veg meals
-
భారతీయ శాకాహార వంటకాలు భేష్: జేడీ వాన్స్
వాషింగ్టన్: అమెరికా నూతన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్ భారతీయ శాకాహార వంటకాలపై ప్రశంసలు గుప్పించారు. తనకు భారతీయ శాకాహార వంటకాల రుచులను చూపించిన ఘనత తన భార్య ఉషా వాన్స్‌కి దక్కుతుందన్నారు. తామిద్దం డేటింగ్లో ఉన్నప్పుడు ఉష తన కోసం వండిన మొదటి శాఖాహార భోజనం గురించి జేడీవాన్స్ మీడియాకు తెలిపారు.‘జో రోగన్ ఎక్స్పీరియన్స్’ కార్యక్రమంలో వాన్స్ తన ఆహార అభిరుచులు తన భార్య ఉష కారణంగా ఎలా మారాయో తెలిపారు. ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ, శాకాహార వంటల వైపు మళ్లానని తెలిపారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలపై జో రోగన్ చేసిన విమర్శతో ఈ చర్చ ప్రారంభమైంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను రోగర్.. చెత్త అని పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో మొక్కల ఆధారిత ఆహారాలను అలవాటు చేసుకున్న వాన్స్ ఈ మాటను హృదయపూర్వకంగా అంగీకరించారు.ఎవరైనా సరే కూరగాయలను సరిగా తినాలనుకుంటే, అలాగే శాఖాహారిగా ఉండాలనుకుంటే భారతీయ ఆహారాలను తినండి అంటూ రోగన్ సలహా ఇచ్చిన దరిమిలా వాన్స్ దీనిని అంగీకరిస్తూ, తన భార్య నేపథ్యం, ఆమె వంటకాలు.. వాటితో తన జీవన విధానం ఎలా మారిందో తెలిపారు. తాను ఉషా వాన్స్‌ని కలవడానికి ముందు భారతీయ వంటకాలపై తనకు ప్రాథమిక అవగాహన మాత్రమే ఉందని వాన్స్ తెలిపారు. తన భార్య భారతీయ-అమెరికన్ అని, ఆమె చేసే శాఖాహార వంటలు అద్భుతంగా ఉంటాయని వాన్స్ పేర్కొన్నారు.శాకాహార జీవనశైలిని స్వీకరించాలనుకునువారు భారతీయ వంటకాల వైపు మళ్లండి. శాకాహారంలో పలు ఎంపికలు ఉంటాయి. నకిలీ మాంసాన్ని తినడం మానివేయండి అని వాన్స్ అన్నారు. వాన్స్ తన భార్య ఉషాతో డేటింగ్ చేసిన తొలిరోజుల నాటి ఊసులను కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తాను తన ఇంట్లో తయారుచేసిన శాఖాహార భోజనంతో ఉషను ఆకట్టుకునేందుకు ప్రయత్నించానని వాన్స్ తెలిపారు. పిజ్జా రోల్స్‌పై పచ్చి బ్రోకలీని ఉంచి, దానిపై మరిన్ని మసాలాలు జల్లి ఓవెన్లో 45 నిమిషాలు ఉంచి, శాఖాహార పిజ్జాను తయారు చేశానని,అయితే అది అత్యంత అసహ్యకరంగా తయారయ్యిందని వాన్స్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. శాకాహార భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తనకు కాస్త సమయం పట్టిందని వాన్స్ తెలిపారు. తన భార్య ఉష కారణంగా భారతీయ వంటకాల రుచులను చూశాక అవి ఎంత గొప్పగా, రుచిగా వైవిధ్యంగా ఉంటాయో గ్రహించానని, భారతీయ శాకాహార ఆహారాన్ని మనేదానితోనూ పోల్చలేమని వాన్స్ పేర్కొన్నారు. భారతీయ శాకాహారం గొప్పదనం తెలుసుకున్నాక తాను శాకాహారిగా మారానని తెలిపారు. కాగా తాను తన తల్లి నుంచి శాకాహర వంటకాలను తయారు చేయడాన్ని నేర్చుకున్నానని ఉషా వాన్స్ ఆ మధ్య మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం -
పెరిగిన వెజ్‌థాలీ ధర.. ఎంతంటే..
వెజిటేరియన్లూ.. పారాహుషార్. మీ భోజనం ఖర్చులు పెరిగిపోయాయి! నాన్ వెజిటేరియన్లూ.. మీకో శుభవార్త. నాన్ వెజ్ మీల్స్ ఖర్చులు తగ్గాయి! వెజిటేరియన్ భోజనం ఖర్చు పెరిగింది ఎంతో తెలుసా? ఏకంగా తొమ్మిది శాతం. మీకెలా తెలుసు అంటున్నారా? ‘రోటీ రైస్ రేట్’ అనే సంస్థ సర్వే చేసి మరీ తేల్చింది ఈ విషయాన్ని. ఇటీవలే ఈ సంస్థ సిద్ధం చేసిన నివేదిక ప్రకారం... ఉల్లి, టమోటా, బంగాళ దుంపల రేట్లు పెరిగిపోవడం వల్ల ‘వెజ్ థాలీ’ రేటు ఎక్కువైంది. మాంసాహారం విషయానికి వస్తే... చికెన్ రేట్లు తగ్గడం వల్ల ‘నాన్‌వెజ్ థాలీ’ ధర తగ్గిందని ఈ సంస్థ తెలిపింది.నివేదికలోని వివరాల ప్రకారం..రోటీ, కూరగాయలు (ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్లతో కూడిన వెజ్ థాలీ ధర మే నెలలో రూ.27.8కి పెరిగింది. గతేడాది ఇదే నెలలో పెరిగిన రూ.25.5తో పోలిస్తే ఎక్కువ. టమాటా ధరలు 39 శాతం, బంగాళదుంపలు 41 శాతం, ఉల్లి ధరలు 43 శాతం పెరగడమే వెజ్‌థాలీ ధర పెరగుదలకు కారణం. బియ్యం, పప్పుల ధరలు కూడా వరుసగా 13 శాతం, 21 శాతం పెరిగాయి. జీలకర్ర, మిర్చి, కూరగాయల నూనె ధరలు వరుసగా 37 శాతం, 25 శాతం, 8 శాతం తగ్గాయి. దాంతో వెజ్‌థాలీ ధర మరింత పెరగకుండా కట్టడైనట్లు నివేదిక పేర్కొంది.నాన్-వెజ్ థాలీ ధర మేలో రూ.55.9కి తగ్గింది. గతేడాది ధర రూ.59.9తో పోలిస్తే తక్కువగా ఉంది. బ్రాయిలర్ చికెన్ ధరలు 16 శాతం క్షీణించడంతో నాన్ వెజ్ థాలీ ధర తగ్గినట్లు నివేదిక తెలిపింది. -
పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్‌వెజ్ ఖరీదు
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా కీలక డేటాను విడుదల చేసింది. ఇంట్లోని శాఖాహార భోజనానికి అయ్యే ఖర్చు 7 శాతం పెరిగి రూ.27.3 చేరిందని నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే నెలలో ఈ ధర రూ.25.5గా ఉండేది. ఇక మాంసహారం భోజనం ధర ఏడుశాతం తగ్గి రూ.54.9కి చేరగా.. గతేడాది రూ.59.2గా ఉండేదని క్రిసిల్ నివేదించింది. నివేదికలోని వివరాల ప్రకారం.. ద్రవ్యోల్బణం వల్ల వంటిల్లు నిర్వహణ భారంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన ఉల్లిగడ్డలు 46 శాతం, టమాటాలు 36 శాతం, బంగాళదుంపలు 22 శాతం పెరగడంతో వెజ్భోజనం ధర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో ఉల్లి, బంగాళదుంపలు, టమాటా కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో పాటు బియ్యం ధరలు 14 శాతం, పప్పులు 22 శాతం అధికమయ్యాయి. అదే సమయంలో మాంసం ధరలు 16 శాతం పడిపోయినందున మార్చిలో భోజనానికి ఖర్చు తగ్గింది. ఇదీ చదవండి: కీలక వడ్డీరేట్లు యథాతథం క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ పూషన్ శర్మ మాట్లాడుతూ.. ‘గత ఐదు నెలలుగా శాకాహార, మాంసాహార భోజనం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మాంసహారం ధర పడిపోయి, కాయగూరల ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెరగడమే ఇందుకు కారణం. దేశంలో ముడి సరుకు ధరలు ఐదుశాతం పెరగడంతో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నాన్‌వెజ్ భోజనం ధర రెండుశాతం పెరిగింది. రంజాన్ మాసంలో మాంసాహారానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పశుగ్రాసం ధర కూడా అధికమైంది. సమీప భవిష్యత్తులో తాజా పంట మార్కెట్లోకి వస్తే గోధుమల ధరలు తగ్గుతాయి’ అని శర్మ వెల్లడించారు. -
Swiggy: రచయితకు చేదు అనుభవం.. రూ.70 వాపస్ చేస్తామనడంతో..
తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చేశాడు. మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్‌లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. (చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్) Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq — Ko Sesha (@KoSesha) August 17, 2022 అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్ విలువ రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్ అయిన తనకు స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్‌పై లీగల్‌గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు. I’ve been a strict vegetarian all my life & it disgusts me to think how casually they tried to buy my values. I demand that a representative of Swiggy, no lesser than the State Head call me to personally to apologise. I also reserve my rights to a legal remedy.@SwiggyCares — Ko Sesha (@KoSesha) August 17, 2022 కాగా, శేషా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్లైన్ ఫుల్ డెలివరీల్లో ఇవన్నీ కామన్ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్ కాదు.. నాన్ వెజ్ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్ వేదికగా స్పందించింది. రెస్టారెంట్ పార్టనర్ వల్లే తమ కస్టమర్‌కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్‌లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది. (చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!) For all those who have rushed to the aid of Swiggy:https://t.co/Fwsn7mmX51 — Ko Sesha (@KoSesha) August 17, 2022 -
వెజ్ టర్న్!
శాకాహారిగా మారిపోయారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. సడన్‌గా తాను తీసుకున్న ఈ ‘వెజ్ టర్న్’ గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘నా డైట్ ప్రకారం నేను నాజ్ వెజ్ తినడం తప్పనిసరి. ముఖ్యంగా గుడ్లు బాగా తింటాను. కానీ అకస్మాత్తుగా ఓ రోజు వీగన్ (శాకాహారం మాత్రమే తినేవారు. పాల ఉత్పత్తులు కూడా తీసుకోరు)గా మారిపోదామనే ఆలోచన వచ్చింది. అంతే.. మాంసాహారం మానేశా. ముంబైలో షూటింగ్ ఉంటే, నా ఇంటి నుంచి వచ్చే శాకాహార భోజనం, ఫలాలు, పండ్ల రసాలతో రోజంతా బాగానే గడుస్తోంది. ఇండియాలో ఎక్కడైనా ఓకే కానీ విదేశాల్లో షూటింగ్ అంటే ఇబ్బందిగా ఉంది. త్వరగా వెజ్ ఫుడ్ దొరకడం లేదు. కాకపోతే మన సంకల్పం ధృడంగా ఉంటే కచ్చితంగా ఓ మార్గం దొరుకుతుంది. నా టీమ్‌లో ఎవరికి వెజ్ ఐటమ్ కనిపించినా నా కోసం తీసుకువస్తున్నారు’’ అని రకుల్ పేర్కొన్నారు. -
వెజ్జా.. నాజ్ వెజ్జా..?!
చెన్నై : కులం, మతం పేరుతో విభజించడం తెలుసు.. కానీ భోజనం పేరు చెప్పి కూడా మనషులును విభజించడం గురించి చాలా తక్కువుగా విని ఉంటాము. నార్మల్‌గా బయట ఫంక్షన్లలో వెజ్, నాన్ వెజ్ అంటూ రెండు వేర్వేరు మెనులు ఏర్పాటు చేస్తారు. కానీ హస్టల్స్లో ఇలాంటి వర్గీకరణ గురించి ఎప్పుడు వినలేదు. కానీ ఇలాంటి సంఘటన ఒకటి మద్రాస్ ఐఐటీలో చోటు చేసుకుంది. ఇక్కడ క్యాంటీన్లో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్లకు వేర్వేరు దారులనే కాక వేర్వేరే వాష్ బేసిన్లను కూడా ఏర్పాటు చేసింది యాజమాన్యం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే విద్యార్థుల కోరిక మేరకే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. గత ఏడాది మేలో క్యాంపస్‌లో ‘బీఫ్ పెస్టివల్’ని నిర్వహించారు. ఈ సమయంలో హస్టల్లో గొడవలు కూడా జరిగాయి. బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్నందుకు ఓ రిసెర్చ్ స్కాలర్ని చితక బాదారు కూదా. ఈ సంఘటన తరువాత విద్యార్థులు.. వెజిటేరియన్లకు ప్రత్యేక మెస్ కావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలా రెండు మెస్‌లను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. అయితే ఇలా వేర్వేరు మెస్‌లు ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. యాజమాన్యం క్యాంపస్‌లో వర్ణ, వర్గ వివక్షలకు తెరతీస్తోందంటూ ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. అయితే విద్యార్థులను ఆహారం పేరు చెప్పి రెండు వర్గాలుగా విభజించడం పట్ల తమిళ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన తెలుపుతున్నాయి. మొత్తం ఐఐటీలో 8 వేల మంది విద్యార్థులుండగా వీరిలో 6 వేల మంది నాన్ వెజిటేరియన్లు కాగా.. మరో 2 వేల మంది వెజిటేరియన్లు. -
కేవలం వెజ్ మీల్స్‌తో రూ.10 కోట్లు ఆదా
న్యూఢిల్లీ : తీవ్ర నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా ఎప్పడికప్పుడూ తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నాన్-వెజ్ మీల్స్ ఎక్కువగా వేస్ట్ అవుతుందని, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఇటీవలే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎయిరిండియాకు వార్షికంగా 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం పార్లమెంట్‌కు చెప్పింది. వారికి కేవలం శాకాహార భోజనం సరఫరా చేయడంతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. నాన్-వెజిటేరియన్ మీల్స్ కేవలం ఎయిరిండియా దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ వారికే రద్దు చేశామని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మెనూలో, భోజన షెడ్యూల్లో పలు మార్పులు చేశామని, ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా అనుబంధ వస్తువులను అందించడం వంటి చర్యలతో ఈ విమానయాన సంస్థకు ఖర్చులు తగ్గి వార్షికంగా ఎయిరిండియాకు రూ.20 కోట్ల మేర ఆదా అవుతాయని ఆయన తెలిపారు.