సాక్షి,ముంబై: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్డ్ డిస్నీ 7వేల ఉద్యోగాలను తీసివేయనుంది. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, పార్క్స్ విభాగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. 'రాబోయే నాలుగు రోజుల్లో' ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనుంది. ఈ మేరకు డిస్నీసీఈవో బాబ్ ఇగర్ మార్చి 27న ఉద్యోగులకు ఇమెయిల్‌లో తెలియజేశారు.
5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చుల ఆదా, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి తమ కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సీఈవో బాబ్ ఇగర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలి డిస్నీసబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అటు గత మూడు నెలల్లో డిస్నీ+కు ఒక శాతం కస్టమర్లు క్షీణించారు. దీనికి తోడు సంస్థ నష్టాలు కూడా పెరిగిపోవడంతో కొత్త నియామకాలను ఆపివేయడంతోపాటు 3.6 శాతం ఉద్యోగాలపై వేటు వేసేందుకు నిర్ణయించింది.
JUST IN
— StockMKTNewz - Evan (@StockMKTNewz) March 27, 2023
Disney $DIS CEO Bob Iger sent this email to Disney employees today letting them know the company has begun its round of 7000 layoffs announced in February pic.twitter.com/ZqV7Z3iqXA
Comments
Please login to add a commentAdd a comment