వెజ్‌ టర్న్‌! | Rakul Preet Singh goes the vegan way | Sakshi
Sakshi News home page

వెజ్‌ టర్న్‌!

Published Sun, Feb 16 2020 3:29 AM | Last Updated on Sun, Feb 16 2020 3:29 AM

Rakul Preet Singh goes the vegan way - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

శాకాహారిగా మారిపోయారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. సడన్‌గా తాను తీసుకున్న ఈ ‘వెజ్‌ టర్న్‌’ గురించి రకుల్‌ మాట్లాడుతూ– ‘‘నా డైట్‌ ప్రకారం నేను నాజ్‌ వెజ్‌ తినడం తప్పనిసరి. ముఖ్యంగా గుడ్లు బాగా తింటాను. కానీ అకస్మాత్తుగా ఓ రోజు వీగన్‌ (శాకాహారం మాత్రమే తినేవారు. పాల ఉత్పత్తులు కూడా తీసుకోరు)గా మారిపోదామనే ఆలోచన వచ్చింది. అంతే.. మాంసాహారం మానేశా. ముంబైలో షూటింగ్‌ ఉంటే, నా ఇంటి నుంచి వచ్చే శాకాహార భోజనం, ఫలాలు, పండ్ల రసాలతో రోజంతా బాగానే గడుస్తోంది. ఇండియాలో ఎక్కడైనా ఓకే కానీ విదేశాల్లో షూటింగ్‌ అంటే ఇబ్బందిగా ఉంది. త్వరగా వెజ్‌ ఫుడ్‌ దొరకడం లేదు. కాకపోతే మన సంకల్పం ధృడంగా ఉంటే కచ్చితంగా ఓ మార్గం దొరుకుతుంది. నా టీమ్‌లో ఎవరికి వెజ్‌ ఐటమ్‌ కనిపించినా నా కోసం తీసుకువస్తున్నారు’’ అని రకుల్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement