తిరుమలలో మరో అపచారం.. భద్రత డొల్లతనం? | Tamil Nadu Devotees Caught Eating Non Vegetarian Food In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో మరో అపచారం.. భద్రత డొల్లతనం?

Published Sat, Jan 18 2025 11:50 AM | Last Updated on Sat, Jan 18 2025 1:06 PM

Tamil Nadu Devotees Caught Eating Non Vegetarian Food In Tirumala

సాక్షి, తిరుపతి: తిరుమలలో మాంసాహారం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు.. ఆలయానికి సమీపంలో ఉన్న రాంభగీచా బస్టాండు వద్ద గుండ్లు భోజనం తింటూ పట్టుబడ్డారు. తిరుమలలో మాంసాహారం నిషేధం. కొందరు భక్తులు సమాచారం ఇవ్వడంతో తమిళనాడు భక్తులను టీటీడీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది బృందంగా వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.

నిషేధిత తిను బండరాలతో తమిళనాడు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పలావ్ తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. సెక్యూరిటీ తనిఖీ దాటుకొని వచ్చిన తమిళనాడు భక్త బృందం.. రాంభాగిచ్చ బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ తింటున్నట్లు కొందరు భక్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానం

భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టరాదని ఆ బృందాన్ని మందలించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకొని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసన
అలిపిరి జూపార్క్ రోడ్డులో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసన చేపట్టారు. ఏడు కొండలకు వెన్ను పోటు పొడవద్దంటూ  డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌ను హెచ్చరించారు. సనాతన హిందూ ధర్మం కోసం తిరుపతిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తక్షణమే ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన. స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్న పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ శ్రీనివాసనంద స్వామి నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement