BARS
-
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
144 ఏళ్ల మెడికల్ స్టోర్ ఎలా బయటపడింది? దానిలో ఏమేమి ఉన్నాయి?
చరిత్రకు సంబంధించిన పలు అంశాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా 114 ఏళ్ల క్రితం నాటి మెడికల్ స్టోర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1880లో ప్రారంభమైన ఈ స్టోర్ 1909 వరకూ సవ్యంగానే నడిచింది. ఈ స్టోర్‌ను బ్రిటన్‌లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించేవాడు. అతని మరణానంతరం ఈ స్టోర్ మూతపడింది. ఇన్నాళ్ల తరువాత ఈ స్టోర్ తలుపులు తెరవగానే లోపల ఆశ్చర్యం కలిగించే పలు వస్తువులు కనిపించాయి. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ మెడికల్ స్టోర్ గురించి 80 ఏళ్ల క్రితమే వెల్లడయ్యింది. అయితే విలియం వైట్ మనుమడు 1987లొ దీని గురించి బహిరంగంగా తెలియజేశాడు. తరువాత దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచాడు. ఈ స్టోర్‌లో లిక్విడ్ మెడిసిన్‌తో నిండిన జార్లు, స్కేళ్లు, వైట్ రైటర్ మొదలైనవి లభ్యమయ్యాయి. విలియం వైట్ మరణానంతరం అతని ఇంటిని విక్రయించే సమయంలో ఈ రహస్య గదిని కనుగొన్నారు. అప్పుడు వైట్ కుమారుడు చార్లెస్ ఈ స్టోర్‌ను మూసివేశాడు. ఒక పరిశోధకుడు చెప్పిన దాని ప్రకారం స్టొర్లోని సామాను పరిశీలించి చూస్తే, విలియం ఒక కెమిస్ట్ అని తెలుస్తోంది. అలాగే అతను గ్రోసరీ సామాను కూడా భద్రపరిచేవాడు. అయితే నాటి వస్తువులు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ దుకాణంలో కొన్ని వనమూలికలు కూడా లభించాయి. ఈ దుకాణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు? -
రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ చెల్లిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి వాటికి వెళ్లినప్పుడు కొన్నింటిలో అక్కడ తిన్నవాటికి, తాగినవాటికి బిల్‌తో పాటు అదనంగా సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంటారు. చాలా మంది ఇది తప్పనిసరేమో అనుకుని మారు మాట్లాడకుండా కట్టేసి వస్తుంటారు. అయితే ఈ సర్వీస్ చార్జ్ అన్నది తప్పసరా.. కాదా.. అని మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తాజా స్పష్టత ఇచ్చింది. గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్లోని ఒక రెస్టారెంట్లో హింసాత్మక ఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఓ కుటుంబానికి, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెస్టారెంట్ వేసిన సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి నిరాకరించడంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించారు. మాల్ లోపల జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి దేశంలో ఉన్న చట్టాలు, రెస్టారెంట్లు, బార్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాల్లో జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్, బార్లలో సర్వీస్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదా? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని కస్టమర్లను బలవంతం చేయకూడదు. ఎందుకంటే దీనిని విచక్షణా ఛార్జ్ అని పిలుస్తారు. అంటే తన విచక్షణ మేరకు రెస్టారెంట్ లేదా బార్లలో అందించిన సేవతో సంతృప్తి చెందితేనే దీన్ని చెల్లిస్తారు. వారి సేవతో సంతృప్తి చెందకపోతే బలవంతంగా విధించకూడదు. దీనర్థం రెస్టారెంట్, బార్ బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు. ఇదీ చదవండి: Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా? -
ఐఐఎఫ్‌ఎల్‌పై సెబీ కొరడా.. కొత్త క్లయింట్ల చేరికపై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. గతంలో ఇండియా ఇన్ఫోలైన్గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీపై క్లయింట్ నిధుల అక్రమ వినియోగం కేసులో సెబీ తాజాగా చర్యలు చేపట్టింది. 2011 ఏప్రిల్ నుంచి 2017 జనవరి మధ్య కంపెనీ ఖాతా పుస్తకాలను పలుమార్లు పరిశీలించాక సెబీ క్లయింట్ల చేరికపై నిషేధం విధించింది. 2011 ఏప్రిల్– 2014 జూన్ మధ్య కాలంలో క్లయింట్ల క్రెడిట్, డెబిట్ బ్యాలన్స్‌లను అక్రమంగా వినియోగించినట్లు దర్యాప్తులో సెబీ గుర్తించింది. ఇదే విధంగా 2015–16, 2016–17 మధ్య కాలంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ పేర్కొంది. వెరసి స్టాక్ బ్రోకర్‌గా రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ సెబీ ఆదేశించింది. క్లయింట్ నిధుల అక్రమ వినియోగంపై 2022 మే నెలలో కంపెనీపై సెబీ రూ. కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
‘వర్క్ ఫ్రమ్ పబ్’.. మందేస్తూ, చిందేస్తూ పని చేయ్..!
లండన్: కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. బ్రిటన్‌లో ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ పబ్’ అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్‌తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా బిజినెస్ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్’ పబ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్‌లో సాండ్విచ్, అన్లిమిటెడ్ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్ సాకెట్స్, నిశబ్దంగా ఉండే క్యాబిన్లతో పాటు షిఫ్ట్ అయిపోగానే జిన్, పింట్, టోనిక్ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్‌ను 2020లోనే యంగ్ పబ్ లాంచ్ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది. తాము పబ్‌లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్ ఫ్రమ్ పబ్ వినియోగదారులు చెబుతున్నారు. లండన్, గ్రీన్విచ్లోని కట్టి సార్క్ పబ్‌లో ‘వర్క్ ఫ్రమ్ పబ్’ చేస్తున్న ఎడ్యుకేషన్ కాపీరైటర్ జెన్ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్ కూలర్‌ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్ పబ్ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్, డ్రింక్ అందిస్తోంది. అలాగే బ్రేవ్హౌస్ అండ్ కిచెన్ 10పౌండ్లకే వర్క్ స్పేస్‌తో పాటు వైఫై, పవర్ సాకెట్స్, అన్లిమిటెడ్ హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్, ప్రింటింగ్ సైతం అందిస్తోంది. ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు! -
AP: దూర దూరం.. బార్లు
సాక్షి, అమరావతి: కొత్త బార్ల పాలసీకి అనుగుణంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం నిర్వహణకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. పూర్తి పారదర్శకంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం విధి విధానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో బార్ల సంఖ్యను పెంచకూడదని ప్రభుత్వం ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకుంది. అదే విధానం ప్రాతిపదికన సామాన్యులకు ఇబ్బందులు లేకుండా బార్లను కేటాయించే రీతిలో మార్గదర్శకాలు రూపొందించింది. పట్టణాలు, నగరాల్లో సామాన్యులకు ఇబ్బంది తలెత్తకుండా బార్ల కేటాయింపు ఉండేలా ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లు అమలులోకి వచ్చేలా ఇ–వేలం నిర్వహణ షెడ్యూల్‌ను ఖారారు చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సూత్రప్రాయంగా ఆమోదించింది. తుది ఆమోదం తర్వాత ఈనెల 21న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. బార్ల సంఖ్య పెంచని ప్రభుత్వం ఐదేళ్లుగా రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం కూడా వాటి సంఖ్యను పెంచకుండా కొత్త లైసెన్సులను 840 బార్లకే పరిమితం చేయనున్నారు. దగ్గర దగ్గరగా బార్ల ఏర్పాటుతో సామాన్యులు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి బార్లు దూర దూరంగా ఉండేలా విధి విధానాలను ఖరారు చేసింది. గత ఐదేళ్లుగా 106 మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో 840 బార్లు ఉన్నాయి. సూత్రప్రాయంగా ఆమోదించిన నోటిఫికేషన్ ప్రకారం అవే 840 బార్లను 130 మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఇప్పటివరకు ఉన్న నగరాలు, పట్టణాల్లో బార్ల సంఖ్యను తగ్గించారు. కొత్త మున్సిపాలిటీలు, డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేస్తారు. దీంతో ఒకే మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ పరిధిలో బార్ల సంఖ్య తగ్గుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో 10 కి.మీ. పరిధిలో, మున్సిపాలిటీల్లో 3 కి.మీ. పరిధిలో బార్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లా పరిధి మాత్రం దాటకూడదు. ఈ రెండు నిబంధనలతో బార్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. పక్కాగా సుప్రీం మార్గదర్శకాలు అమలు బార్ల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించనుంది. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, జాతీయ రహదారికి సమీపంలో బార్లను అనుమతించరు. ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నోటిఫికేషన్లో విధివిధానాలను నిర్దేశించనున్నారు. పూర్తి పారదర్శకంగా బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇ–వేలం ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు. ఎవరు ఎంత కోట్ చేశారన్న వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. ఎక్సైజ్ శాఖ సూత్రప్రాయంగా ఆమోదించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వివరాలు ఇలా... ఈ నెల 22 నుంచి 27 వరకు బార్ లైసెన్సుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 30, 31వ తేదీల్లో ఇ–వేలం నిర్వహిస్తారు. ఇ–వేలంలో ఒకరికంటే ఎక్కువమంది ఒకే మొత్తాన్ని కోట్ చేస్తే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తారు. వేలంలో లైసెన్స్ పొందినవారు అనంతరం ఒక రోజులో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే ఆ కేటాయింపును రద్దు చేసి మళ్లీ ఇ–వేలం నిర్వహిస్తారు. లైసెన్సులు పొందినవారు తమకు కేటాయించిన మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ పరిధిలో నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం బార్లు ఏర్పాటు చేసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లను నిర్వహించుకునేందుకు అనుమతి. లైసెన్స్ కాల పరిమితి మూడేళ్లు ఉంటుంది. మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలవారీగా బార్లు ఆమదాలవలస 2, పలాస కాశీబుగ్గ 2, ఇచ్ఛాపురం 2, సాలూరు 3, పార్వతీపురం 4, పాలకొండ 1, నెల్లిమర్ల 1, బొబ్బిలి 3, రాజాం 4, అమతమవారివలస(టూరిజం రిసార్ట్) 1, ఎస్.కోట (టూరిజం రిసార్ట్)1, నర్సీపట్నం 2, యలమంచిలి 1, సామర్లకోట1, పిఠాపురం1, గొల్లప్రోలు 1, పెద్దాపురం 1, తుని 1, మండపేట 2, అమలాపురం 3, ముమ్మడివరం 1, రామచంద్రాపురం 3, నిడదవోలు 3, కొవ్వూరు 2, కడియపులంక (టూరిజం రిసార్ట్) 1, జంగారెడ్డిగూడెం 2, నూజివీడు 3, చింతలపూడి 1, తణుకు 5, పాలకొల్లు 6, నరసాపురం 2, తాడేపల్లిగూడెం 4, భీమవరం 6, తాడిగడప 12, పెడన 1, గుడివాడ 10, ఉయ్యూరు 1, మంగినపూడి(టూరిజం సెంటర్) 1, అవనిగడ్డ( టూరిజం సెంటర్)2, జగ్గయ్యపేట 2, నందిగామ 1, తిరువూరు 1, కొండపల్లి 8, తెనాలి 20, పొన్నూరు 4, బాపట్ల 5, రేపల్లె 5, చీరాల 6, అద్దంకి 1, నరసరావుపేట 16, చిలకలూరిపేట 11, సత్తెనపల్లి 4, పిడుగురాళ్ల 6, గురజాల 2, దాచేపల్లి 3. మాచర్ల 3, వినుకొండ 8, మార్కాపురం 5, చీమకుర్తి 1, కనిగిరి 1, గిద్దలూరు 1, పొదిలి 1, దర్శి 1, ఆత్మకూరు 1, కావలి 6, కందుకూరు 3, బుచ్చిరెడ్డిపాలెం 1, అల్లూరు 1, పుంగనూరు 1, పలమనేరు 1, నగరి 1, కుప్పం 1, పుత్తూరు 1, శ్రీకాళహస్తి 3, తొండవాడ( టూరిజం రిసార్ట్) 1, గూడూరు 3, నాయుడుపేట 1, సూళ్లూరుపేట 1, వెంకటగిరి 1, మదనపల్లి 4, బి.కొత్తకోట 1, పీలేరు 1, రాయచోటి 2, రాజంపేట 2, ప్రొద్దుటూరు 8, బద్వేల్ 2, మైదుకూరు 1, జమ్మలమడుగు1, ఎర్రగుంట్ల 1, పులివెందుల 1, కమలాపురం 1, ఆదోని 5, ఎమ్మిగనూరు 3, గూడూరు 1, నంద్యాల 15, డోన్ 2, ఆళ్లగడ్డ 1, నందికొట్కూరు 1, ఆత్మకూరు( నంద్యాల జిల్లా) 1, బేతంచర్ల 1, గుంతకల్ 3, తాడిపత్రి 3, రాయదుర్గం 1, గుత్తి 1, కల్యాణదుర్గం 1, హిందూపూర్ 3, కదిరి 3, ధర్మవరం 2, పెనుకొండ 2, మడకశిర 1. గ్రేటర్ విశాఖ 134 (అనకాపల్లి పరిధిలో 6) విజయవాడ 110 శ్రీకాకుళం 12 విజయనగరం 17 కాకినాడ 11 రాజమహేంద్రవరం 16 ఏలూరు 10 మచిలీపట్నం 10 గుంటూరు 67 మంగళగిరి 17 ఒంగోలు 15 నెల్లూరు 35 తిరుపతి 16 చిత్తూరు 7 కడప 12 కర్నూలు 18 అనంతపురం 10 -
బార్లకేమో బంపర్ ఆఫర్.. దీక్షపై ఆంక్షలా?: బండి సంజయ్
సాక్షి,కాగజ్‌నగర్: ప్రజలు తాగి ఊగాలని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకూ వైన్స్‌లు, బార్లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ‘మేం నిరుద్యోగదీక్ష చేపడతామంటే ఒమిక్రాన్ పేరుతో అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వరకూ జనం తాగి ఊగితే వైరస్ వ్యాప్తిచెందదా?’అని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల మీద వచ్చే పైసల కోసమే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చిబియ్యం ఎంతైనా కొంటామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ‘బాయిల్డ్ రైస్ నువ్వు తినవు, కానీ పక్క రాష్ట్రంలో తినాలా’ అని సీఎంను నిలదీశారు. ‘మీ ఫాంహౌస్‌లో మీరు చేస్తున్నదమేమిటీ.. అక్కడ వరి పండిస్తూ, రైతులు పండిస్తే మాత్రం ఉరి అంటారా’అని మండిపడ్డారు. -
గబ్బు గబ్బుగా హైదరాబాద్ పబ్ లు
-
హైదరాబాద్: పబ్బులు, బార్లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రాంతంలోని పబ్బులు, బార్ల నుంచి శబ్ధకాలుష్యం వస్తోందంటూ దాఖ లైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ, నగర పోలీసు కమిషనర్‌తోపాటు ప్రతివాదులుగా ఉన్న పబ్బులు, బార్ల యజమానులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేసిన పబ్బులు, బార్లతో తీవ్రమైన శబ్ధకాలుష్యం ఏర్పడుతోందని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: తెలంగాణ: రైళ్ల వేళల్లో మార్పులు.. కొత్త టైంటేబుల్ విడుదల.. -
బార్లు,రెస్టారెంట్లు,నైట్‌క్లబ్‌లకు క్యూ కట్టిన నార్వే ప్రజలు
-
క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్..
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో గత ఆరు నెలలుగా (మార్చి 14 నుంచి) మూతబడిన బార్లు, క్లబ్బులు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న బార్లు, క్లబ్బులను తక్షణమే తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులను తక్షణమే తెర వచ్చు. అయితే ఆయా ప్రదేశాల్లో సమూహాల ఏర్పాటు, మ్యూజికల్ ఈవెంట్లు, డ్యాన్స్ ఫ్లోర్లపై నిషేధం కొనసాగుతుంది. దీంతో పబ్బులు మళ్లీ తెరుస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెల కొంది. అయితే బార్లకు అనుమతిచ్చిన ప్రభు త్వం వైన్‌షాపుల వద్ద పర్మిట్ రూంలపై ఉన్న నిషేధాజ్ఞలను ఎత్తేయలేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పర్మిట్ రూంలపై నిషేధం కొనసాగు తుందని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన షరతులు... ►బార్లలో ప్రవేశద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. థర్మల్ స్క్రీనింగ్ స్పర్శరహితంగా ఉండాలి. ►బార్లు, క్లబ్బుల్లో పరిశుభ్రత పాటించాలి. నిబంధనలకు అనుగుణంగా క్యూ పద్ధతి పాటించాలి. ►పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలి. ►హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. బార్ సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు ధరించి సర్వీసు చేయాలి. ►ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు బార్ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శుభ్రపరచాలి. కస్టమర్ మారే ప్రతిసారీ సీట్లను శానిటైజ్ చేయాలి. ►బార్లు, క్లబ్బుల ప్రాంగణాల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టాలి. -
మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకే..
సాక్షి, విజయవాడ: మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా బార్ లైసెన్సులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా బార్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించింది. దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తు, 2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
బార్లు, పబ్‌లకు అనుమతి
బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో ప్రకటించిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా అదేరోజు నుంచి పబ్‌లు, బార్లు, క్లబ్‌లకు అనుమతించాలని కర్ణాటక నిర్ణయించింది. అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్‌లు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బార్లు, క్లబ్బులు, పబ్‌ల్లో మద్యం విక్రయాలను అనుమతిస్తామని, అయితే వాటి సీటింగ్ సామర్థ్యంలో సగం ఖాళీగా ఉంచాలని కర్ణాటక ఎక్సైజ్ మంత్రి హెచ్ నాగేష్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే వారు అనుమతించాలని, భౌతిక దూరం సహా ఇతర కోవిడ్-19 నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకూ 1435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడితో పోల్చితే ఇంతమొత్తంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని అంచనా వేశామని మంత్రి తెలిపారు. మద్యం విక్రయాలకు అనుమతించనిపక్షంలో నష్టాలు 3000 కోట్ల రూపాయలు దాటతాయని చెప్పారు. ఇక ఈ ఏడాది జూన్‌లో కర్ణాటక ప్రభుత్వం వైన్ షాపులను తెరిచేందుకు అనుమతించింది. చదవండి : కార్యాలయంలో రాసలీలలు -
1 నుంచి మెట్రో సర్వీసులు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న అన్‌లాక్–4 ప్రక్రియలో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీలను తెరిచే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని అధికారవర్గాలంటున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి వాటిని ప్రారంభించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటిదాకా మూతపడి ఉన్న బార్లు కూడా తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం కౌంటర్‌పై మద్యం విక్రయాలను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. బార్లో కూర్చుని మద్యం తాగేందుకు అవకాశం ఉండదు. మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. టోకెన్లకు బదులు మెట్రో కార్డుల ద్వారానే ప్రయాణానికి అనుమతించడం, స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని పెంచడం వంటి మార్పులు ఉంటాయని సమాచారం. -
మద్యం ప్రియులకు మరో శుభవార్త
జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలు అమలైన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు సడలింపు ఇవ్వడంతో సోమవారం రోజున రాజస్థాన్ ప్రభుత్వం బార్లు తిరిగి తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. జూన్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటికీ.. బార్లపై ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఇప్పటివరకు మూసేఉన్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు తెరుచుకోనున్నాయి. సామాజిక దూరం పాటిచండం, శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టడం వంటి నిబంధనలతో బార్లకు అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల దాకా కర్ఫ్యూ యధావిధిగా అమలు కానుండటంతో.. ఉన్న తక్కువ సమయంలోనే తగినంత ఆదాయాన్ని పొందడానికి యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా.. మాల్స్, రెస్టారెంట్లు మొదలైన వాటికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కరోనా వైరస్ ప్రమాదం దృష్ట్యా ప్రజలు బయటకు రావడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం. చదవండి: మద్యం హోం డెలివరీకి గ్రీన్‌సిగ్నల్.. -
ఇప్పటివరకు 129.. ఇక 68
మహారాణిపేట(విశాఖ దక్షిణ): మద్యం నిషేధం దశల వారీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే విక్రయాలతో పాటు టైమింగ్స్ కూడా తగ్గించింది. ఇక బార్లకు కూడా కళ్లెం వేయనుంది. నూతన బార్ పాలసీలో 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభు త్వం 40 శాతం బార్లు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించడంతో జిల్లా ఎ క్సైజ్ అధికారులు ఇప్పటికే ఆ ప్రకియ ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఉంచాల్లో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్‌తో లైసెన్స్‌లు పూర్తి.. ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్సులు డిసెంబర్ 31తో రద్దు అవుతాయి. వాస్తవానికి ప్రస్తుత బార్ల లైసెన్సులు 2020 జూన్ ఆఖరి వరకు ఉన్నాయి. మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రోజులకు సంబంధించి లైసెన్స్ ఫీజును ప్రభుత్వం బార్ యజమానులకు తిరిగి చెల్లిస్తుంది. ఇక 68 బార్లే.. ప్రస్తుతం జిల్లాలో 129 బార్లు ఉన్నా యి. ప్రభుత్వం 40 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో 68 బార్లు మాత్రమే జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి విశాఖ నగర పరి«ధి(జీవీఎంసీ)లో 66 ,యలమంచలి,నర్సీపట్నం మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు కానున్నాయి. ఫీజుల పెంపు మరో వైపు 2020 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న బార్ల లైసెన్స్ ఫీజులు ప్రభుత్వం పెంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీలో రూ.50 లక్షలు, 5 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న మున్సిపాలిటీ/నగర పాలక సంస్థలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజులు చెల్లించాలి. ఈ ప్రాతిపదికన విశాఖ నగర పరిధిలో బార్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో దరఖాస్తులు.. బార్ లైసెన్స్‌ల కోసం ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి వుంది. ఎక్సైజ్ శాఖ వెబ్సైట్ ద్వారా డిసెంబర్ 6లోగా (మధ్యాహ్నం మూడు గంటలు) ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంది. 7న డ్రా తీస్తారు. అలాగే ఒక కాపీని ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలి. అన్ని డాక్యుమెంట్లు,బార్ నడిపే ఇంటి యజమాని నుంచి లేఖ, ఇతర డాక్యుమెంట్లు తప్పని సరిగా సమర్పించాలి. మార్గదర్శకాలు రాగానే.. నూతన మద్యం పాలసీలో భాగంగా బార్ల తగ్గింపుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై శుక్రవారం రాజపత్రం కూడ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. ఏడాది పాటు బార్లు నడపడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న వారు రూ.10 లక్షల డీడీ సమర్పించాలి. బార్లు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తాం. -టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకే మాత్రమే బార్లలో మద్యం అమ్మకాలు సాగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
12:00 కాదు 1:00
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీకెండ్ మరింత మత్తెక్కించనుంది. జీహెచ్ఎంసీతోపాటు 5 కి.మీ. పరిధిలోని బార్లలో శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకే అనుమతి ఉంది. తాజాగా మరో గంట అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 400 వరకు పబ్బులు, బార్లు ఉన్నాయి. నిత్యం లక్ష లీటర్ల మద్యం, 5 లక్షల లీటర్ల బీర్ల విక్రయం జరుగుతోంది. తాజా నిర్ణయం వల్ల అమ్మకాలు పెరగొచ్చని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ‘అమ్మకాల సమయం పెంచాలని హోటళ్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో అమ్మకాలను పరిశీలించి వారంలో 2 రోజులు గంటపాటు అదనంగా అమ్మకాలకు అనుమతించాం’ అని అన్నారు. -
వేడుకలు రెండ్రోజులు వైన్స్, బార్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: హోలీ వేడుకలు నగరంలో రెండు రోజులు జరగనున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం వేడుకలు నిర్వహించనుండగా... రవీంద్రభారతి, ఇందిరాపార్కు, నెక్లెస్ రోడ్, లలిత కళాతోరణం, మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్, శిల్పారామం తదితర ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించనున్నారు. సిటీలో హోలీ పండగకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మార్వాడీలు, రాజస్థాన్ వాసులు శుక్రవారమే హోలీ ఆడాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో వైన్స్, బార్లు పూర్తిగా బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. రాజేంద్రనగర్: రంగుల పండగకురంగం సిద్ధమైంది. కలర్‌ఫుల్‌ఈవెంట్‌లో ఆడిపాడేందుకు సిటీసన్నద్ధమైంది. కానీ.. రసాయనరంగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్న నేపథ్యంలో సహజ రంగులతోనే హోలీ ఆడుకోవాలని నిపుణులుసూచిస్తున్నారు. సిటీజనుల్లోనూఈ స్పృహ పెరిగింది. ప్రకృతి సిద్ధంగా తయారైన రంగులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయవిశ్వవిద్యాలయం పరిధిలోని హోమ్‌సైన్స్ కళాశాల సహజ రంగులు సిద్ధం చేసింది. గతేడాది 4టన్నులు తయారు చేయగా, ఈ ఏడాది 7టన్నులుఅందుబాటులో ఉంచింది. రంగులు లభించే ప్రాంతాలు.. సైఫాబాద్ హోమ్‌సైన్స్ కళాశాల, రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణ మఠం, ఎమరాల్డ్ స్వీట్ హౌస్, హైదర్‌నగర్‌లోని 24మంత్ర ఆర్గానిక్ షాప్ తదితర ప్రాంతాల్లో వీటిని విక్రయించనున్నారు. కిలో రూ.400 హోమ్‌సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రకాల రంగులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరెంజ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్ కలర్లు ఉన్నాయి. కిలో రంగును రూ.400 విక్రయిస్తున్నారు. పావు కిలో, అర్ధ కిలో, కిలో చొప్పున ప్యాకింగ్‌లు కూడా చేశారు. మరిన్ని వివరాలకు: 7032823265, 7331175251, 040–23244058. పెరుగుతున్న డిమాండ్.. ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న రంగులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది రంగుల ఉత్పత్తి పెరుగుతోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా రంగులను తయారు చేస్తున్నాం. మార్కెట్లో విక్రయించేందుకు కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశాం. – గీతారెడ్డి, సహజ రంగుల ప్రాజెక్ట్ ప్రిన్సిపల్, హోమ్‌సైన్స్ కాలేజీ ఉపయోగాలు... ♦ ఈ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ♦ శరీరానికి, కళ్లకు ఎలాంటి హానీ చేయవు. ♦ పర్యావరణంపై ప్రభావం చూపవు. ♦ శుభ్రపరుచుకోవడం చాలా తేలిక. ♦ నీరు ఆదా అవుతుంది.. ఖర్చు తక్కువ. ♦ భూమిలో ఈ రంగుల నీరు ఇంకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక వాడం.. సహజ రంగులతోనే హోలీ ఆడాలని నిర్ణయించాం. ఇక నుంచి రసాయన రంగులు వాడం. రాజేంద్రనగర్‌లోని తయారీ యూనిట్లో రంగులు కొనుగోలు చేశాం. – కె.వనజ, హైదర్‌గూడ -
పబ్‌లు, బార్లలో జర జాగ్రత్త..!
సాక్షి, బెంగళూరు: ముంబైలోని కమల మిల్స్ భవనంపై ఉన్న పబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో నగర అగ్నిమాపక శాఖ విభాగం అప్రమత్తమైంది. ముంబై ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు ముఖ్యంగా ఇటువంటి భవనాల్లో ఉన్న పబ్‌లు, బార్లు, రెస్టోరెంట్లలో తనిఖీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సంబరాలకు ఎక్కువ మంది పబ్‌లు, బార్లలలో నిర్వహించుకోవడానికి యువత ఇష్టపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే నగరంలోని చాలా పబ్‌లు, బార్లు అగ్నిమాపశాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను పొందకుండానే వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. నెటిజన్లు ట్వీట్లతో సమాచారం.. ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు నగరంలోని ఏఏ రెస్టారెంట్లలో ఎటువంటి పరిస్థితి ఉందన్న విషయమై రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ ఎం.ఎన్ రెడ్డికి ట్వీట్లతో సమాచారం అందించారు. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రముఖ మాల్లోని రెస్టారెంట్‌తో పాటు రూఫ్ టాప్ పబ్‌లకు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు ఇందిరానగరలోని అనేక పబ్‌లు ఇళ్లకు అనుమతులు పొంది అందులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎం.ఎన్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఎం.జీరోడ్, బ్రిగేడ్‌రోడ్, ఇందిరానగర్‌లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయంపై ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణిస్తారు. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కిందికి రావడానికి వీలుగా అత్యవసర మెట్లు ఉండాలి. అంతేకాక అటువంటి భవనాల ముందు అగ్నిమాపక వాహనాల నిలుపుదలకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. ప్రతి అంతస్తులో అగ్నినిరోదక వస్తువులు తప్పక ఉండాలి. ఈ ఏర్పాట్లు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. అధికారులు ప్రజలకు చెబుతున్న జాగ్రత్తలు .. ∙పబ్‌లు, బార్లలో కిచెన్‌కు దగ్గరగా సిటింగ్ టేబుల్‌పై కూర్చొకపోవడమే ఉత్తమం. ∙మద్యానికి దగ్గరగా సిగరెట్ వంటి వస్తువులు ఉండకుండా చూడాలి. ∙పబ్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లే సమయంలోనే అత్యవసర ద్వారాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ∙అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను ఉపయోగించకపోవడమే మేలు -
న్యూ ఇయర్ స్పెషల్ బార్లు..బార్లా!
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సర జోష్ మొదలైంది. వేడుకల కోసం ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఇప్పటికే 134 పార్టీలకు పోలీసు, ఆబ్కారీశాఖ అనుమతులు ఇచ్చాయి. ఈ ఈవెంట్లు మాత్రమే కాకుండా హైదరాబాద్‌వ్యాప్తంగా 542 బార్లు, పబ్బులు, పెద్దసంఖ్యలో ఉన్న క్లబ్బులు, రిసార్టుల్లో మద్యం పొంగిపొర్లనుంది. గత వేడుకలకు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈసారి రూ.120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారుల అంచనా. ఇటీవల మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో.. అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. నగరంలోని మద్యం దుకాణాలు, బార్లు ఇప్పటికే అదనంగా మద్యం ఆర్డర్లు ఇచ్చాయని.. లిక్కర్ డిపోల్లోనూ ఫుల్లుగా స్టాకు ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు మద్యం తాగి రహదారులపై దూసుకెళ్లే వాహనదారులకు కళ్లెం వేసేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేపట్టింది. పార్టీలు, ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగంపైనా నిఘా పెడుతోంది. – సాక్షి, హైదరాబాద్ రాత్రి ఒంటిగంట వరకు బార్లు, పబ్‌లు బార్లా..! నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించాలని పోలీసు, ఆబ్కారీ శాఖలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రాత్రి 12 గంటల వరకు మాత్రమే పార్టీల నిర్వహణకు అనుమతి ఉంది. నూతన సంవత్సర వేడుకలు కావడంతో మరో గంటపాటు మినహాయింపునిచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మందుబాబులకు ఓలా బంపర్ ఆఫర్! బార్లు, పబ్‌లు, నూతన సంవత్సర పార్టీలో పీకలదాకా తాగిన మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఓలా ఆఫర్లు ప్రకటించింది. ‘ఏపీఐ ఇంటిగ్రేషన్–మిషన్ స్మార్ట్‌రైడ్ పథకం’లో భాగంగా రూపొందించిన ‘స్మార్ట్ వెయిటర్ యాప్’నుంచి యూజర్లు నేరుగా ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకునే ఏర్పాటు చేసింది. ఆయా బార్లు, పబ్బుల్లో పార్టీ నిర్వాహకుల సహకారంతో క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. అధికంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడాన్ని నిరోధించడంతోపాటు క్షేమంగా ఇంటికి చేరుకునేలా చర్యలు చేపట్టామని తెలిపింది. ప్రత్యేక రాయితీలు, కూపన్లను కూడా అందజేస్తున్నట్లు పేర్కొంది. శ్రుతి మించితే అరదండాలే! కొత్త సంవత్సర వేడుకల్లో యువత శ్రుతి మించకుండా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీల్లో మద్యం తాగి రహదారులపైకి దూసుకొచ్చే వాహనదారులను కట్టడి చేసేందుకు.. రాత్రి ఒంటి గంట తరవాత బహిరంగ ప్రదేశాలు, నివాస జోన్ల పరిధిలో డీజేల హోరును నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50 బృందాలు, సైబరాబాద్ పరిధిలో 120 ప్రత్యేక బృందాలను గురువారం రాత్రి నుంచే రంగంలోకి దింపారు. ఇక కొత్త సంవత్సర వేడుకలు జరిగే ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్‌లపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించనున్నారు. ఇదే సమయంలో నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేని, కింద రైల్వేట్రాక్స్ ఉన్న బేగంపేట, డబీర్‌పుర, సనత్‌నగర్ వంటి ఫ్లైఓవర్లపై మాత్రమే రాకపోకలు ఉంటాయి. భారీ వాహనాల రాకపోకలను నిషేధించనున్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డుపైనా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారిని టికెట్ ఉంటేనే అనుమతిస్తారు. ఇక కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగించేవారిని గుర్తించేందుకు పోలీసు, ఆబ్కారీశాఖలు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించాయి. పార్టీలు జరిగే ప్రాంతాలతోపాటు అన్ని బార్లపై దృష్టి సారించాయి. ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులతో కలసి 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నాం. వారు సాధారణ దుస్తుల్లో పబ్బులు, బార్లలో సంచరిస్తూ.. మైనర్ల కదలికలు, వారికి మద్యం సరఫరాపై నిఘా పెడతారు. విస్తృత డ్రంకెన్ డ్రైవ్‌లు చేపడుతున్నాం.. – వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ మద్యం తాగి వాహనాలు నడపొద్దు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు, ప్రమాదాలు జరగకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలి. మద్యం తాగి నడిపితే వాహనాలను సీజ్ చేస్తాం. బార్లు, పబ్బులు, వైన్‌షాపులను సమయానికి మించి కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. – సందీప్ శాండిల్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ -
తాగినోళ్లకు తాగినంత..!?
సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరంలో పబ్బులు, రెస్టారెంట్లు, బార్ల క్లోజింగ్ టైమ్‌లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. బార్లు, పబ్బులును ఉదయం రెండు గంటలకు వరకూ తెరిచివుంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బార్లు, పబ్బుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు, పిల్లలతో వచ్చే తల్లులకు రిజర్వ్డ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బెంగళూరు పోలీసులు బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను సామరస్యంగా, ఆహ్లాదపూరిత వాతావరణంలో నిర్వహించుకోవాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ ప్రజలను కోరారు. మద్యం మత్తులో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించేవారిని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్న వారికి బలంవంతంగా విషెస్ చెప్పడం, అల్లరి చేష్టలకు దిగినవారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. నగరంలోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గంటల పాటు సీసీటీవీలో మానిటరింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా అల్లర్లు జరగవచ్చన్న ఉద్దేశంతో ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా 15 వేల మంది పోలీసులు వినిమోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బార్లు, పబ్బులు నిబంధనలు పాటించాల్సిందే
హైదరాబాద్: బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని బార్లు, పబ్బులు, వైన్ షాపులు, స్పాల యాజమాన్యాలు/మేనేజర్లతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసాజ్ సెంటర్లు, పార్లర్లలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు జరగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మసాజ్ సెంటర్లు నిర్వహించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. మసాజ్ సెంటర్లను మసాజ్ సెంటర్లు గానే కొనసాగించాలని, వీటి ముసుగులో వ్యభిచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నేరమని తెలిపారు. స్పాలకు నిబంధనలు స్పాలలో తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఇందులో స్పాలకు వచ్చే వారి పేరు, ఫోన్ నంబర్లను విధిగా నమోదు చేయాలన్నారు. స్పాలలో పడకల వాడకం అవసరం లేదన్నారు. సాధ్యమైనంత వరకూ క్రాస్ మసాజ్‌లకు అనుమతించవద్దని, 18 ఏళ్లకు తక్కువ ఉన్నవారిని అనుమతించొద్దని, సిసి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజిటింగ్ వీసాలపై వచ్చిన ఇతర దేశాల వారిని స్పాలల్లో నియమించుకోవద్దన్నారు. స్పాలల్లో తలుపులు పారదర్శకంగా ఉండాలన్నారు. తలుపులకు ఎలాంటి బోల్టులను బిగించరాదన్నారు. వీలుంటే గాజు పార్టిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బార్లు, పబ్బులు, వైన్ షాపులకు నిబంధనలు బార్లు, పబ్బులు, వైన్ షాపుల యజమానులు కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్, లిక్కర్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్‌లను తీసుకోవాలన్నారు. సమయపాలన పాటించాలని, రాత్రి 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో షాపులను తెరిచి ఉంచొద్దని సూచించారు. పై నిబంధనలు అతిక్రమిస్తే మొదటిసారి సీపీ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని, రెండోసారి అయితే 2, 3 రోజులు జైలు శిక్ష తప్పదని శాండిల్య హెచ్చరించారు. కేసుల నమోదుతోపాటు లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకున్నారు. వ్యాపారులు కనీస నైతికత పాటించాలని, సామాజిక హితాన్ని కొంతైనా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జేపీ అసోసియేట్‌కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని నొయిడా ప్రాంతంలో ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్ (జెపి) అసోసియేట్స్ కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ (జైపీ ఇన్ఫ్రాటెక్ మాతృ సంస్థ) స్వతంత్ర డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఎలాంటి వ్యక్తిగత ఆస్తులను బదిలి చేయడానికి వీల్లేదని ఆదేశించింది. గృహ యజమానుల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రమోటర్లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గృహకొనుగోలుదారుల ఖర్చుతో మీరు పెరిగారంటూ సుప్రీం ప్రధానన్యాయమూర్తి దీపాక్ మిశ్రా వ్యాఖ్యానించారు. మంచివాళ్లలాగా డబ్బులు చెల్లించండి..మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల జీవితకాలం పొదుపు సొమ్మును నాశనం చేయొద్దు.. కొనుగోలుదారులు డబ్బును తిరిగి చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. అప్పు తెస్తారో.. మీ కుటుంబ బంగారు నగలు అమ్ముతారో కానీ... గృహకొనుగోలుదారులకు చెల్లించాలని ఆదేశించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా మొత్తం డైరెక్టర్లు ప్రమోటర్లు వ్యక్తిగత ఆస్తులు బదిలీ చేయకుండా నిషేధాన్ని విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘింస్తే తీవ్ర పరిణామాలుంటాయని దీపాక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది. బుధవారం కోర్టు రిజిస్ట్రీతో కంపెనీ రూ .275 కోట్లు డిపాజిట్ చేయగా, కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ. 1725 కోట్లకు చేరింది. అలాగే రూ. 2,000 కోట్లను వాయిదాల పద్ధతిమీద చెల్లించేందుకు కోర్టు అనుతినిచ్చింది. డిసెంబర్ 14 నాటికి రూ.150 కోట్లను , డిసెంబరు మాసాంతానికి మరో రూ.125 కోట్లను చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. 13 స్వతంత్ర డైరెక్టర్లు, ప్రమోటర్లు కూడా హాజరు కావాలని ఆదేశించింది. ఇవాల్టి విచారణకు ఎనిమిది స్వతంత్ర దర్శకులు, ఐదుగురు ప్రమోటర్లు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కాగా మొత్తం రూ.2వేల కోట్ల బకాయిలో రూ .400 కోట్ల చెల్లిస్తామన్న జైప్రకాశ్ అసోసియేట్స్ ప్రతిపాదనను గత విచారణలో తిరస్కరించింది. సెప్టెంబర్ 4న జేపీ అసోసియేట్ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జారీ చేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పాటు జేపీ అసోసియేషన్స్ సిస్టర్ కంపెనీ జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండీ, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి వీల్లేదనిన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.