IBM To Replace 7800 Jobs With AI Announces Hiring Freeze, Know Details Inside - Sakshi
Sakshi News home page

IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్‌ న్యూస్‌

Published Tue, May 2 2023 3:21 PM | Last Updated on Tue, May 2 2023 3:35 PM

IBM to Replace 7800 Jobs with AI Announces Hiring Freeze - Sakshi

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఉద్యోగాలకు ముప్పు తెస్తుందన్న ఆందోళనల మధ్య ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.దాదాపు 7,800 ఉద్యోగాలనుఏఐతో భర్తీ చేసే అంశాన్నిపరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ బాట్‌ ద్వారా  నిర్వహించవచ్చని  భావిస్తున్న ఉద్యోగాల్లో  కంపెనీ  హైరింగ్‌ను నిలిపి వేయనుందని  ఐబీఎం  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ  ప్రకటించడం కలకలం రేపుతోంది. 

ఇదీ  చదవండి:  మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్‌ ధర తెలిస్తే షాకవుతారు!

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం,  హెచ్‌ఆర్‌ వంటి బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్లలో నియామకాల్లోమందగమనం చూడవచ్చని ఐబీఎం సీఈవో చెప్పారు. అత్యంత వేగంగా పెరుగుతున్న ఏఐలో రాబోయే ఐదేళ్ల కాలంలో కంపెనీలోని చాలావరకు ఉద్యోగాలకు బదులుగా ఏఐని వాడాలని కంపెనీ భావిస్తోంది.  అరవింద్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో 30 శాతం మంది శ్రామిక శక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యంలోనే  ఇప్పటికే ఆయా సంబంధిత ఉద్యోగాల నియామకాలను నిలిపివేయనుంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!)

ముఖ్యంగా ఆర్థికమాంద్యం, ఖర్చుల నియంత్రణలో  భాగంగా ఈ ఏడాది జనవరిలో 4 వేల ఉద్యోగాలను, కొన్ని వ్యాపార విభాగాలను తొలగించింది. మరోవైపు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 7 వేల మంది కొత్త నియామకాలు కూడా ఉన్నాయని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐబీఎంలో దాదాపు 2.6 లక్షల మంది ఉద్యోగులున్నారు.    (Realme 5th Anniversary Sale:స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ  ఆఫర్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement