రెస్టారెంట్లలో ఆ చార్జ్ తప్పనిసరి కాదు
రెస్టారెంట్లలో ఆ చార్జ్ తప్పనిసరి కాదు
Published Mon, Jan 2 2017 5:00 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
న్యూఢిల్లీ : రెస్టారెంట్ బిల్లులో ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జీలపై కేంద్రప్రభుత్వం స్పష్టతనిచ్చింది.. సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సినవసరం లేదని తేల్చి చెప్పింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సినవసరం ఉందా లేదా అన్నది వినియోగదారుడి నిర్ణయించుకుంటారని, అది కేవలం ఆప్షనల్ మాత్రమేనని తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లు 5-20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తెలిపింది.
కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ట్రేడ్ నియమం ప్రకారం విక్రయాలను ప్రమోట్ చేయడానికి, ఏదైనా గూడ్స్ను సప్లై చేసేటప్పుడు అందించే సర్వీసులకు న్యాయవిరుద్ధమైన నిబంధనలను, రెస్టారెంట్లు ఇతర సంస్థలు ఎంచుకుంటే, వినియోగదారులు సంబంధిత ఫోరమ్కు వెళ్లే అవకాశముంటుందని తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల డిపార్ట్మెంట్, కేంద్రప్రభుత్వం ఈ విషయంపై ఇండియా హోటల్ అసోసియేషన్ నుంచి క్లారిటీ తీసుకుంది. సర్వీసు ఛార్జ్ అనేది పూర్తిగా విచక్షణతో కూడుకుని ఉంటుందని, ఒకవేళ వినియోగదారుడు తమకు అందించిన సర్వీసుల్లో అసంపూర్తిగా ఉంటే, వాటిని చెల్లించాల్సినవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
Advertisement