JM Financial
-
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎంఎఫ్పీలో ప్రత్యేక ఆడిట్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘనలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, జేఎం ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ (జేఎంఎఫ్పీ)లో ఆర్బీఐ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి ఆడిటర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన టెండరు ప్రకటన ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు సెబీ ఆమోదం పొందిన ఆడిట్ సంస్థలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమరి్పంచేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8 కాగా, ఎంపికైన సంస్థలకు ఏప్రిల్ 12న విధులను కేటాయిస్తారు. గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో పర్యవేక్షణపరమైన అవకతవకలను పరిశీలించిన మీదట తదుపరి బంగారం రుణాలు ఇవ్వరాదంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే ఐపీవోలకు బిడ్ చేసే కస్టమర్లకు నిధులు సమకూర్చే విషయంలో అవకతవకలకు గాను జేఎంఎఫ్పీపైనా ఆంక్షలు విధించింది. -
అదానీ దూకుడు, ఓపెన్ ఆఫర్ డేట్ ఫిక్స్, షేర్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీగ్రూప్ మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి తన ఓపెన్ ఆఫర్‌ను అక్టోబర్ 17న ప్రారంభించనుంది.1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలుకు సంబంధించిన ఈ ఓపెన్ ఆఫర్లో ఒక్కో షేరు ధర రూ. 294గా నిర్ణయించిందని జేఎం ఫైనాన్షియల్ ప్రకటించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ అనుబంధ సంస్థల ద్వారా బహుళ-లేయర్డ్ లావాదేవీలతో ఎన్డీటీవీలో మొత్తం 55శాతం వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అదానీ గ్రూప్, మీడియా సంస్థలో 29.18వాటాను కొనుగోలు చేయాలనే గ్రూప్ ప్రణాళికలకు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్ కోసం తాత్కాలిక ప్రారంభ తేదీగా అక్టోబర్ 17ని నిర్ణయించింది.ఇష్యూకు మేనేజర్ జేఎం ఫైనాన్షియల్ పబ్లిక్ ప్రకటన ప్రకారం, ఆఫర్ తాత్కాలికంగా నవంబర్ 1న ముగియనుంది. ఓపెన్ ఆఫర్‌కు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్లో పూర్తి అంగీకారం ఉందని భావించి, కొనుగోలుదారు, ఓటింగ్ షేర్ క్యాపిటల్‌లో 26శాతం వరకు పొందవలసి ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 294 ధరతో పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే, ఓపెన్ ఆఫర్ మొత్తం రూ. 492.81 కోట్లుగా ఉంటుంది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కాగా ఆగస్టు 23న, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌లో 99.99 శాతం వాటాను కలిగి ఉన్న విశ్వప్రధాన కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్‌లో భాగమైన వీపీసీఎల్ వాటా తీసుకున్నామని వివరించింది. ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్, ఏఎంఎన్ఎల్, ఏఈఎల్ కలిసి ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Share Pledging Case: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!) -
ఎల్ఐసీకి మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి. చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే! -
టెల్కోల ఆదాయానికి బూస్ట్
న్యూఢిల్లీ: టెలికం సంస్థలకు యూజర్లపై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్రమంగా పెరగనుంది. కరోనా వైరస్ కాలంలో పెరిగిన డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు (మార్కెట్ ఆధారితమైనది కావొచ్చు లేదా నియంత్రణ సంస్థపరమైన చర్యల ఆధారితమైనదైనా కావొచ్చు) తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జేఎం ఫైనాన్షియల్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో ఏఆర్పీయూల పెరుగుదల తప్పనిసరిగా ఉండవచ్చని, ఫలితంగా 2024–25 నాటికి పరిశ్రమ ఆదాయం రెట్టింపై సుమారు రూ. 2,60,000 కోట్లకు చేరవచ్చని పేర్కొంది. భవిష్యత్ పెట్టుబడుల అవసరాలను బట్టి చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి టెల్కోల ఏఆర్పీయూ రూ. 230–250 స్థాయికి చేరాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.ఇక ఆధిపత్యమంతా రెండు కంపెనీలదే కాకుండా చూసేందుకు వొడాఫోన్ ఐడియా మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సంస్థ ఏఆర్పీయూ రూ. 190–200 దాకా ఉండాల్సి వస్తుందని పేర్కొంది. కొత్త చోదకాలు..: ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్న ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్టీటీహెచ్), ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ వంటి వ్యాపార విభాగాలు భవిష్యత్‌లో వృద్ధికి కొత్త చోదకాలుగా మారగలవని జేఎం ఫైనాన్షియల్ నివేదిక తెలిపింది. ఈ రెండు విభాగాల్లో జియో వాటా 5–10 శాతం స్థాయిలోనే ఉండటంతో అది చౌక పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో జియో యూజర్ల సంఖ్య పెరగడం కొనసాగుతుందని వివరించింది. వొడాఫోన్ ఐడియా యూజర్లను కొల్లగొట్టడం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి జియో 50% మార్కెట్ వాటా లక్ష్యాన్ని సాధించవచ్చని, ఎయిర్టెల్ మాత్రం తన 30% వాటాను రక్షించుకోగలదని నివేదిక అభిప్రాయపడింది. -
క్యుపిడ్- జేఎం ఫైనాన్షియల్.. జోరు
వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పుంజుకుని 34,102ను తాకగా.. నిఫ్టీ 38 పాయింట్లు బలపడి 10,089 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో టాంజానియా ప్రభుత్వం నుంచి మరోసారి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో కండోమ్స్ తయారీ కంపెనీ క్యుపిడ్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. ఇక మరోపక్క అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్న వార్తలతో ఎన్బీఎఫ్సీ.. జేఎం ఫైనాన్షియల్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు షేర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యుపిడ్ లిమిటెడ్ టాంజానియా ప్రభుత్వ సంస్థ.. మెడికల్ స్టోర్స్ డిపార్ట్మెంట్ నుంచి రిపీట్ ఆర్డర్ లభించినట్లు క్యుపిడ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. పురుష కండోమ్స్ సరఫరాకు లభించిన ఈ ఆర్డర్ విలువను రూ. 23.6 కోట్లుగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యుపిడ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3.4 శాతం లాభపడి రూ. 180 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 7 శాతం జంప్‌చేసి రూ. 187 సమీపానికి చేరింది. గత ఏడాది కాలంలో ఈ కౌంటర్ 40 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! జేఎం ఫైనాన్షియల్ ప్రయివేట్ రంగ కంపెనీ.. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ తాజాగా షేరుకి రూ. 70 సంకేత ధరలో క్విప్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే క్విప్ ధర 1.4 శాతం తక్కువగా సంబంధిత వర్గాలు తెలియజేశాయి. క్విప్ ద్వారా 10.18 కోట్ల డాలర్లను(రూ. 770 కోట్లు) సమీకరించాలని జేఎం ఫైనాన్షియల్ భావిస్తున్నట్లు వెల్లడించాయి. క్విప్ నిర్వహణలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్ మర్చంట్ బ్యాంర్లుగా సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎం ఫైనాన్షియల్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 75 వద్ద ట్రేడవుతోంది. -
ఉపాధి కల్పన తగ్గింది..
♦ కార్మిక శాఖ గణాంకాలే చెబుతున్నాయ్ ♦ జేఎం ఫైనాన్షియల్ నివేదిక ముంబై: భారీ ఆర్థిక వృద్ధి చూపిస్తున్నా.. ఉద్యోగాలు మాత్రం ఉండటం లేదంటూ వస్తున్న విమర్శలను ప్రభుత్వం తిప్పికొడుతున్నప్పటికీ ఉపాధి కల్పన తగ్గుతోందని కార్మిక శాఖ గణాంకాలే చెబుతున్నాయని బ్రోకరేజి సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. డిగ్రీ హోల్డర్లు, కొత్త ఉద్యోగాల కల్పన నిష్పత్తి వివరాలు చూస్తే ఇది తెలుస్తుందని ఒక నివేదికలో వివరించింది. 2011–13 మధ్య కాలంలో ఈ నిష్పత్తి 9 రెట్లు ఉండగా, 2014–16 మధ్య కాలంలో ఏకంగా 27 రెట్లకు పెరిగిందని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ‘నా ఈ డిగ్రీని ఏం చేసుకోను’ అనే శీర్షికతో జేఎం ఫైనాన్షియల్ ఈ నివేదికను రూపొందించింది. జాబ్‌లెస్ వృద్ధి అంటూ కొందరు ఆర్థికవేత్తలు, విపక్షాలు చేస్తున్న విమర్శలన్నీ కూడా బోగస్ అంటూ నీతి ఆయోగ్ వైస్–చైర్మన్ అరవింద్ పనగారియా ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘7–8 శాతం వృద్ధి సాధిస్తున్నామంటే.. లేబర్ మార్కెట్‌కు ఏమాత్రం ప్రయోజనాలు ఒనగూరకుండానే సాధ్యం కాదు. ఉద్యోగాల కల్పన జరగకుండా ఈ స్థాయి వృద్ధి వీలు కాదు. ఉద్యోగాల కల్ప న జరుగుతోంది’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, నిరుద్యోగిత రేటు సుమారు 3 శాతంగానే ఉందన్న మాట తప్ప తన వాదనలకు బలమిచ్చే ఇతరత్రా గణాంకాలేమీ ఆయన చూపలేదు. -
జేఎమ్ ఫైనాన్షియల్ లాభం 19% వృద్ధి
న్యూఢిల్లీ: జేఎమ్ ఫైనాన్షియల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.86 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్) ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.72 కోట్లు)తో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.383 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.475 కోట్లకు పెరిగిందని జేఎమ్ ఫైనాన్షియల్ గ్రూప్ చైర్మన్ నిమేశ్ కంపాని చెప్పారు.కంపానీకి 70 ఏళ్లు నిండినందున సెప్టెంబర్ 30 నుంచి ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి ఆయన రిటైర్‌అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. -
జేఎం ఫైనాన్షియల్‌లో ప్రేమ్‌జీ వాటా పెంపు!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ... బ్యాంకింగ్ లెసైన్స్‌కోసం పోటీలో ఉన్న జేఎం ఫైనాన్షియల్‌లో అదనపు వాటా కొనుగోలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేఎంలో ప్రేమ్‌జీకి 2.9% వాటా ఉంది. వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో కింద ప్రేమ్‌జీ ఈ వాటాను కలిగి ఉన్నారు. దీనికి అదనంగా 5% వాటాను తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. నిమేష్ కంపానీ ఆధ్వర్యంలోని జేఎం కొత్త బ్యాంకింగ్ లెసైన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సిటీబ్యాంక్ మాజీ చీఫ్ విక్రమ్ పండిట్‌ను కీలక ఇన్వెస్టర్‌గా ఎంపిక చేసుకుంది కూడా. అధికారిక సమాచారం లేనప్పటికీ 5% వాటాకు సమానమైన షేర్లను ప్రేమ్‌జీకి కొత్తగా జారీ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా, మార్కెట్ ధర కంటే బాగా అధిక ధరలో ఈ షేర్లను కేటాయించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గడిచిన శుక్రవారం జేఎం ఫైనాన్షియల్ షేరు బీఎస్ఈలో 5% జంప్‌చేసి రూ. 28.85 వద్ద ముగిసింది. కుటుంబం తరఫున పెట్టుబడులు చేపట్టే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా గతంలో ప్రేమ్‌జీ జేఎంలో 2.9% వాటాను కొనుగోలు చేశారు. -
20 ఎఫ్‌డీఐలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పూర్తిస్థాయి విమానయాన సర్వీసులను ప్రారంభించేందుకు వీలుగా టాటా సన్స్‌తో జత కట్టిన సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోపాటు 20 ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విదేశీ పెట్టుబడుల మొత్తం విలువ రూ. 916 కోట్లు. గత నెల చివర్లో సమావేశమైన ఎఫ్ఐపీబీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. వీటిలో సింగపూర్ ఎయిర్‌లైన్ పెట్టుబడి విలువ రూ. 303.2 కోట్లుకాగా, రూ. 179.43 కోట్ల రెలిగేర్ ఎంటర్‌ప్రెజైస్ ప్రతిపాదన కూడా ఉంది. పెట్టుబడి సలహా సర్వీసులు, ఆర్థిక సేవలతోపాటు ఎన్బీఎఫ్సీ రంగంలో పెట్టుబడులకు రెలిగేర్ ఈ నిధులను వినియోగించనుంది. ఈ బాటలో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏర్పాటుకు జేఎం ఫైనాన్షియల్(రూ. 22.19 కోట్లు), ఫార్మా రంగ పెట్టుబడులకు పెర్రిగో ఏపీఐ ఇండియా(రూ. 130 కోట్లు) చేసిన ప్రతిపాదనలకు అనుమతి లభించింది. కాగా, రూ. 1,400 కోట్ల విలువైన ఫెడరల్ బ్యాంక్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించింది. బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74%కి పెంచేందుకు అనుమతి కోరింది. డీఎల్ఎఫ్ లిమిట్లెస్ డెవలపర్స్, సింగ్టెల్ గ్లోబల్ ఇండియా ప్రతిపాదనలపై ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు.