చెన్నై : కులం, మతం పేరుతో విభజించడం తెలుసు.. కానీ భోజనం పేరు చెప్పి కూడా మనషులును విభజించడం గురించి చాలా తక్కువుగా విని ఉంటాము. నార్మల్‌గా బయట ఫంక్షన్‌లలో వెజ్, నాన్ వెజ్ అంటూ రెండు వేర్వేరు మెనులు ఏర్పాటు చేస్తారు. కానీ హస్టల్స్‌లో ఇలాంటి వర్గీకరణ గురించి ఎప్పుడు వినలేదు. కానీ ఇలాంటి సంఘటన ఒకటి మద్రాస్ ఐఐటీలో చోటు చేసుకుంది. ఇక్కడ క్యాంటీన్‌లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లకు వేర్వేరు దారులనే కాక వేర్వేరే వాష్ బేసిన్‌లను కూడా ఏర్పాటు చేసింది యాజమాన్యం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే విద్యార్థుల కోరిక మేరకే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. గత ఏడాది మేలో క్యాంపస్‌లో ‘బీఫ్ పెస్టివల్’ని నిర్వహించారు. ఈ సమయంలో హస్టల్‌లో గొడవలు కూడా జరిగాయి. బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నందుకు ఓ రిసెర్చ్ స్కాలర్‌ని చితక బాదారు కూదా. ఈ సంఘటన తరువాత విద్యార్థులు.. వెజిటేరియన్లకు ప్రత్యేక మెస్ కావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలా రెండు మెస్‌లను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. అయితే ఇలా వేర్వేరు మెస్‌లు ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు.
యాజమాన్యం క్యాంపస్‌లో వర్ణ, వర్గ వివక్షలకు తెరతీస్తోందంటూ ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. అయితే విద్యార్థులను ఆహారం పేరు చెప్పి రెండు వర్గాలుగా విభజించడం పట్ల తమిళ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన తెలుపుతున్నాయి. మొత్తం ఐఐటీలో 8 వేల మంది విద్యార్థులుండగా వీరిలో 6 వేల మంది నాన్ వెజిటేరియన్లు కాగా.. మరో 2 వేల మంది వెజిటేరియన్లు.
Comments
Please login to add a commentAdd a comment