న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.7,18,000 కోట్ల సంపదతో వరుసగా 10వ సంవత్సరం భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
ఈ ఏడాది గౌతమ్ అదానీ & కుటుంబం రెండు స్థానాలు పైకి ఎగబాకి రూ. 5,05,900 కోట్లతో రెండవ స్థానానికి చేరుకున్నారు. ముకేశ్ అంబానీతో పాటుగా ఎల్ఎన్ మిట్టల్, కుమార మంగళం బిర్లా, శివ నాడార్ పదేళ్లుగా ఇండియా కుబేరుల జాబితాలో టాప్ 10లో ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఇండియా టాప్ 10 కుబేరుల జాబితాలో నలుగురు కొత్తగా చేరారు. గౌతమ్ అదానీ & కుటుంబం కేవలం ఒక రోజులో దాదాపు రూ.1,002 కోట్లు సంపాదించారు.
15 సెప్టెంబర్ 2021 నాటికి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్ట్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న 119 నగరాల నుంచి 1,007 వ్యక్తుల నికర సంపద ₹1,000 కోట్లుగా ఉంది. వీరి సంపద సగటున 25%పెరిగింది. 894 మంది వ్యక్తులు తమ సంపద పెరగడం లేదా అలాగే ఉంది. ఇందులో 229 కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. అలాగే 113 మంది సంపద ఈ ఏడాది కాలంలో పడిపోయింది. భారతదేశంలో 2021నాటికి 237 మంది బిలియనీర్లు ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 58 మంది పెరిగారు.(చదవండి: ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ)
Comments
Please login to add a commentAdd a comment