Service charge
-
రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ చెల్లిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి వాటికి వెళ్లినప్పుడు కొన్నింటిలో అక్కడ తిన్నవాటికి, తాగినవాటికి బిల్‌తో పాటు అదనంగా సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంటారు. చాలా మంది ఇది తప్పనిసరేమో అనుకుని మారు మాట్లాడకుండా కట్టేసి వస్తుంటారు. అయితే ఈ సర్వీస్ చార్జ్ అన్నది తప్పసరా.. కాదా.. అని మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తాజా స్పష్టత ఇచ్చింది. గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్లోని ఒక రెస్టారెంట్లో హింసాత్మక ఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఓ కుటుంబానికి, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెస్టారెంట్ వేసిన సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి నిరాకరించడంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించారు. మాల్ లోపల జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి దేశంలో ఉన్న చట్టాలు, రెస్టారెంట్లు, బార్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాల్లో జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్, బార్లలో సర్వీస్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదా? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని కస్టమర్లను బలవంతం చేయకూడదు. ఎందుకంటే దీనిని విచక్షణా ఛార్జ్ అని పిలుస్తారు. అంటే తన విచక్షణ మేరకు రెస్టారెంట్ లేదా బార్లలో అందించిన సేవతో సంతృప్తి చెందితేనే దీన్ని చెల్లిస్తారు. వారి సేవతో సంతృప్తి చెందకపోతే బలవంతంగా విధించకూడదు. దీనర్థం రెస్టారెంట్, బార్ బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు. ఇదీ చదవండి: Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా? -
బిల్ ఎంత పని చేసింది!.. రెస్టారెంట్లో కొట్టుకున్న సిబ్బంది, కస్టమర్లు!
సాధారణంగా అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్‌ని ఆరగించడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. బిల్లు ఎక్కువైనా పర్లేదు కడుపు నిండా తినాల్సిందేనని కొందరు తెగ లాగించేస్తుంటారు. ఇదే తరహాలో ఓ కుటుంబం కూడా రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేసింది. అంతా అయ్యాక, వెయిటర్ బిల్లు తెచ్చాడు. బిల్లు చూసి ఆ కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆహార పదార్థాలే కాకుండా బిల్లుపై సర్వీస్ చార్జీలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. రూ. 970 సర్వీస్ ఛార్జీ ఎందుకు విధించారని, హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో హోటల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఆ కుటుంబ సభ్యులలో ఒకరు ట్వీట్ రూపంలో తమకు చేదు అనుభవాన్ని నెటిజన్లకు ఇలా పంచుకున్నారు.. “ఈరోజు మేము నా కుటుంబంతో కలిసి నోయిడాలోని స్పెక్ట్రమ్ మాల్, సెక్టార్-75లో ఉన్న రెస్టారెంట్ ఫ్లోట్ బై ఫ్యూటీ ఫ్రీకి వెళ్లాం. ముందుగా సిబ్బంది మెనూ కార్డ్‌లో ఉన్న కొన్ని పుడ్ ఐటమ్స్‌ను ఆర్డర్ చేస్తే.. అవి లేవని చెప్పాడు. సరే అని మేము సర్దుకుని రెస్టారెంట్లో ఉన్న అందుబాటులో ఉన్న ఆహారాన్ని తెప్పించుకుని తిన్నాము. కాసేపు అనంతరం రెస్టారెంట్ సిబ్బంది మా భోజన ఖర్చుకు సంబంధించిన బిల్లు తీసుకువచ్చి మా ముందు ఉంచాడు. అయితే సర్వీస్ ఛార్జీ ఎక్కువగా ఉందని.. దాన్ని తొలగించి బిల్ ఇవ్వమని కోరాము. కానీ సిబ్బంది కుదరదంటూ మొండిగా వాదించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి నా సోదరుడిపై దుర్భాషలాడడంతో పాటు నాపై కూడా దాడి చేశాడని వాపోయాడు. Customers, restaurant employees clash over ‘service charge’ at Noida’s Spectrum Mall Read: https://t.co/xs0tE4fX6M pic.twitter.com/0iI0nr0QmC — Express Delhi-NCR (@ieDelhi) June 19, 2023 చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
ఇష్టంగానా? కష్టంగానా?
ఒకరికి ఖేదం... వేరొకరికి మోదం అంటే ఇదేనేమో! హోటళ్ళు, రెస్టారెంట్లలో తప్పనిసరి సర్వీస్ ఛార్జ్‌పై నిషేధంతో హోటల్ యజమానులు విచారిస్తుంటే, వినియోగదారులు సంతోషిస్తున్నారు. కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సోమవారం జారీ చేసిన మార్గదర్శకాలతో దేశవ్యాప్తంగా ఆతిథ్యరంగంలో ఇదే పరిస్థితి. సేవా రుసుము (సామాన్య భాషలో టిప్స్) చెల్లించడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదనీ, ఎవరైనా నిర్బంధంగా వసూలు చేస్తుంటే 1915 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చనీ సీసీపీఏ తేల్చేసింది. ఆతిథ్యరంగ ప్రతినిధులు మాత్రం శ్రామికులకు ఉపకరించే సర్వీస్ ఛార్జ్‌లో చట్టవిరుద్ధమేమీ లేదనీ, దీనిపైన కూడా పన్ను చెల్లిస్తున్నం దున ప్రభుత్వానికి ఆదాయం వస్తోందనీ వాదిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వృద్ధి, కొనుగోలుశక్తి లాంటి సమస్యలుండగా సర్కారు ‘టిప్స్’ అంశంపై దృష్టి పెట్టడం విచిత్రమే. ఇష్టపడి స్వచ్ఛందంగా ‘టిప్స్’ ఇవ్వడం వేరు. తప్పనిసరి అంటూ ముక్కుపిండి వసూలు చేయడం వేరు. ఈ వాదనే ఇప్పుడు హోటళ్ళలో విధిస్తున్న సేవా రుసుమును చర్చనీయాంశం చేసింది. వినియోగదారులు తాము అందుకున్న సేవలకు సంతృప్తి చెంది, ఇష్టంతో ఇవ్వాల్సిన సేవా రుసుమును చాలాచోట్ల బిల్లులో తప్పనిసరి భాగం చేశారు. అయిదేళ్ళ క్రితం దేశమంతటా అమలైన ‘వస్తు, సేవల పన్ను’ దీనికి అదనం. హోటల్లో తిండికి అయిన ఖర్చు మీద 5 నుంచి 15 శాతం దాకా సేవా రుసుమును హోటల్ వారే వేసి, ఆ రెంటినీ కలిపిన మొత్తం మీద ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) వసూలు చేయడం సరికాదన్నది కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదు. తినడానికి అయిన బిల్లు మీద ఎలాగూ సర్కారీ ‘వస్తు, సేవల పన్ను’ వసూలు చేస్తున్నప్పుడు, మళ్ళీ విడిగా హోటల్ వారి ‘సేవా రుసుము’ ఏమిటి? దీని వల్ల ఒకటి రుసుము, మరొకటి పన్ను అంటూ ఒకే సేవకు రెండుసార్లు చెల్లిస్తున్నట్లు అవుతోందనేది ఫిర్యాదీల వాదన. ఆ వాదన తార్కికమే. కానీ, సేవలందించే శ్రామికుడిని మానవీయ కోణంలో చూస్తే సరైనదేనా? హోటళ్ళు అంటున్నదీ అదే! సర్వీస్ ఛార్జ్‌కు చట్టబద్ధత ఏమీ లేకున్నా, బేరర్ శ్రమను గుర్తించి, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా టిప్ ఇవ్వడం నైతికంగా ధర్మమే. అలాగని కొన్నిసార్లు సేవలు అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బిల్లులో భాగంగా 10 శాతం తప్పనిసరి ‘సర్వీస్ ఛార్జ్’ను చెల్లించాల్సి వస్తున్న అనుభవాలూ లేకపోలేదు. దీనిపై ఫిర్యాదుల మేరకు కొన్నేళ్ళుగా వినియోగదారుల మంత్రిత్వ శాఖకూ, దేశంలోని 5 లక్షల పైచిలుకు రెస్టారెంట్ల పక్షాన నిలిచే ‘నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్నార్ఏఐ)కీ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, జీఎస్టీ విధింపు కన్నా ముందే 2017 ఏప్రిల్‌లోనే హోటళ్ళలో సర్వీస్ ఛార్జ్ వసూలుపై మంత్రిత్వ విభాగం మార్గదర్శకాలిచ్చింది. రెస్టారెంట్‌కు వచ్చినంత మాత్రాన సర్వీస్ ఛార్జ్‌కి కస్టమర్ అంగీకరించినట్టు కాదని పేర్కొంది. ఛార్జ్ కట్టే పక్షంలోనే ఆర్డర్ చేయాలంటూ, కస్టమర్ ప్రవేశంపై షరతులు పెట్టడం చట్టప్రకారం ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ అవుతుందన్నది. మెనూ కార్డులో పేర్కొన్న రేట్లు, ప్రభుత్వం విధించే పన్నులు మినహా మరే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది. తద్విరుద్ధమైన అనుచిత విధానాలపై కస్టమర్లు న్యాయవేదికలను ఆశ్రయించవచ్చని తెలిపింది. ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ లాంటి పెద్ద పెద్ద మాటలు ఈ ‘టిప్స్’కు వర్తిస్తాయా, లేదా అన్నది పక్కనబెడితే, సర్వీస్ ఛార్జ్‌ను ఆపేయాలంటూ ఇలా 2017 నుంచి 2019 మధ్య కేంద్రం పలు మార్గదర్శకాలు ఇచ్చిందన్నది నిజం. అయినా హోటళ్ళ బిల్లులో తప్పనిసరి సర్వీస్‌ఛార్జ్ పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దాని ఫలితమే ఫిర్యాదులు, ప్రభుత్వ తాజా నిర్ణయం. నెల రోజుల క్రితం జూన్ 2న కూడా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం దీనిపై హోటళ్ళ సంఘం వారితో సమావేశం జరిపింది. చివరకు సోమవారం నాటి సీసీపీఏ మార్గనిర్దేశనంతో ఇకపై హోటళ్ళు తప్పనిసరి సేవా రుసుము వసూలు చేయడం పూర్తి నిషిద్ధం. సీసీపీఏ చట్టబద్ధ సంస్థ. ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం– 2019’ కింద హక్కులు అమలయ్యేలా చూసేందుకూ, ఉల్లంఘించినవారిని శిక్షించేందుకూ రెండేళ్ళ క్రితమే 2020 జూలైలో ఏర్పాటైందనేది గమనార్హం. గతంతో పోలిస్తే 2021–22లో ఆతిథ్యరంగంలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు శ్రామికు లకు ప్రోత్సాహకంగా దక్కే టిప్స్ కూడా రద్దు అంటే కష్టమని హోటల్ యజమానుల అభిప్రాయం. ప్రభుత్వ లావాదేవీలకు ‘ప్రాసెసింగ్ ఫీ’ అనీ, రైలు, సినిమా టికెట్ల బుకింగ్‌కు ‘కన్వీనియన్స్ ఫీ’ అనీ, ఫుడ్ డెలివరీకి ‘రెస్టారెంట్ ఛార్జెస్’ అనీ రకరకాల పేర్లతో అనేక రంగాలు సేవా రుసుము వసూలు చేస్తూనే ఉన్నాయి. వాటిని అనుమతిస్తూ, ఆతిథ్యరంగంపై ఈ దాడి ఏమిటన్నది వారి వాదన. అలాగే, టిప్స్ రద్దుతో శ్రామికులకు కలిగే నష్టం భర్తీకి జీతాలు పెంచడం, దానికై హోటల్ రేట్లు పెంచడం అనివార్యం కావచ్చు. అయితే, కోవిడ్ అనంతరం ఆహార, ఇంధన ద్రవ్యోల్బణంతో సతమతమవుతూ ఇప్పటికే రేట్లు పెంచి, ఇరుకునపడ్డ హోటళ్ళు మరోసారి ఆ పని చేయగలవా? అయినా, అందుకున్న సేవల పట్ల సంతృప్తిని బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి కస్టమర్లు ఇవ్వాల్సినదాన్ని కొన్ని హోటళ్ళు తప్పనిసరి అనబట్టే తలనొప్పి. యూరప్, యూకేల పద్ధతిలో మన దగ్గరా కస్టమర్ల ఇష్టానికే టిప్స్ చెల్లింపును వదిలేయాలి. అయినా, హోటల్లో టిప్ లాంటివాటి కన్నా కోవిడ్ పడగ నీడలోని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే పని మీద మన పాలకులు పరిశ్రమిస్తే దేశానికి మంచిదేమో! -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!
అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి మారనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, దేశీయ పొదుపు ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా, చెక్ బుక్ ఛార్జీల గురించి ఈ క్రింద పేర్కొన్నాము. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి. 6 మెట్రో నగరాలలో ఒక నెలలో మొదటి 3 లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) మాత్రమే ఉచితంగా లభిస్తాయి. మెట్రో నగరాలు కాకుండా ఇతర అన్ని ప్రాంతాల్లో మొదటి 5 లావాదేవీలు ఉచితం. ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. నాన్ హోమ్ బ్రాంచీలో రోజుకు ₹25,000 వరకు నిర్వహించే క్యాష్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ₹25,000 కంటే ఎక్కువ లావాదేవిలు జరిపితే ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు ₹25,000గా నిర్ణయించబడింది. ప్రతి లావాదేవీకి ₹25,000 వరకు నిర్వహించే ప్రతి లావాదేవీపై ₹150. ₹25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయడం వీలు కాదు. ఒక సంవత్సరంలో 25 చెక్కు లీఫ్స్ గల చెక్ బుక్ ఉచితం. 10 చెక్కు లీఫ్స్ గల అదనపు చెక్కు బుక్ కావాలంటే ₹20 చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో నిర్వహించే మొదటి 4 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకు ₹5 చెల్లించాల్సి ఉంటుంది. కనీస రుసుము రూ.150కు లోబడి ఉంటుంది. -
నిన్న వడ్డీ రేట్ల కోత.. రేపు సర్వీస్ ఛార్జీల పెంపు..
న్యూఢిల్లీ: సామాన్యులు పొదుపు చేసి దాచుకునే సొమ్ముపై ఇప్పటికే వడ్డీ కోత పెట్టిన తపాలా శాఖ తాజాగా మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డోర్‌స్టెప్ అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. వడ్డీ తగ్గింపు దేశంలో మారుమూల పల్లెలకు కూడా విస్తరించిన ఇండియన్ పోస్టల్ శాఖ చాలా ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీంతో లక్షల మంది ప్రజలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలను పొదుపుగా దాచుకున్నారు. ప్రారంభంలో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడిని పోస్టాఫీసులు అందించాయి. అయితే రాను రాను వడ్డీని తగ్గిస్తూ పోయాయి. జులై 1 నుంచి లక్ష లోపు పొదుపు మొత్తాలకు చెల్లించే వడ్డీని సాలుకు 2.75 నుంచి 2.50 శాతానికి తగ్గించింది. జులై 1 నుంచి ఈ తగ్గింపును అమల్లోకి తెచ్చింది. వడ్డీ తగ్గింపుతో ఖాతాదారులు ఉసూరుమంటున్నారు. ఇది చాలదన్నట్టు సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చింది. ‘డోర్‌స్టెప్’కు సర్వీస్ ఛార్జీ పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు అందించే సదుపాయం పోస్టల్ శాఖ కల్పించింది. తాజాగా ఉచిత సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. డోర్ స్టెప్ సేవలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రతీ ఒక్క సేవకు రూ. 20 వంతున సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని చెప్పింది. ఆగష్టు 1 నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి రానుంది. -
దేశంలో ఏటీఎం సేవలు విస్తృతపరచండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఏటీఎం సేవలను విస్తృత పరచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కేంద్రమంత్రికి లేఖరాశారు. దేశంలో ప్రతి లక్ష మందికి 15 ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోనేగాక అర్బన్ ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇక నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే పేరుతో బ్యాంకులు ఎడాపెడా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల తమ డబ్బు డ్రా చేసుకోవడానికి కూడా ఆంక్షలు విధించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దేశంలో ఏటీఎంల నిర్వహణ సంస్థలను పెంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని లేఖలో కోరారు. -
రైల్వే ఈ టికెట్లపై గుడ్‌న్యూస్
న్యూడిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. డీమానిటైజేషన్ తరవాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే ఈ టికెట్లపై ఉపసంహరించుకున్న సర్వీసు చార్జ్‌ను గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రయాణికుల సౌలభ్యంకోసం భారత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై సర్వీసు చార్జ్ మినహాయింపు కొనసాగనుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఐఆర్సీటీసీలో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి సర్వీస్ చార్జ్ మినహాయింపు సెప్టెంబర్ 2017వరకు కొనసాగనుంది. తాజా ఆదేశాలప్రకారం సెప్టెంబరు 30 వరకు ఆన్లైన్లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సర్వీస్ ఛార్జ్ ఉండదు. తద్వారా తమకు రూ.500కోట్ల నష్టం వాటిల్లనుందని రైల్వే శాఖ అంచనా వేసింది ఈ మేరకు ఈ నష్టాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ రైల్వే మంత్రిత్వశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం మొదట 2016 నవంబర్ 23 నుంచి సర్వీస్ చార్జ్ మినహాయింపు ప్రకటించింది. ఆ తర్వాత ఈ అవకాశాన్ని ఏడాది మార్చి 31 వరకు కల్పించారు. అనంతరం ఈ గడువును మరో మూడు నెలలపాటు అంటే 2017, జూన్ 30వరకు పొడిగించింది. సాధారణంగా ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకుంటే రూ. 20 నుంచి రూ. 40 వరకు సర్వీస్ చార్జ్ అయ్యే సంగతి తెలిసినదే. -
సర్వీస్ ఛార్జ్!
►హోటళ్లు, రెస్టారెంట్లలో యథేచ్ఛగా దోపిడీ ►బిల్లుపై అదనంగా 5–10 శాతం మేర సర్వీస్ చార్జి? ►కేంద్రం ఆదేశాలు బేఖాతరు ►వినియోగదారుల అప్రమత్తతే కీలకం అంటున్న నిపుణులు ►బలవంతంగా వసూలు చేస్తే చర్యలు సిటీబ్యూరో: గ్రేటర్లో హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీల పేరిట యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. వారంలో ఓ రోజు సరదాగా బయట భోజనం చేద్దామనుకునే వారి జేబుకు చిల్లు పడుతోంది. వాస్తవంగా ఏప్రిల్ చివరివారంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ హోటళ్లలో సర్వీసు చార్జి తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. వినియోగదారులు తాము చెల్చించే బిల్లుపై అదనంగా సేవా రుసుం తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని..వినియోగదారుని ఇష్టానుసారమే దీన్ని చెల్లించవచ్చని స్పష్టంచేసింది. అంతేకాదు సర్వీసు చార్జీలేదన్న సందేశం అందరికీ కనిపించేలా హోటల్ ప్రాంగణంలో హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ వీటిని పాటించిన దాఖలాలు సిటీలో ఎక్కడా కన్పించడం లేదు. మరోవైపు దీనిపై వినియోగదారుల్లోనూ చైతన్యం లేదు. దీనిపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో సర్వీసు చార్జీ విధించినప్పటికీ ఎవరూ ప్రశ్నించడం లేదు. గ్రేటర్లో జేబులు గుల్ల ఇలా... మహానగరం పరిధిలో సుమారు 500 ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లున్నాయి. వీటిలో అన్నీ కాకపోయినా ఎక్కువ శాతం హోటళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్వీస్‌ట్యాక్స్(సేవాపన్ను), వ్యాట్(విలువ ఆధారితపన్ను)కు అదనంగా సర్వీసు చార్జీ(సేవారుసుం)వడ్డిస్తున్నాయి. వినియోగదారునికి జారీచేసే ప్రతిబిల్లుపై వ్యాట్ 14.5 శాతం, సేవాపన్ను 5.80 శాతం మేర వసూలుచేస్తున్నారు. దీనికి అదనంగా బిల్లు మొత్తంపై హోటల్స్థాయి, ప్రాంతాన్నిబట్టి 5–10 శాతం మేర సేవారుసుము పేరిట వసూలు చేస్తూ వినియోగదారుల జేబులు గుల్లచేస్తున్నారు. అంటే రెస్టారెంట్లో ఇంటిల్లిపాదీ భోజనం చేస్తే..బిల్లు రూ.2000 అయితే దానిపై అదనంగా రూ.100–200 వరకు సర్వీసు చార్జీ రూపంలో బాదేస్తున్నారన్నమాట. సర్వసాధారణంగా హోటల్ యాజమాన్యం ప్రతి పదార్థానికి నిర్ణీత ధరను నిర్ణయించే స్వేచ్ఛ కలిగి ఉంటుంది. అంతేకాదు జారీచేసిన ప్రతి బిల్లులో సిద్ధంచేసిన ఆహారపదార్థాలు, డ్రింక్స్‌కు అయ్యే వ్యయం, నిర్వహణ వ్యయం వంటివి దాగిఉంటాయి. హోటల్స్థాయిని బట్టి ..అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి మెనూలోని ఆహారపదార్థాలు, డ్రింక్స్‌కు అయ్యే చార్జీ ఉంటుంది. దీనికి అదనంగా సేవాచార్జీలు వసూలుచేయడం దారుణమన్నది కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల సారాంశం. వీటిని ఉల్లంఘించేవారిపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ విభాగం కఠినచర్యలు తీసుకోవాలని, వరుస తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
సేవా రుసుం తప్పనిసరి కాదు
-
సేవా రుసుం తప్పనిసరి కాదు
► కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే హోటళ్లు తీసుకోవాలి ► రుసుం తప్పనిసరంటే కేసు వేయొచ్చు: కేంద్రం న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో సేవా రుసుం (సర్వీస్ చార్జీ) తప్పనిసరి కాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పాశ్వాన్ చెప్పారు. ఆ చార్జీ కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలన్నారు. ఈ మేరకు సేవా రుసుంపై నూతన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. కస్టమర్లకు సేవ చేసినందుకు ఎంత వసూలు చేయాలన్నది హోటళ్లు, రెస్టారెంట్లు నిర్ణయించడం సరికాదని, అది వినియోగదారుడి విచక్షణకే వదిలేయాలని ఆయన సూచించారు. కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు చెప్పారు. ‘సేవా రుసుం అనేదేమీ లేదు. దీన్ని తప్పుగా వేస్తున్నారు. ఈ అంశంపై మేం ఓ సలహాపూర్వక నివేదిక సిద్ధం చేశాం. దాన్ని ప్రధాని కార్యాలయ ఆమోదానికి పంపించనున్నాం’ అని చెప్పారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుం కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలి. వినియోగదారుడు ఇష్టపడితే ఆ ఖాళీని పూరించి బిల్లు చెల్లించవచ్చు. ఎవరైనా సేవా రుసుం తప్పనిసరి అన్నట్లయితే దానిపై వినియోగదారుల కోర్టులో కేసు వేయొచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం (హెచ్‌ఆర్‌డబ్ల్యూఐ) అధ్యక్షుడు దిలీప్ దత్వానీ స్పందిస్తూ.. ఇది హేతుబద్ధమైన ట్యాక్స్ అన్నారు. ఇవేం రహస్యమైన చార్జీలుకావని మెనూలో పేర్కొంటామని చెప్పారు. -
సర్వీస్ చార్జ్‌పై క్లారిటీ..గైడ్‌లైన్స్ జారీ
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్ల విధిగా సర్వీస్ చార్జి చెల్లించే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తద్వారా సర్వీసు బాదుడుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది. ఇక మీదటహోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసే సర్వస్ చార్జ్ తప్పనిసరికాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గైడలైన్స్ ను కేంద్రప్రభుత్వం రూపొందించింది. కస్టమర్ల నుంచి వసూల్ చేసే సర్వీస్ ఛార్జ్‌పై కేంద్ర ప్రభుత్వం నియమావళిని విడుదల చేసింది. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి అంశం కాదని, అది వ్యక్తగతమైనదని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్లో ప్రకటించారు. సర్వీస్ చార్జ్ ఎంత చెల్లించాలి అని నిర్ణయించే అధికారం హోటల్స్‌కు, రెస్టారెంట్లకు లేదని ట్వీట్ చేశారు. కస్టమర్లు ఎంత సర్వీస్ ఛార్జ్ కట్టాలన్న అంశాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు డిసైడ్ చేయరాదని, అది కస్టమర్ విజ్ఞతకు వదిలి వేయాలని వరుస ట్వీట్లలో తెలిపారు.. సర్వీస్ ఛార్జ్ అంశంపై తయారు చేసిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు పాశ్వాన్ పేర్కొన్నారు. కాగా సేవా రుసుంను తప్పనిసరిగా బిల్లుతో పాటు చేర్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల ప్రతినిధులతో చర్చించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను సమీక్షించి ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది. దీనికి హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లుతోపాటు వాటి స్థాయిని బట్టి 5-20 శాతం సర్వీస్ చార్జి బిల్లులో కలిపి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. Hotels/Restaurants should not decide how much Service Charge is to be paid by the customer &it should be left to the discretion of customer. — Ram Vilas Paswan (@irvpaswan) April 21, 2017 Guidelines are being sent to states for necessary action at their ends. — Ram Vilas Paswan (@irvpaswan) April 21, 2017 -
బాబోయ్.. బ్యాంకులు
ఓ వ్యక్తి రోడ్డుపై వెళుతూ వెళుతూ యథాలాపంగా పక్కనే ఉన్న బ్యాంకు వైపు చూశాడు. అంతే.. ‘మీ బ్యాంకు ఖాతాలో రూ.25 కోత విధించడమైనది..’ అంటూ అతని మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది. మరో వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి బయటకు వస్తూ ఏటీఎం కార్డుతో మెడ మీద గోక్కున్నాడు. అంతే.. ‘మీరు మీ ఏటీఎం కార్డును ఐదుకన్నా ఎక్కువ సార్లు గీకారు. అందుకు రూ.25 సర్వీసు చార్జీ..’ అంటూ మెసేజ్ వచ్చింది. ఇవన్నీ నిజం కాదు. బ్యాంకులు ఖాతాదారుల నుంచి నానా రకాలుగా వసూలు చేస్తున్న చార్జీలపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకులు. సాక్షి, అమరావతి: బ్యాంకులు అడ్డగోలుగా విధిస్తున్న చార్జీలు ఖాతాదారులకు చిర్రెత్తిస్తున్న మాట మాత్రం నిజం. ప్రస్తుతం బ్యాంకు అన్నా, బ్యాంకు లావాదేవీ అన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. డబ్బులు డిపాజిట్ చేసినా చార్జీ, విత్ డ్రా చేసినా చార్జీ. ఏటీఎం కార్డు ఎక్కువసార్లు వాడినా చార్జీ. ఇలా.. ప్రతి లావాదేవీకి బ్యాంకులు చార్జీల మోత మోగిస్తున్నాయి. బాదుడే బాదుడు బ్యాంకులు అవలంభిస్తున్న విధానాలతో పాత పద్ధతిలో ఇంటిలోనే డబ్బు దాచుకోవడం మంచిదన్న ఆలోచనలోకి ప్రజలు వస్తున్నారు. తాను సంపాదించిన మొత్తాన్ని ఏ రోజుకు ఆరోజు బ్యాంకులో జమ చేసేవాడినని, కానీ బ్యాంకు చార్జీల మోత మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటిలోనే దాచుకోవడం మొదలు పెట్టానని విజయవాడకు చెందిన సెలూన్‌షాపు యజమాని రఘు చెపుతున్నాడంటే ప్రజల్లో బ్యాంకులపై ఎంత విరక్తి పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బ్యాంకయిన ఎస్బీఐ చార్జీల మోత షురూ చేయగా మిగిలిన బ్యాంకుల అదే దారిలో పయనించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి ఎస్బీఐలో నెలలో మూడుసార్లు మించి బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్ వేస్తే సర్వీస్ ట్యాక్స్‌తో కలిసి రూ.50 వరకు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకు సొంత ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు మించి, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు సార్లకు మించి నగదు తీసుకుంటే రూ.10 నుంచి రూ.20 వరకు చార్జీల విధిస్తున్నాయి. అలాగే బ్యాంకు నిబంధనల మేరకు ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోయినా..రోజుల లెక్కన రూ.200 ఆపై సర్‌చార్జీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇక నిర్దిష్ట కాలం తర్వాత బ్యాంకుల నుంచి వచ్చే ఎస్సెమ్మెస్‌లకు కూడా చార్జీలు వసూలు చేస్తారు. చార్జీలే..సేవలేవీ..? ఇన్ని చార్జీలు విధిస్తున్నా సేవలైనా సరిగా అందిస్తున్నాయా అంటే అదీ లేదు. ఏప్రిల్ నెల వచ్చి అప్పుడే అయిదు రోజులు గడుస్తున్నా ఉద్యోగులు జీతాలు తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఏటీఎంలు పనిచేయవు. అలాగని బ్యాంకుకి వెళితే ‘నగదు లేదు తర్వాత రండి’ అన్న సమాధానాలే చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇంటి అద్దెలు, ఫీజులు, ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంటలు అమ్మిన డబ్బు బ్యాంకుల్లో వేస్తుకుని తీసుకోవాలనుకుంటే తల ప్రాణం తోకకు వస్తోం దని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ పనే..! పెద్ద నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్ లావాదేవీలు జనవరి రెండవ వారం నుంచి తగ్గు ముఖం పట్టడంతో, నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ఆర్బీఐ నగదు కొరతను సృష్టిస్తు న్నట్లు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మార్చి నెల మొదలైనప్పటి నుంచి నగదు సరఫరా తగ్గిపోయిందని, అడిగినంత నగదును ఆర్బీఐ ఇవ్వడం లేదని ఈ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్యాంకులో డబ్బులున్నా.. పింఛను డబ్బులు తీసుకోవడం కోసం రెండు రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నాను. పెద్దనోట్ల రద్దు సమయంలో ఇబ్బందులు పడ్డాం. ఆ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఏటీఎంలలో ఎక్కడా డబ్బులుండటం లేదు. చిల్లర ఖర్చులకు డబ్బులు లేక తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. – పి. విశ్వేశ్వరరావు, రిటైర్డు ఉద్యోగి, కాకినాడ. ఎక్కడ చూసినా నోటీఎంలే... ఎక్కడా చూసినా ఏటీఎంలు కనిపిస్తున్నా వాటిల్లో నగదు మాత్రం ఉండటం లేదని కాకినాడకు చెందిన ఎల్.శ్రీనివాస్ తెలిపారు. ఇంటి అద్దె చెల్లించడం కోసం మంగళవారం మొత్తం ఏడు ఏటీఎంలు తిరిగినా ఒక్కటి కూడా పనిచేయలేదన్నారు. ఏటీఎం ఎక్కువసార్లు వాడితే చార్జీలు వేయడం కాదని, ఏటీఎంలో నగదు ఉంచనందుకు బ్యాంకులపై ఫైన్ విధించాలంటున్నారంటే బ్యాంకులతో ప్రజలెంతగా విసిగిపోతున్నారో అర్థమవుతుంది. 8,036 రాష్ట్రంలో మొత్తం ఏటీఎంలు రాష్ట్రంలో గత ఇరవై రోజుల నుంచి 80 శాతానికి పైగా ఏటీఎంలు పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 7,007 బ్యాంకు శాఖలు ఉండగా 8,036 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 449 ఏటీఎంలున్నాయి. అడిగినంత ఇవ్వకపోవటంతో.. ఏప్రిల్ 1 తేదీకి తక్షణం రూ. 3,000 కోట్లు అవసరమవుతాయని, లేకపోతే రాష్ట్రంలో నగదు కొరత తీవ్రమవుతుందని ఆర్బీఐకి చెప్పినా ఇంతవరకు నగదు పంపలేదని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. -
ఆహారం, పానీయాలపై సర్వీస్ చార్జీ చెల్లించొద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: హోటళ్లలో ఆహారం, పానీయాలపై కస్టమర్లకు సేవల రుసుము (సర్వీస్ చార్జ్) విధింపు ఎంతమాత్రం సమంజసం కాదని కేంద్ర వినిమయ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ బుధవారం స్పష్టం చేశారు. ఇలాంటి రుసుముల విధింపు అసమంజస వ్యాపార పద్దతి కిందకే వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి చార్జీని వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఇలాంటి చార్జీలు విధించిన హోటళ్లు, రెస్టారెంట్లపై న్యాయపరమైన చర్యలకు ప్రస్తుత చట్టాల నిబంధనలు ఏవీ వీలు కల్పించడంలేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అయితే హోటల్స్ లో తినకండి..!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో ఆర్డర్స్ పై ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జ్‌లపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ ఆర్ ఏఐ) స్పందించింది. ప్రభుత్వం ప్రకటను విభేదించిన సంఘం సర్వీస్ చార్జ్ చెల్లించే ఉద్దేశం లేకపోతే హెటల్స్ లో తినొద్దంటూ ఒక ప్రకటన జారీ చేసింది. సర్వీస్ ఛార్జ్ విధింపును పూర్తిగా సమర్ధించుకున్న ఎన్ఆర్ఏఐ సర్వీసు చార్జ్ ను ఐచ్ఛికం చేసే బదులు ప్రభుత్వం పన్నులు వదులుకోవాలని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారంమే తాము ఈ చార్జిలను వసూలు చేస్తున్నట్టు ఎన్ ఆర్ ఏఐ అధ్యక్షుడు రియాజ్ అమ్లాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెబుతున్న అదే వినియోగదారుల రక్షణ చట్టాన్ని తమ వాదన మద్దతుగా రియాజ్ ఉదహరించారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా తాము వ్యవహరించడం లేదని వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జి వసూళ్లను ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లించడం, రెస్టారెంట్ల వ్యాట్ బిల్లులాంటి వాటిల్లో భాగమంటూ సర్వీస్ చార్జి వసూలు సమర్ధించుకున్నారు. అలాగే అనేక రెస్టారెంట్లు ఇప్పటికే సర్వీస్ ఛార్జ్ చెల్లింపులపై వినియోగదారులకు మర్యాదగా వివరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తాజా ఆదేశాలకు బదులు సర్వీస్ చార్జ్ ను రద్దు చేసి ఉంటే బావుండేదని మరి కొంతమంది రెస్టా రెంట్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ అద్దెలు, మార్కెట్లో పోటీ , కార్మికుల జీతాలు పెరుగుతున్నాయని ప్రముఖ చెఫ్, మంకీ బార్ అవుట్ లెట్స్ ప్రతినిధి మను చంద్ర వ్యాఖ్యానించారు. ఇపుడిక ఈ ఖర్చులకోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ నిట్టూర్చారు. కాగా సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది వినియోగదారులే నిర్ణయించుకుంటారని చెప్పిన కేంద్రం.. అది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తేల్చి చెప్పింది. హోటల్స్, రెస్టారెంట్లలో 5 నుంచి 20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రెస్టారెంట్లలో ఆ చార్జ్ తప్పనిసరి కాదు
-
నచ్చితేనే సర్వీస్ చార్జీ
• కచ్చితంగా చెల్లించాల్సిన పనిలేదు. • హోటళ్లలో బిల్లులపై కేంద్రం • వినియోగదారుడి విచక్షణమేరకే చెల్లించాలన్న కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లులపై వేసే సర్వీస్ చార్జీని వినియోగదారులు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని, వినియోగదారులు వారి విచక్షణ మేరకు సదరు సేవలు నచ్చితేనే స్వచ్ఛందంగా చెల్లించాలని.. లేదంటే చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘హోటళ్లు, రెస్టారెంట్లు 5 నుంచి 20 శాతం సర్వీసు చార్జీ వసూలు చేస్తున్నాయని చెబుతూ వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. వారికి పెద్దగా సేవలు అందనప్పటికీ తప్పనిసరిగా, బలవంతంగా సర్వీసు చార్జీ చెల్లించాల్సి వస్తోందంటున్నారు. దీనిపై భారత హోటల్ అసోసియేషన్‌ను వివరణ కోరగా సర్వీసు చార్జీ వినియోగదారుడు సంతృప్తి చెందితేనే చెల్లించాలనే సమాధానం వచ్చింది. దీని ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ప్రకటలో పేర్కొంది. ఈ మేరకు సర్వీసుచార్జీ చెల్లింపునకు సంబంధించి వినియోగదారులకు కనిపించేలా హోటళ్లలో బోర్డులు ఏర్పాటుచేసేలా రాష్ట్రప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కేంద్రం కోరింది. -
రెస్టారెంట్లలో ఆ చార్జ్ తప్పనిసరి కాదు
న్యూఢిల్లీ : రెస్టారెంట్ బిల్లులో ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జీలపై కేంద్రప్రభుత్వం స్పష్టతనిచ్చింది.. సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సినవసరం లేదని తేల్చి చెప్పింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సినవసరం ఉందా లేదా అన్నది వినియోగదారుడి నిర్ణయించుకుంటారని, అది కేవలం ఆప్షనల్ మాత్రమేనని తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లు 5-20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తెలిపింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ట్రేడ్ నియమం ప్రకారం విక్రయాలను ప్రమోట్ చేయడానికి, ఏదైనా గూడ్స్‌ను సప్లై చేసేటప్పుడు అందించే సర్వీసులకు న్యాయవిరుద్ధమైన నిబంధనలను, రెస్టారెంట్లు ఇతర సంస్థలు ఎంచుకుంటే, వినియోగదారులు సంబంధిత ఫోరమ్‌కు వెళ్లే అవకాశముంటుందని తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల డిపార్ట్మెంట్, కేంద్రప్రభుత్వం ఈ విషయంపై ఇండియా హోటల్ అసోసియేషన్ నుంచి క్లారిటీ తీసుకుంది. సర్వీసు ఛార్జ్ అనేది పూర్తిగా విచక్షణతో కూడుకుని ఉంటుందని, ఒకవేళ వినియోగదారుడు తమకు అందించిన సర్వీసుల్లో అసంపూర్తిగా ఉంటే, వాటిని చెల్లించాల్సినవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. -
ఇష్టముంటేనే సర్వీస్ చార్జీ
హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో స్పష్టం చేసిన ప్రభుత్వం న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు.. సర్వీస్ చార్జీ విధించే ముందు తప్పనిసరిగా వినియోగదారులను అడగాలని ప్రభుత్వం పేర్కొంది. సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమని, ఇది టిప్లాంటిదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే పేర్కొన్నారు. అయితే చాలా హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో పది శాతం వరకూ సర్వీస్ చార్జీ విధిస్తున్నాయని వివరించారు. వినియోగదారులను అడిగిన తర్వాతనే హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీ విధించాలని పేర్కొన్నారు. ఆ ‘సర్వీస్’ నచ్చకపోతే వినియోగదారులు ఈ సర్వీస్ చార్జీని చెల్లించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సర్వీస్ చార్జీ చెల్లించాలా వద్దా అనేది వినియోగదారుల ఇష్టమని పేర్కొన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవడానికి రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెస్టారెంట్లు... బిల్లులపై 12.5 శాతం వ్యాట్‌ను, 6 శాతం సర్వీస్ ట్యాక్స్‌లతో పాటు సర్వీస్ చార్జీని కూడా విధిస్తున్నాయి. వినియోగదారుల హక్కులకు సంబంధించి అవగాహనను పెంచడానికి వివిధ చర్యలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకుందని హెమ్ పాండే చెప్పారు. కొత్త వినియోగదారుల రక్షణ బిల్లును రూపొందించామని వివరించారు. -
డెబిట్ కార్డులపై సర్వీసు చార్జి రద్దు
-
డెబిట్ కార్డులపై సర్వీసు చార్జి రద్దు
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా పలు రకాల చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో ఉపశమన చర్యను ప్రకటించింది. డెబిట్ కార్డుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. వాటి వాడకంపై సర్వీసుచార్జీని ఈ ఏడాది చివరివరకు రద్దు చేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు దేశంలోని 82వేల ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేసినట్లు ఆయన చెప్పారు. మిగిలినవాటిని కూడా త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు.. కొన్ని ప్రైవేటు బ్యాంకుల డెబిట్ కార్డుల మీద కూడా సర్వీసు చార్జీని ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దాస్ చెప్పారు. ఇక పెద్ద నోట్ల రద్దు కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి వీలుగా.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డీసీసీబీ) నాబార్డ్ రూ. 21వేల కోట్లను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. డీసీసీబీలలో తగినంత నగదు సిద్ధంగా ఉండేలా చూడాలని నాబార్డు, రిజర్వు బ్యాంకులకు కేంద్రప్రభుత్వం సూచించింది. ఫీచర్ ఫోన్ల ద్వారా చేసే అన్ని డిజిటల్ లావాదేవీల మీద ఎలాంటి సర్వీసు చార్జి ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు ఉండబోదని కూడా శక్తికాంత దాస్ చెప్పారు. ఈ వ్యాలెట్ల వాడకాన్ని మరింత ప్రోత్సహించేందుకు గాను వాటి పరిమితిని కూడా రూ. 10వేల నుంచి రూ. 20 వేలకు పెంచినట్లు తెలిపారు. -
రైతు నెత్తిన మరో పిడుగు
యాచారం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న నెత్తిపై మరో పిడుగు పడనుంది. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ వినియోగానికిగాను కుప్పలుగా పేరుకుపోతున్న సర్వీస్ చార్జీలను చెల్లించని పక్షంలో కనెక్షన్లు కట్ చేయడానికి విద్యుత్ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రూ. కోట్లాది బకాయిలు వసూలు చేయడం కోసం ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని వివిధ గ్రామాల్లో 15 వేలకు పైగా వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రూ.5 కోట్లకు పైగా సర్వీస్ చార్జీల బకాయిలు ఉన్నాయి. 2004 నుంచి వినియోగానికి సంబంధించి ఉచిత విద్యుత్ అందుతున్నప్పటికీ సర్వీస్ చార్జీలను మాత్రం రైతులు కచ్చితంగా చెల్లించాల్సి ఉంది. 2004 నుంచి నెలకు రూ. 20 సర్వీస్ చార్జి ఉండగా, 2012 మార్చి నుంచి రూ.10 అదనంగా పెంచి నెలకు రూ.30 చేశారు. వ్యవసాయ బోర్లు నీళ్లు పోసినా, ఎండిపోయినా చార్జీలను మాత్రం రైతులు కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇబ్రహీంపట్నం డివిజన్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎండిపోయిన వేలాది బోరు బావులకు సైతం సర్వీస్ చార్జీలు విధిస్తున్నారు. బిల్లుల పంపిణీకి రంగం సిద్ధం.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం, ఉత్పత్తి లేకపోవడంతో తీవ్ర లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు అత్యంత ఆవశ్యకమైంది. ఇందుకోసం అవసరమైన సొమ్మును రైతుల వద్ద పేరుకుపోయిన బకాయిల నుంచి వసూలు చేయడానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఉపక్రమించారు. నాలుగు రోజుల క్రితం డివిజన్లో ఉన్న అన్ని వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లకు సర్వీస్ చార్జీల బిల్లులను ఆయా మండల విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయాలకు పంపించారు. వీటిని ఆయా గ్రామాల వారీగా వెళ్లి నేరుగా రైతులకు అందజేయనున్నారు. కొంత కాలంపాటు రైతులకు గృహ వినియోగానికి సంబంధించిన బిల్లుల్లోనే సర్వీస్ చార్జీల బిల్లులను కలిపేవారు. అలా రూ. వేలల్లో బిల్లులు రావడంతో గృహ వినియోగ బిల్లులు కూడా చెల్లించే వారు కాదు. బిల్లుల బకాయిలు పెద్ద మొత్తంలో ఉండడంతో ప్రస్తుతం వ్యవసాయ బోరుబావులకు ప్రత్యేకంగా సర్వీస్ చార్జీల బిల్లులను అందించడానికి సిద్ధమయ్యారు. 2004 నుంచి సర్వీస్ చార్జీలు చెల్లించని రైతులకు మొత్తం బిల్లు రూ.4,852 వచ్చింది. అప్పుడప్పుడు కొంత చెల్లించిన రైతులకు సైతం రూ. 2వేల నుంచి రూ.3 వేలకు పైనే వచ్చింది. డివిజన్లో తీవ్ర కరువు పరిస్థితులతో రైతుల వ్యవసాయ బోరుబావులు ఎండిపోయాయి. ఆయా మండలాలకు వచ్చిన బిల్లుల్లో అత్యధికంగా అలాంటి రైతులకు రూ. 4,852 బిల్లులు వచ్చాయి. వచ్చిన బిల్లులు చూస్తే రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. కచ్చితంగా చెల్లించాల్సిందే.. వ్యవసాయ బోరుబావుల సర్వీస్ చార్జీలను రైతులు కచ్చితంగా చెల్లించాల్సిందే. నెలకు రూ. 30 చెల్లించడం పెద్ద కష్టమేమీ కాదు. బిల్లుల పంపిణీ తర్వాత కొంత గడువు ఇస్తాం. ఆలోపు చెల్లించని పక్షంలో కనెక్షన్లు తొలగించక తప్పదు. ఇప్పటికే చాలాసార్లు అవకాశం కల్పించాం. ఉన్నతాధికారుల నుంచి కచ్చితమైన ఆదేశాలున్న దృష్ట్యా ఇక చెల్లించక తప్పదు. - చక్రవర్తి, విద్యుత్ ఏడీఈ, ఇబ్రహీంపట్నం -
ఉచిత షాక్
వరంగల్, న్యూస్‌లైన్: రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ‘భస్మాసుర హస్తాన్ని’ ప్రయోగిస్తోంది. వారి చేతులను వారి నెత్తిపైనే పెట్టుకునేలా చేసి.. ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకుంటోంది. 2009కి ముందు సర్కారు భరించిన సర్వీస్ చార్జీలను రైతులపైనే వేయాలని కిరణ్ ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఆదేశాలిచ్చింది. రూ.20 ఉన్న సర్వీస్ చార్జీలను రూ.30కి పెంచడమే కాకుండా... చెల్లింపులపై దొంగాటకు తెరతీసింది. ముందుగా కోట్లాది రూపాయలు పెండింగ్‌లో పెట్టి వాటిని విడుదల చేయకుండా.... రైతుల నుంచి వసూలు చేసుకోకుండా ఫైల్‌ను తొక్కి పెట్టింది. ప్రభుత్వం చెల్లిస్తుందంటూ 2012 నవంబర్ వరకూ విద్యుత్ శాఖ అధికారులను మభ్యపెట్టింది. కానీ... అదే ఏడాది డిసెంబర్లో సర్వీస్ చార్జీలను రైతుల నుంచే వసూలు చేసుకోవాలని ఈఆర్సీ, డిస్కంలకు దొంగచాటున ఆదేశాలిచ్చింది. పాత పద్దులను కూడా వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. రైతులకు అనుమానం రాకుండా సేవాపన్నును వడ్డీతో సహా రాబట్టుకునే పన్నాగాన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా ఉచిత విద్యుత్‌ను విని యోగించుకుంటున్న జిల్లా రైతులపై వడ్డీ భారం సుమారు రూ.4,68,06,600 పడుతోంది. పన్నాగం ఇదే... నెలల వారీగా సర్వీస్ చార్జీలు చెల్లించడం రైతులకు ఇబ్బందిగా ఉంటుందని... పంట దిగుబడులు, సీజన్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆరునెలలకోసారి కట్టేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైతులకు వెసులుబాటు కల్పించినట్లు అనిపించినా... ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. సర్వీస్ చార్జీలకు వడ్డీ వేసి వారిని దొంగదెబ్బ తీసింది. భారం ఇలా... వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వినియోగించే రైతులు జిల్లాలో 2,60,037 మంది ఉన్నారు. ఉచిత విద్యుత్‌ను వినియోగించుకునే ప్రతి రైతు నెలకు రూ. 30 చొప్పున సర్వీసు చార్జీ చెల్లించాలి. ప్రభుత్వం అవకాశం కల్పించిన మేరకు ఒక్కో రైతు ఆరు నెలలకు చెల్లించాల్సింది రూ.180. సర్వీస్ చార్జీలపై నెలకు 0.5 పైసల చొప్పున వసూలు చేస్తున్న వడ్డీ నెలకు రూ.15 చొప్పున ఆరు నెలలకు రూ.90. ఇలా ప్రతి రైతుపై ఆరు నెలలకు రూ.270 భారం పడుతోంది. అంటే ఆరు నెలలకు 2,60,037 మంది రైతులు సర్వీస్ చార్జీల కింద రూ.4,68, 06,660 కాగా... వడ్డీ కింద రూ.2,34,03,330 చెల్లించా ల్సి వస్తోంది. ఇలా ఏడాదికి సర్వీస్ చార్జీల పేరిట రూ.9,36, 13,320... వడ్డీ కింద రూ.4,68,06,660 భారం పడుతోంది. కరెంటోళ్ల స్పెషల్ డ్రైవ్ రైతుల నుంచి సర్వీస్ చార్జీల వసూళ్లకు ఎన్పీడీసీఎల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రైతులను బెదిరిస్తున్నారు. చెల్లించని పక్షంలో రబీలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, మీటర్లు తీసుకెళతామని హెచ్చరిస్తుండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. -
‘ఉచితం’ పై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే సర్వీసు చార్జీ పెంచటంతో పాటు ఏళ్లనాటి పాత బకాయిలను వసూలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఉచిత విద్యుత్‌కు 7 గంటలకు మించి సరఫరా చేస్తే జీతాలు కత్తిరిస్తామని ఉద్యోగులను హెచ్చరించింది. అదే సమయంలో వ్యవసాయానికి ఏడు గంటల కంటే తక్కువ విద్యుత్ సరఫరా అయితే గతంలో మాదిరిగా మరుసటి రోజు సర్దుబాటు చేయటం కుదరదనీ తేల్చిచెప్పింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెందిన కిందిస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలు విద్యుత్ అధికారులు, సిబ్బందిలో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో ఉచిత విద్యుత్ సరఫరాను రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా కుదించారు. వాస్తవానికి ఏదైనా ఒక రోజు సాంకేతిక కారణాలు అంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, సబ్‌స్టేషన్‌కు పై నుంచి సరఫరా లేకపోవటం, విద్యుత్ సరఫరా లైన్లు తెగిపోవడం తదితర కారణాల వల్ల వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా కాకపోతే.. ఆ మేరకు కొరత పడిన విద్యుత్‌ను మరుసటి రోజు సరఫరా చేయాలి. ఈ మేరకు డిస్కంలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక అలా చేయటం కుదరదని తాజాగా ఆదేశించారు. ఏ రోజైనా 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా జరిగితే ఉద్యోగుల జీతాలకు కోత విధిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించటంతో.. 7 గంటల కంటే సాధ్యమైనంత తక్కువగా ఇచ్చేందుకే అధికారులు మొగ్గుచూపుతున్నారు. పారదర్శకతకూ పాతర... గతంలో ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ఫీడర్లకు ఎంత మేర విద్యుత్ సరఫరా జరిగిందనే వివరాలను ట్రాన్స్‌కో వెబ్సైట్లో వెల్లడించేవారు. పారదర్శకత కోసం ఈవిధంగా చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు కూడా. అయితే.. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా కావటం లేదనే విషయాన్ని ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకే ఫీడర్ల వారీగా ఎంత విద్యుత్ సరఫరా జరిగిందనే వివరాలతో ‘సాక్షి’ అనేక కథనాలను ప్రచురించింది. దీంతో తమ తప్పు బయటపడుతోందని భావించిన ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెబ్సైట్ నుంచి తొలగించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఈ సమాచారం అందుబాటులో లేకుండా పోయింది. వ్యవసాయానికి ఎంత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయకపోతుండటంతో.. అసలు ఉచిత విద్యుత్ పథకానికి క్రమంగా మంగళం పాడతారనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి.. సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి.. తదనంతర ప్రభుత్వం ఈ పథకంపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఎలాగైనా ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక ఆంక్షలను తెరమీదకు తెచ్చింది. పరిమితులు విధించటం మొదలయింది. రెండున్నర ఎకరాల మాగాణి (తరిపొలం) దాటిన వారికి బిల్లులు చెల్లించాలంటూ నోటీసులు జారీ అవుతున్నాయి. ఐఎస్ఐ మార్క్ పంపుసెట్లు వంటి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ (డీఎస్ఎం) నిబంధనలు పాటించని వారి నుంచీ విద్యుత్ బిల్లుల వసూలు షురూ అయ్యింది. బకాయిల పేరుతో వేలల్లో బిల్లులు... ఒకవైపు ఉచిత కనెక్షన్లకు సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న విద్యుత్ సంస్థలు.. మరోవైపు తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు యూనిట్‌కు 20 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి తత్కాల్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు లేవు. దీంతో ఎంత విద్యుత్ వినియోగాన్ని వినియోగించారని లెక్కించటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో 2009లో తత్కాల్ కనెక్షన్లకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేశారు. తాజాగా 2004 నుంచి 2009 వరకు వాడుకున్న విద్యుత్‌కు చార్జీలు చెల్లిం చాలంటూ బకాయిల పేరిట రైతులకు బిల్లులు జారీచేస్తున్నారు. విద్యుత్ వాడకానికి సంబంధించి విద్యుత్ సంస్థలు వింత లెక్కను ముందుకు తెచ్చాయి. ‘వ్యవసాయానికి ఒక రైతు 5 హార్స్ పవర్ (హెచ్‌పీ) సామర్థ్యం కలిగిన మోటారు వాడుతున్నారు. ఈ మోటారును వాడటం వల్ల గంటకు 3.73 యూనిట్లు (హార్స్‌పవర్‌కు 0.746 యూనిట్ల చొప్పున) కాలుతుంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ లెక్కన రోజుకు 26.11 యూనిట్లు.. నెలకు 783.3 యూనిట్లు.. ఏడాదికి 9,399.6 యూనిట్లు కాలుతుంది. యూనిట్‌కు 20 పైసల చొప్పున ఏడాదికి రూ. 1,879.92 చెల్లించాల్సి ఉంటుంది. 2004 నుంచి 2009 వరకు చెల్లించలేదు. కాబట్టి ఐదేళ్లకు మొత్తం రూ. 9,396 చెల్లించాల్సిందే’నని బిల్లులు మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా పాత బకాయిల పేరుతో రైతులపై వందల కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. సర్వీసు చార్జీ బకాయిల వడ్డన... వైఎస్ 2004 నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టగా.. ఆ విద్యుత్ కనెక్షన్లకు సర్వీసు చార్జీల రూపంలో రూ. 20 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే.. రైతుల నుంచి ఈ మొత్తాన్ని కూడా ఏనాడూ వసూలు చేయలేదు. ఈ సర్వీసు చార్జీని కాస్తా 2011 ఏప్రిల్ నుంచి రూ. 30కి పెంచారు. గతంలో వసూలు చేయని సర్వీసు చార్జీలు ఇప్పుడు చెల్లించాలంటూ 2004 నుంచి ఇప్పటివరకు అయిన మొత్తాన్ని లెక్కగట్టి రైతుల నుంచి బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇంటికి ఇచ్చే విద్యుత్ బిల్లులోనే దీనిని కలిపేసి ఇస్తున్నారు. దీనివల్ల రైతులపై ఏకంగా రూ. 216 కోట్ల మేర భారం పడుతుందని అంచనా. -
ఉత్తుత్తి ఉచితం
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : పేరుకే ఉచితం.. రైతన్న విషయంలో స్పందన మాత్రం అనుచితం! ఉచిత విద్యుత్తు విషయంలో ప్రభుత్వం వైఖరి ఇదీ.. జిల్లా వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ బెంబేలెత్తించే విధంగా ప్రభుత్వం తీరు ఉంది. రెండు విడతలుగా ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్టు అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పగటి పూట ఇస్తున్న మూడున్నర గంటల్లో గంటన్నర పూర్తిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రి విషయానికొస్తే కరెంటు వచ్చే సమయానికి రైతులు వెళ్తున్నా, మధ్యలో కోతలు విధిస్తున్నారు. నాలుగైదు సార్లు ఇలా చేస్తుండటంతో విసుగు చెందుతున్న రైతులు, ఇళ్లకొచ్చి మళ్లీ పొలాలకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఏడుగంటల ఉచిత విద్యుత్తని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోపగపడేది మూడు గంటలే. ఇదేకాకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్న సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత్‌కు బిల్లులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఒక్కో కనెక్షనుకు సర్వీసు చార్జీ కింద నెలకు రూ. 20 మాత్రమే వసూలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఒక్కోదానికి లక్షల్లో బిల్లులు వస్తుంటే ఎలా చెల్లించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 28 వేల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి వినియోగానికి రోజుకు ఇరవై లక్షల యూనిట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. ప్రస్తుతం జిల్లాకు సరిపడా విద్యుత్ పంపిణీ లేక అన్ని రంగాలకు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బోర్లపై ఆధారపడి సాగు చేసిన భూముల్లో పెట్టుబడులైనా వస్తాయంటే అనుమానమేనని రైతులు లబోదిబో మంటున్నారు.