US Vice President
-
Kamala Harris: ట్రంప్ వస్తే వినాశనమే
షికాగో: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ’ఏ మాత్రం సీరియస్‌నెస్ లేని వ్యక్తి’గా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభివర్ణించారు. ‘పొరపాటున ఆయన మళ్లీ అధ్యక్షుడైతే అంతులేని వినాశనమే. దేశాన్ని ట్రంప్ అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనక్కు తీసుకెళ్తారు‘ అంటూ అమెరికన్లను హెచ్చరించారు. డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) చివరి రోజు పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వాన్ని ఆమె లాంఛనంగా స్వీకరించారు. ‘జాతి, లింగ, భాషా భేదాలకు అతీతంగా, తమ కలల సాకారానికి అహరహం శ్రమిస్తున్న అమెరికన్లందరి తరఫున ఈ నామినేషన్‌ను స్వీకరిస్తున్నా‘ అంటూ కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యంత భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు. నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైనవిగా హారిస్ అభివరి్ణంచారు. ‘నన్ను గెలిపిస్తే పార్టీ భేదాలు తదితరాలకు అతీతంగా, అమెరికన్లందరి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తా. దేశ మౌలిక విలువలను, సూత్రాలను సమున్నతంగా నిలబెడతా. రాజకీయంగా, సైనికంగా సూపర్ పవర్‌గా అమెరికా స్థానాన్ని అన్నివిధాలా సుస్థిరం చేస్తా. అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పోరాడతా. గత పాలన తాలూకు విద్వేషాలు, విభజనవాదాలను రూపుమాపి దేశాన్ని ఒక్కటి చేస్తా‘ అని ప్రకటించారు. 59 ఏళ్ల హారిస్ వేదిక మీదకు వస్తుండగా పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. పలు అంశాలను స్పృశిస్తూ 40 నిమిషాల పాటు ఏకధాటిగా సాగిన ఆమె ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతున్నంతసేపూ, ’ఎస్, యూ కెన్ (నువ్వు సాధించగలవ్)’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారమే హారిస్ పదో పెళ్లి రోజు కూడా కావడం విశేషం. హిల్లరీ క్లింటన్ తర్వాత డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రెండో మహిళగా ఆమె నిలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత, ఆఫ్రికన్ మూలాలున్న నేత హారిసే. ఆమె గెలిస్తే అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు.ట్రంప్‌పై నిప్పులు ట్రంప్‌పై హారిస్ తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. ఏ కోణంలో చూసినా ఆయన అత్యంత నాన్ సీరియస్ వ్యక్తి అని దుయ్యబట్టారు. ట్రంప్ హయాంలో దేశంలో అయోమయం, గందరగోళమే రాజ్యం చేశాయన్నారు. చివరికి ఓటమిని ఒప్పుకోకుండా పార్లమెంటు మీదికే అల్లరిమూకలను ఉసిగొలి్పన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. హష్ మనీ మొదలుకుని ఫ్రాడ, లైంగిక వేధింపుల దాకా నానారకాల ఆరోపణలు, లెక్కలేనన్ని కోర్టు కేసులు ఎదుర్కొంటున్న విచి్ఛన్నకర శక్తిగా ట్రంప్‌ను అభివరి్ణంచారు. ‘ట్రంప్ రష్యాకు అన్ని అరాచకాలకూ లైసెన్సు ఇచ్చారు. అమెరికా మిత్రదేశాలపై దండెత్తేలా ప్రోత్సహించారు‘ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను మళ్లీ గెలిపిస్తే కేవలం తనకోసం, తన బిలియనీర్ మిత్రుల ప్రయోజనాల కోసమే పాటుపడతారని దుయ్యబట్టారు. ‘నేనలా కాదు. అమెరికన్లందరి కోసం పోరాడతా. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి నియంతలను ట్రంప్ మాదిరిగా నేను ఉపేక్షించను. అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిగా తీర్చిదిద్దుతా. సైనికులు, వారి కుటుంబాల త్యాగాలను ట్రంప్‌లా ఎన్నటికీ కించపరచను‘ అని చెప్పారు. గాజా యుద్ధాన్ని ఆపేందుకు బైడెన్‌తో కలిసి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణకు సర్వ హక్కులూ ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.కోర్టు హౌస్ నుంచి వైట్ హౌస్ దాకా... అనూహ్య ప్రస్థానాలు అలవాటేఅధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో అత్యంత అనూహ్యంగా తాను అధ్యక్ష రేసులోకి వచి్చన వైనాన్ని హారిస్ ప్రస్తావించారు. ఇలాంటి అనూహ్య ప్రస్థానాలు జీవితంలో తనకు కొత్తేమీ కాదన్నారు. అమెరికాను తిరిగి ఐక్యం చేసి నూతన దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న నేతగా తనను తాను పరిచయం చేసుకున్నారు. కోర్టు హౌస్ నుంచి ఇప్పుడు వైట్ హౌస్‌కు పోటీపడే దాకా తన జీవనయానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందన్నారు. ‘ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశ ఘన చరిత్రకు వారసులం మనం. అమెరికా అంటే అనంతమైన అవకాశాలకు, అంతులేని ప్రేమకు, అపరిమితమైన స్వేచ్ఛకు ఆలవాలమని ప్రపంచానికి మరోసారి చాటుదాం‘ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు.తల్లీ నిన్ను తలంచి.. తన తల్లి శ్యామలా గోపాలన్‌ను ఈ సందర్భంగా హారిస్ గుర్తు చేసుకున్నారు. ఆమెను రోజూ మిస్సవుతున్నానని చెప్పారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రధానమైన గాజుతెరను బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్న ఈ సమయంలో అమ్మ మరీ మరీ గుర్తొస్తోందని చెప్పారు. ఆమె నూరిపోసిన విలువలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. ఏ పనీ సగంలో వదలొద్దని తల్లి తనకు మరీ మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నారు. ‘నా తల్లి కేవలం 19 ఏళ్ల వయసులో సప్త సముద్రాలు దాటి ఎన్నో కలలతో భారతదేశం నుంచి అమెరికాలో అడుగు పెట్టింది. ఒక సైంటిస్టుగా రొమ్ము క్యాన్సర్‌కు మందు కనిపెట్టడమే లక్ష్యంగా శ్రమించింది. ఉన్నది ఐదడుగులే అయినా అనంతమైన ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. భారత్ తిరిగి వెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ సమయంలో జమైకా నుంచి వచి్చన మా నాన్న డొనాల్డ్ హారిస్‌తో అమ్మకు పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. నన్నూ, చెల్లెలు మాయను అమ్మే పెంచింది. ఈస్ట్ బేలో అద్దెకు తీసుకున్న ఒక చిన్న ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. శ్రామిక తరగతి వ్యక్తుల నడుమ పెరిగాం. అమ్మ రోజంతా పనిచేస్తే మా బాగోగులు ఇరుగుపొరుగు చూసుకునే వాళ్లు‘ అంటూ వారిని పేరుపేరునా హారిస్ గుర్తు చేసుకున్నారు. ‘వాళ్లంతా మాకు రక్త సంబం«దీకులు కాకున్నా ప్రేమ బాంధవులు. కలసికట్టుగా నెగ్గడం ఎలానో వారి మధ్య పెరగడం వల్లే నేర్చుకున్నా‘ అన్నారు. ‘ఈ క్షణం అమ్మ పైనుంచి నన్ను కచి్చతంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంటుంది‘ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని కూడా ఈ సందర్భంగా ఆప్యాయంగా స్మరించుకున్నారు. -
కమలా హారిస్ మరో రికార్డు.. అమెరికా చరిత్రలో 191 ఏళ్ల తర్వాత..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్(58) మరో రికార్డు నెలకొల్పారు. భారత సంతతికి చెందిన కల్పనా కోటగల్‌ను అమెరికా సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ సభ్యురాలిగా నియమించే విషయంలో ఆమె టై–బ్రేకింగ్ ఓటు వేశారు. సెనేట్‌లో బుధవారం ఓటింగ్ జరిగింది. కల్పనా కోటగల్‌ను నియమించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ టై–బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షుడు ఇలాంటి ఓటు హక్కు వినియోగించుకోవడం 191 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చదవండి: రెస్టారెంట్‌కు షాక్.. మసాలా దోసతో సాంబారు ఇవ్వలేదని.. -
నూతన రంగాల్లోనూ కలిసి పనిచేస్తున్న భారత్, అమెరికా
వాషింగ్టన్: నూతన రంగాల్లోనూ భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాలో పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం శ్వేతసౌధంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇచి్చన విందులో పాల్గొన్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం వచి్చన తనకు ఘన స్వాగతం పలికిన అమెరికా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాలు పెంపొందించుకుంటున్నాయని తెలిపారు. భారత్–అమెరికా సంబంధాలనే శ్రావ్యమైన గానాన్ని ఇరుదేశాల పౌరులే స్వరపర్చారని కొనియాడారు. రెండు దేశాల మైత్రి బలపడానికి భారతీయ–అమెరికన్ అయిన కమలా హ్యారిస్ ఎంతగానో కృషి చేస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ విందులో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాల్గొన్నారు. -
ఈ గాలి.. ఈ నేల... బాల్య స్మృతుల్లో కమలా హ్యారిస్
లుసాకా: అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ జాంబియా వెళ్లి తన బాల్య స్మృతుల్లో మునిగిపోయారు. తన తాత, భారత్‌కు చెందిన పి.వి.గోపాలన్ ఇంట్లో చిన్నప్పుడు వారితో గడిపిన రోజుల్ని గుర్తు చేస్తుకున్నారు. 1960 దశకంలో కమల హ్యారిస్ తాత చెన్నై నుంచి జాంబియా రాజధాని లుసాకా వెళ్లి అక్కడ ఇండియన్ ఫారెన్ సర్వీసు అధికారిగా సేవలందించారు. అప్పట్లో తాము నివసించిన ఇల్లు ఇప్పుడు లేకపోయినా ఆ ప్రాంతానికి వెళ్లిన కమల అక్కడ మట్టి పరిమళాన్ని ఆస్వాదించారు. ‘‘నా చిన్నతనంలో మా తాతయ్యతో గడిపిన రోజులు నాకెంతో విలువైనవి. ఈ ప్రాంతంలో నా బాల్యం గడిచింది. ఇప్పుడు మళ్లీ అక్కడే ఉన్నానన్న ఊహ ఎంతో మధురంగా ఉంది.బాల్య జ్ఞాపకాలు ఎప్పుడూ ఒక ఉద్వేగాన్ని ఇస్తాయి. ఇక్కడ్నుంచి మా కుటుంబం తరఫున ప్రతీ ఒక్కరికీ హాయ్ చెబుతున్నాను’’ అని అంటూ కమలా హ్యారిస్ ఉద్విగ్నతకు లోనయ్యారు. -
మిసైల్ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్‌లో యూఎస్, దక్షిణ కొరియా
సియోల్: ఉత్తర కొరియా ఒక అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ విషయమై తమ జపాన్ కోస్ట్ గార్డు తీరంలో ఉన్న నౌకలకు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా జపాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియా ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం నిర్వహించనుందని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగానికి తెగబడటం గమనార్హం. ఇదిలా ఉండగా..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె ఉత్తర దక్షిణ కొరియాల సరిహద్దు పటిష్ట భద్రతను పర్యవేక్షించనున్నారు. ఈ వారంలోనే ఈ రెండు దేశాలు రోనాల్డ్ రీగన్ సముద్రతీర ప్రాంతంలో సంయుక్తంగా సైనిక కసరత్తులను నిర్వహించనున్నాయి. ఐతే ఉత్తర కొరియా ఈ ఇరు దేశాల సైనిక కసరత్తులను యుద్ధ సన్నహాలుగా పరిగణిస్తూ ఫైర్ అవుతోంది. ఐతే ఆయా దేశాలు మాత్రం తమ భద్రతా దృష్ట్యా సాగిస్తున్న విన్యాసాలుగా చెబుతున్నాయి. అదీగాక అమెరికా దక్షిణ కొరియా రక్షణ నిమిత్తం దాదాపు 28 వేల సైనికులను మోహరించింది. (చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు!) -
‘గ్యాప్’ పెరుగుతోందా? వైట్‌హౌస్‌లో ఏదో తేడా కొడుతోంది!
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షరాలిగా చరిత్రకెక్కిన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌కు ‘వైట్‌హౌస్’లో ప్రాధాన్యత తగ్గుతోందా? బాధ్యతల నిర్వహణలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రముఖ మీడియా సంస్థలు. కమలా హ్యారిస్‌తో అధ్యక్షుడు జో బైడెన్ కీలక బృందంలోని సభ్యులకు పొసగడం లేదని, ఫలితంగా పాలనా వ్యవహారాల్లో ఆమె పాత్ర క్రమేపీ తగ్గుతోందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. కమల కమ్యూనికేషన్ డైరెక్టర్ ఆష్లే ఇటైనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని తొలుత వార్తలు వెలువడ్డాయి. ఉపాధ్యక్షురాలికి ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న సైమోన్ సాండర్స్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలగనున్నారు. హ్యారిస్ జట్టులో వీరిద్దరూ అత్యంత ముఖ్యులు. ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారిస్ ఇమేజ్ను పెంచడంలో, ఆమె ప్రతిభను, నాయకత్వ పటిమను విజయవంతంగా అమెరికా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించారు. అత్యంత ముఖ్యులు, సీనియర్లు ఇద్దరూ ఒకే సమయంలో కమలా హ్యారిస్‌కు దూరమవ్వడం... యాదృచ్చికంగా కాదని ‘సీఎన్ఎన్’ వార్తా సంస్థ అభిప్రాయపడింది. వైట్‌హౌస్‌లో అంతా సవ్యవంగా లేదని, ఏదో తేడా కొడుతోందని పేర్కొంది. ‘ముద్ర’పడిపోతుందనే భయమా? కమలా హ్యారిస్‌కు అత్యంత సన్నిహితురాలైన సైమోన్ సాండర్స్ వైదొలుగుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకీ ‘ఆమె ఎప్పటికీ బైడెన్– హ్యారిస్ కుటుంబం (సన్నిహిత బృందం)లో సభ్యురాలే. రెండు మూడేళ్లు ఒక పదవిలో పనిచేశాక కొత్త బాధ్యతలు సిద్ధం కావడం సహజమే. తొలి ఏడాది వైట్‌హౌస్‌లో పనిచేయడం ఉత్సాహాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అదే సమయంలో కఠోరమైన శ్రమకు, తీవ్ర అలసటకు గురిచేస్తుంది’ అని అన్నారు. ‘సైమోన్‌ను నేనెంతో అభిమానిస్తాను. తదుపరి ఆమె ఏం చేస్తారనేది తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. బాధ్యతల నిర్వహణలో భాగంగా దాదాపు మూడేళ్లుగా విరామం ఎరుగకుండా దేశాన్ని చుట్టేసింది’ అని హ్యారిస్ స్పందించారు. కమలకు అత్యంత సన్నిహితులుగా శాశ్వత ముద్రపడితే... బైడెన్ హయాంతో పాటు భవిష్యత్తులోనూ తమకు మంచి అవకాశాలు లభించకపోవచ్చనే భయమూ ఆష్లే, సాండర్స్లకు ఉండి ఉండొచ్చని మరికొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. పరిమిత పాత్రపై అసంతృప్తి! జెన్ సాకీ వివరణ ఆమోదయోగ్యంగా లేదని... ఆష్లే, సాండర్స్ ఇద్దరూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే (జవనరి 20) బాధ్యతల నుంచి తప్పుకోవడం అసాధారణమైన పరిణామమేనని సీఎన్ఎన్ పేర్కొంది. విధి నిర్వహణకు ఉపాధ్యక్షురాలు సరైన రీతిలో సన్నద్ధం కాలేదని, పైగా ఆమెకు అంతగా ప్రాధాన్యం కూడా దక్కడం లేదని కమలా హ్యారిస్ కార్యాలయంలో, జట్టులో పనిచేస్తున్న సన్నిహితుల్లో అసంతృప్తి పెరుగుతోంది. రాజకీయంగా చేతులు కట్టేసినట్లుగా భావిస్తున్నానని హ్యారిస్ సన్నిహితుల వద్ద బాధపడినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ఆమె టీంలోని దాదాపు 30 మందితో మాట్లాడాక సీఎన్ఎన్ ఈ అభిప్రాయానికి వచ్చింది. లీగల్ రెసిడెంట్లు, ఇతర మైనారిటీలకు ఓటు హక్కు విషయంలో గట్టిగా కృషి చేసే బాధ్యతను బైడెన్ జనవరిలోనే హ్యారిస్‌కు అప్పగించారు. చట్టసభల్లో ఈ అంశంలో బిల్లు పాసయ్యే అవకాశాలు బహుస్వల్పం. అలాగే మెక్సికో గుండా అక్రమ వలసలను నిరోధించి, దీనికో పరిష్కారం కనుగొనే బాధ్యతనూ ఉపాధ్యక్షురాలికి అప్పగించారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అక్రమ వలసలు, శరణార్థుల విషయంలో కఠిన వైఖరిని అవలంభించారు. అప్పుడు ఎన్నో వేల మంది పిల్లలను తల్లిదండ్రులకు అమెరికా యంత్రాంగం దూరం చేసిందనే అపవాదు ఉంది. అక్రమవలసలను అడ్డుకొనే విషయంలో బైడెన్‌కు ముందు పనిచేసిన చాలామంది అధ్యక్షులూ విఫలమయ్యారు. ఇలాంటి కఠినతరమైన, సున్నిత అంశాలను కమలా హ్యారిస్‌కు అప్పగించారు. వయసు, ఆరోగ్యరీత్యా బైడెన్ (79 ఏళ్లు) రెండోసారి అధ్యక్ష పదవికి పోటీపడకపోవచ్చని, భవిష్యత్తులో డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి కావొచ్చని, అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుందనే అంచనాల మధ్యన బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్ (57 ఏళ్లు) ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమనేది మెజారిటీ మీడియా అంటోంది. రుణ పరిమితిని పెంచుకోవడం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, సంక్షేమ పథకాలపై భారీ ఎత్తున ఖర్చు చేయడానికి సంబంధించిన ప్రతినిధుల సభ, సెనేట్ల ఆమోదం పొందడానికి జో బైడన్ ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలితో ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నాలపై సత్వరం దృష్టి సారించేంత సమయం ఇప్పుడు ఆయనకు లేదని అంటున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కమల ‘అధ్యక్ష’ బాధ్యతలు భేష్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గంట 25 నిమిషాలపాటు అగ్రరాజ్యం తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరించడం అమెరికా దేశ చరిత్రలో ఒక అధ్యాయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ అన్నారు. అధ్యక్ష హోదాలో విధుల్లో ఉన్నది కాసేపే అయినప్పటికీ కమలా తన బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ‘అమెరికా చరిత్రలో ఇది మరో అధ్యాయంగా చెప్పాలి. కొద్దిసేపైనా సరే ఒక మహిళ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని జెన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలరనే భావనతోనే ఎన్నికల సమయంలో కమలా హ్యారిస్‌ను బైడెన్ ఎన్నిక చేసుకున్నట్టుగా సాకీ వివరించారు. అధ్యక్షుడు బైడెన్‌కి కొలనోస్కోపీ పరీక్షలు నిర్వహించే సమయంలో మత్తుమందు ఇవ్వడం వల్ల కమలకు తన అధికారాలను బైడెన్ బదలాయించిన విషయం తెలిసిందే. బైడెన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తేలింది. -
కమల హారిస్ ఇంటి ముందు కలకలం..!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇంటిముందు తుపాకీతో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. స్థానిక సమయం ప్రకారం బుధవారం రోజన టెక్సాస్ కు చెందిన ఓ వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసం ముందు వాషింగ్టన్ డీసీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి వాహనం నుంచి రైఫిల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం .. స్థానిక సమయం మధ్యాహ్నం 12:12 గంటలకు మసాచుసెట్స్ అవెన్యూ 3400 బ్లాక్ దగ్గర అనుమానాస్పద వ్యక్తిని అమెరికా భద్రత సిబ్బంది గుర్తించింది, ఆ వ్యక్తిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. అతడు టెక్సాస్ కు చెందిన పాల్ ముర్రే( 31)గా ఇంటెలిజన్స్ అధికారులు గుర్తించారు. ముర్రేపై పలు కేసులను నమోదు చేశారు. దీనిపై అమెరికా భద్రత సిబ్బంది మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హారిస్ తొలి మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. (చదవండి: మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది. మా ఇద్దరిలో కాన్ఫిడెన్స్ ఉంది) -
కమలా హ్యారిస్ ముగ్గురమ్మల కూతురు
‘‘అమ్మ కాకుండా మరో ఇద్దరు మహిళలు నా జీవితంలో ఉన్నారు’’ అని కమలా హ్యారిస్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘అమ్మ కాకుండా’ అంటే అర్థం.. అమ్మతో సమానమైన వాళ్లు అనే! కమల తల్లి శ్యామలా గోపాలన్ జీవశాస్త్రవేత్త. బ్రెస్ట్ క్యాన్సర్‌పై పరిశోధకురాలు. పదేళ్ల క్రితం చనిపోయారు. కమల పద్ధతులు, పాటింపులు అన్నీ తల్లివే. తల్లి ఆమెకు తొలి ఆదర్శం. అందుకే కమల అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన నాటి నుంచీ కమల కన్నా కూడా కమల తల్లి గురించే ఎక్కువగా ప్రపంచానికి తెలిసింది. కమలే చెప్పుకున్నారు తన మాతృమూర్తి గురించి. మరో రెండు రోజుల్లో అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కమల ఇప్పుడు.. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన మరో ఇద్దరు మహిళ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వారిలో ఒకరు కమల పొరుగింట్లో ఉండే షెల్టన్. ఇంకొకరు కమల ఒకటో తరగతి టీచర్ విల్సన్. వాళ్లిద్దరితో తను ఉన్న ఫొటోలను కూడా కమల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కి జత చేశారు. ‘‘ఇప్పుడు నేనిలా ఉన్నానంటే అందుకు కారణం అమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా. శ్రీమతి షెల్టన్, శ్రీమతి విల్సన్. నా చిన్నప్పుడు మేము షెల్టన్ ఇంటి పక్కనే ఉండేవాళ్లం. ఆమె మా నైబర్. సాయంత్రం అమ్మ డ్యూటీ నుంచి రావడం ఆలస్యం అయితే నేను, చెల్లి మాయ.. నేరుగా షెల్టన్ వాళ్ల ఇంట్లోకి వెళ్లేవాళ్లం. అక్కడి తిని, అమ్మ వచ్చి మమ్మల్ని పిలుచుకెళ్లే వరకు అక్కడే పడుకునేవాళ్లం. షెల్టన్ మమ్మల్నెంతో ఆదరణగా చూశారు. మేము ఉంటున్న ఓక్లాండ్కి ఆమె లూసియానా నుంచి వచ్చి ఉంటున్నారు. ఆమె భర్త ఆర్థర్. నర్సరీ స్కూల్ నడిపేవారు ఆయన. మా ఇంటికి.. వాళ్ల ఇల్లు ఒక కొనసాగింపుగా ఉండేది. ఇక షెల్టన్ అయితే జస్ట్ లైక్ రెండో అమ్మ మాకు. షెల్టన్ గలగల మాట్లాడేవారు. అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకునేవారు. అదొక జీవిత విధానంగా చేసుకున్నారు. నాలోని ఆ స్వభావం అమె నుంచి అంటు కట్టుకున్నదే. ‘లా’ అయ్యాక నేను అలామెడా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్‌లో పని చేసే రోజుల్లో కూడా తరచు షెల్టన్ వాళ్ల ఇంటికి వెళుతుండేదాన్ని. వంట బాగా చేస్తారామె. ఏవేళనైనా వాళ్లింటికి వెళితే నాకు ప్రియమైవి రెండు లభించేవి. ఒకటి షెల్టన్ వెచ్చని కావలింత. రెండు రుచికరమైన భోజనం. తల్లి శ్యామలతో కమల (ఫైల్ ఫొటో) ‘‘ఇక మరో అమ్మ.. శ్రీమతి విల్సన్ బర్కిలీలోని థౌజండ్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్లో మా ఒకటో తరగతి టీచర్. బాల్యంలో నాలో ఆశల్ని, ధైర్యాన్ని నింపింది ఆవిడే. కాన్ఫిడెన్స్ కూడా ఆమె ఇచ్చిందే. ఎప్పటికీ నేను ఆమెకు రుణపడి ఉంటాను. పై చదువులకు వెళ్లి ‘లా’ డిప్లొమా చేసి, ఆ సర్టిఫికెట్‌ను అందుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్లినప్పుడు కూడా విల్సన్ నా కోసం వచ్చి ఆడియన్స్‌లో కూర్చొని ఉన్నారు! నవ్వుతూ నావైపే చూస్తూ ఉన్నారు. తన రాకతో నన్ను సంతోష పరచడం కోసం వచ్చారు విల్సన్. చిన్నప్పుడు స్కూల్లో ఆమె చెప్పిన పాఠాలు జీవితంలో ఇప్పటికీ నన్ను నడిపిస్తూనే ఉన్నాయి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు చేసుకున్నారు కమలా హ్యారిస్. జనవరి 20 ప్రమాణ స్వీకారం దగ్గర పడుతున్న కొద్దీ.. ఆమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల తన జీవితంలోని అమూల్యమైన వ్యక్తులను, ప్రదేశాలను, మరచిపోలేని సందర్భాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఏ విధంగానూ అధికార దర్పాన్ని ప్రదర్శించని ఒక సాధారణ నాన్– అమెరికన్ సంతతి మహిళను అమెరికా తన తొలి ఉపాధ్యక్షురాలిగా చూడబోతోంది. ఆమె పాలనలో సకల మానవ సౌభ్రాతృత్వ భావనను కూడా. తెలిసిన వాళ్లెవరైనా ఒక్కసారిగా పెద్ద పొజిషన్లోకి వెళితే.. ‘వాళ్లు మాకు తెలుసు’ అని గొప్పగా చెప్పుకుంటాం. గొప్ప కాకుండా ఎలా ఉంటుంది? మనకు పరిచయం ఉన్నవారు దేశాన్నే పాలించబోతుంటే!! కమలా హ్యారిస్ గురించి కూడా ‘ఆమె మాకు తెలుసు’ అని గొప్పగా చెప్పుకోడానికి ఎంతోమంది ఉండే ఉంటారు. అయితే రివర్స్‌లో.. కమలా హ్యారిసే.. ‘చిన్నప్పుడు నాకు అన్నం పెట్టిన అమ్మ’. ‘నాలో ఆశలు నింపిన అమ్మ’ అని ఇద్దరు మహిళల గురించి గొప్పగా చెప్పుకుని, వాళ్లిద్దరికీ తన మాతృమూర్తి స్థానాన్ని పంచడం.. ప్రపంచ ప్రజల దృష్టిలో ఆమెను మరింత ఎత్తుకు ఎదిగేలా చేసింది. -
వూహాన్లో ఆరు కొత్త కరోనా కేసులు
బీజింగ్/వాషింగ్టన్: ప్రాణాంతక మహమ్మారి కరోనా పుట్టినిల్లు వూహాన్లో సుమారు నెల రోజుల స్తబ్దత తర్వాత ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. వూహాన్‌లోని సాన్‌మిన్ నివాస సముదాయంలో ఈ కొత్త కేసులు నమోదు కాగా.... అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్ చేసింది. ఛాన్‌గోయింగ్ స్ట్రీట్ వర్కింగ్ కమిటీ కార్యదర్శి ఝాంగ్ యుక్సిన్ వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్ చేసినట్లు షిన్హువా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్తగా బయటపడ్డ కేసులన్నీ ఈ ఛాంగ్గోయింగ్ వీధిలోనివే. మరోవైపు, చైనాలోని అన్ని ప్రాంతాల్లోనూ వైరస్ ప్రభావం తగ్గిందనేందుకు సూచనగా ప్రభుత్వం కోవిడ్ రిస్క్ ప్రమాద హెచ్చరికను తగ్గించింది. వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ప్రఖ్యాత షాంఘై డిస్నీల్యాండ్ మళ్లీ మొదలైంది. మైక్ పెన్స్ స్వీయ నిర్బంధం తన సహాయకుడు ఒకరు కరోనాబారిన పడటంతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా పరీక్షల్లో పెన్స్‌కు ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ స్టీఫెన్ హాన్ సైతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. -
ఉగ్ర ఆనవాళ్లన్నీ అక్కడే!
సింగపూర్: అంతర్జాతీయంగా జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల ఆనవాళ్లు, మూలాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ప్రత్యేకంగా ఏ దేశాన్ని ప్రస్తావించకున్నా పాకిస్తాన్‌ను ఉద్దేశించే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆసియాన్–ఇండియా సదస్సుకు హాజరయ్యేందుకు రెండు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన మోదీ బుధవారం పలువురు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మైక్ పెన్స్‌తో పాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్–ఓ–చాలతో భేటీ అయ్యారు. భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అమెరికా కంపెనీలను కోరారు. పెన్స్ నోట ముంబై దాడుల మాట.. మోదీ–పెన్స్ భేటీలో ఉగ్రవాదం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఎలా చూసినా కూడా ప్రపంచంలో జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల మూలాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల పలు దేశాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ సంతతి ప్రజల పాత్ర సంగతి ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పార్టీ పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, పెన్స్ భేటీ వివరాల్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానానికి పెన్స్ అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో భేటీ అయిన మోదీ..ఆర్థిక సాంకేతికత, ప్రాంతీయ అనుసంధానత, ద్వైపాక్షిక సహకారం తదితరాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మోదీ, లూంగ్ మధ్య సమావేశం ఫలప్రదంగా జరిగిందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్‌లతో సమావేశమైన మోదీ..వాణిజ్యం, రక్షణ, భద్రత తదితర రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. -
'ట్రంప్ వస్తే చస్తామనే భయమేస్తోంది'
ఫామ్ విల్లే: ఆర్థిక పరమైన అంశాలు, వలస విధానాలు, విదేశాంగ విధానంవంటి అంశాలపై అమెరికా ఉపాధ్యక్ష పదవికోసం బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ కైనే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ పెన్స్ మధ్య తొలి చర్చా కార్యక్రమం హాట్ హాట్ గా ముగిసింది. ఈ ఇద్దరూ కూడా తమలో ఏ ఒక్కరం తమ బాసులకు(హిల్లరీక్లింటన్, డోనాల్డ్ ట్రంప్)లకు ఏ మాత్రం తక్కువ కాదనే స్థాయిలో చర్చకు దిగారు. ప్రతిసారి వీరు తమ అధ్యక్ష అభ్యర్థుల పేర్లను ప్రస్తావిస్తూ చర్చను కొనసాగించారు. ఇదే క్రమంలో తమ వ్యక్తిగత సామర్థ్యాలు, అనుభవాలు, వ్యూహాలు పంచుకున్నారు. నవంబర్ 8న అమెరికా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా సాగింది. వర్జీనియాకు సెనేటర్ గా పనిచేస్తున్న టిమ్ కైనే తనకు స్థానికపరంగానే కాకుండా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, తమ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు తానే సరైన అభ్యర్థినని చెప్పుకున్నాడు. ఆమెను నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అంటూ కొనియాడారు. కమాండర్ ఇన్ చీఫ్ గా హిల్లరీకి మిక్కిలి సామర్థ్యం ఉందన్నారు. డోనాల్డ్ ట్రంప్ కమాండర్ ఇన్ చీఫ్ అనే ఆలోచన చావు అనే భయాన్ని తెప్పిస్తోందంటూ వ్యాఖ్యానించారు. అనుక్షణం అవమానించే ట్రంప్ లాంటి వ్యక్తిని పెన్స్ ఎలా వెనుకేసుకొస్తున్నారో, ఆయన వ్యక్తినని ధైర్యంగా ఎలా చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇక ఇండియానా గవర్నర్ గా పనిచేస్తున్న మైక్ పెన్స్ స్పందిస్తూ అదే స్థాయిలో కైనే విమర్షలను తిప్పికొట్టారు. అసలు ఆయన విమర్శలు పట్టించుకోకుండా ఇతర విషయాలు ప్రస్తావించారు. 'ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన అవమానాలు మాత్రమే నీకు గుర్తుండి ఉండొచ్చు. గత కొద్ది నెలలు హిల్లరీ కూడా అదే విషయాలు చెబుతున్నారు. అయితే నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మేం ప్రపంచంలో భిన్న పార్శాలు చూశాము. ముఖ్యంగా మధ్యాసియాలో పరిస్థితులు ఏ మాత్రం అదుపులో లేకుండా మారిపోతున్నాయి. మేం గంటగంటకు సిరియాలో ఆ విషయాలను పరిశీలిస్తున్నాం. అవన్నీ కూడా గతంలో హిల్లరీ చేసిన చలవే' అంటూ విమర్శించారు. అనంతరం ట్రంప్ ఎగ్గొట్టిన పన్నుల గురించి, హిల్లరీ వివాదాస్పద ఈమెయిల్స్ వ్యవహారం గురించి మొత్తం తొమ్మిదిగంటలపాటు కొన్ని అంశాల వారిగా వీరి మధ్య చర్చా కార్యక్రమం జరిగింది. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థులు నిల్చొని పలు అంశాలపై మాట్లాడుకోగా ఉపాధ్యక్షులు మాత్రం దర్జాగా కూర్చొని చర్చించుకుంటారు. -
సంస్కరణలు వేగవంతం చేయండి
వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడేలా చూడండి - భారత్‌ను కోరిన అమెరికా - వైస్ ప్రెసిడెంట్ జో బెడైన్ వాషింగ్టన్: పెట్టుబడుల రాకకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేలా ఆర్థిక సంస్కరణల అమలును మరింత వేగవంతం చేయాలని అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్.. భారత్‌ను కోరారు. మేధోహక్కులను పరిరక్షించడం, వాణిజ్య నిబంధనలను సరళతరం చేయడంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు.. ఇరు దేశాల సంబంధాల్లో నూతన శకాన్ని ఆవిష్కరించగలవని బెడైన్ వ్యాఖ్యానించారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) 40వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా బెడైన్ ఈ విషయాలు చెప్పారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సర్వీసులను మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకునే వీలు కల్పించేలా విదేశీ పెట్టుబడులపై పరిమితులు తొలగించాల్సిన అవసరం ఉందని బెడైన్ పేర్కొన్నారు. వాణిజ్య నిబంధనల సరళీకరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందన్నారు. అటు వాతావరణంలో ప్రతికూల మార్పులను సరిదిద్దేందుకు కూడా ఇరు దేశాలు మరింతగా పరస్పరం సహకరించుకోవాలని, ఇది ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల ఆర్థిక ప్రగతిలో కొత్త శకాన్ని ఆవిష్కరించగలదని బెడైన్ చెప్పారు. ఇరు దేశాలు వాణిజ్య సంబంధాలు వేగవంతంగా పటిష్టం చేసుకుంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పేర్కొన్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి.. సుష్మా స్వరాజ్ భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలని అమెరికన్ ఇన్వెస్టర్లకు సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. భారత్ పట్టణీకరణను పెంచేందుకు, ప్రజలందరికీ చౌకగా విద్యుత్‌ను, అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు. అలాగే అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. వీటన్నింటా కూడా వ్యాపార అవకాశాలు ఉన్నాయని, అమెరికా ఇన్వెస్టర్లు వీటిని అందిపుచ్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత్ .. టాప్ 50లోకి చేరాలంటే .. కాంట్రాక్టుల అమలును మెరుగుపర్చాలని, దివాలా చట్టాలను ఆధునీకరించాలని అమెరికా వాణిజ్య మంత్రి పెనీ ప్రిట్జ్కర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో వ్యాపారపరమైన కాంట్రాక్టుల వివాదాలు పరిష్కారం కావడానికి సంవత్సరాలు పట్టేస్తుందని, నిబంధనలు తరచూ మారిపోతుంటాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల వల్ల భారత్‌లో వ్యాపార నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారంగానూ, అనూహ్యమైన విధంగానూ ఉంటోందని పెనీ పేర్కొన్నారు. ఇవే దేశీ, విదేశీ పెట్టుబడుల రాకకు అవరోధంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించే దిశగా అత్యుత్తమ విధానాలదే రూపకల్పన చేసేందుకు ఇరు దేశాల బృందాలు కలిసి పనిచేయనున్నాయని పెనీ చెప్పారు. నూయి, భార్తియాకు పురస్కారాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో అందర్నీ భాగస్వాములు చేసే దిశగా కృషి చేస్తున్నందుకు గాను పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ శోభనా భార్తియా ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను యూఎస్ఐబీసీ.. గ్లోబల్ లీడర్షిప్ అవార్డును దక్కించుకున్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో యూఎస్ఐబీసీ కీలకపాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఇంద్రా నూయి పేర్కొన్నారు. రెండు దేశాల మీడియా, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచే సేందుకు అపార అవకాశాలున్నాయని శోభనా భార్తియా తెలిపారు. ప్రముఖ ఇండియన్-అమెరికన్ ఆర్టిస్టు నట్వర్ భవ్సార్.. ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. -
ఉపాధ్యక్షుడి కుమారుడు మృతి
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు బ్యూ బిడెన్ (46) మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు శనివారం చనిపోయాడని అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై జో బిడెన్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్‌తో గత కొద్ది కాలంగా బాధపడుతున్న నాకుమారుడు చివరికి మా అందరి హృదయాలను బాధపెట్టి వెళ్లిపోయాడు. అయినా అతడి ఆత్మ మా మధ్యనే ఉంటుంది. క్యాన్సర్ జయించడానికి అతడు ప్రతి రోజూ ఒక క్రమపద్ధతిలో జీవించేందుకు చాలా ధైర్యంగా పోరాడాడు. ఈ విషయంలో అతడి భార్య కూడా ఎంతో ధైర్యంగా అతడికి అండగా ఉంది' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
అమెరికా ఉపాధ్యక్షుడి నివాసం వెలుపల కాల్పులు
డెలావర్: అమెరికా ఉపాధ్యక్షుడు జోయి బిడెన్ నివాసం వెలుపల కాల్పులు కలకలం రేపాయి. డెలావర్ లోని జోయి బిడెన్ నివాసం వెలుపల కాల్పులు జరిగినట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. రాత్రి 8.25 గంటల ప్రాంతంలో ఓ వాహనంలో వచ్చిన దుండగులు రోడ్డుపై నుంచి కాల్పులు జరిపినట్టు పేర్కొంది. కాల్పులకు తెగబడింది ఎవరనే దానిపై అమెరికా భద్రతా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. -
గతేడాది 43 % వీసాలను మంజూరు చేశాం: అమెరికా కాన్సులేట్
వడోదరా: గతేడాది భారతీయ విద్యార్థులకు 43% వీసాల కేటాయించామని యూఎస్ వైస్ కాన్సులెట్ జెస్సీ వాల్తర్ తెలిపారు. సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పొల్గొన్న ఆయన అమెరికా వీసా విధివిధానాలపై వివరణ ఇచ్చారు. బీ-1, బీ-2, ఎఫ్-1 సవరణలు చేయడంతో ఇది సాధ్యపడిందని తెలిపారు గత సంవత్సరం భారతీయులకు ఆరు లక్షలపైగా అమెరికా వీసాలు మంజూరు చేశామన్నారు. భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా కేటాయింపులు పెరిగడంతో లక్షలాది మంది విద్యార్థుల లక్ష్యమైన అమెరికా చదువుకు మరింత అవకాశం పెరిగింది. నిరుడు అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 5600 స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. అంతకుముందు కంటే ఇది 50 శాతం ఎక్కువ. 2012 నివేదిక ప్రకారం 2011- 12 లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3.5 శాతం తగ్గింది. కానీ ఆ తర్వాతి క్రమేపీ పుంజుకుంది. అమెరికాలో ప్రస్తుతం 1,00,270 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. భారతీయ విద్యార్థుల స్పందన సానుకూలంగా ఉందని, ఈ పరిణామం తమకు సంతోషకరమని అమెరికా కాన్సులేట్ అధికారులు చెబుతున్నారు.