పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి వాటికి వెళ్లినప్పుడు కొన్నింటిలో అక్కడ తిన్నవాటికి, తాగినవాటికి బిల్‌తో పాటు అదనంగా సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంటారు. చాలా మంది ఇది తప్పనిసరేమో అనుకుని మారు మాట్లాడకుండా కట్టేసి వస్తుంటారు. అయితే ఈ సర్వీస్ చార్జ్ అన్నది తప్పసరా.. కాదా.. అని మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తాజా స్పష్టత ఇచ్చింది.
గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్‌లోని ఒక రెస్టారెంట్‌లో హింసాత్మక ఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఓ కుటుంబానికి, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెస్టారెంట్ వేసిన సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి నిరాకరించడంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్‌లతో దురుసుగా ప్రవర్తించారు.
మాల్ లోపల జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి దేశంలో ఉన్న చట్టాలు, రెస్టారెంట్లు, బార్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాల్‌లో జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్, బార్‌లలో సర్వీస్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదా?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. రెస్టారెంట్‌లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని కస్టమర్లను బలవంతం చేయకూడదు. ఎందుకంటే దీనిని విచక్షణా ఛార్జ్ అని పిలుస్తారు. అంటే తన విచక్షణ మేరకు రెస్టారెంట్ లేదా బార్‌లలో అందించిన సేవతో సంతృప్తి చెందితేనే దీన్ని చెల్లిస్తారు. వారి సేవతో సంతృప్తి చెందకపోతే బలవంతంగా విధించకూడదు. దీనర్థం రెస్టారెంట్, బార్ బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు.
ఇదీ చదవండి: Fact Check: బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా?
Comments
Please login to add a commentAdd a comment