వెజిటేరియన్లూ.. పారాహుషార్. మీ భోజనం ఖర్చులు పెరిగిపోయాయి! నాన్ వెజిటేరియన్లూ.. మీకో శుభవార్త. నాన్ వెజ్ మీల్స్ ఖర్చులు తగ్గాయి! వెజిటేరియన్ భోజనం ఖర్చు పెరిగింది ఎంతో తెలుసా? ఏకంగా తొమ్మిది శాతం. మీకెలా తెలుసు అంటున్నారా? ‘రోటీ రైస్ రేట్’ అనే సంస్థ సర్వే చేసి మరీ తేల్చింది ఈ విషయాన్ని. ఇటీవలే ఈ సంస్థ సిద్ధం చేసిన నివేదిక ప్రకారం... ఉల్లి, టమోటా, బంగాళ దుంపల రేట్లు పెరిగిపోవడం వల్ల ‘వెజ్ థాలీ’ రేటు ఎక్కువైంది. మాంసాహారం విషయానికి వస్తే... చికెన్ రేట్లు తగ్గడం వల్ల ‘నాన్‌వెజ్ థాలీ’ ధర తగ్గిందని ఈ సంస్థ తెలిపింది.
నివేదికలోని వివరాల ప్రకారం..రోటీ, కూరగాయలు (ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌లతో కూడిన వెజ్ థాలీ ధర మే నెలలో రూ.27.8కి పెరిగింది. గతేడాది ఇదే నెలలో పెరిగిన రూ.25.5తో పోలిస్తే ఎక్కువ. టమాటా ధరలు 39 శాతం, బంగాళదుంపలు 41 శాతం, ఉల్లి ధరలు 43 శాతం పెరగడమే వెజ్‌థాలీ ధర పెరగుదలకు కారణం. బియ్యం, పప్పుల ధరలు కూడా వరుసగా 13 శాతం, 21 శాతం పెరిగాయి. జీలకర్ర, మిర్చి, కూరగాయల నూనె ధరలు వరుసగా 37 శాతం, 25 శాతం, 8 శాతం తగ్గాయి. దాంతో వెజ్‌థాలీ ధర మరింత పెరగకుండా కట్టడైనట్లు నివేదిక పేర్కొంది.
నాన్-వెజ్ థాలీ ధర మేలో రూ.55.9కి తగ్గింది. గతేడాది ధర రూ.59.9తో పోలిస్తే తక్కువగా ఉంది. బ్రాయిలర్ చికెన్ ధరలు 16 శాతం క్షీణించడంతో నాన్ వెజ్ థాలీ ధర తగ్గినట్లు నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment