మాంసాహారులతో శృంగారం వద్దు!: పెటా | Peta Sex Strike Campaign Back Fired | Sakshi
Sakshi News home page

మాంసం తినే మగవాళ్లతో శృంగారం వద్దు! పెటా ప్రచారంపై స్పందన ఏంటంటే..

Published Tue, Sep 27 2022 8:32 PM | Last Updated on Tue, Sep 27 2022 9:14 PM

Peta Sex Strike Campaign Back Fired - Sakshi

వైరల్‌: ముక్క తినే మగవాళ్లకు ముద్దూముచ్చటలను దూరం చేయాలన్న పెటా ప్రయత్నం బెడిసి కొట్టింది. నాన్‌-వెజ్‌ తినే మగవాళ్లతో శృంగారంలో పాల్గొనకూడదంటూ మహిళాలోకానికి పిలుపు ఇచ్చింది మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ. అయితే.. 

ఈ పిలుపుపై సెటైర్లు పేలుతున్నాయి ఇప్పుడు. సెప్టెంబర్‌ 22వ తేదీన పెటా తన బ్లాగు పోస్టులో ఇలా రాసుకొచ్చింది. ‘‘చేతిలో బీరు బాటిళ్లు.. ముక్కతో మగవాళ్లు ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ, అది మూగజీవులకు మాత్రమే హాని కాదు.. ఈ భూమికి కూడా. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడానికి మహిళల కంటే పురుషులే ఎక్కువ కారణం. 

ముఖ్యంగా మాంసం తినే మగవాళ్లు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కారణం అవుతున్నారు అంటూ పెటా ఓ పోస్ట్‌ ఉంచింది. ఈ కారణంతో.. సె* స్ట్రైక్‌ చేయాలని, తద్వారా వాళ్లను శాఖాహారులుగా మార్చాలంటూ పెటా పిలుపు ఇచ్చింది. 

అయితే.. సోషల్‌ మీడియా ఈ పిలుపునకు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. పైగా పెటా ప్రచారంలో ఏమాత్రం వాస్తవికత లేదని పేర్కొంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

ఇదీ చదవండి: దొం‍గలను భలేగా పట్టేసిన సెక్యూరిటీ గార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement