tamil nadu devotees
-
తిరుమలలో మరో అపచారం.. భద్రత డొల్లతనం?
సాక్షి, తిరుపతి: తిరుమలలో భద్రతా డొల్లతనం మరోసారి బయటపడింది. అధికారులను దాటుకుని మాంసాహారం ఆలయానికి సమీపంలోకి చేరింది. రాంభగీచా బస్టాండు వద్ద గుడ్డు భోజనం తింటూ కొందరు పట్టుబడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో మాంసాహారం నిషేధం. కొందరు భక్తులు సమాచారం ఇవ్వడంతో తమిళనాడు భక్తులను టీటీడీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది బృందంగా వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.నిషేధిత తిను బండరాలతో తమిళనాడు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పలావ్ తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. సెక్యూరిటీ తనిఖీ దాటుకొని వచ్చిన తమిళనాడు భక్త బృందం.. రాంభాగిచ్చ బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ తింటున్నట్లు కొందరు భక్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానంభక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టరాదని ఆ బృందాన్ని మందలించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకొని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసనఅలిపిరి జూపార్క్ రోడ్డులో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసన చేపట్టారు. ఏడు కొండలకు వెన్ను పోటు పొడవద్దంటూ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌ను హెచ్చరించారు. సనాతన హిందూ ధర్మం కోసం తిరుపతిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తక్షణమే ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన. స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ శ్రీనివాసనంద స్వామి నిలదీశారు. -
తిరుమలలో పోటెత్తిన పెరటాశి భక్తులు
-
తిరుమలలో పోటెత్తిన పెరటాశి భక్తులు
– కిక్కిరిసిన అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు – సా:6గంటల వరకు 69,502 మందికి స్వామి దర్శనం – 29,716 మంది మెట్లమార్గంలో రాక సాక్షి,తిరుమల: పెరటాశి (తమిళనెల) తిరుమల శనివారాల్లోని మొదటి శనివారం కావటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి. వీరిలో ఎక్కువ మంది తమిళనాడు, చిత్తూరు జిల్లా వాసులే అధికంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు రెండు కాలిబాటల్లోనూ 29,716 మంది భక్తులు నడిచి తిరుమలకొండెక్కారు. దీంతో కాలిబాట భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండాయి. భద్రతా సిబ్బంది భక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేసి క్యూలైన్లలోకి అనుమతించారు. క్యూలైన్లలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆలయం, భద్రతా సిబ్బంది చొరవ తీసుకుని క్యూలైన్లను క్రమబద్దీకరించారు. సర్వదర్శనం క్యూలైన్లు కూడా భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 69,502 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. పెరిగిన రద్దీ వల్ల గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్కేంద్రాల్లోనూ భక్తులు గదుల కోసం నిరీక్షించారు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది.