
బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie) దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించింది. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు రూ.121 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ మూవీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఎక్స్ వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనేత్తారు.
‘ఈ రోజే ఛావా చిత్రం చూశాను. ధైర్యం, నిస్వార్థం, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఉన్న గొప్ప కథ ఇది. నిజాయతీగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర స్కూల్లో ఎందుకు నేర్పించలేదు? పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు? కానీ అక్బర్ గొప్ప నాయకుడు, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఢిల్లీలోకి ఓ రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టుకున్నాం. అలా ఎందుకు జరిగింది?అని తన ఎక్స్ ఖాతాలో ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.
ఆకాశ్ చోప్రా ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకాశ్ ట్వీట్‌ని సమర్థిస్తుండగా..మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్స్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘చరిత్ర తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడూ నమ్మదగిన మాధ్యమం కాదు. ఎవరు ఏ ఏ స్థాయిలో కృషి చేశారనే చరిత్ర మొత్తం చూస్తే అర్థం అవుతుంది. మౌర్య/గుప్త సామ్రాజ్యాలు, అక్బర్, ఔరంగజేబు, శివాజీ సహజంగానే శంభాజీ కంటే ఎక్కువ ప్రాధాన్యతతను పొందారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చరిత్ర తెలుసుకో ఆకాశ్’ అని మరో నెటిన్ కామెంట్ చేయగా.. ‘నేను హిస్టరీలో టాపర్‌ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని ఆకాశ్ రిప్లై ఇచ్చాడు.
Watched Chhaava today. Incredible tale of bravery, selflessness and the sense of duty.
Genuine question—why were we not taught about Chattrapati Sambhaji Maharaj at all in school? Not even a mention anywhere!!!
We did learn though how Akbar was a great and fair emperor, and…— Aakash Chopra (@cricketaakash) February 17, 2025
Comments
Please login to add a commentAdd a comment