ఆ మాజీ క్రికెటర్‌ రెస్టారెంట్‌ బిల్లు ఏడు లక్షలు | Former Cricketer Aakash Chopra Paid 7 Lakh Bill For A Restaurant Meal With Family | Sakshi
Sakshi News home page

ఆ మాజీ క్రికెటర్‌ రెస్టారెంట్‌ బిల్లు ఏడు లక్షలు

Published Thu, Jul 19 2018 1:30 PM | Last Updated on Sun, Jul 14 2019 3:29 PM

Former Cricketer Aakash Chopra Paid 7 Lakh Bill For A Restaurant Meal With Family - Sakshi

మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా

సాధారణంగా కుటుంబమంతా కలిసి రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తే.. బిల్లు ఎంత అవుతుంది? మహా అయితే ఆరు వేలు నుంచి పది వేలు దాకా అవుతుండొచ్చు. అదే కొంచెం రేంజ్‌ ఎక్కువ అయితే బిల్లు పది వేలు దాటుతుంది. కానీ మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా చెల్లించిన బిల్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆకాశ్‌ చోప్రా తన కుటుంబంతో కలిసి భోజనం చేసినందుకు ఓ రెస్టారెంట్‌లో ఏడు లక్షల బిల్లు చెల్లించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మీల్స్‌ కోసం సుమారు ఏడు లక్షల మేర బిల్లు చెల్లించాల్సి వచ్చింది.. వెల్‌కమ్‌ టూ ఇండోనేషియా’ అంటూ ట్వీట్‌ను షేర్‌ చేశారు. అంటే ఆయన చెల్లించింది ఇక్కడ కాదు ఇండోనేషియా రెస్టారెంట్‌లో. అయితే భారత కరెన్సీ ప్రకారం ఆయన చెల్లించింది కేవలం 3,331 రూపాయలు మాత్రమే.  

ఆకాశ్‌ చోప్రా షేర్‌ చేసిన ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆకాశ్‌ చోప్రా 2003 నుంచి 2004 వరకు డిఫెన్సివ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఆడేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement