న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ (జేఎంఎఫ్‌పీ)లో ఆర్‌బీఐ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఆడిటర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన టెండరు ప్రకటన ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు సెబీ ఆమోదం పొందిన ఆడిట్ సంస్థలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులను సమరి్పంచేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8 కాగా, ఎంపికైన సంస్థలకు ఏప్రిల్ 12న విధులను కేటాయిస్తారు. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో పర్యవేక్షణపరమైన అవకతవకలను పరిశీలించిన మీదట తదుపరి బంగారం రుణాలు ఇవ్వరాదంటూ ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌ను ఆర్‌బీఐ ఆదేశించింది. అలాగే ఐపీవోలకు బిడ్ చేసే కస్టమర్లకు నిధులు సమకూర్చే విషయంలో అవకతవకలకు గాను జేఎంఎఫ్‌పీపైనా ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment