restaurant bill
-
పెరిగిన వెజ్‌థాలీ ధర.. ఎంతంటే..
వెజిటేరియన్లూ.. పారాహుషార్. మీ భోజనం ఖర్చులు పెరిగిపోయాయి! నాన్ వెజిటేరియన్లూ.. మీకో శుభవార్త. నాన్ వెజ్ మీల్స్ ఖర్చులు తగ్గాయి! వెజిటేరియన్ భోజనం ఖర్చు పెరిగింది ఎంతో తెలుసా? ఏకంగా తొమ్మిది శాతం. మీకెలా తెలుసు అంటున్నారా? ‘రోటీ రైస్ రేట్’ అనే సంస్థ సర్వే చేసి మరీ తేల్చింది ఈ విషయాన్ని. ఇటీవలే ఈ సంస్థ సిద్ధం చేసిన నివేదిక ప్రకారం... ఉల్లి, టమోటా, బంగాళ దుంపల రేట్లు పెరిగిపోవడం వల్ల ‘వెజ్ థాలీ’ రేటు ఎక్కువైంది. మాంసాహారం విషయానికి వస్తే... చికెన్ రేట్లు తగ్గడం వల్ల ‘నాన్‌వెజ్ థాలీ’ ధర తగ్గిందని ఈ సంస్థ తెలిపింది.నివేదికలోని వివరాల ప్రకారం..రోటీ, కూరగాయలు (ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్లతో కూడిన వెజ్ థాలీ ధర మే నెలలో రూ.27.8కి పెరిగింది. గతేడాది ఇదే నెలలో పెరిగిన రూ.25.5తో పోలిస్తే ఎక్కువ. టమాటా ధరలు 39 శాతం, బంగాళదుంపలు 41 శాతం, ఉల్లి ధరలు 43 శాతం పెరగడమే వెజ్‌థాలీ ధర పెరగుదలకు కారణం. బియ్యం, పప్పుల ధరలు కూడా వరుసగా 13 శాతం, 21 శాతం పెరిగాయి. జీలకర్ర, మిర్చి, కూరగాయల నూనె ధరలు వరుసగా 37 శాతం, 25 శాతం, 8 శాతం తగ్గాయి. దాంతో వెజ్‌థాలీ ధర మరింత పెరగకుండా కట్టడైనట్లు నివేదిక పేర్కొంది.నాన్-వెజ్ థాలీ ధర మేలో రూ.55.9కి తగ్గింది. గతేడాది ధర రూ.59.9తో పోలిస్తే తక్కువగా ఉంది. బ్రాయిలర్ చికెన్ ధరలు 16 శాతం క్షీణించడంతో నాన్ వెజ్ థాలీ ధర తగ్గినట్లు నివేదిక తెలిపింది. -
పర్యాటకుల రెస్టారెంట్ బిల్లు కట్టిన ఇటలీ ప్రభుత్వం
రోమ్: ఇటలీకి చెందిన ముగ్గురు పర్యాటకులు పొరుగుదేశం ఆల్బేనియాకు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్లో తిని బిల్లు కట్టకుండా చెక్కేశారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఇటీవల కుటుంబంతో కలిసి ఆల్బేనియాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్బేనియా ప్రధాని ఈడి రమా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని మెలోనీ తీవ్ర అవమానంగా భావించారు. దేశం పరువు తీశారంటూ తమ దేశస్తులపై మండిపడ్డారు. ‘వెళ్లి ఆ నలుగురు ఇడియట్స్ బిల్లు కట్టండి’అంటూ అక్కడి తమ దౌత్యాధికారులను ఆదేశించారు. వారు వెళ్లి రూ.7,245 బిల్లును సదరు రెస్టారెంట్ నిర్వాహకులకు చెల్లించి వచ్చారు. నిబంధనలు, సంప్రదాయాలను పాటించాలని, ఇటువంటివి మరోసారి జరక్కుండా జాగ్రత్తపడాలని తమ దేశస్తులకు ఇటలీ ఎంబసీ సూచించింది. కొందరు వ్యక్తులు బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా సదరు రెస్టారెంట్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఫుడ్ ఐటమ్స్ ఎంతో బాగున్నాయంటూ సదరు నలుగురు ఇటాలియన్లు తమను మెచ్చుకున్నారని కూడా తెలపడం విశేషం. -
రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్ చార్జీ వసూలు చేయుడు బంజేయండి!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు సర్వీసు చార్జీ వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు. రెస్టారెంట్ల అసోసియేషన్ ప్రతినిధులు, వినియోగదారుల సంఘాలతో గురువారం సమావేశం నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడించారు. ‘‘సర్వీసు చార్జీ వసూలు చట్టబద్ధమేనని అసోసియేషన్లు పేర్కొన్నప్పటికీ వినియోగ వ్యవహారాల శాఖ అభిప్రాయం అయితే..ఇది వినియోగదారుల హక్కులను దెబ్బతీస్తుంది. అంతేకాదు అనుచిత విధానం కూడా. 2017నాటి మార్గదర్శకాలు ఉన్నాయి కానీ, వాటిని అమలు చేయలేదు. కనుక త్వరలోనే చట్టపరమైన కార్యాచరణను ప్రకటిస్తాం. దాంతో చట్టప్రకారం అవి సర్వీసు చార్జీ వసూలు నిలిపివేయాల్సి ఉంటుంది’’అని రోహిత్ కుమార్‌సింగ్ తెలిపారు. కస్టమర్లు సర్వీసు చార్జీని సర్వీస్ ట్యాక్స్ గా పొరబడి చెల్లిస్తుంటారన్నారు. వినియోగదారులు, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ లేవనెత్తిన అంశాలపై తాజా సమావేశంలో కేంద్రం ప్రస్తావించింది. చట్టవిరుద్ధం కాదు..:‘‘ఇదే అంశం 2016–17లోనూ చర్చకు వచ్చింది. అప్పుడు అసోసియేషన్ తన స్పందన తెలిపింది. కాంపిటిషన్ కమిషన్‌కు సైతం మా వాదనను సమర్థవంతంగా వినిపించాం’’అని నేషనల్ రెస్టాంరెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. ‘‘సర్వీసు చార్జీ చట్ట విరుద్ధం కాదు, అనుచిత విధానమూ కాదు. ప్రజా వేదికపై ఈ చర్చ అనవసర గందరగోళానికి దారితీస్తుంది. రెస్టారెంట్ల సాఫీ కార్యాకలాపాలను ప్రభావితం చేస్తుంది’’అని ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ కబీర్‌సూరి పేర్కొన్నారు. చదవండి👉 శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
ఆ రెస్టారెంట్లో స్టూపిడ్ ప్రశ్నలు అడిగితే అంతే..
మాములుగా రెస్టారెంట్‌కు వెళితే.. మనం ఆర్డర్ చేసినవాటికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అమెరికా డెన్వర్‌లోని ‘టామ్స్ డిన్నర్’ రెస్టారెంట్లో మాత్రం వాటితో పాటు.. ఇంకో నిబంధన కూడా ఉంటుంది. రెస్టారెంట్లో కస్టమర్లు అడిగే స్టూపిడ్ ప్రశ్నలకు కూడా వారు బిల్లు వసూలు చేస్తారు. ఇలా బిల్లు వసూలు చేస్తామని వారి మెనూలో కూడా పొందుపర్చారు. గత 20 ఏళ్లుగా ఆ రెస్టారెంట్లో ఈ నిబంధన ఉంది. తాజాగా ఓ వ్యక్తి టామ్స్ రెస్టారెంట్లో ఎదుర్కొన్న అనుభవాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. తను అడిగిన ఓ ప్రశ్నకు.. బిల్లు వేశారని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ఆన్లైన్లో ఉంచాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. స్టూపిడ్ ప్రశ్నలు అడిగినందుకు.. $0.38(రూ. 27) బిల్లు కట్టాల్సిందిగా రెస్టారెంట్ నిర్వాహకులు ఆ బిల్లులో పేర్కొన్నారు. అయితే ఆ రెస్టారెంట్ సంబంధిన మెను కార్డును పరిశీలిస్తే.. అందులో హెల్తీ ఆప్షన్స్ కింద కొన్ని అంశాలను జోడించారు. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని వ్యంగ్యంగా ఉన్నాయి. నెక్ట్స్ మిల్ తినకుంటే.. డబ్బులు ఆదా అవుతాయని, ఇంటికి నడుచుకుంటే వెళ్తే.. ఖర్చు ఉండదని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఆ ‘మెను’ ను రూపొందించారని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ చార్జ్ ఏమిటని కస్టమర్లు అడిగనప్పుడు.. భలే ఫన్నీగా అనిపిస్తోందని చెప్పారు. -
ఆ మాజీ క్రికెటర్ రెస్టారెంట్ బిల్లు ఏడు లక్షలు
సాధారణంగా కుటుంబమంతా కలిసి రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తే.. బిల్లు ఎంత అవుతుంది? మహా అయితే ఆరు వేలు నుంచి పది వేలు దాకా అవుతుండొచ్చు. అదే కొంచెం రేంజ్ ఎక్కువ అయితే బిల్లు పది వేలు దాటుతుంది. కానీ మాజీ ఇండియన్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెల్లించిన బిల్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆకాశ్ చోప్రా తన కుటుంబంతో కలిసి భోజనం చేసినందుకు ఓ రెస్టారెంట్లో ఏడు లక్షల బిల్లు చెల్లించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మీల్స్ కోసం సుమారు ఏడు లక్షల మేర బిల్లు చెల్లించాల్సి వచ్చింది.. వెల్కమ్ టూ ఇండోనేషియా’ అంటూ ట్వీట్‌ను షేర్ చేశారు. అంటే ఆయన చెల్లించింది ఇక్కడ కాదు ఇండోనేషియా రెస్టారెంట్లో. అయితే భారత కరెన్సీ ప్రకారం ఆయన చెల్లించింది కేవలం 3,331 రూపాయలు మాత్రమే. ఆకాశ్ చోప్రా షేర్ చేసిన ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆకాశ్ చోప్రా 2003 నుంచి 2004 వరకు డిఫెన్సివ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడేవారు. Paid nearly 7 Lac for a meal 🙈🤣😇😂 Welcome to Indonesia 🇮🇩😋 pic.twitter.com/LYySPXPN3c — Aakash Chopra (@cricketaakash) July 15, 2018 -
భజ్జీ జోక్ : ట్విట్టరియన్లు ఫుల్ ఫన్నీ
స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్లో షేర్ చేసిన పాపులర్ వాట్సాప్ మెసేజ్‌పై ట్విట్టరియన్లు తెగ జోకులు పేల్చుతున్నారు. రెస్టారెంట్లో డిన్నర్ చేసిన అనంతరం బిల్లు పేమెంట్ చేసేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి మనతో డిన్నర్ చేసిన ఫీల్ వస్తుందని భజ్జీ ట్వీట్ చేశారు. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానాన్ని ఆధారంగా తీసుకుని ఆయన ఈ పాపులర్ వాట్సాప్ జోకును తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం రెస్టారెంట్ల బిల్లులో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీలు వేరువేరుగా వస్తున్నాయి. దీనిపై కామెడీ చేస్తూ భజ్జీ ఈ ట్వీట్ చేశారు. భజ్జీ చేసిన ఈ ట్వీట్‌పై విపరీతైన స్పందనలు వస్తూ ఉన్నాయి. భజ్జీ ఫీలింగ్ సరియైనదని, తనకు కూడా అలానే అనిపిస్తుందని, ఎందుకు రెండు జీఎస్టీలు ఉన్నాయో తనకు అర్థం కావడం లేదని, మనకు అరుణ్ జైట్లీ జీ కూడా వివరించలేరని ఓ ట్విట్టరియన్ పేర్కొన్నాడు. అంతకముందు కూడా వీరిద్దరూ మనతో డిన్నర్ చేసేవాళ్లని, కానీ ప్రస్తుతం రెండు వేరువేరు ఆహ్వాన పత్రికలపై మన దగ్గరకి వస్తున్నారంటూ మరో ట్విట్టరియన్ అన్నాడు. ఇలా హర్భజన్ ట్వీట్‌పై ట్విట్టరియన్లు ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్ మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి భజ్జీ ట్వీట్లతో వార్తలోకి ఎక్కుతునే ఉన్నారు. ఏదో ఒక ట్వీట్‌తో ట్విట్టరియన్లను అలరిస్తున్నారు. -
రెస్టారెంట్లలో ఆ చార్జ్ తప్పనిసరి కాదు
-
రెస్టారెంట్లలో ఆ చార్జ్ తప్పనిసరి కాదు
న్యూఢిల్లీ : రెస్టారెంట్ బిల్లులో ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జీలపై కేంద్రప్రభుత్వం స్పష్టతనిచ్చింది.. సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సినవసరం లేదని తేల్చి చెప్పింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సినవసరం ఉందా లేదా అన్నది వినియోగదారుడి నిర్ణయించుకుంటారని, అది కేవలం ఆప్షనల్ మాత్రమేనని తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లు 5-20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తెలిపింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ట్రేడ్ నియమం ప్రకారం విక్రయాలను ప్రమోట్ చేయడానికి, ఏదైనా గూడ్స్‌ను సప్లై చేసేటప్పుడు అందించే సర్వీసులకు న్యాయవిరుద్ధమైన నిబంధనలను, రెస్టారెంట్లు ఇతర సంస్థలు ఎంచుకుంటే, వినియోగదారులు సంబంధిత ఫోరమ్‌కు వెళ్లే అవకాశముంటుందని తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల డిపార్ట్మెంట్, కేంద్రప్రభుత్వం ఈ విషయంపై ఇండియా హోటల్ అసోసియేషన్ నుంచి క్లారిటీ తీసుకుంది. సర్వీసు ఛార్జ్ అనేది పూర్తిగా విచక్షణతో కూడుకుని ఉంటుందని, ఒకవేళ వినియోగదారుడు తమకు అందించిన సర్వీసుల్లో అసంపూర్తిగా ఉంటే, వాటిని చెల్లించాల్సినవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.