వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇంటిముందు తుపాకీతో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. స్థానిక సమయం ప్రకారం బుధవారం రోజన టెక్సాస్ కు చెందిన ఓ వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసం ముందు వాషింగ్టన్ డీసీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి వాహనం నుంచి రైఫిల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం .. స్థానిక సమయం మధ్యాహ్నం 12:12 గంటలకు మసాచుసెట్స్ అవెన్యూ 3400 బ్లాక్ దగ్గర అనుమానాస్పద వ్యక్తిని అమెరికా భద్రత సిబ్బంది గుర్తించింది, ఆ వ్యక్తిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. అతడు టెక్సాస్ కు చెందిన పాల్ ముర్రే( 31)గా ఇంటెలిజన్స్ అధికారులు గుర్తించారు. ముర్రేపై పలు కేసులను నమోదు చేశారు. దీనిపై అమెరికా భద్రత సిబ్బంది మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హారిస్ తొలి మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. (చదవండి: మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది. మా ఇద్దరిలో కాన్ఫిడెన్స్ ఉంది)
Comments
Please login to add a commentAdd a comment