అమెరికాలోని మూడో అతిపెద్ద బ్యాంకు సిటీ గ్రూపు ఉద్యోగాల కోత వార్తల మధ్య ఉద్యోగులకు సిటీ గ్రూప్ సీఈవో జేన్ ఫ్రేజర్ వార్నింగ్ కలకలం రేపుతోంది. రిస్క్‌ని తగ్గించడం, లాభదాయకతను పెంచడం అనే సవాళ్ల మధ్య సీఈవో తాజా వ్యాఖ్యలు లక్షలాది ఉద్యోగులు గుండెల్లో గుబులు రేపాయి. ఫైనాన్షియల్ టైమ్స్ (FT) నివేదిక ప్రకారం కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుక మార్పులకు రెడీగా ఉండాలని లేదంటే కంపెనీ నుంచి వైదొలగాలంటూ సీఈవో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
మార్పునకు సిద్దంగా ఉండండి.. లేదంటే రైలు దిగడానికి సమయం ఆసన్న మైందంటూ 240,000 మంది ఉద్యోగులకు ఒక కఠినమైన సందేశాన్ని చ్చారు.. 15 ఏళ్లలో బ్యాంక్ చరిత్రలో అతిపెద్ద పునర్నిర్మాణాన్ని ఆమె ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వెచ్చరిక రావడం గమనార్హం. 2021లో సీఈవోగా బాధ్యతలను స్వీకరించిన ఆమె లాభాలను మెరుగుపరచడానికి, బ్యాంకును క్రమబద్ధీకరించడానికి వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. (ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుచేసిన ఆర్‌బీఐ: అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!)
గతవారం జరిగిన టౌన్ హాల్ మీటింగ్‌లో జేన్ మాట్లాడారు. అత్యున్నత ఆశయాలతో ముందు కెళుతున్నాం ఈ వేగవంతమైన ప్రయాణంలో త్వరితగతిన తమతో పయనించాలన్నారు. అంతేకాదు చాలా వేగంగా కదులుతున్న ఈ బ్యాంక్ పురోగతికి సంబంధించి చాలా ఆశయాలు ఉన్నాయి. సో.. మేల్కొండి...క్లయింట్‌లను గెల్చుకోవడంలో తమతో సాయపడండి.. టార్గెట్‌లను అందుకోవాల్సి ఉంటుంది అంటూ ఆమె ఉద్యోగులకు వార్నింగ్ బెల్స్ అందించారు. అటు ఆమె సమగ్ర ప్రణాళిక నివేదిక వెలువడిన తర్వాత, సిటీ లాటిన్ అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాల హెడ్ ఎడ్వర్డో క్రజ్‌తో సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని విడిచిపెట్టినట్లు ఎఫ్‌టీ నివేదించింది. (వేల కోట్ల జీఎస్‌టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11)
కాగా దాదాపు 160 దేశాలు మిలియన్ల మంది వినియోగదారులు, వ్యాపారాలు, సంస్థలకు సేవలందిస్తున్న టాప్ మోస్ట్ గ్లోబల్ బ్యాంకు సిటీ గ్రూపు. సంస్థ చరిత్రలో తొలి మహిళా సీఈవో జేన్ ఫ్రేజర్. (ప్రపంచంలోనే బెస్ట్ పెర్ఫామింగ్ కరెన్సీ ఏదో తెలుసా? నమ్మలేరు!)
Comments
Please login to add a commentAdd a comment