వాషింగ్టన్: అమెరికా నూతన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్ భారతీయ శాకాహార వంటకాలపై ప్రశంసలు గుప్పించారు. తనకు భారతీయ శాకాహార వంటకాల రుచులను చూపించిన ఘనత తన భార్య ఉషా వాన్స్‌కి దక్కుతుందన్నారు. తామిద్దం డేటింగ్‌లో ఉన్నప్పుడు ఉష తన కోసం వండిన మొదటి శాఖాహార భోజనం గురించి జేడీవాన్స్ మీడియాకు తెలిపారు.
‘జో రోగన్ ఎక్స్‌పీరియన్స్’ కార్యక్రమంలో వాన్స్ తన ఆహార అభిరుచులు తన భార్య ఉష కారణంగా ఎలా మారాయో తెలిపారు. ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ, శాకాహార వంటల వైపు మళ్లానని తెలిపారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలపై జో రోగన్ చేసిన విమర్శతో ఈ చర్చ ప్రారంభమైంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను రోగర్.. చెత్త అని పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో మొక్కల ఆధారిత ఆహారాలను అలవాటు చేసుకున్న వాన్స్ ఈ మాటను హృదయపూర్వకంగా అంగీకరించారు.
ఎవరైనా సరే కూరగాయలను సరిగా తినాలనుకుంటే, అలాగే శాఖాహారిగా ఉండాలనుకుంటే భారతీయ ఆహారాలను తినండి అంటూ రోగన్ సలహా ఇచ్చిన దరిమిలా వాన్స్ దీనిని అంగీకరిస్తూ, తన భార్య నేపథ్యం, ఆమె వంటకాలు.. వాటితో తన జీవన విధానం ఎలా మారిందో తెలిపారు. తాను ఉషా వాన్స్‌ని కలవడానికి ముందు భారతీయ వంటకాలపై తనకు ప్రాథమిక అవగాహన మాత్రమే ఉందని వాన్స్ తెలిపారు. తన భార్య భారతీయ-అమెరికన్ అని, ఆమె చేసే శాఖాహార వంటలు అద్భుతంగా ఉంటాయని వాన్స్ పేర్కొన్నారు.
శాకాహార జీవనశైలిని స్వీకరించాలనుకునువారు భారతీయ వంటకాల వైపు మళ్లండి. శాకాహారంలో పలు ఎంపికలు ఉంటాయి. నకిలీ మాంసాన్ని తినడం మానివేయండి అని వాన్స్ అన్నారు. వాన్స్ తన భార్య ఉషాతో డేటింగ్ చేసిన తొలిరోజుల నాటి ఊసులను కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తాను తన ఇంట్లో తయారుచేసిన శాఖాహార భోజనంతో ఉషను ఆకట్టుకునేందుకు ప్రయత్నించానని వాన్స్ తెలిపారు. పిజ్జా రోల్స్‌పై పచ్చి బ్రోకలీని ఉంచి, దానిపై మరిన్ని మసాలాలు జల్లి ఓవెన్‌లో 45 నిమిషాలు ఉంచి, శాఖాహార పిజ్జాను తయారు చేశానని,అయితే అది అత్యంత అసహ్యకరంగా తయారయ్యిందని వాన్స్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
శాకాహార భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తనకు కాస్త సమయం పట్టిందని వాన్స్ తెలిపారు. తన భార్య ఉష కారణంగా భారతీయ వంటకాల రుచులను చూశాక అవి ఎంత గొప్పగా, రుచిగా వైవిధ్యంగా ఉంటాయో గ్రహించానని, భారతీయ శాకాహార ఆహారాన్ని మనేదానితోనూ పోల్చలేమని వాన్స్ పేర్కొన్నారు. భారతీయ శాకాహారం గొప్పదనం తెలుసుకున్నాక తాను శాకాహారిగా మారానని తెలిపారు. కాగా తాను తన తల్లి నుంచి శాకాహర వంటకాలను తయారు చేయడాన్ని నేర్చుకున్నానని ఉషా వాన్స్ ఆ మధ్య మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం
Comments
Please login to add a commentAdd a comment