియర్ డైటిస్ట్ ట్రేసి పార్కర్ చెప్పారు. నేటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నందున శాకాహారమే ఒక విధంగా మేలని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ఇదీ శాకాహార చరిత్ర) -
వహ్వా పాయా.. ఏమి రుచిరా !
సాక్షి, నిజామాబాద్ : చలి, వర్షా కాలాలు వచ్చాయంటే చాలు నోరూరించే వేడి వేడి పాయాను తినాల్సిందే అంటున్నారు నగర వాసులు. నగరంలో సుభాష్‌నగర్, నెహ్రూపార్క్, తిలక్‌గార్డెన్ లైన్, రైల్వే స్టేషన్ లాంటి నాలుగైదు ప్రాంతాల్లోనే లభించే ఈ నాన్‌వెజ్ వంటకం కోసం పోటీ పడుతున్నారు. దీంతో మధ్యాహ్నానికే హోటళ్లలో పాయా వంటకం ఖాళీ అవుతోంది. దీంతో ఎంత దొరికితే అంత ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు వెచ్చించడానికి పాయా ప్రియుడు వెనుకాడడం లేదు. అయితే ఇంత టేస్టీగా ఉండే పాయాను ఎందుకు ఇష్టపడి తింటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రమపడితేనే రుచి... పాయాను పొట్టేలు, మేక కాళ్లతో తయారు చేస్తారు. కాళ్లను కాల్చి గోధుమ పిండి సహాయంతో వాటి వెంట్రుకలను తొలగిస్తారు. తర్వాతా శుభ్రంగా కడుగుతారు. ఒక పాత్రలో కాళ్లను, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిర్యాలు, సొంటి, కొబ్బరి, ఇత ర మసాల దినులు వేసి నీళ్లు పోసి రెండు, మూడు గంట ల పాటు మరిగిస్తారు. అనంతరం కారంపొడి, ఉప్పు, కావాల్సిన పదార్థాలు వేస్తారు. అధికంగా సూప్ ఉంచి అన్ని కలిసేదాక మరిగిస్తారు. దీంతో ఘుమఘుమలాడే పాయా సిద్ధమవుతుంది. పాయా తయారీ శ్రమతో కూడుకున్న పనే అయినప్పటికీ, దానికున్న రుచి మరే నాన్‌వెజ్ వంటకానికి రాదని తయారీ దారులు చెప్తున్నారు. ఆయా హోటళ్లలో ఒక ప్లేట్ పాయా రూ.100 విక్రయిస్తున్నారు. రైస్‌తో కావాలంటే రూ.140 చెల్లించాలి. ఎముకలకు బలంగా.. పాయా వంటకం రుచికే కాకుండా ఆరోగ్యానికి మంచిదంటున్నారు.ఎముకలకు బలాన్ని ఇస్తుంది. నీళ్ల నొప్పులుంటే తప్పిపోతాయి. ఒంట్లో వేడి పుట్టించి జలుబు చేసిన వారికి సూప్ ఎంతగానో సహాయకారిగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు విరిగిన వారికి పొట్టేలు, మేక కాళ్లను ఉడికించిన సూప్‌ను ఎలాంటి మసాలాలు లేకుండా తాగితే త్వరగా అతుక్కుంటాయని చాలా మంది చెప్తుంటారు. ఇదొక ప్రత్యేకమైన వంట.. పాయా అనేది హోటళ్లలో చాల అరుదుగా లభిస్తుంది. దీనిని రుచిగా తయారు చేయాలంటే వంటకంలో అనుభవం ఉండాలి. అన్ని మసాలాలు కలిసి రుచిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాయా కోసం ఒక రోజు ముందుగానే చాల మంది ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్తుంటారు. -
వెజ్జా.. నాజ్ వెజ్జా..?!
చెన్నై : కులం, మతం పేరుతో విభజించడం తెలుసు.. కానీ భోజనం పేరు చెప్పి కూడా మనషులును విభజించడం గురించి చాలా తక్కువుగా విని ఉంటాము. నార్మల్‌గా బయట ఫంక్షన్లలో వెజ్, నాన్ వెజ్ అంటూ రెండు వేర్వేరు మెనులు ఏర్పాటు చేస్తారు. కానీ హస్టల్స్లో ఇలాంటి వర్గీకరణ గురించి ఎప్పుడు వినలేదు. కానీ ఇలాంటి సంఘటన ఒకటి మద్రాస్ ఐఐటీలో చోటు చేసుకుంది. ఇక్కడ క్యాంటీన్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లకు వేర్వేరు దారులనే కాక వేర్వేరే వాష్ బేసిన్లను కూడా ఏర్పాటు చేసింది యాజమాన్యం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే విద్యార్థుల కోరిక మేరకే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. గత ఏడాది మేలో క్యాంపస్‌లో ‘బీఫ్ పెస్టివల్’ని నిర్వహించారు. ఈ సమయంలో హస్టల్లో గొడవలు కూడా జరిగాయి. బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్నందుకు ఓ రిసెర్చ్ స్కాలర్ని చితక బాదారు కూదా. ఈ సంఘటన తరువాత విద్యార్థులు.. వెజిటేరియన్లకు ప్రత్యేక మెస్ కావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలా రెండు మెస్‌లను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. అయితే ఇలా వేర్వేరు మెస్‌లు ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. యాజమాన్యం క్యాంపస్‌లో వర్ణ, వర్గ వివక్షలకు తెరతీస్తోందంటూ ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. అయితే విద్యార్థులను ఆహారం పేరు చెప్పి రెండు వర్గాలుగా విభజించడం పట్ల తమిళ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన తెలుపుతున్నాయి. మొత్తం ఐఐటీలో 8 వేల మంది విద్యార్థులుండగా వీరిలో 6 వేల మంది నాన్ వెజిటేరియన్లు కాగా.. మరో 2 వేల మంది వెజిటేరియన్లు. -
శాకాహారులకు, మాంసాహారులకు వేరువేరు సీట్లు
న్యూఢిల్లీ : దేశీయ రైళ్లు శాకాహారులు, మాంసాహారులను వేరు చేయనున్నాయా? ఆన్‌బోర్డు రైళ్లలో శాకాహారులకు, మాంసాహారులకు వేరు వేరు సీట్లు కేటాయించనున్నారా? అంటే ఏమో అది జరగవచ్చు అంటున్నారు కొందరు. ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకుని రైళ్లలో వేరు వేరు సీట్లు కేటాయించేలా కోర్టు జోక్యం చేసుకోవాలని గుజరాత్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను అహ్మదాబాద్‌లోని ఖాన్పూర్కు చెందిన ఈఈ సైద్ అనే న్యాయవాది దాఖలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ప్రకారం ప్రయాణికుల ఆహారపు ఎంపికలను బట్టి రైళ్లలో సీట్లను కేటాయించేలా దేశీయ రైల్వేను ఆదేశించాలని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. వచ్చే వారం ఈ పిల్ విచారణకు రానుంది. తాను వేసిన ఈ పిల్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని పిటిషనర్ చెప్పారు. ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించడంలో దేశీయ రైల్వే అత్యంత జాగ్రత్త వహించాలని సైద్ అన్నారు. ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్‌ను కల్పించాలని, దీంతో శాకాహార ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారి ఆహారపు అలవాట్లకు తగ్గట్టు సీట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించవచ్చన్నారు. సైద్ తాను శాకాహారిగా చెప్పారు. ఈ పిల్లో రైల్వే మంత్రిత్వ శాఖను, దేశీయ రైల్వే కేటరిగింగ్, టూరిజం కార్పొరేషన్‌ను, పశ్చిమ రైల్వే జోన్‌ను, గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. -
చేపలు కొంటున్నారా.. ఇది చదవండి!
నాన్‌వెజ్ ప్రియులకు ఇప్పుడు ఫార్మలిన్ భయం పట్టుకుంది. చేపలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు హానికారక ఫార్మలిన్‌ను వాడుతున్నారనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో చేపలంటేనే వినియోగదారులు భయపడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా భయాందోళనలు ఏపీ, కేరళ నుంచి వస్తున్న చేపలు త్వరగా పాడైపోకుండా వాటిని తాజాగా ఉంచేందుకు ఫార్మలిన్ పూస్తున్నారనే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గోవా అసెంబ్లీని సైతం ఈ అంశం కుదిపేసింది. దీంతో కేరళ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతిని 15 రోజుల పాటు నిలిపివేస్తు గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ పలు ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న చేపలను చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్నారు. తాజాగా ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయంటూ ఏపీ నుంచి వెళ్లిన ఆరు వేల కేజీల చేపలను డంప్‌యార్డుకు పంపేశారు. ఫార్మలిన్ భయంతో తాజా(బతికివున్న) చేపలనే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏమిటీ ఫార్మలిన్ మనుషుల మృతదేహాలను దీర్ఘకాలం పదిల పరిచేందుకు వినియోగించే రసాయనం ఫార్మాలిన్. ఈ రసాయనం ప్రయోగించడంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. ఇలా చేయడంతో వారాల తరబడి చేపలు తాజాగా ఉంటాయి. ఫార్మాలిన్ ప్రయోగించిన చేపలు సాధారణ చేపల కంటే గట్టిగా ఉంటాయి. దీనిపై పొలుసు సాధారణ చేపల కంటే రాటుదేలి ఉంటుంది. ఫార్మాలిన్ రసాయనం ప్రయోగంతో చేపమొప్పలు ఎర్రగా నిగనిగలాడతాయి. ఈ చేపల్ని వండే సమయంలో భిన్నమైన వాసన వస్తుంది. ఫార్మలిన్ మానవ శరీరంలో చొరబడితే కేన్సర్ సంభవించే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కడుపులో నొప్పి, వాంతులు అయి ఒక్కోసారి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కిట్‌తో పరీక్ష ఇలా.. చేపలు తాజావా కావా? వాటిలో ఏమైనా విషపూరిత రసాయనాలు ఉన్నాయా? అనేవి చాలా సులభంగా తెలుసుకోవచ్చంటోంది... సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్టీ) డిపార్ట్మెంట్. వినియోగదారులు సులభంగా పరీక్షించి చేపల తాజాదనాన్ని, అందులో ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు వీలుగా ఐసీఏఆర్సీఐఎఫ్టీ ఈ కిట్‌ను రూపొందించాయి. ఇందులో 25 స్ట్రిప్‌లు ఉంటాయి. కెమికల్ పూసిన ఈస్ట్రిప్లను చేపలపై మూడు నాలుగు సార్లు రుద్దాలి. ఈ స్ట్రిప్‌పై ఉన్న పేపర్‌పై డ్రాపర్ సహాయంతో కిట్‌లో ఉన్న సొల్యూషన్‌ను వేయాలి. లేత పసుపు రంగు కలర్లోకి పేపర్ మారుతోంది. తక్కువ మోతాదులో ఫార్మలిన్ ఉంటే లేత ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. ఎక్కువ మోతాదులో ఉంటే ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ రంగులను గుర్తించవచ్చు. ప్రతీ కిట్‌లోనూ ఓ కలర్ కార్డు ఉంటుంది. ఒక్కో టెస్టుకు సుమారు రెండు రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటికే ఈ కిట్లను కేరళలోని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని, జులై 29 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇలా చేయాలి.. చేపలను నీటితో పరిశుభ్రంగా కడగాలి. కుళాయి కింద చేపలు ఉంచి నీటిని వదిలి శుభ్రం చేయాలి... నీటితో కడిగినా చెడువాసన వస్తుంటే అవి తాజా చేపలు కాదని గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అలాగే 75 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద కూరను ఉడికించాలి. ఇలా చేయడం ద్వారా కొంత వరకు విషపూరిత రసాయనాలను కొంత వరకు తగ్గించవచ్చు. -
ముక్కకు మూడుకోట్లు!
పండగ మూడు రోజులూ మాంసాహారం కోసం జిల్లా వాసులు భారీగా ఖర్చు చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రూ 3 కోట్ల మాంసాన్ని చక్కగా చప్పరించేశారు. వేకువజామున నాలుగు గంటల నుంచే మాంసం కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద క్యూ కట్టారు. వేల సంఖ్యలో కోళ్లు, గొర్రెల తలలు తెగిపడ్డాయి. ఒక్క నెల్లిమర్ల నగర పంచాయతీ విషయమే తీసుకుంటే..ఇక్కడున్న 50 మాంసం దుకాణాల ద్వారా భోగి నుంచి కనుమ వరకూ సుమారు పది లక్షల రూపాయల మాంసం విక్రయాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో అత్యధికంగా రూ.30 లక్షలపైనే మాంసం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు మటన్, చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయినా జిల్లావాసులు ఎంతమాత్రం జంకలేదు. భోగీ, సంక్రాంతి నాడు కొంతమందే మాంసాహారం తీసుకున్నా, కనుమ రోజు దాదాపు అందరూ నోట ముక్క పెట్టారు. ప్రస్తుతం మటన్ ధర రూ.440 కాగా, చికెన్ ధర రూ 160గా ఉంది. మొన్నటిదాకా బాగా తక్కువగా ఉన్న చికెన్, మటన్ ధరలు పండగ రోజుల్లో అమాంతం పెరిగాయి. భోగికి ముందు వారం రోజుల నుంచి ధరలు చుక్కలను అంటాయి. అయినా సంక్రాంతి ప్రధాన పండగ కావడంతో జిల్లావాసులు మాంసం కొనుగోళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. భోగి మొదలుకొని కనుమ దాకా జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలోనే అత్యధికంగా మాంసం విక్రయాలు జరిగాయి. ప్రతి మున్సిపాలిటీలోనూ పది లక్షల రూపాయలకు తక్కువ గాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. అలాగే 34 మండల కేంద్రాల్లోనూ అధికంగా అమ్ముడుపోయింది. ఎక్కడా ఐదు లక్షలకు తక్కువకాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. దాదాపు అన్ని గ్రామాల్లోనూ పండగ సందర్భంగా మాంసం దుకాణాలు వెలిశాయి. ఒక్క కనుమనాడే భారీ సంఖ్యలో గొర్రెలు, కోళ్ల తలలు తెగిపడ్డాయి. వేకువజామున నాలుగు గంటల నుంచే జిల్లా కేంద్రంలోనూ, మున్సిపాలిటీల్లోనూ, మండల కేంద్రాల్లోనూ మాంసం విక్రయాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల తర్వాత మాంసం దొరకలేదు. ముఖ్యంగా మటన్ ధర రూ 440కి పెరిగినా కొనుగోలు చేసేందుకు జిల్లావాసులు వెనుకాడలేదు. డిమాండ్ పెరగడంతో దుకాణదారులు అప్పటికప్పుడే ధరలను పెంచేశారు. నాటుకోడి ప్రియులకు ఈ ఏడాది ధరలు చుక్కలు చూపించాయి. మటన్‌తో సమానంగా నాటుకోడి ధరలు సైతం అమాంతం పెరిగాయి. కిలో నాటుకోడి మాంసం రూ.300 పైనే పలికింది. ముక్కనుమ సందర్భంగా శుక్రవారం కూడా మాంసం విక్రయాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్త అల్లుళ్లు, దూరప్రాంతాల నుంచి విచ్చేసిన బంధువులున్న వారు శుక్రవారం కూడా భారీగానే కొనుగోలు చేస్తారు. దీంతో జిల్లావ్యాప్తంగా మాంసం విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది.