city group
-
సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు
అమెరికాలోని మూడో అతిపెద్ద బ్యాంకు సిటీ గ్రూపు ఉద్యోగాల కోత వార్తల మధ్య ఉద్యోగులకు సిటీ గ్రూప్ సీఈవో జేన్ ఫ్రేజర్ వార్నింగ్ కలకలం రేపుతోంది. రిస్క్‌ని తగ్గించడం, లాభదాయకతను పెంచడం అనే సవాళ్ల మధ్య సీఈవో తాజా వ్యాఖ్యలు లక్షలాది ఉద్యోగులు గుండెల్లో గుబులు రేపాయి. ఫైనాన్షియల్ టైమ్స్ (FT) నివేదిక ప్రకారం కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుక మార్పులకు రెడీగా ఉండాలని లేదంటే కంపెనీ నుంచి వైదొలగాలంటూ సీఈవో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్పునకు సిద్దంగా ఉండండి.. లేదంటే రైలు దిగడానికి సమయం ఆసన్న మైందంటూ 240,000 మంది ఉద్యోగులకు ఒక కఠినమైన సందేశాన్ని చ్చారు.. 15 ఏళ్లలో బ్యాంక్ చరిత్రలో అతిపెద్ద పునర్నిర్మాణాన్ని ఆమె ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వెచ్చరిక రావడం గమనార్హం. 2021లో సీఈవోగా బాధ్యతలను స్వీకరించిన ఆమె లాభాలను మెరుగుపరచడానికి, బ్యాంకును క్రమబద్ధీకరించడానికి వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. (ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుచేసిన ఆర్బీఐ: అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!) గతవారం జరిగిన టౌన్ హాల్ మీటింగ్‌లో జేన్ మాట్లాడారు. అత్యున్నత ఆశయాలతో ముందు కెళుతున్నాం ఈ వేగవంతమైన ప్రయాణంలో త్వరితగతిన తమతో పయనించాలన్నారు. అంతేకాదు చాలా వేగంగా కదులుతున్న ఈ బ్యాంక్ పురోగతికి సంబంధించి చాలా ఆశయాలు ఉన్నాయి. సో.. మేల్కొండి...క్లయింట్లను గెల్చుకోవడంలో తమతో సాయపడండి.. టార్గెట్లను అందుకోవాల్సి ఉంటుంది అంటూ ఆమె ఉద్యోగులకు వార్నింగ్ బెల్స్ అందించారు. అటు ఆమె సమగ్ర ప్రణాళిక నివేదిక వెలువడిన తర్వాత, సిటీ లాటిన్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాల హెడ్ ఎడ్వర్డో క్రజ్‌తో సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని విడిచిపెట్టినట్లు ఎఫ్టీ నివేదించింది. (వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11) కాగా దాదాపు 160 దేశాలు మిలియన్ల మంది వినియోగదారులు, వ్యాపారాలు, సంస్థలకు సేవలందిస్తున్న టాప్ మోస్ట్ గ్లోబల్ బ్యాంకు సిటీ గ్రూపు. సంస్థ చరిత్రలో తొలి మహిళా సీఈవో జేన్ ఫ్రేజర్. (ప్రపంచంలోనే బెస్ట్ పెర్ఫామింగ్ కరెన్సీ ఏదో తెలుసా? నమ్మలేరు!) -
ఎల్ఐసీకి మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి. చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే! -
భారత్‌కు కలిసొస్తున్న...మోదీ-రాజన్-కమోడిటీస్ త్రయం!
పెట్టుబడులకు ఫేవరెట్... వచ్చే ఏడాదీ స్టాక్ మార్కెట్ జోరు సిటీ గ్రూప్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: అమెరికా కంపెనీలకు అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ కొనసాగుతోందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటీ గ్రూప్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, దిగొస్తున్న అంతర్జాతీయ కమోడిటీ ధరలు భారత్‌ను ఫేవరెట్‌గా నిలుపుతున్నాయని సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కాగా, భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు, రష్యా కరెన్సీ రూబుల్ భారీ పతనం ఇతరత్రా అంతర్జాతీయ ప్రతికూలాంశాల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తప్పించుకోలేనప్పటికీ.. ఇతర దేశాలతోపోలిస్తే మెరుగైన స్థితిలో ఉందని సిటీ గ్రూప్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. భారీగా క్రూడ్ దిగుమతులు చేసుకుంటున్న భారత్‌కు దీని ధర నేలకు దిగిరావడం శుభపరిణామమని.. దీంతోపాటు స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటం, విదేశీ మారక నిల్వల పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు మరింత చేయూతనివ్వనున్నట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఐదున్నరేళ్ల కనిష్టానికి(బ్యారెల్ 60 డాలర్ల దిగువకు) పడిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని ఆందోళనలూ ఉన్నాయ్... వ్యాపారానుకూల మోదీ ప్రభుత్వం, వేగవంతంగా తగిన పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, కమోడిటీ ధరల క్షీణతతో పెట్టుబడులకు సానుకూల దేశంగా భారత్ నిలుస్తోందని తెలిపింది. 2014లో స్టాక్ మార్కెట్ల జోరు నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరింత ఉత్సాహంగా ఉన్నారని అభిప్రాయపడింది. ఈ వేగం కొంత తగ్గనున్నప్పటికీ... వచ్చే ఏడాది కూడా మార్కెట్లు లాభాల జోరును కొనసాగించే అవకాశం ఉందని సిటీ పేర్కొంది. కాగా, భారత్ మార్కెట్‌పై అంచనాలు భారీగా ఉన్నా... అమెరికా ప్యాకేజీల ఉపసంహరణ, వడ్డీరేట్ల పెంపు భయాలు ఇన్వెస్టర్లలో తొలగిపోలేదని వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు పెరిగిపోవడం... పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్ఠంభన కారణంగా కీలక సంస్కరణలకు ఆమోదం లభిస్తుందోలేదోనన్న అనిశ్చితి ఇన్వెస్టర్లకు ఆందోళనకలిగిస్తున్న ప్రధానాంశాలని అభిప్రాయపడింది. 2012-13లో ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకిన క్యాడ్(జీడీపీలో 4.8%)... 2013-14లో 1.7 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.4%కి తగ్గగా, టోకు ధరల ద్రవ్యోల్బణం సున్నా శాతానికి పడిపోవడం గమనార్హం. బడ్జెట్‌పై దృష్టి... ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. భవిష్యత్తులో భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇది దిశానిర్దేశం చేయనుంది. అంతేకాకుండా ద్రవ్యలోటు కట్టడి ఇతరత్రా కీలక చర్యల విషయంలో ఎలా నెగ్గుకొస్తుందనేది కూడా బడ్జెట్లో ఆవిష్కృతమౌతుంది’ అని సిటీ గ్రూప్ పేర్కొంది. కాగా, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి దిగిరావడం భారత్‌కు కలిసొచ్చే అంశమని.. మళ్లీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7% స్థాయిని అందుకోగల సత్తా ఉందని అభిప్రాయపడింది. గడిచిన రెండేళ్లలో 5% దిగువకు పడిపోయిన వృద్ధి రేటు ఈ ఏడాది 5.5 శాతం ఉండొచ్చని అంచనా.