IIFL Private Wealth Management
-
ఐఐఎఫ్ఎల్ వెల్త్‌కు గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్లో వాటాలను విక్రయించాలని విదేశీ పెట్టుబడి సంస్థలు యోచిస్తున్నాయి. ప్రధానంగా జనరల్ అట్లాంటిక్ సింగపూర్, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాటాలను ఆఫర్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్‌లో ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్‌కు 13.6 శాతం వాటా ఉంది. అయితే మార్కెట్ ధర కంటే అధికంగా సుమారు 40 శాతంవరకూ ప్రీమియంను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాటాల కొనుగోలుకి పీఈ ఫండ్స్, సంపన్న వర్గాలు (హెచ్ఎన్ఐలు) ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నాయి. పీఈ సంస్థ ద క్యాపిటల్ ఫండ్ సైతం రేసులో ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో షేరుకి రూ. 2,100 ధరవరకూ ఆశిస్తున్నట్లు వెల్లడించాయి. బుధవారం బీఎస్ఈలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,474 వద్ద ముగిసింది. కాగా.. వాటా విక్రయం అంశంపై ఐఐఎఫ్ఎల్ వెల్త్సహా జనరల్ అట్లాంటిక్, ఫెయిర్‌ఫాక్స్ స్పందించకపోవడం గమనార్హం! 2008లో షురూ కొటక్ వెల్త్ ఉద్యోగులు కరణ్ భగత్, యతిన్ షా సహకారంతో 2008లో నిర్మల్ జైన్ ఐఐఎఫ్ఎల్ వెల్త్‌ను ఏర్పాటు చేశారు. 2015 అక్టోబర్‌లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ 21.6 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,122 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అయితే అప్పటికి ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ పేరుతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2019లో విలువ జోడింపునకు వీలుగా ఐఐఎఫ్ఎల్.. ఫైనాన్స్, వెల్త్, సెక్యూరిటీస్ పేరుతో మూడు కంపెనీలుగా విడదీసి లిస్టింగ్ చేసింది. కాగా.. 44 బిలియన్ డాలర్ల ఆస్తులతో దేశంలోనే అతిపెద్ద స్వతంత్ర వెల్త్ మేనేజర్ కంపెనీగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ నిలుస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
భాగ్యనగరంలో అత్యంత ఆస్తిపరులు వీళ్లే
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ సంస్థలు ప్రకటించిన దేశంలోని టాప్ 100 ధనవంతుల జాబితాలో ముగ్గురు హైదరాబాదీలు చోటు దక్కించుకున్నారు. అంతేకాదు గతేడాదితో పోల్చితే హైదరాబాద్‌లో ధనవంతుల సంఖ్య పెరుగుతున్నట్టు కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఫార్మా కంపెనీ వారే.. బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియా హబ్‌గా పేరు తెచ్చుకుంది హైదరాబాద్. ఈ పేరుకు తగ్గట్టే ఐఐఎఫ్ వెల్త్, హురున్ ఇండియా రిచ్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ధనవంతుల్లో ముగ్గురు ఫార్మా రంగానికి చెందినవారే కావడం గమనార్హం. దివీస్ మురళీ, హెరిటో గ్రూప్ పార్థసారథిరెడ్డి, ఆరబిందో ఫార్మా పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డిలు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ టాప్ 100లో ఉన్నారు. దివీస్ మురళీ ఆస్తులు ఐఐఎఫ్ఎల్, హురున్ ఇండియా 2021 ఏడాదికి గాను ప్రకటించిన వంద మంది ఐశ్వర్యవంతుల జాబితాలో దివీస్ ల్యాబ్స్ యజమాని దివి మురళి 14వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 79,000 కోట్లుగా హురున్ జాబితా తెలిపింది. గతేడాదికి సంబంధించిన జాబితాలో ఆయన రూ. 49,200 కోట్ల రూపాయలతో 17వ స్థానంలో నిలవగా, ఈసారి మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం.. ఏడాది కాలంలో ఆయన ఆస్తులు 61 శాతం పెరిగాయి. దీంతో మూడు స్థానాలు పైకి చేరుకున్నారు. హెటిరో, అరబిందో గతేడాది హురున్ ప్రకటించిన టాప్ 100 జాబితాలో రూ, 13,900 కోట్ల రూపాయల ఆస్తులతో హెటిరో సంస్థ ప్రమోటర్ పార్థసారథిరెడ్డి 88వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన ఆస్తుల విలువ రూ. 26,100 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో టాప్ 100 లిస్టులో ఆయన 23 స్థానాలు మెరుగుపరుచుకుని 58వ స్థానంలో నిలిచారు. ఇక అరబిందో గ్రూపు ప్రమోటర్ పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి రూ. 19,000 కోట్ల ఆస్తులతో 86వ స్థానంలో నిలిచారు. వెయ్యి కోట్లకు పైన ఫార్మా, ఐటీ తదితర పరిశ్రమలతో విరాజిల్లుతున్న హైదరాబాద్ నగరంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. మానవ వనరులు, మౌలిక సదుపాయలు మెరుగ్గా ఉండటంతో ఇక్కడ వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వారు హైదరాబాద్‌లో 1007 మంది ఉన్నట్టు హురున్ వెల్లడించింది. దేశంలో అత్యధిక మంది ఐశ్వర్యవంతులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. వీళ్లు కూడా లారస్ ల్యాబ్స్ ఫౌండర్ సీ సత్యనారాయణ ఆస్తులు రూ. 8400 కోట్లు, సువెన్ ఫార్మాస్యూటికల్ ప్రమోటర్ జాస్తి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ ఆస్తులు రూ. 9,700 కోట్లు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి జీఏఆర్ గ్రూప్ ప్రమోటర్ జీ అమరేందర్‌రెడ్డి ఆస్తుల విలువ రూ. 12,000 కోట్లు ఉన్నట్టు హురున్ ప్రకటించింది. చదవండి : అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు! -
ముకేష్ అంబానీ: నేనే నెంబర్ 1
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.7,18,000 కోట్ల సంపదతో వరుసగా 10వ సంవత్సరం భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది గౌతమ్ అదానీ & కుటుంబం రెండు స్థానాలు పైకి ఎగబాకి రూ. 5,05,900 కోట్లతో రెండవ స్థానానికి చేరుకున్నారు. ముకేశ్ అంబానీతో పాటుగా ఎల్ఎన్ మిట్టల్, కుమార మంగళం బిర్లా, శివ నాడార్ పదేళ్లుగా ఇండియా కుబేరుల జాబితాలో టాప్ 10లో ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఇండియా టాప్ 10 కుబేరుల జాబితాలో నలుగురు కొత్తగా చేరారు. గౌతమ్ అదానీ & కుటుంబం కేవలం ఒక రోజులో దాదాపు రూ.1,002 కోట్లు సంపాదించారు. 15 సెప్టెంబర్ 2021 నాటికి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్ట్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న 119 నగరాల నుంచి 1,007 వ్యక్తుల నికర సంపద ₹1,000 కోట్లుగా ఉంది. వీరి సంపద సగటున 25%పెరిగింది. 894 మంది వ్యక్తులు తమ సంపద పెరగడం లేదా అలాగే ఉంది. ఇందులో 229 కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. అలాగే 113 మంది సంపద ఈ ఏడాది కాలంలో పడిపోయింది. భారతదేశంలో 2021నాటికి 237 మంది బిలియనీర్లు ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 58 మంది పెరిగారు.(చదవండి: ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ) -
బఫెట్.. బేరిష్- ఆటో, టెలికం గ్రేట్
చరిత్రలోనే అతి గొప్ప ర్యాలీని సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మిస్సయ్యారంటున్నారు సంజీవ్ భాసిన్ ఒక ఇంటర్వ్యూలో. సెప్టెంబర్ తదుపరి స్టాక్ మార్కెట్లు అతి పెద్ద బుల్ ర్యాలీలో ప్రవేశించే వీలున్నట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ అంచనా వేస్తున్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలు తదితర పలు అంశాలపై సంజీవ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలుసుకుందామా..? అంచనా తప్పు గ్లోబల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మార్కెట్ల పట్ల అత్యంత బేరిష్ ధృక్పథాన్ని కలిగి ఉన్నారు. దీంతో బఫెట్ గొప్ప ర్యాలీని మిస్ అయ్యారు. నిజానికి వాస్తవ పరిస్థితులను స్టాక్ మార్కెట్లు ప్రతిబింబించడంలేదనే చెప్పాలి. ఒకసారి కోవిడ్‌కు వ్యాక్సిన్ వెలువడ్డాక పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటే ఏం జరుగుతుందన్నది ఆలోచించి చూడండి... నెమ్మదిగానైనా ఇవి జరగబోయే విషయాలే కదా! సెప్టెంబర్ తదుపరి సెప్టెంబర్ తరువాత చరిత్రలోనే అతిగొప్ప ర్యాలీ ప్రారంభంకావచ్చు. దీంతో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు మరింత వేగమందుకునే వీలుంది. ఈ సందర్భంలో గత రెండు, మూడేళ్లలో రెట్టింపైన పలు కౌంటర్లు గొప్ప ప్రదర్శన చేయకపోవచ్చు. నేను చెబుతున్న అంశాల్లో మీకు పూర్తి విశ్వాసం కలగకపోవచ్చు. కోవిడ్-19కు వ్యాక్సిన్ వెలువడితే మార్కెట్లకు ఎక్కడలేని బలం చేకూరుతుంది. దీనిసంగతి పక్కనపెడితే రానున్న మూడు నెలల్లో మిడ్, స్మాల్ క్యాప్స్ భారీ ర్యాలీ చేసే అవకాశముంది. రానున్న మూడు నెలల్లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,500 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. అయితే ఇదే సమయంలో జులైలోనే నిఫ్టీ 11,000ను తాకవచ్చని అత్యంత ఆశావహంగా ఉన్నాం. ఆటో స్పీడ్ ఆటో రంగంలో ఎస్కార్ట్స్, వీఎస్టీ టిల్లర్స్, స్వరాజ్ ఇంజిన్స్, ఎంఅండ్ఎం వంటి కౌంటర్లు ఇటీవల బలపడ్డాయి. కనిష్టాల నుంచి ఇవి బౌన్స్ అయినప్పటికీ గత రెండేళ్లుగా హీరో మోటో, ఎంఅండ్ఎం పెద్దగా లాభపడింది లేదు. అండర్ పెర్ఫార్మర్లుగా నిలుస్తూ వచ్చాయి. బీఎస్-4 నుంచి బీఎస్-6కు మారడం, కొంతమేర గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మందగమనం తదితర అంశాలు ప్రభావం చూపాయి. ప్రస్తుతం గ్రామ ప్రాంతాల మార్కెట్లు జోరందుకుంటున్నాయి. పంటల విస్తీర్ణం పెరగడం, ఆదాయాలు మెరుగుపడటం ద్వారా సబ్సిడీ వ్యయాలు తగ్గడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆహార సరుకుల సరఫరాలు పుంజుకోనున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ ఊపందుకోనుంది. సిప్ పద్ధతిలో రానున్న మూడు నెలల కాలంలో క్రమానుగత పెట్టుబడి(సిప్) విధానంలో హీరో మోటో, మహీంద్రా, ఐషర్ మోటార్స్ వంటి కౌంటర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చని భావిస్తున్నాం. రానున్న కొద్ది క్వార్టర్లలో మంచి పనితీరును చూపే వీలుంది. ఇక బ్యాటరీలకు పెరగనున్న డిమాండ్ కారణంగా ఎక్సైడ్నూ పరిశీలించవచ్చు. ఇదేవిధంగా యూరప్ మార్కెట్లో పెరగనున్న అవకాశాల రీత్యా మదర్సన్ సుమీపైనా కన్నేయవచ్చు. కొన్ని కౌంటర్లు ఖరీదుగా ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ రిటర్నులు అందించే వీలుంది. మంచి మ్యూచువల్ ఫండ్ ద్వారా ఆటో రంగంలో ఎక్స్పోజర్ను తీసుకుంటే లాభించగలదు. టెలికం రింగింగ్ టెలికం రంగానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. వీటితోపాటు స్టీల్, సిమెంట్ రంగాలనూ పరిశీలించవచ్చు. పునర్మిర్మాణ పనులు మొదలయ్యాక ఈ రంగాలకు డిమాండ్ పెరిగే చాన్స్ ఉంది. ఇకపై ఆటో, టెలికం, స్టీల్, సిమెంట్ రంగాలు ఔట్ పెర్ఫార్మ్ చేయవచ్చని భావిస్తున్నాం. ఇక వినియోగ రంగంలో ఐటీసీ, నెస్లేలకూ పెద్దపీట వేయవచ్చు. హోటల్స్ మినహా మిగిలిన విభాగాలు మంచి పనితీరు చూపుతుండటం ఐటీసీకి లాభించగలదు. హెచ్‌యూఎల్‌తో పోలిస్తే ఐటీసీ చౌకగా ట్రేడవుతోంది. మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయదలిస్తే పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న మూడు, నాలుగు నెలల కాలంలో సిప్ పద్ధతిలో పెట్టుబడులకు ఉపక్రమిస్తే మేలు కలగవచ్చు. మా అంచనాలు నిజమైతే సెప్టెంబర్ తదుపరి ఏడాది లేదా రెండేళ్ల కాలంలో మార్కెట్లు ర్యాలీ చేసే అవకాశముంది! -
ప్రమోటర్ల పుష్- IIFL షేర్లు హైజంప్
గ్రూప్ కంపెనీలో ప్రమోటర్లు వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఐఐఎఫ్ఎల్(IIFL) కౌంటర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు క్యూకట్టడంతో గ్రూప్‌లోని మూడు లిస్టెడ్ కంపెనీల షేర్లూ అనూహ్య లాభాలతో పరుగు తీస్తున్నాయి. ట్రేడింగ్ పరిమాణం సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఓపెన్ మార్కెట్ ద్వారా కంపెనీ ప్రమోటర్, డైరెక్టర్ నిర్మల్ జైన్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 4.54 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు రూ. 3.4 కోట్లు వెచ్చించారు. దీంతో కంపెనీలో జైన్ వాటా 12.49 శాతం నుంచి 12.61 శాతానికి బలపడింది. ఈ నేపథ్యంలో ఐఐఎఫ్ఎల్ గ్రూప్ షేర్లన్నీ హైజంప్ చేశాయి. యమ స్పీడ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ బాటలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 1134 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1195 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కౌంటర్ సైతం అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 82.50 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 2.46 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కౌంటర్లో 4.85 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇదే విధంగా 99,000 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కౌంటర్లో 65,000 షేర్లు, 2700 షేర్ల సగటుతో పోలిస్తే ఐఐఎఫ్ఎల్ వెల్త్ కౌంటర్లో 1400 షేర్లు చొప్పున ట్రేడయ్యాయి. -
మళ్లీ ము‘క్యాష్’ కింగ్..!
ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,700 కోట్లు. తాజా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే... ► రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే. ► అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. ► రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం. ► సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2% పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది. ► మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26%) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి. ► సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్ఆర్ఐలకు ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ► స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి∙అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు. ► జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు. వృద్ధిలో వీరి పాత్ర కీలకం... ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం. –అనాన్ రెహ్మాన్ జునైడ్, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ, చీఫ్ రెసెర్చర్ వేగం పుంజుకుంటున్న భారత్ భారత్ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది. – యతిన్ షా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కో–ఫౌండర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు హురున్ భారతీయ కుబేరుల జాబితా (బిలియనీర్లు)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 మంది కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) చైర్మన్ పి.పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్చంద్ర కిరణ్ 83వ స్థానం, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు. పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి కాగా, దేశంలోని టాప్–10 మహిళా కుబేరుల జాబితాలో దివీస్ ల్యాబ్స్‌కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. ఇక స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదిగిన అత్యంత పిన్న వయస్కుల్లో(40 ఏళ్ల లోపు) విజయవాడకు చెందిన 33 ఏళ్ల శ్రీహర్ష మాజేటి చోటు సంపాదించారు. స్విగ్గీ సహ ప్రమోటర్ శ్రీహర్ష సంపద విలువను హురున్ రూ.1,400 కోట్లుగా లెక్కగట్టింది. మొత్తం సంపన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 68 మంది,(గతేడాది 49), ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది(గతేడాది 6) ఉన్నట్లు హురున్ వెల్లడించింది. గోపిచంద్ హిందూజా, శ్రీచంద్ హిందూజా, అజీం ప్రేమ్‌జీ రాంప్రసాద్‌రెడ్డి, దివి సత్చంద్ర కిరణ్, నీలిమ, శ్రీహర్ష మాజేటి -
ఈక్విటీల్లో ఇవి ఉండాల్సిందే..
స్టాక్ సూచీలు నూతన గరిష్ట స్థాయిలను దాటి దూసుకుపోతున్న తరుణంలో షేర్ల పెట్టుబడిలో ఉండే లాభనష్టాలు, ఇన్వెస్ట్ చేసే ముందు పాటించాల్సిన నియమాలతో పాటు, ప్రస్తుత ర్యాలీలో ఏ రంగాల షేర్లు పెరిగే అవకాశం ఉందన్న దానిపై ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ సీఐవో ఉమాంగ్ సలహాలు,సూచనలు ప్రత్యేకంగా ‘ప్రాఫిట్’ పాఠకుల కోసం ... సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రంలో ఏక పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారం చేపట్టడంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా కీలకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టే అవకాశం ఏర్పడింది. ఈ అంశమే విదేశీ ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. గత రెండేళ్లలో ఎఫ్ఐఐలు సగటున ఏడాదికి 22 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ ఏడాది జూన్ 18 నాటికే 10 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. అలాగే గత రెండేళ్లుగా తగ్గిన దేశీయ పొదుపు రేటు తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు కూడా స్టాక్ మార్కెట్లోకి కొత్త నిధుల ప్రవాహాన్ని సూచిస్తున్నాయి. రానున్న కాలంలో స్టాక్ మార్కెట్లు మరింత పైకి ఎదిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈక్విటీలు మంచి లాభాలను అందిస్తాయనే అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం... మిడ్క్యాప్దే జోరు ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతున్నప్పుడు మిడ్, స్మాల్ క్యాప్ విభాగంలో మంచి కంపెనీల షేర్లు అత్యధికంగా లాభపడతాయి. సహజంగా పెరుగుతున్న వృద్ధిరేటుతో పాటే ఈ కంపెనీల వ్యాపార, ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. వాటి భవిష్యత్తు ఆదాయాలు, లాభాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీల షేర్ల ధరల రీ-రేటింగ్ జరుగుతుంది. బుల్ మార్కెట్ ర్యాలీలో లార్జ్ క్యాప్ షేర్ల కంటే మిడ్ క్యాప్ షేర్లే ఎక్కువ లాభాలను అందిస్తాయి. ఉదాహరణకు గత బుల్ ర్యాలీనే పరిశీలిస్తే... 2003-2007లో నిఫ్టీ 47 శాతం పెరిగితే నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 55 శాతం వార్షిక వృద్ధిరేటును అందించింది. కాబట్టి మిడ్, స్మాల్ క్యాప్ విభాగంలో మంచి కంపెనీల షేర్లు తప్పకుండా మీ పోర్ట్‌ఫోలియోలో ఉండే విధంగా చూసుకోవాలి అదే బాటలో సైక్లికల్స్ బుల్ ర్యాలీలో మంచి పనితీరు కనపర్చే వాటిల్లో సైక్లికల్స్ అంటే.. క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాలు ఉంటాయి. వృద్ధిరేటు మందగించడంతో ఈ రంగాలకు చెందిన కంపెనీల ఆదాయం 40 -60% పడిపోయింది. దీంతో ఈ షేర్లు వాటి సగటు ట్రేడింగ్ స్థాయి కంటే చాలా చౌక ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే ముందుగా పెరిగేది ఈ సైక్లికల్సే కాబట్టి వీటిపై ఓ కన్నేసి ఉంచాలి. పీఎస్యూలదే భవిష్యత్తు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సంస్కరణల్లో మొదటి ప్రాధాన్యత పీఎస్‌యూలను సంస్కరించడమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా పీఎస్‌యూలను ఆయన గాడిలో పెట్టిన విషయం తెలిసిందే. సరైన నిర్వహణ సామర్థ్యం లేక చాలా పీఎస్‌యూ కంపెనీలు పూర్తిస్థాయిలో లాభాలను పొందలేకపోతున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన 81 ప్రభుత్వరంగ కంపెనీల పదేళ్ల సగటు లాభాలు 12.5 శాతంగా ఉంటే ఇదే సమయంలో బీఎస్ఈలోని టాప్ 100 కంపెనీల సగటు లాభాలు 19.2%గా ఉన్నాయి. బ్యాంకులను మినహాయిస్తే 52 పీఎస్‌యూల సగటు లాభాలు 9.8 శాతం. పీఎస్‌యూలు రానున్న కాలంలో మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బుల్ ర్యాలీలో మిగిలిన వాటికంటే ఈ మూడు రంగాలు మరింత మెరుగైన పనితీరును కనపర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అని మీ మొత్తం పెట్టుబడి అంతా ఈ మూడింటికే కేటాయించడం మంచిది కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కేవలం ఒకే రంగానికి కాకుండా అన్ని రంగాలకు కేటాయించే విధంగా చూసుకోవాలి. అందులో కొద్దిగా అధిక భాగం ఈ మూడింటికి కేటాయించడం ద్వారా రిస్క్ తగ్గించుకొని అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆర్థిక వృద్ధికి దోహదం చేసే రంగాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఎంచుకోండి.