IIFL
-
హైదరాబాద్ : ఉత్సాహంగా అహింసా 2వ ఎడిషన్ రన్ (ఫొటోలు)
-
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎంఎఫ్పీలో ప్రత్యేక ఆడిట్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ (జేఎంఎఫ్పీ)లో ఆర్బీఐ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఆడిటర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన టెండరు ప్రకటన ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు సెబీ ఆమోదం పొందిన ఆడిట్ సంస్థలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమరి్పంచేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8 కాగా, ఎంపికైన సంస్థలకు ఏప్రిల్ 12న విధులను కేటాయిస్తారు. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో పర్యవేక్షణపరమైన అవకతవకలను పరిశీలించిన మీదట తదుపరి బంగారం రుణాలు ఇవ్వరాదంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే ఐపీవోలకు బిడ్ చేసే కస్టమర్లకు నిధులు సమకూర్చే విషయంలో అవకతవకలకు గాను జేఎంఎఫ్పీపైనా ఆంక్షలు విధించింది. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ పసిడి రుణాలపై ఆర్బీఐ నిషేధం
ముంబై: పర్యవేక్షణ లోపాల కారణంగా ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాలు ఇవ్వకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచి్చనట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, ప్రస్తుత గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోకి సంబంధించిన వసూళ్లు, రికవరీ ప్రక్రియలను యథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది. పసిడి రుణాలిచ్చేటప్పుడు, డిఫాల్ట్ అయిన సందర్భాల్లో వేలం వేసేటప్పుడు బంగారం స్వచ్ఛత, బరువును విలువ కట్టడంలో లోపాలు, పరిమితికి మించి నగదు రూపంలో రుణ మొత్తాన్ని మంజూరు చేయడం .. వసూలు చేయడం తదితర తీవ్ర ఉల్లంఘనలను కంపెనీ ఆడిట్లో గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ వివరించింది. అలాగే, ప్రామాణిక వేలం ప్రక్రియలను పాటించకపోవడం, కస్టమర్లకు విధించే చార్జీలపై పారదర్శకత లోపించడం మొదలైనవి కూడా కస్టమర్ల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపేవేనని ఆర్బీఐ తెలిపింది. సంస్థపై చేపట్టిన ప్రత్యేక ఆడిట్ పూర్తయ్యాక పర్యవేక్షణపరమైన ఆంక్షలను సమీక్షించనున్నట్లు వివరించింది. -
బంగారం రుణాల్లో రెండో స్థానానికి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ దేశంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల కంపెనీగా అవతరించింది. మణప్పురం ఫైనాన్స్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి రూ.23,690 కోట్లను అధిగమించింది. మణప్పురం ఫైనాన్స్ నిర్వహణలో బంగారం రుణాలు రూ.20,809 కోట్లుగానే ఉన్నాయి. ఆస్తుల నిర్వహణ పరంగా బంగారం రుణాల వితరణలో రెండో అతిపెద్ద సంస్థగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నట్టు బంగారం రుణాల హెడ్ సౌరభ్ కుమార్ తెలిపారు. బంగారం రుణాల మార్కెట్లో రూ.66,089 కోట్ల నిర్వహణ ఆస్తులతో ముత్తూట్ ఫైనాన్స్ మొదటి స్థానంలో ఉంది. ‘‘18.6 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో 70 శాతం మంది కస్టమర్లు మళ్లీ మళ్లీ మా సేవలను వినియోగించుకునే వారే. దీంతో ముందస్తు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు’’అని కుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 25–27 శాతం వృద్ధి చెందుతుందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 1,486 పట్టణాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. -
ఐపీవో లైన్లో 80 సంస్థలు
న్యూఢిల్లీ: దాదాపు 80 కంపెనీలు వరుసగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రానున్నాయని బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ నిపుణ్ గోయల్ తెలిపారు. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, స్నాప్‌డీల్, టాటా టెక్నాలజీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, గో డిజిట్ ఇన్సూరెన్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. మ్యాన్‌కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల ఇష్యూతో మొదలై గత మూడు నెలలుగా ఐపీవో మార్కెట్ చాలా సందడిగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. అప్పటి నుంచి మరో ఐదు పబ్లిక్ ఇష్యూలు విజయవంతంగా పూర్తయ్యాయని, వచ్చే 4–8 వారాల్లో మరిన్ని సంస్థలు ఐపీవోకు రానున్నాయని వివరించారు. -
ఐఐఎఫ్‌ఎల్‌పై సెబీ కొరడా.. కొత్త క్లయింట్ల చేరికపై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. గతంలో ఇండియా ఇన్ఫోలైన్గా కార్యకలాపాలు నిర్వహించిన కంపెనీపై క్లయింట్ నిధుల అక్రమ వినియోగం కేసులో సెబీ తాజాగా చర్యలు చేపట్టింది. 2011 ఏప్రిల్ నుంచి 2017 జనవరి మధ్య కంపెనీ ఖాతా పుస్తకాలను పలుమార్లు పరిశీలించాక సెబీ క్లయింట్ల చేరికపై నిషేధం విధించింది. 2011 ఏప్రిల్– 2014 జూన్ మధ్య కాలంలో క్లయింట్ల క్రెడిట్, డెబిట్ బ్యాలన్స్‌లను అక్రమంగా వినియోగించినట్లు దర్యాప్తులో సెబీ గుర్తించింది. ఇదే విధంగా 2015–16, 2016–17 మధ్య కాలంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సెబీ పేర్కొంది. వెరసి స్టాక్ బ్రోకర్‌గా రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను చేర్చుకోవద్దంటూ సెబీ ఆదేశించింది. క్లయింట్ నిధుల అక్రమ వినియోగంపై 2022 మే నెలలో కంపెనీపై సెబీ రూ. కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
ఐఐఎఫ్ఎల్ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగేతర సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రుణ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువైన సెక్యూర్డ్ రీడీమబుల్ ఎన్సీడీలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. వీటికి 9 శాతంవరకూ రిటర్నులను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 9న వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధులను వ్యాపారాభివృద్ధి, మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇష్యూకి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో రూ. 1,200 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం కేటాయించేందుకు గ్రీన్ షూ అప్షన్‌ను ఎంచుకున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. 60 నెలల కాలానికిగాను ఇన్వెస్టర్లకు 9 శాతం వరకూ రిటర్నులను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 24 నెలలు, 36 నెలల కాలావాధితోనూ బాండ్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. వడ్డీని వార్షికంగా లేదా నెలవారీ చెల్లించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఏప్రిల్‌లో 40 కోట్ల డాలర్ల విలువైన డాలర్ బాండ్లను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. వీటిని 2020 ఫిబ్రవరిలో జారీ చేసింది. -
వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షలు లోన్? ఒక్క హాయ్ మెసేజ్‌తో..
చాలామందికి తెలిసినంతవరకు వాట్సాప్ అంటే చాటింగ్ చేసుకోవడానికి, లేదా స్టేటస్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయని తెలుసు. అయితే వాట్సాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చని ఎక్కువ మందికి తెలిసి ఉండక పోవచ్చు. ఇది వినటానికి కొత్తగా అనిపించినా ఇది నిజమే. ఇంతకీ వాట్సాప్ ద్వారా లోన్ ఎలా తీసుకోవాలనే దానికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. వాట్సాప్ ద్వారా లోన్ అనే సదుపాయాన్ని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కల్పిస్తోంది. దీనిద్వారా ఏకంగా రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి సేవలు అందించే మొదటి సంస్థగా IIFL రికార్డ్ సృష్టించింది. కొన్ని నివేదికల ప్రకారం, ఒక్క మన దేశంలో మాత్రమే 45 కోట్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ వినియోగదారులున్నట్లు సమాచారం. వారిని దృష్టిలో ఉంచుకుని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశం ఎప్పుడూ వాట్సాప్ లో అందుబాటులో ఉంటుంది. KYC, బ్యాంకు అకౌంట్ వెరిఫికేషన్ వంటివి ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?) లోన్ కావాలనుకునే వారు 9019702184 నెంబర్ కి హాయ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలి. ఆ తరువాత కంపెనీ అడిగిన సమాచారం అందించాల్సి ఉంటుంది. భారతదేశంలో అతి పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీలలో ఒకటైన 'ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్' ఇప్పటికే హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, మైక్రో ఫైనాన్స్ లోన్ వంటి వాటిని అందిస్తుంది. ఇప్పటివరకు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాట్సాప్ ద్వారా ఒక లక్ష ఎమ్ఎస్ఎమ్ఈ క్రెడిట్ విచారణలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉన్న ఫైనాన్సింగ్ సంస్థల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. సంస్థ ప్రధానంగా చిన్న వ్యాపారాలుపై ద్రుష్టి పెడుతున్నట్లు కంపెనీ బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ అన్నారు. (ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఇంటర్నేషనల్ కాల్స్.. క్లిక్ చేసారో మీ పని అయిపోయినట్టే!) వాట్సప్ ద్వారా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అందరికి రూ. 10 లక్షలు లోన్ అందిస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బహుశా వాట్సాప్ ద్వారా మీరు అందించే సమాచారం ప్రకారం మీకు ఎంత లోన్ అందించే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
360 వన్‌కు ముంబై ఏంజెల్స్‌లో నియంత్రణ వాటా
న్యూఢిల్లీ: ఆరంభ స్థాయి కంపెనీల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టే ‘ముంబై ఏంజెల్స్’లో నియంత్రిత వాటాను సొంతం చేసుకున్నట్టు 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) ప్రకటించింది. ఆరంభ స్థాయి పెట్టుబడుల విభాగంలో ముంబై ఏంజెల్స్ ప్రముఖ సంస్థగా ఉందని, ఈ కొనుగోలుతో స్టార్టప్‌లలో పెట్టుబడులను మరింత విస్తతం చేయనున్నట్టు తెలిపింది. తమ ఇన్వెస్టర్లకు మరింత విస్తృత శ్రేణి డీల్స్‌ను ఆఫర్ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడం ద్వారా, తమ ఇన్వెస్టర్ల సంపద వృద్ధికి సాయపడనున్నట్టు వివరించింది. మరోవైపు ముంబై ఏంజెల్స్ రెండు నూతన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌ను ఈ సందర్భంగా ప్రకటించింది. ఆరంభ దశలోని కంపెనీల్లో ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను వీటి ద్వారా తమ క్లయింట్లకు అందించొచ్చని 360వన్ ఎండీ, సీఈవో కరణ్ భగత్ తెలిపారు. -
గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?,ఈ బంపరాఫర్ మీ కోసమే!
ఎన్బీఎఫ్సీ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బంగారం రుణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ‘గోల్డ్ లోన్ మేళా బంపర్ ధమాకా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఈ నెల 15న మొదలు కాగా, డిసెంబర్ 31వరకు కొనసాగుతుందని తెలిపింది. బంగారంపై రుణం తీసుకునే వారికి లగ్జరీ కారు, బైక్‌లు, స్మార్ట్ఫోన్లతోపా టు, కచ్చితమైన ఓ బహుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. -
హరిత గృహ రుణాలపై ఐఐఎఫ్ఎల్: వారికి ప్రత్యేక డిస్కౌంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణానికి అనుకూలమైన, హరిత గృహాల ప్రాజెక్టులకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ జోనల్ హెడ్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు) శ్రీనివాసరావు రేకపల్లి తెలిపారు. నిర్దిష్ట నిబంధనలను పాటించే డెవలపర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నట్లు వివరించారు. అటు కీలక వ్యాపార విభాగమైన అఫోర్డబుల్ ఇళ్లకు సంబంధించి మరిన్ని రుణాలు అందించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25,300 కుటుంబాలకు రుణాలు అందించామని .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణలో 35శాఖలు ఉన్నాయన్నారు. కొత్తగా ఏపీలో మరో 10, తెలంగాణలో 15 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. -
హురూన్ జాబితాలో 19 ఏళ్ల వ్యాపారవేత్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2022లో రూ.10,94,400 కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, కుటుంబం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.7,94,700 కోట్లతో ముకేశ్ అంబానీ, కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా రూ.2,05,400 కోట్లతో సైరస్ ఎస్ పూనావాలా కుటుంబం (సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), రూ.1,85,800 కోట్లతో శివ్ నాడార్ కుటుంబం (హెచ్‌సీఎల్), రూ.1,75,100 కోట్లతో రాధాకిషన్ దమానీ, కుటుంబం (అవెన్యూ సూపర్‌మార్ట్స్) దక్కించుకుంది. రూ.1,000 కోట్లకుపైగా సంపద కలిగిన వ్యాపారవేత్తలతో ఈ జాబితా తయారైంది. ఇందులో దేశవ్యాప్తంగా 1,103 మంది చోటు సంపాదించారు. గతేడాదితో పోలిస్తే 96 మంది కొత్తగా చేరారు. లిస్ట్‌లో స్థానం పొందిన వ్యాపారవేత్తల మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లకు చేరుకుంది. 19 ఏళ్ల యువ వ్యాపారవేత్త, జెప్టో ఫౌండర్ కైవల్య వోరా జాబితాలో ఉన్నవారిలో పిన్న వయస్కుడు. తెలుగు రాష్ట్రాల నుంచి.. జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది చోటు సంపాదించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రూ.56,200 కోట్ల సంపదతో మురళి దివీ, కుటుంబం (దివీస్ ల్యాబొరేటరీస్) మొదటి స్థానంలో ఉంది. రూ.39,200 కోట్లతో బి.పార్థ సారధి రెడ్డి, కుటుంబం (హెటిరో ల్యాబ్స్) రెండవ స్థానం కైవసం చేసుకుంది. రూ.16,000 కోట్లతో ఎం.సత్యనారాయణ రెడ్డి కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్), రూ.15,000 కోట్లతో జి.అమరేందర్ రెడ్డి, కుటుంబం (జీఏఆర్), రూ.13,300 కోట్లతో రామేశ్వర్రావు జూపల్లి కుటుంబం (మై హోమ్ ఇండస్ట్రీస్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూ.12,600 కోట్లతో పి.పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఆరవ స్థానం, రూ.12,100 కోట్లతో పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఏడవ స్థానం, రూ.11,300 కోట్లతో కె.సతీష్ రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) ఎనిమిదవ స్థానం, రూ.9,000 కోట్లతో వెంకటేశ్వర్లు జాస్తిని కుటుంబం (సువెన్ ఫార్మా) తొమ్మిదవ స్థానం, రూ.8,700 కోట్లతో మహిమ దాట్ల కుటుంబం (బయాలాజికల్–ఇ) 10వ స్థానంలో నిలిచారు. -
తెలుగు రాష్ట్రాల్లో రూ. 7,200 కోట్ల గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నాటికల్లా రూ. 7,200 కోట్ల గృహ రుణాల మంజూరును లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ (ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్) ఈడీ మోనూ రాత్రా వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో రూ. 4,320 కోట్లు, తెలంగాణలో రూ. 2,880 కోట్లు ఉండనున్నట్లు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17,000 పైచిలుకు కుటుంబాలకు రూ. 2,448 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో హరిత గృహాల నిర్మాణంపై డెవలపర్లలో అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన 9వ ’కుటుంబ్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోనూ ఈ విషయాలు తెలిపారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌తో (ఏడీబీ) కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పర్యావరణ హిత నిర్మాణాలు చేపట్టే డెవలపర్లకు చౌకగా రుణాలివ్వడంలో తోడ్పడేందుకు ఏడీబీ 10 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చిందని వివరించారు. సగటు గృహ రుణ పరిమాణం సుమారు రూ. 15 లక్షలుగా ఉంటోందని మోనూ చెప్పారు. ప్రస్తుతం తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 87 శాఖలు ఉన్నాయని, 2023 నాటికి వీటి సంఖ్యను 120కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: డార్మిటరీలో మొదలైన స్టార్టప్.. నేడు 101 బిలియన్ డాలర్ల కంపెనీ -
40 ఏళ్లకే తరగనంత సంపద
న్యూఢిల్లీ: వయసులో ఉన్నప్పుడే వేలాది కోట్లు కూడబెట్టుకోవడం ఎలాగో.. ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40, అండర్ సెల్ఫ్‌మేడ్ రిచ్‌లిస్ట్ 2021’ను పరిశీలిస్తే తెలుస్తుంది. 40 ఏళ్లలోపే రూ.1,000 కోట్లకు పైగా సంపదను సమకూర్చుకున్న వ్యాపార విజేతలతో ఈ జాబితాను హురూన్ ఇండియా బుధవారం విడుదల చేసింది. భారత్‌లో జని్మంచిన వ్యాపారవేత్త, మీడియా డాట్ నెట్ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్ తురాఖియా రూ.12,500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత బ్రౌజర్‌స్టాక్ సహ వ్యవస్థాపకులు నకుల్‌అగర్వాల్(38), రితేష్ అరోరా(37), చెరో రూ.12,400 కోట్ల విలువతో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 45 వ్యాపారవేత్తలకు స్థానం లభించింది. ఇందులో 42 మంది భారత్‌లో నివసిస్తున్నారు. జాబితాలో 31 మంది కొత్తవారే ఉన్నారు. ఇందులోనూ 30 మంది స్టార్టప్‌లతో సంపద సృష్టించుకున్నారు. బెంగళూరు ఎక్కువ మందికి ఆశ్రయమిచి్చంది. జాబితాలో 15 మంది ఈ నగరంలోనే నివసిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ 8 మంది, ముంబై 5, గురుగ్రామ్ 3, థానె ఇద్దరికి చొప్పున నివాస కేంద్రంగా ఉంది. సాఫ్ట్వేర్ అండ్ సేవలు (12 మంది), రవాణా అండ్ లాజిస్టిక్స్ (5 మంది), రిటైల్ (5 మంది), ఎంటర్టైన్మెంట్ (5 మంది), ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం నుంచి 5 మంది చొప్పున ఇందులో ఉన్నారు. డిస్కౌంట్ బ్రోకరేజీలో దిగ్గజంగా ఉన్న జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.11,100 కోట్లుగా ఉంది. భారత్ మొత్తం మీద సంపన్నుల్లో చూస్తే కామత్ కుటుంబం 63వ స్థానంలో ఉంది. 2021 సెపె్టంబర్ 15 నాటి గణాంకాలను ఈ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారు. ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడికీ చోటు.. ఇటీవలే ఐపీవోను విజయవంతంగా ముగించుకున్న ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకులు రికాంత్ పిట్టి (33), నిశాంత్ పిట్టి (35), ప్రశాంత్ పిట్టి (37) జాబితాలోకి చేరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడు మనీష్ కుమార్ దబ్‌కర (37) కూడా ఇందులో ఉన్నారు. ఈ జాబితాలోని సంపన్నులు అందరూ ఉమ్మడిగా రూ.1,65,600 కోట్లు కూడబెట్టుకున్నారు. గతేడాది జాబితాలో నిలిచిన వారి సంపదతో పోల్చి చూస్తే 286 శాతం వృద్ధి కనిపిస్తోంది. భారత్‌పేకు చెందిన 23 ఏళ్ల శశ్వత్ నక్రాని జాబితాలో అత్యంత పిన్న వయసు్కడిగా నిలవడం గమనార్హం. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే..!
హైదరాబాద్: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం. వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం.. బయోలాజికల్ ఈ. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాహిమా దట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ధనిక మహిళగా అవతరించింది. ఆమె నికర సంపద విలువ రూ.7,700 కోట్లు. మొత్తం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మహిమ 231వ ర్యాంకు సాధించారు. లండన్‌లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన 44 ఏళ్ల మాహిమా 2001 నుంచి బయోలాజికల్ ఈ భాద్యతలు చేపట్టారు. ఆమె తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి హెపారిన్ అనే ఔషధాన్ని తయారు చేస్తుంది. ఈ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో ఉన్న మరో మహిళ ఎన్ ఏసీఎల్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె లక్ష్మీరాజు రూ.1,000 కోట్ల సంపద కలిగి ఉన్నారు.(చదవండి: 10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్) తెలుగు రాష్ట్రాల్లో ధనికుల జాబితాలో ఆమె 41వ స్థానంలో ఉండగా.. దాట్లా & కుటుంబం 15 స్థానాల్లో ఉన్నారు. భారతదేశంలోని సంపన్నుల జాబితాలో లక్ష్మీ రాజు 956వ ర్యాంకు సాధించారు. ఈ ఏడాది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 69 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్తం సంపద తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరిగింది. -
‘హురూన్’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యా»ొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్‌కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి(గ్రీన్కో) ఉన్నారు. -
ముకేష్ అంబానీ: నేనే నెంబర్ 1
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.7,18,000 కోట్ల సంపదతో వరుసగా 10వ సంవత్సరం భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది గౌతమ్ అదానీ & కుటుంబం రెండు స్థానాలు పైకి ఎగబాకి రూ. 5,05,900 కోట్లతో రెండవ స్థానానికి చేరుకున్నారు. ముకేశ్ అంబానీతో పాటుగా ఎల్ఎన్ మిట్టల్, కుమార మంగళం బిర్లా, శివ నాడార్ పదేళ్లుగా ఇండియా కుబేరుల జాబితాలో టాప్ 10లో ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఇండియా టాప్ 10 కుబేరుల జాబితాలో నలుగురు కొత్తగా చేరారు. గౌతమ్ అదానీ & కుటుంబం కేవలం ఒక రోజులో దాదాపు రూ.1,002 కోట్లు సంపాదించారు. 15 సెప్టెంబర్ 2021 నాటికి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్ట్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న 119 నగరాల నుంచి 1,007 వ్యక్తుల నికర సంపద ₹1,000 కోట్లుగా ఉంది. వీరి సంపద సగటున 25%పెరిగింది. 894 మంది వ్యక్తులు తమ సంపద పెరగడం లేదా అలాగే ఉంది. ఇందులో 229 కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. అలాగే 113 మంది సంపద ఈ ఏడాది కాలంలో పడిపోయింది. భారతదేశంలో 2021నాటికి 237 మంది బిలియనీర్లు ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 58 మంది పెరిగారు.(చదవండి: ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ) -
గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త!
మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. తక్కువ వడ్డీ రేటుకు ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ గోల్డ్ లోన్ అందిస్తుంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయ గోల్డ్ లోన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో వడ్డీ రేటు నెలకు 0.79 శాతం నుంచి ప్రారంభమౌతోంది. దేశవ్యాప్తంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్రాంచులు అన్నింటిలోనూ ఈ స్కీమ్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తీసుకున్న లోన్ మొత్తాన్ని 24 నెలలలోగా చెల్లించవచ్చు అని పేర్కొంది. నెల, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ వార్షికనికి ఒకసారి గోల్డ్ లోన్ వడ్డీ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ కోసం కస్టమర్లు బంగారం/ఆభరణాలతో ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ బ్రాంచీని సందర్శించవచ్చు. కేవలం 30 నిమిషాల వ్యవధిలో రుణాన్ని పొందవచ్చు అని కూడా తెలిపింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వడ్డీ తిరిగి చెల్లింపుల కొరకు 5-7 రోజుల గ్రేస్ పీరియడ్ అందిస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ డిజిగోల్డ్ లోన్ ఫెసిలిటీని కూడా లాంఛ్ చేసింది. "మహమ్మారి సమయంలో రైతులు & చిన్న వ్యవస్థాపకుల మూలధన అవసరాలను తీర్చడానికి బంగారు రుణాలను తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ కాలానికి అందిస్తున్నాం. మా కస్టమర్లలో 70 శాతం మంది మళ్లీ వ్యాపారం కోసం మా వద్దకు రావడం మా నిజాయితీ, పారదర్శకతకు నిదర్శనం" అని బిజినెస్ హెడ్ - గోల్డ్ లోన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శ్రీ సౌరభ్ కుమార్ అన్నారు. -
ప్రమోటర్ల పుష్- IIFL షేర్లు హైజంప్
గ్రూప్ కంపెనీలో ప్రమోటర్లు వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఐఐఎఫ్ఎల్(IIFL) కౌంటర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు క్యూకట్టడంతో గ్రూప్‌లోని మూడు లిస్టెడ్ కంపెనీల షేర్లూ అనూహ్య లాభాలతో పరుగు తీస్తున్నాయి. ట్రేడింగ్ పరిమాణం సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓపెన్ మార్కెట్ ద్వారా కంపెనీ ప్రమోటర్, డైరెక్టర్ నిర్మల్ జైన్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 4.54 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 3.4 కోట్లు వెచ్చించారు. దీంతో కంపెనీలో జైన్ వాటా 12.49 శాతం నుంచి 12.61 శాతానికి బలపడింది. ఈ నేపథ్యంలో ఐఐఎఫ్ఎల్ గ్రూప్ షేర్లన్నీ హైజంప్ చేశాయి. యమ స్పీడ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ బాటలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 1134 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1195 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కౌంటర్ సైతం అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 82.50 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 2.46 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కౌంటర్లో 4.85 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇదే విధంగా 99,000 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కౌంటర్లో 65,000 షేర్లు, 2700 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్ఎల్ వెల్త్ కౌంటర్లో 1400 షేర్లు చొప్పున ట్రేడయ్యాయి. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌పై కేసుల యోచన లేదు: ఐఐఎఫ్ఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్)పై ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టే ఉద్దేశ్యం లేదని, కాని ఖాతాదారులకు రావాల్సిన బకాయిలను తొందరగా వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఇండియా ఇన్ఫోలైన్ ప్రకటించింది. క్రిమినల్ కేసులు పెట్టడం వలన సమస్య మరింత జటిలమై చెల్లింపులు ఆలస్యం అవుతాయన్న అభిప్రాయాన్ని ఐఐఎఫ్ఎల్ ప్రెసిడెంట్ ఇ.ప్రశాంత్ ప్రభాకరన్ వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీ ఇష్యూ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఎన్ఎస్ఈఎల్ రూ.5,600 కోట్లు చెల్లింపుల చేయలేక చేతులు ఎత్తేయడంతో జూలై 31న ట్రేడింగ్‌ను సస్పెండ్ చేశారు. ఇందులో ఐఐఎఫ్ఎల్కి చెందిన దాదాపు 1,400 మంది ఖాతాదారులకు రూ.325 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే చెల్లింపులు జరగ్గా ఇంకా రూ.305 కోట్లు రావాల్సి ఉందని అన్నారు.ఎన్సీడీపై 12 శాతం వడ్డీ: మూడవ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) ఇష్యూ ద్వారా రూ.1,050 కోట్లు సమీకరించనున్నట్లు ఐఐఎఫ్ఎల్ ప్రకటించింది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ ఇష్యూపై సంవత్సరానికి గరిష్టంగా 12 శాతం వార్షిక వడ్డీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. స్పాట్ ఎక్స్ఛేంజీపై ప్రభుత్వానికి ఈడీ నివేదిక : కాగా ఆర్థిక చట్టాలను ఉల్లంఘనకు సంబంధించి నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై రూపొందించిన నివేదిక(స్టేటస్ రిపోర్ట్)ను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ఆర్థిక శాఖకు అందజేసింది.