న్యూఢిల్లీ: రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. గతంలో ఇండియా ఇన్ఫోలైన్‌గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీపై క్లయింట్ నిధుల అక్రమ వినియోగం కేసులో సెబీ తాజాగా చర్యలు చేపట్టింది. 2011 ఏప్రిల్ నుంచి 2017 జనవరి మధ్య కంపెనీ ఖాతా పుస్తకాలను పలుమార్లు పరిశీలించాక సెబీ క్లయింట్ల చేరికపై నిషేధం విధించింది.
2011 ఏప్రిల్– 2014 జూన్ మధ్య కాలంలో క్లయింట్ల క్రెడిట్, డెబిట్ బ్యాలన్స్‌లను అక్రమంగా వినియోగించినట్లు దర్యాప్తులో సెబీ గుర్తించింది. ఇదే విధంగా 2015–16, 2016–17 మధ్య కాలంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ పేర్కొంది. వెరసి స్టాక్ బ్రోకర్‌గా రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ సెబీ ఆదేశించింది. క్లయింట్ నిధుల అక్రమ వినియోగంపై 2022 మే నెలలో కంపెనీపై సెబీ రూ. కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment