మాములుగా రెస్టారెంట్‌కు వెళితే.. మనం ఆర్డర్ చేసినవాటికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అమెరికా డెన్వర్‌లోని ‘టామ్స్ డిన్నర్’ రెస్టారెంట్‌లో మాత్రం వాటితో పాటు.. ఇంకో నిబంధన కూడా ఉంటుంది. రెస్టారెంట్‌లో కస్టమర్లు అడిగే స్టూపిడ్ ప్రశ్నలకు కూడా వారు బిల్లు వసూలు చేస్తారు. ఇలా బిల్లు వసూలు చేస్తామని వారి మెనూలో కూడా పొందుపర్చారు. గత 20 ఏళ్లుగా ఆ రెస్టారెంట్‌లో ఈ నిబంధన ఉంది. తాజాగా ఓ వ్యక్తి టామ్స్ రెస్టారెంట్‌లో ఎదుర్కొన్న అనుభవాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. తను అడిగిన ఓ ప్రశ్నకు.. బిల్లు వేశారని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ఆన్‌లైన్‌లో ఉంచాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. స్టూపిడ్ ప్రశ్నలు అడిగినందుకు.. $0.38(రూ. 27) బిల్లు కట్టాల్సిందిగా రెస్టారెంట్ నిర్వాహకులు ఆ బిల్లులో పేర్కొన్నారు.
అయితే ఆ రెస్టారెంట్ సంబంధిన మెను కార్డును పరిశీలిస్తే.. అందులో హెల్తీ ఆప్షన్స్ కింద కొన్ని అంశాలను జోడించారు. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని వ్యంగ్యంగా ఉన్నాయి. నెక్ట్స్ మిల్ తినకుంటే.. డబ్బులు ఆదా అవుతాయని, ఇంటికి నడుచుకుంటే వెళ్తే.. ఖర్చు ఉండదని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఆ ‘మెను’ ను రూపొందించారని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ చార్జ్ ఏమిటని కస్టమర్లు అడిగనప్పుడు.. భలే ఫన్నీగా అనిపిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment