
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది.
గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎల్‌ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి.
చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే!